Saturday, May 23, 2015

"THE CHURNING OF OCEAN OF LIFE- MY TRUE STORY TELUGU AND ENGLISH VERSIONS FIRST PART - FIRST EPISODE


జీవిత చరమాంకంలో ఉన్న నేను ఇంక నా కధ విడమర్చి చెప్పటంలో తప్పు లేదనుకుంటాను. నేను ఫుట్టి  బుద్ధెరిగిన దగ్గరనుంచి ఈ రోజు వరకూ జరిగిన ప్రతి మంచి, చెడు సంఘటలను విడమర్చి చెప్తాను.

ఇందులో చాలా మంది పాత్రధారులు,సూత్రధారులు ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళూ చెప్పలేదు.

అయినా చేతిలో చిల్లిగవ్వలేని, ఆశయాలే తప్ప, ఆశలు ఎప్పుడో వదులుకున్న నాకు ఇందులో పోయేదెమి లేదు, వచ్చేదేమి లేదు.

నేను రాసే ప్రతి సంఘటనలోను ఎకడైనా తప్పు కాని, అబద్ధం కాని ఉన్నట్లయితె  జీవితంలో మొదటినుంచి ఈ రోజు వరకూ భాగస్వాములెవరైనా చెప్పవచ్చు.

నా కధ  మొదటి వాక్యం "నేను చాలా తెలివిగల వాణ్ణీ. ఎంతంటే ప్రపంచంలో తెలివి సూచిలో(IQ) మొదటి 10 లక్షల మందిలో నేను ఇప్పటికీ ఉంటాను. ఇక యువకుడిగా ఊహించుకోండి"

మీకు ఓపిక ఉంటే రోజూ ఈ సీరియల్ చదవండి.


అసమర్ధుడి సాగర మధనం అనబడే నా స్వీయ చరిత్రకు ఉపోద్ఘాతము.

"ఏమొయ్! వాణీ! నా స్వీయ చరిత్ర రాస్తున్నాను అని చెప్తే, "నీకు స్వీయ చరిత్ర ఏమిటి(నీ బొంద) ఏం సాధించావని. నెత్తిన రూపాయి పెడితే కానీకి చెల్లుబాటు కావు. నువ్వు సాధిచించిందల్ల నన్ను పెళ్ళి చేసుకొవడము, ముగ్గురు పిల్లల్ని కనడమూను. అంతకంటే ఏముంది" అని అన్నదో, అనుకున్నదో ఏదో ఒకటి జరిగింది.

"అదేమిటి! అలా అంటావు (కుంటావు). మహాత్మా గాంధి, ఎల్ బీ  శాస్త్రి  అక్టోబర్ 2న పుడితే నేను అక్టోబర్ 20న  పుట్టాను తెలుసుగా అన్నాను ." ఆ సున్ననే తేడా కొట్టింది" అని కొట్టి పారేసింది.

మా ఆవిడ కూడా చాలా తెలివి కలదే. అయితే ఆ విషయం ఆమెకు తెలియక పోయుండవచ్చు, లేదా నేనే ఆమెకు తెలియకుండా చేసి ఉండవచ్చు. ప్రపంచంలో 99 శాతం మంది తెలివికలవాళ్ళే ఉంటారు. అయితే పైన చెప్పిన కారణాల  వల్ల పైకి లేచి, కింద పడరు.

 జీవితం పరమపద సోపాన పటం లాంటిది. నిచ్చెనలూ,పాములూ సహజం. కొందరు నిచ్చెనలెక్కుతూ, పాములబారి పడకుండా అలా, అలా పైకి వెళ్తారు. మరికొందరు పాము కాట్లే తప్పితే, నిచ్చెన మెట్ల దగ్గరకు కూడా వెళ్ళరు. ఈ రెండురకాలమనుషులకి ఏ విధమైన ఆలోచనా ఉండదు.ఎందుకంటే మొదటి రకం వారికి పడతామమే భయం లేదు. రెండో రకం వారికి లేస్తామనే ఆశ లేదు.

ఇక నా సంగతి. ప్రతి కొన్ని సంవత్సరాలకి నిచ్చెన మెట్లెక్కడం, ఇంకో సారి ఆట మొదలు కాగానే ఒక పెద్ద పాము కరవడమూ, మొదటి గడిలోకి రావడమూనూ. ఇది కేవలం కర్మ ఫలం కాదు, మనం చేసే తప్పొప్పులూ, మన పక్క ఉన్న వాళ్ళు తెలివిగా పావులు కదపడమూ, లేదామన మంచితనాన్ని వాడుకుని వదిలేయడమూ ఉండొచ్చు.

నా చిన్న తనంలో ఒక పెద్ద వ్యాపారవేత్త తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఇంత తెలివికలవాడివి ఎలా బొల్తా పడ్డావయా అంటే, నేను ప్రతి మెట్టూ ఎక్కడానికి అందరికి లంచాలు తినిపించాను. లంచం ఇవ్వకుండా పని చేయించుకున్నవాడిని ఒక్కడ్ని చూపించిండి. కాకపోతే ఒక చిన్న తప్పు నన్ను దొంగను చేసింది. కాలమే చెప్తుంది నేను తెలివికల వాడినో కాదో అని, జనాంతికంగా చెప్పాడు. బైటికొచ్చాడనుకోండి. వెరే విషయం. ఎందుకు చెప్పానంటే న్యాయం, అన్యాయం అనే వాటి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. గీత ఇవతల చాలా న్యాయపరుడు, అవతల పరమ దుర్మార్గుడూ ఉంటారు. ఇది సాధారణ న్యాయం కాకపోవచ్చు. కాని చాలా మందివిషయంలో ఇది నిజం.

ర్యూబిక్ క్యూబ్ వినే ఉంటారు. ప్స్రిష్కరించడం చాలా కష్టం. అంతా అయినా టే ఉంటుంది. ఒక్క గడిలోకి మిగులుతుంది .కొందరు వదిలేస్తారు. కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను రెండో కోవకు చెందిన వాణ్ణి. 32 సంవత్సరాల వయసులో ఎడమకన్ను రెటీనా దెబ్బతిని చూపు దాదాపు లేకుండా పోయింది. 2011 లో ముఖ పక్షవాతం వచ్చి కుడి కన్ను కండరాలు దెబ్బతిన్నాయి. క్రమగా చూపు తగ్గుతోంది. అయినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు ఆ చివరి గడి పరిష్కరిస్తానని.

దానికి సాక్ష్యం నా చరిత్ర.

                                        *********************************


నా స్వీయ కధ మొదటి భాగము.

నా స్వీయ చరిత్ర పేరు " అసమర్ధుడి  జీవిత యాత్ర" అనొచ్చు. ఐతే అది బుచ్చి బాబు సొంతం కాబట్టి "అసమర్ధుడి సాగర మధనం" అంటాను. సాగరమధనంలో విషం, అమృతం, లక్ష్మి దేవి వచ్చినా నాకు చివరకు మిగిలింది ఏమీ లేదు. అందుచేత
ఆ పేరే స్ధిరం చేద్దాం నేను తెలివికలవాణ్ణే కాదు, బాపు గారి బుడుగులా, నా
ఙాపక శక్తి అపారం. సోదాహరణంగా వివరిస్తాను.

"నేను చాల తెలివి కలవాణ్ణీ. సంశయమే లేదు." అయితే ఒకసారి నా శ్రేయోభిలషి ఒకాయన "నాయనా చంద్రమొహనూ, ఇంతవరకూ నేను కలిసినవాళ్ళలో అత్యంత తెలివెకలవాడివి నువ్వే. వచ్చిన చిక్కల్లా  నువ్వు తెలివికలవాడివని చిన్నప్పటినునీ నీ చెవిలో గూడుకట్టుకుని అందరూ చెప్పటంవల్ల, మరియూ ఆ విషయం నీకు కూడా బాగా తెలియటం వల్ల, నువ్వు బాగు పడవు"  అని బల్లగుద్ది చెప్పాడు.   "మరి పరిష్కారం  కూడా చెప్పండి" అంటే " నీ మనసులో నాటుకు పొవటం వల్ల ఇందులో ఎవరూ ఏమీ చేసేదీ లేదు" అని వాకృచ్చాడు.

దీని ప్రధాన లక్షణము  ఎవరి మాటా  వినక పోవటమూ, నేను చెప్పేదే  న్యాయము అని

నేను తెలివిగల వాణ్ణీ ఎందుకో, ఎలానో ముందు చెప్తాను. తదుపరి నేను ఎలా దెబ్బ తిన్నాను, ఎందుకు దెబ్బ  తిన్నాను, మరల పైకి  ఎలా లేచానో, అందుకు ఆ తెలివినే ఎలా ఉపయోగించానో తరువాత చెప్తాను.

                                      *********************************

నేను పెరిగిన శుద్ధ పల్లెటూరులో చాలామందికి ఖానా, పాయఖానా రెండూ ఉండేవి కావు.మాకు మొదటిది లోపం లేదు.

అక్కడ ఒక చిన్న జిల్లా  పరిషత్తు ప్రాధమిక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో నన్ను చేర్చిన వారం రోజులకి తెలుగు అక్షరాలు 56 చూసి నేర్చుకున్నానని మా నాన్నగారు, అమ్మగారూ నేను డిగ్రీ చదివే వరకూ చెప్తూ ఉండేవారు. అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు కాలధర్మం చేశారు కాబట్టి  నా మాటే వేదం.

కాదండోయ్. ఒక రుజువు దొరుకుతుంది మీకు వోపిక వుంటే. మీరు నాలుగు అంకెల నంబర్లు పది ఒక కాగితం మీద రాసుకుని, నాకు చదివి వినిపిస్తే ఇప్పటికీ వాటి మొత్తం నేను చెప్పగలను. అంతే కాదు ఒక తెలివిగల యువకుడు ఒక గడియారం పెట్టుకొని, ఆ మొత్తాన్ని ఎంత సేపులో పూర్తి చెయ్యగలడో నేను మనసులో అంత కంటే త్వరగా  చెయ్యగలను.

 ఇంకో ఉదాహరణ. అదే పాఠశాలలో (అది ప్రాధమికోన్నత  పాఠశాల, ప్రాధమిక కాదు) ఆరు, ఏదు తరగతులవారికి ఙాపక శక్తి పరీక్ష పెట్టారు, ఒక సంవత్సరం. మా క్లాసు పంతులమ్మ ప్రత్యేకంగానా పేరు అందులో చేర్పించారు, పొట్లాడి మరీనూ. ఎందుకంటే నేను అప్పుడు నాలుగో క్లాసే.

ఈ పరీక్షలు రెండు భాగాలు. మొదటిది ఒక రూములో 20 వస్తువులు ఒక టబులు మీద పెట్టి 5 నిమిషాలు చూపించి గుర్తున్నన్ని వస్తువులు రాయడం. నేను 20 వస్తువుల పేర్లు అవి పెట్టిన క్రమంలో రాయగలిగాను.


రెండో పరీక్ష "క" అక్షరంతో దాని గుణింతంతో మొదలయ్యే మాటలు రాయడం. నేనే ఎక్కువ రాశాను, 120 వరకూ.

ఆ స్కూలు మొత్తం నా పేరు మారు మోగింది. నా ఉన్నతికి, నా గర్వానికి, అంతిమంగా నా పూర్తి నాశనానికి నాంది పడింది ఆ రోజే! నేను చాలా తెలివి కలవాడినని తెలిసిందీ ఆ రోజే.

                                    *********************************
          "THE CHURNING OF OCEAN OF LIFE- MY TRUE STORY

                                    FIRST PART - FIRST EPISODE

Being in the sixth stage of life (Shakespeare says there are seven stages) , I feel it is apt I tell about myself. From the day, I saw the world through mine own eyes, till date I will, hence, recreate the minutest details of incidents in my life. both good and bad.As there are many other actors in this sordid drama of life, I previously felt it was not in the fittest of things to speak these issues.But at this stage of life, I do not have a single rupee of mine own, nor assets but a few liabilities here and there, what I am left now with is only my ideas and no further  ambitions in life.If I faltered in my narration or  on fact, if anyone who were part of my life since childhood, found any inaccuracies in the narration of incidents, they would be free point them out. (I will explain or correct and apologize).I will start my story with a confident statement that I am very intelligent by birth. That holds good today too. If IQ of all world citizens is now assessed, I shall stand among the first million, I am confident, though it is not possible to assess so. Imagine my IQ as a youth.If you have patience, please read my serial story in parts.


Prologue to my sordid story of life- "The churning of the ocean of Life by an Incompetent"
I called my wife and told her, "Hey! Vani! I am writing my life story"." Are you mad? What did you achieve in life to tell a story of it? I feel that if you are auctioned in market place with a hundred rupees on your head, there will be no bidders for even a single rupee. The only thing you achieved was marrying me and giving birth to three intelligent and responsible children." I think these last words she did not say, but I imagined she thought so."How can you just strike me off from the list of great people. If Gandhi and Sastry were born on 2nd October, I was born on 20th October" , I retorted. "That "zero" only made all the difference like Rahul and Sibal, she said.My wife had also been  very intelligent. Might be she did not know that fact or I eclipsed her so much that she was never allowed to know that. In the world ninety nine per cent of people are intelligent. But, they do not rise to the top and fall suddenly like me for reasons I write below in many parts.

Life is like a game of snakes and ladders. Some climb the ladders unhindered by the snakes and reach the top. Some are perennially bitten by snakes that they do not reach the bottom of the ladders also. For these two types, there is no worry. The former is never afraid of snakes and the latter are never hopeful of reaching the top and are satisfied with what they are.It is not like that with my life. Every few years I climb a big ladder and reach the top, I confront a snake. Bitten by it, I fall down to where I have started. Another game and another game it continued.

We can not brush aside this as the result of our past sins or Karma. The repeated mistskes we commit, the other players moving their pawns cleverly or knowing our next moves, pre- plan their moves and see that we fail.During my childhood I read a news about a very big businessman. He was caught red handed in a bribery case. When pestered by Media, how such an intelligent guy, he could fall from grace he replied, " I bribed everyone in every step of life. Show me one who did not do this in their lives. By one small mistake,  I am here. Just see whether I am intelligent or not."  And he was acquitted of all charges, as he used his pawns and won the game. Now, he is on top.Though  it was not related to my own life story, I narrated this as a thin line would divide honesty from dishonesty and those on this side of the line would be branded  dishonest and who had cleverly crossed it would be named honest.This may not be a general rule, but in many cases it is true.There is one puzzle  called "Ruby  Cube". It is very difficult to solve. Some solve it easily. We reach till last square and it again slips. Many try and try and leave it. Some continue trying till their end and until they see the end of solution, I am the second kind.I am still trying to solve the mystery of life and of the last square and I am confident of solving it.


That sums up my life story. Now, enter the jigsaw puzzle of my life.

                                                      ######################


First part of "My Churning of the Ocean of Life "

We can name the story as " The Life journey of an Incompetent"? But as Buchibabu owned the title, I would call it the "Churning the Ocean of Life by an incompetent" During the churning of ocean, even though poison, nectar and Lakshmi came, I got nothing or rather, I got everything. I swallowed poison, the rest escaped me. So, let us fix the name. Like the character Budugu by Bapu (Telugu people know), I am not only intelligent but my power of memory is almost unparellelled in my circles. I will, give few examples.That I am very, very intelligent is a fact none can counter. But, one well wisher once warned me. " Dear, good Chandramohan! There is no doubt that you are the most intelligent guy I have ever met. But, the real problem is the fact that everyone you come across in your life continuously bombard this fact in your ears. It has happened  since your childhood and the other fact that now you know your are quite intelligent, you will never shine in life". I asked him to show out of the dilemma. He said I crossed all limits of arrogance on this count and hence there was no way out. "You climb and fall down. It is inevitable.""The main quality of yours on this count is not heeding advice and saying what I told is law." True to his words, I never heeded his words too.I will tell you how I have decided I am intelligent and why, before embarking upon how and why I fell from grace and again rose in life using the same intelligent planning in life.

                                            ################################
In the village in which I was brought up, there was severe dearth of food and a place for defecation. ( khana, payakhana). We did not have dearth of the former.There was a small Zilla Parishad Upper Primary School in the village. That after enrolling  there,  I learned all 56 Telugu alphabets by just seeing and remembering, was a fact repeated by both my parents till I completed graduation, As both are no more, you have no option but take my words on face value.No.No. No. There can be a proof. If anyone of the readers have patience, you can write ten four digit numbers (like 4988,9876) and read them out to me one by one with gap of ten seconds , I will tell you the total. This capacity is now.I used to attempt this with 50, 60 numbers in our office. Not only that, I can total this faster than a normally intelligent guy can do it on paper with a pencil.Another instance. But here too, my word is final. During my fourth class, a memory test was conducted for students of classes 6th and seventh. My class teacher, who knew my capacity, might have recommended my name too to the Head Master, who accepted me as a special case. The tests were:

1. They keep 20 items on a table and allow students to look at them for five minutes and they should write the names of items in the order they were placed.2. We should write as many words as possible with letter "ka" it's equivalents like ki, kee etc.,

I wrote all 20 items exactly in the order they were placed and wrote about 120 words with "ka".The entire school reverberated with my name. Overnight I was a child celebrity. Most probably, that day was the day for my unprecedented growth at a very young age and sudden fall from grace at age 40, too young to leave active life.
First Episode of the first part comes to an end.