Friday, October 2, 2015

PANCHATANTRA TELUGU POEMS- ENGLISH TRANSLATION PART 4




STORIES OF PANCHATANTRA IN SIMPLE TELUGU POEMS - ENGLISH TRANSLATION

PART 4  


For more than two and a half millennia, the Panchatantra tales have regaled children and adults alike with a moral at the end of every story. Some believe that they are as old as the Rig Veda. There is also another story about these fables. According to it, these are stories Shiva told his consort Parvati. The present series is based on the Sanskrit original.
A king, worried that his three sons are without the wisdom to live in a world of wile and guile, asks a learned man calledVishnu Sharman to teach them the ways of the world.
Since his wards are dimwits, Vishnu Sharman decides to pass on wisdom to them in the form of stories. In these stories, he makes animals speak like human beings. Panchatantra is a collection of attractively told stories about the five ways that help the human being succeed in life. Pancha means five and tantra means ways or strategies or principles. Addressed to the king's children, the stories are primarily about statecraft and are popular throughout the world.



Image Courtesy: http://www.indianhindunames.com/panchatantra-stories.htm
                                                                                                                                             

विद्वत्त्वं नृपत्वं नैव तुल्यं कदाचन  

स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते  


Scholar and king are never comparable. King is worshipped in his country, but scholar is worshipped everywhere. 




ఈ రోజు నుంచి పంచతంత్రం కధలను తేలికైన, కమ్మని తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలని సంకల్పించాను. సచిత్రంగా చేసి అందంగా ఉండేలా  పిల్లలకు ఉపయోగ పడేలా చెయ్యాలని సంకల్పం. చిత్రాలను వెయ్యడం ఇప్పుడే నేర్చుకోవడం ప్రారంభించాలి కంప్యూటరు సాయంతో. 

From today, I decided to write the story “PANCH TANTRAM” a collection of moral stories penned by Manya Vishnu Sharma. I want to make a pictorial presentation of the stories, but still I am learing the line sketch on Computer. I will edit these blogs soon.

నాకు భగవంతుడిచ్చిన అహంకారాన్ని, ఆత్మ విశ్వాసంగా మార్చుకోమని ఇప్పటికి సంకల్పం కలిగింది.
ఈ రోజు నుంచి పంచతంత్రం కధలను తేలికైన, కమ్మని తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలని సంకల్పించాను.

I mode vow that I will turn my arrogance born out of immense self-confidence, knowledge and thirst for more into pure self-confidence.

1.
విష్ణు శర్మ నామ విప్రుండు గురువు
శిష్యులందరికిని చెప్పె కథలు
నాడు నేడు రేపు నీతి బతుకు రీతి

పంచతంత్ర మంచు పేరు నిడెను! 1

.....................................

......................................................

36.

ఆరు లక్షణములు ఇరువురి బ్రేమకు
పంచు కొనుట గలుగ యుంచు కొనక
పుచ్చు కొనుట కరుణ ఇచ్చిన బహుమతి
వలయు పంచుకొనగ తెలిసిన మాటయు!

తాత్పర్యము

English: There are six distinct characteristics to define friendship between two individuals. 1. Sharing whatever is possessed without being miser.  2. Accepting whatever is given out of love and 3. Sharing the thoughts through the word of mouth.
The Crow-Rat Discourse

47.

చెప్పు మాటలు వినును చెవుల కింపు గాగ
తిండి బంచు హితుకు తాను తినగ
తినును హితుడు తనకు దానమిచ్చిన తిండి
గుణము లివియె బ్రేమ గుఱుతు బట్ట!
తాత్పర్యము          

English: 4. The other friend hears the words spoken by the first with attention. 5. While eating he shares food with the friend. 6. The real friend savours the food so served by the other. These are the six characteristics that define true friendship.

38.

కాంక లివ్వ శివుడు కరుణతొ జూచును
గడ్డి బెట్ట యావు బిడ్డ మరచి
బాలు ఇచ్చు జాల బ్రేమ మీరంగను
ఇచ్చి పుచ్చు కొనుట యసలు బ్రేమ!

తాత్పర్యము

English: God gives boons if we appease him with small gifts. If we feed grass the cow gives milk even forgetting to feed the calf. The real friendship lies in give and take.


39.

సాగ వారి మైత్రి సామ్యమునను
వాశి కుదుర ఎలుక వాయసమ్ముకు
కలుగు వదిలి ఎలుక కాకి పక్కకు వచ్చె
రెక్క నడుమ డాగి సుఖము నుండె!

తాత్పర్యము

English:

As the friendship between the mouse and the crow established like this, and mutual trust between them increased by the day, the mouse came out of the hole and settled in the feather-bed of the crow.

40.

అంతట యొక దినము యాయాస పడుచును
వాయసమ్ము వచ్చె వేగము గాను
తాను ఇచట నుండ తగదని ఏడిచె
ఎలుక చింత చెందె ఏమి యాయె!

తాత్పర్యము

English:
As days were passing by like this, one day the crow came flying fast sweltering and breathless and told the mouse that it would be impossible for her to stay there in the forest. The mouse asked him what had turned up.

41.
వాయసమ్ము బలికె యాయాసమును వీడి
కరువు వచ్చి పడెను కాన యందు
గంజి లేక జనులు కాక బలు లాపిరి
బోయ వాడు వలను బట్టు కొచ్చె!

తాత్పర్యము

English:
The crow recouped her breath and said that a severe drought hit the surroundings of the forest and people, unable to feed themselves stopped offerings to crows. ( This reference is to the offerings of cooked read rice to crows during Yagas and at the time of paying obsequies to the Departed). Hunters are on prowl to net the various birds in the forest.

42.

బోయ వాండ్రు వచ్చి బన్నిరి వలలను
నేను వలను చిక్కి నయమున వచ్చితి
ప్రాణ ముండ నేను బయటకు బోవలె
ఎటుల యైన బోదు ఎచట కయిన!

తాత్పర్యము

English: I too got caught in one net, but through my tact I came out. If I want to live I should leave the forest. I should go somewhere, somehow.

43.

యనగ విని యెలుక యెంతయు చింతించి
యిటుల బలికె 'హితుడ ' యెటుల బోదు
విపుడు గమ్య మెచట వేగిర బడకుము
యాపద సమయమున యాలో చించు!

తాత్పర్యము

English.

Hearing the melancholic story of the crow, the perturbed mouse said. “Oh! Friend! Where will you go now? What is the destination? Do not hurry. In times of trouble, you should think”

44.
యనగ బలికె కాకి యెంతయొ బ్రేమతొ
కలడు యొక్క హితుడు కారడవిన
మందరకము యతడు మిత్రము హితుడును
కూర్మ రాజు యతడు కావ గలడు!

తాత్పర్యము
English:                 
The crow said with lots of affection. “ I have a friend yonder deep in the forest. He is a Tortoise. His name is Mandaraka. He can provide us a secure place”
45.
స్నేహ శీలి యతడు సాకును మనలను
కబురు లాడు కొనుచు గడుప వచ్చు
సుఖము నుండ వచ్చు సమయము తెలియదు
నోరు మంచి  దైన  యూరు  మంచి!

తాత్పర్యము

English:
He is of a very friendly disposition. He will patronize us. We can spend time in friendly conversations. We can live happily without knowing time. If our word is good, world is good to us.

46.

దూర మేగ వలయు దేహము కాపాడ
కాపు (రక్ష) లేదు కాల మెట్లు గడచు
పోద మటకు బేగ పయనము యగుమన
మూషికుండు బలికె మరల ఇటుల!
తాత్పర్యము

English:

To secure ourselves, we may have to travel beyond borders. How can we spend time here fearing for security day on day? Get ready! We shall travel fast. Hearing this the mouse said thus.

47.
ఎగుర గలవు నీవు యాకస మందున
నేను ఎటుల వత్తు నడక తోడ
యనగ కాకి బలికె యెంతయొ బ్రేమతొ
భయము వలదు హితుడ కలదు వెరవు! (ఉపాయము) 
తాత్పర్యము

English:
You can fly high in the air. How can I follow you on land at snail’s pace? Hearing the doubt of the Mouse the crow said, “Do not fear. There is a way out of this tricky issue”

48.
ఎగుర గలను నేను ఎంతపైకి యయిన
గింగిరాలు కొట్టి కింద దిగెద
నాదు వీపు మీద నీవు కూరుచొనుము  
యెగిరి పోద మటులె యేల భయము! 48
తాత్పర్యము
English:
“Yes! Right! I can fly high in the air. I can do acrobatics in the air and land safely anywhere. You sit on my back. Why should you fear? We shall fly together.”

49.
ఎక్క మూషికుండు యెగిరెను కాకియు
మిత్రు జూడ ఎంతొ ముదము తోడ
ఆకసమున బోయె యమిత వేగముతోడ
చేరె బేగ చెలుని చెరువు చెంత!

తాత్పర్యము
English: Thus, as the mouse  sat comfortably on her back the crow flew into the skies with intense speed and pleasure and reached his friend, the Tortoise place. Meeting a New Friend
50.

పిలిచె హితుడ చూడు పరుగున వచ్చితి
వచ్చి కౌగలించు వొక్క సారి
మేని స్పర్శ మంచి గంధము కాదొకొ
కప్పురంబు తోడ కలియు రీతి!

తాత్పర్యము
After landing on the banks of the lake where the tortoise lives, the crow called out. “Oh! Friend! I came to see you with doubled up enthusiasm. Come and hug me. Elders say that the touch of a friend’s body is like camphor coated with sandalwood.

51.
కూర్మ మొచ్చి చూసె కడు సంతసము తోడ
కుశల మడిగె బ్రేమ కాకి జూసి
అడిగె హితుడ యెలుక యెటులొచ్చె నీ తోడు
కాకి తినదె యెలుక కాన గానె!

తాత్పర్యము


English:
The tortoise came out with immense happiness and asked about the welfare of the crow. He asked with surprise, “Is not mouse your food? How could it accompany you, without your devouring him?”


52.

కాకి బలికె ఇటుల కడు ప్రేమ తోడను
మూషికుండు నాకు మంచి హితుడు
పరుల సేవ యతని పరమార్ధ మగుటను
చూసి నేనె యతని చెంత బోతి!
తాత్పర్యము

English:
Crow said thus. “This Mouse King, Hiranyaka, is my best friend. His life is dedicated in the service of others. Looking at his service to others, I only approached him for a hand of friendship”
53.

మాయ లేదు యితడు మర్మమె యెరుగడు 
నన్ను విడిచి యుండ నేర కుండె
మోసుకొస్తి ఇటకు మందరకమా యన
యెలుక చెప్పె ఇటుల యతని కధను!

తాత్పర్యము

English:
The crow further said,” There is nothing secretive about his affairs and does not know miracles. He was unable to stay back in our earlier abode without me being there. So, I carried him on my back all the way, Oh! Mandaraka!” Then the mouse, Hiranyaka started telling his past story thus.
The Rescue of a Deer

                                    ###########################


न कोई किसी का मित्र है और न ही शत्रु, कार्यवश ही लोग मित्र और शत्रु बनते हैं॥