Saturday, June 20, 2015

HELP THIS GIRL PURSUE DEGREE IN COMPUTER SCIENCE- AN APPEAL

.





మూర్ఛ రోగి బిడ్డ మొదటి ముద్ద తినకె
పాఠ శాల నుంచి బయట బంప
యక్షరములు నేర్చె యింత వయసు లోన
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

అక్షరాలు నేర్చుకునే తల్లి మా వాచ్ మాన్  రెండో కూతురు. చిన్నతనంలోనే ఎపిలెప్సీ రావడంతో బడి నుంచి పంపెశారట. ఇప్పుడు నా భార్య దగ్గర అక్షరాలు నేర్చుకుంటుంది. ఏక సంథా గ్రాహి. దేవుడు అమ్మాయిని చల్లగా చూడాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.


English:

The younger of the two girls is an epilepsy patient. Even she ate her first solid meal she fell ill with epilepsy. The Government School she was studying discarded her and hence, she left studies. At this age she is learning alphabets in our house. (She is second daughter of our watchman)


Top of Form
98.

తల్లి సదువు తాది తెలివితే టలు మెండు
సొమ్ము లేడ తెత్తు సదువు సాగ
కట్ట మెంత బడ్డ పొట్ట నిండక పోయ
వాణి బలుకు మాట నాదు నోట!



లాప్ టాప్ లో టైపింగ్ నేర్చుకుంటున్న అమ్మాయి మా వాచ్ మాన్ పెద్ద కూతురు. 12 తరగతి లో 77 శాతంతో  ఉత్తీర్ణురాలయ్యి డిగ్రీ లో చేరింది. లాప్ టాప్ మేమే అమ్మాయికి ఇచ్చాము. ఫీజు కట్టేందుకు ఏవరైనా ముందు కొస్తే, అమ్మాయి కాలేజీకి పంపవచ్చు, మా ప్రమేయం లేకుండా, దురుపయోగం కాకుండా. అది మా ఇల్లే, హైదరాబాదులో. నేర్పుతోంది వాణి.

తాత్పర్యము (తా):

పద్యం రాయలసీమ భాషలో రాసింది. అమ్మాయి తండ్రి మా బిల్డింగులో వాచ్ మాన్. 12 తరగతిలో 77 శాతం మార్కులొచ్చాయి.నీళ్ళు లేక పొట్ట చేత పట్టుకుని హైదరాబాదు వచ్చారు. అతని మాటల్లోనే " మా తల్లి సానా బాగా సదువుతాది సార్! డిగ్రీలో సేర్చాల. 42 ఏలు అడుగుతా ఉన్నారు. మా సంపాదనలు పొట్ట నిపుకోడానికే సాలటం లేదు" అని.

నేను మొదటి వాయిదా (ప్రిన్సిపాలుకి) పంపుతానని నాలుగు వాయిదాలు తీసుకున్నాను. ఎవరైనా సహాయం చెయ్య దలుచుకుంటే కాలేజీకి డబ్బు పంప వచ్చు. నాకు తెలిపితే నేను వివరాలిస్తాను.

English:

The elder one is the elder daughter of our watchman. She scored 77% in Intermediate. Clever girl. We donated a two year old Acer Laptop and promised the principal that we would pay first instalment of Rs.10,000/_ If anybody feels he/she can help may contact me. I will give details of College in Anantapur, AP.  Amount can be sent direct to college.

Hope the matter is self explanatory. As the amounts will be remitted to the college directly, there is no scope for misuse. Those who wish to donate may DM me or tweet to me. I will give details. 

There is no force or obligation. Money should NOT come in the way of friendship. Whatever amounts are received, I will total and bear the rest from our sources until she completes graduation. We donated new clothes, lap top, Rs.10,000/- as first installment and a little pocket money. All donated to us by our children as we do not have source of income.


                                      ################################