Monday, August 1, 2016

VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE

8



తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11  తరగతి తరువాతతెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూ
తదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషాపుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానేమిగిలి పోయిందిఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నానుకాని ఏనాడూ ఒక్క పద్యంకూడ పూర్తి చెయ్యలేదు.

It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకునా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టానుచిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణసూత్రాలులఘువులుగురువులువృత్తాలుయతిప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నానునాభార్య సలహా తీసుకున్నానుపద్యం పూర్తయ్యాకఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చునాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పిందికుదరలేదుసరైనపదంవదిలెశాను.
ఇక మీ ఓపిక.

At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.

వాణి శతనానికి నాందీ పద్యము.

కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!

Dedicated to Goddess of Knowledge, Vani.

నా చదువుల రాణి వాణికి అంకితం.

Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.




 వాణి త్రిశతి   Part 9 




బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్యకం

గూళలకిచ్చి యప్పడుఁపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషనార్థమై.

పద్యానికి "పాన్ మసాల" పేరడీ.




పాను మసాల చాల తిని పల్లపు గుంటలొ దూకి దేలుచున్ 
మున్ గుచు మత్తునన్ మదము మాడుకి యెక్కగ తాత తండ్రి సు
ఙ్ఞానము మానమున్ విడి యఙ్ఞానివై రొక్కము ఖర్చుచేసియున్     
మీనము మేషమున్ కొలుతె  మానిని పుత్రులు రోదనం బడన్!   


తండ్రి చెట్లు పెట్ట తనయుడు పడగొట్టి 
తండ్రి దినము బెట్టి తనను పిలువ
కాకి పిండ మెట్ట కాకియె కన రాదె 
వాణి పలుకు మాట నాదు నోట! 293


తాత్పర్యము 



హిందూ మత సాంప్రదాయము ప్రకారము, తండ్రి పోయాక తనయుడు పిండ ప్రదానము చేసి కాకికి సమర్పిస్తాడు. కాకులేవి? అనే విషయంపై ఈ పద్యము. 


తండ్రి చెట్లు పెంచితే కొడుకు వాటిని నరికి కలపకు వాడాడు. తండ్రికి తద్దినము పెట్టి కాకి కోసం చూస్తే కాకులేవి? చెట్టు లేక పోతే కాకులకు ఆశ్రయమేది? అలానే తండ్రి ఆశయాలకుp విరుద్ధంగా ప్రవర్తిస్తూ, తండ్రి ఆత్మ "కాకి" రూపంలో రమ్మంటే ఎలా వస్తుంది?  

English: As per Hindu tradition, after the death of father son pays tributes to his father every year on the date of death by offering a ball of rice to a crow. Where is crow?

Father planted seeds, took care of plants and trees grew. Son cut the trees for timber. If he offers tributes to his father and wait for a crow where is it? There are no trees, there is no shelter.

It means if the son acts in a way opposite to the values his father stood, he can not expect his father's soul to rest in peace and visit him every year.



స్కీము స్కాము యుండు చూడ నొక్కటె రీతి 
పోగ పోగ స్కీమె స్కాము యగును
స్కీము పేర చేయు స్కాములె వేరయా 
వాణి పలుకు మాట నాదు నోట! 294

తాత్పర్యము 
ఈ మధ్య ఎక్కడ చూసినా స్కాములే స్కాములు. ఇక స్కీముల పేర ఎన్ని స్కాములో. 


స్కీము, స్కాము రెండూ ఒకటి గానే ధ్వనిస్తాయి. స్కీము నడపగా, నడపగా అదే పెద్ద స్కాము అవుతూ ఉంది. స్కీముల పేర చేసే స్కాములే వేరు కదా? 



English: Now-a-days, whatever news we see, it is about scams. Scams in the name of Schemes are different though they sound similar.As the Schemer runs a scam for a time, it becomes a scam.


అమ్మ ఆటవెలది తేట గీతిక కాదె
కంద బచ్చ లంటి కమ్మ దనపు
ప్రాస యతులు గలియు సీస మంటి మనసు
మత్త కోకిల వలె మధుర గీతి! 296

అమ్మ లేని లోటు అమ్మ కోడలు తీర్చె
తల్లి మరువ యాయె తానె తల్లి
తల్లి కో నమస్సు తన కేమొ యాశీస్సు  
వాణి పలుకు మాట వినవొ నరుడ! 295

తాత్పర్యము 


మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిగా, భార్యగా స్త్రీ పోషించే పాత్రను వర్ణించే పద్యమిది.


నాకు తల్లి లేదు కాబట్టి నాదే ఈ పద్య మనుకోవచ్చు.తల్లి లేని లోటు ఆమె కోడలు భార్యగా తీర్చింది. తనే తల్లి అయి తల్లిని మరిపించింది. నా తల్లికి ఓ నమస్సు, ఆమె కోడలికి ఓ ఆశీస్సు! 

English: On the eve of Mothers' Day this poem was written. As i do not have mother, this can be applied to me. The vanity created by mother was filled by her daughter-in-law. Wife became a mother and made him feel that his mother is still there. One salute to the mother and a blessing to her daughter-in-law! 






ముద్ద యరగ నడుచు మైలు దూరము ధని 
ముద్ద కొరకు నడుచు మైళ్ళు పేద 
బతుకు మీద ఆశె పేదకు ధనికును 
వాణి పలుకు మాట వినర నరుడ!  296

తాత్పర్యము 

పేద వాడు కాని, ధనవంతుడు కాని బ్రతుకు మీద ఆశ ఎవరికుండదు? తిన్న ముద్ద అరగడానికి ఓ మైలు నడుస్తాడు ఉన్న వాడు. ఆ ముద్ద ఎక్కడ దొరుకుతుందా అని అదే మైలు నడుస్తాడు లేని వాడు. ఇద్దరికీ ఆశ బ్రతుకు మీదే! 



English: The haves walk a mile to digest the food. The have-nots walk a mile in search of the food. Both do this with the hope they live longer.


రాలు కరుగు నంట రామ పదము పాడ
జలము రాలు కంట జనని కధకు
మేలు కలుగు నింట మారుతి భజనతొ
వాణి పలుకు మాట నాదు నోట!  297

తాత్పర్యము 

రాముని భజన చేస్తే, రామ నామము వల్లిస్తే రాళ్ళే కరుగుతాయట.  జనని జానకి గాధ వింటే కళ్ళ వెంట నీరు జల, జల రాలుతుందట. రాముని బంటు, మారుతి భజన చేస్తే గృహంలో సుఖ, సంతోషాలు ఉంటాయట. 



English: If we sing the praise of Rama, stones are said to melt. If we hear the story of Janaki, tears flow from eyes. If we want our house to be a dwelling of happiness and prosperity, it is good to sing the name of Hanuma.


పుత్రు డుండ తప్పు పున్నామ నరకము
యనుచు తల్లి తండ్రి యాత్ర పడగ 
పలుకు పసిడి యాయె పరము చూపె భువిని 
వాణి పలుకు మాట నాదు నోట! 298 

తాత్పర్యము 

కొడుకు ఉంటే పున్నామ నరకము తప్పుతుందని తల్లి, తండ్రి ఎంతో ఆరాట పడి పెంచితే, కొడుకు మాటలాడడమే పెద్ద ఉపకారంగా భావిస్తున్నాడే? నరకము తప్పడము సంగతి అలా ఉంచితే ఇక్కడే ఆ నరకాన్ని చూపిస్తున్నాడు కదా?  



English: It is a belief that a son rescues them from hell. But the son, by not talking to them when alive, is showing the hell on earth. 

పుస్తకమును యిచ్చె మస్తకమును తండ్రి 
తనయు చదువు కొరకు తపన పడెనొ
తపన మరిచె యెంచె తప్పులు తనయుడు
వాణి పలుకు మాట నాదు నోట! 299

తాత్పర్యము 

పుస్తకాన్ని, మస్తకాన్ని ఇచ్చాడు కదా తండ్రి. పుస్తకము కొనిస్తే, మస్తకము అంటే తెలివితేటలు వారసత్వంగా ఇచ్చాడు కదా? కొడుకు చదువుకొని వృద్ధి లోకి రావాలని తండ్రి పడే తపన ఎవరికి తెలుస్తుంది? (ఇందులో స్వార్ధమేమీ ఉండదు, పెద్ద వాడై ఉద్ధరిస్తాడని). ఆ తండ్రి పడ్డ తపనని మరిచి, వృద్ధి లోకి వచ్చాక తండ్రి చేసిన తప్పులు మాత్రమే పదే, పదే వల్లె వేస్తున్నాడే ఆ కొడుకు?   

English: Father not only gave books but gave his brain to the son, as inheritance with all the good intention that he studies and becomes great. (There is no selfishness in this and the father never expects his debt to be repaid). But the son, who occupies pride of place in the society, thanks to his father's selflessness) forgot the good and is in the process of picking holes in his character.


మాతృ భాష లోన మూడు నూర్లు ముగిసె
ఆట వెలది  మరియు తేట గీతి
వాక్కు దేవి దయతొ వాణి వాక్కు మహిమ
వాణి పలుకు మాట నాదు నోట! 300


మాత ఇచ్చె వాక్కు ధాత వయసు పెంచె

మూడు శతము ముగిసె మురిసె మనసు

వాణి యాన వచ్చె వ్రాయ పంచ శతము

వాణి పలుకు మాట నాదు నోట! 301 

తాత్పర్యము 

నా మాతృ భాషలో, వాగ్దేవి ఆశీస్సుతో, వాణి మాట సాయంతో ఆటవెలది, తేటగీతిలలో మూడు నూర్ల పద్యాలు వ్రాయడము ముగించాను.తల్లి సరస్వతి వ్రాయ వాక్కునిస్తే, బ్రహ్మ వయసు పెంచి సహకరిస్తున్నాడు. తల్లి వాణి నుంచి ఆనతి వచ్చింది, ఐదు నూర్లు పద్యాలు ముగించమని.  



English: With blessings of the Goddess of knowledge, Sarasvati and with the kind words of Vani, I completed three hundred poems.  Now I got permission from Devi Vani and more number of years from the Creator to complete five hundred poems.


తినెనొ లేదొ తాను తనయుని చదివించె
పస్తు లుండె కొనగ  పుస్తకములు 
ముదిమి వయసు లోన మురిసె తనయు చూసి
వాణి పలుకు మాట నాదు నోట! 302


మనుమ డొచ్చె నంచు మురిసె ముసలి తాత
కాను కివ్వ తాత కలలు కనెను
కొనగ పుస్తక మొండు కాని లేకనె పోయె 
వాణి పలుకు మాట నాదు నోట! 303

తాత్పర్యము 

తాను తిన్నాడో, లేక పస్తులున్నాడో తెలియదు కాని తనయుడికి పుస్తకాలు మాత్రం కొనియ్యడం మర్చిపోలేదు. (ఇప్పుడు ఆ తండ్రికి మిగిలిన ఆస్తి అదే). ముసలితనంలో కొడుకుని చూసి తెగ మురిసి పోయాడు. 


మనవడు పుట్టాడని మురిసి పోయిన తాత ఏదన్నా కానుక ఇద్దామని కలలు కన్నాడు. పుస్తకాలు మాత్రమే జీవితమనుకునే  ఆ తాత మనవడికి ఒక పుస్తకము కొనిద్దామని చూస్తే జేబులో చిల్లి గవ్వ లేదు కదా!    



English: Whether he ate food or starved none knows, but the father never ignored buying a good book to the son's benefit. In his old age he enjoys the growth of his son. But! Alas! The happy grand father enjoying arrival of grandson, wants to present him also a book. But there is not a penny left with him except the library of books he amassed to give knowledge to his son.



మనసు కుంగ వచ్చె మానసికపు వ్యాధి  
పిచ్చి యనుచు మచ్చ యొకటి వేసి
వేరు పరిచి తండ్రి వ్యక్తిత్వమును జంపె 
తనయు గనగ మీకు తపన యేల! 304

తాత్పర్యము 

జీవితమంతా అనేక కష్టాలను ఎదుర్కొన్న తండ్రి మానసికంగా కృంగి పోతే పిచ్చి వాడని ఒక ముద్ర వేసి ఆయన వ్యక్తిత్వానే చంపాడు కొడుకు.

ఎందుకయ్యా! కొడుకునే కనాలని తాపత్రయము? కొడుకుల కంటే కూతుళ్ళే కడుపులో పెట్టుకొని చూసుకుంటారు కదా? 



English: Through out life, facing trials and tribulations, when in old age, the father developed deep depression, the son branded him as mad and killed his great personality? Why do you hanker after sons? Daughters look after you better than sons. 


పేద వాని కినుక పెదవికి చేటట 
ముదిమి కినుక చేటు మనసు కగును
పేదరికము పోదు పెదవిని కొరుకగ
వయసు తిరిగి రాదు వాదు లాడ! 305

తాత్పర్యము 

పేదవాడికి కోపమొస్తే ఏమి చెయ్యాలో తోచక పెదవి కొరుక్కుంటాడట. అందుకే "పేద వాని కోపము పెదవికి చేటు" అంటారు. ముసలి వానికి కోపమొస్తే మనసు దారి తప్పి పిచ్చి వాడవుతాడు. పెదవి కొరుక్కుంటే పేదరికము పోదు. కోపమొచ్చి పిచ్చి వాడి లాగా వాదులాడుతూ కూర్చుంటే పోయిన వయసు తిరిగి రాదు.  



English: It is said that if a poor man gets angry, he bites his lip until it bleeds and hurts him, as he can do nothing to the rich. Likewise, if an old man gets angry his mind becomes imbalanced and he is branded mad. If lips are bitten poverty will not vanish. And if one argues, the gone age will not return.


చీమ తినును పక్షి సేమము నుండగ 
పులుగె చీమ కగును భుక్తి తుదకు 
అగము నుండి వచ్చు యగ్గి పుడక కాదె
యగ్ని జ్వాల యగును యడవు లందు! 306

తాత్పర్యము



పక్షి తను జీవించడానికి పురుగులను, చీమలను తింటుంది. అవే చీమలు పక్షి చని పోయాక దాని శరీరాన్ని ఆహారంగా చేసుకుంటాయి. చెట్టు నుంచి వచ్చిన పుడక అగ్గి పుల్ల అవుతుంది కదా? మరి అదే అగ్గి పుల్ల అడవులనే తగుల పెట్టే శక్తి కలిగి ఉంటుంది కదా?  



English: A bird eats ants to make a living. The same ants make the dead body of the bird as their food. The match stick that comes from a tree has the potential to potential to burn the whole of a forest!




భాగ్యవంతు డనుచు బరుల నింద తగదు 
బండి యోడ యగును భాగ్య మందు
పగిలి యోడ యగును బండి భాగ్యము బోవ   
కాల మహిమ నెన్న కాదు తరము!  307



(వాణి పలుకు మాట నాదు నోట)

తాత్పర్యము

నేను భాగ్యవంతుడను కదా అని ఇతరులను దూషించడము తగదు. భాగ్యము కలిసి వచ్చినప్పుడు బండి ఓడ అవుతుంది. భాగ్యము పోయినప్పుడు అదే ఓడ పగిలి బండి అవుతుంది. కాల మహిమ తెలియగా ఎవరి తరము?   

English: When fortune favors a cart turns into a ship. But when fortune disfavors, the ship breaks and becomes a cart. Who can predict the tide of time? 



అహము విడిచి పెట్ట యిహమున సుఖమట
యెక్కు వయిన సుఖము యహము పెరుగు
యిహము విడిచి పెట్ట యిహముకు విరహమే
విడిచి పోదు యహము ఇహము నెపుడు!
(వాణి పలుకు మాట నాదు నోట) 308

తాత్పర్యము

అహము విడిస్తే ఇహములో, అంటే ఈ లోకములో సుఖంగా బ్రతుక వచ్చు. ఆ సుఖమే ఎక్కుడయితే, అహము పెరుగుతుంది కదా? ఇహము విడిచి పెట్టి పరముకి పోతే మరి ఇహముకు విరహమే కదా? అందుకేనేమో అహమెప్పుడూ ఇహమును విడిచి పెట్టి పోదు. బ్రతికున్నంత కాలము అహము వెంటాడుతూనే ఉంటుందని అర్ధము.

English: If one sheds ego, he lives happily in this world. But when the happiness exceeds limits, it gives rise to more ego. When the soul leaves this world and goes to higher worlds, pangs of separation will be there for life here. That is why the ego never leaves this world.



యముడు కూడ బెదిరె యమ అర్జెన్సీ చూసి
చిత్ర గుప్తు డేమొ చెరసాల పాలాయె
పాప మెంతొ చేయ సుపరిపా లనపేర
నేడు చెగ్జి టయ్యె మోడి రాగ! 309
చెగ్జిట్ =CEXIT
41st Anniversary of Emergency.
తాత్పర్యము 

ఎమర్జెన్సీ చూసి యముడు కూడ బెదిరి పోయాడు. చిత్రగుప్తుడు కూడా చెరసాల పాలయ్యాడు. ఎమర్గెన్సీ సమయంలో సుపరిపాలన పేరున కాంగ్రెస్  వారు అనేక పాపాలు చేశారు. అందుకే ఈరోజు చెక్జిట్ (కాంగ్రెస్ ఎక్జిట్) అయింది.



English: This poem was penned on the eve of the 41st anniversary of Emergency. Looking at Emergency, even the Lord of Death, Yama was mortally afraid. Chitragupta was jailed. In the name of good governance, there was no sin the Congress Party did not commit. That is why now, it is CEXIT, (Congress Exit)



నవ్వ లేని వాడు నువుగింజ సమమౌను
నవ్వు లేని నాడు కొవ్వు పెరుగు
నవ్వు పంచు వాడు నాగరికము పెంచు
నవ్వు చంప చచ్చు నవ్వు కొరకు!  310

తాత్పర్యము 

నవ్వ లేని వాడు నువ్వు గింజ సమానము.  నవ్వే లేక పోతే, కొవ్వు పెరిగే అవకాశం కూడా వుంది.నవ్వు నలుగురుకీ పంచే వాడు నాగరికము పెంచుతాడు. నవ్వునె చంపితే, నవ్వు దొరక్క చచ్చి పోతాడు. 



English: Man who cant smile is like a sesame seed. (means too small). When one cant laugh his fat increases. The man who laughs spreads good culture.If one kills smile, he will dies in search of smile.




చేత నెంతొ విద్య చెరగని చిరునవ్వు
పసిడి కీర్ష్య మేని పసిమి చూసి
కాన  ఇంతి  వయసు కలవర పడె బ్రహ్మ
పొట్టి  మగని కెరుక పుట్టె నెపుడొ! 311

పసిడి లేదు కాని పసి మనసు నీ సొత్తు
నగలు లేవ నేమి నవ్వె సొత్తు 
భవన మొకటి లేదు పిల్లలె త్రాణము (ప్రాణము)  
నాకు నీవె రక్ష నీకు నేను!  312
తాత్పర్యము 

కొంతమంది ఆడ వాళ్ళకి వయసు పెరిగినట్టు తెలియదు. ఎంతో చదువుకున్న ఆ ఇల్లాలికి ముఖము మీద చిరునవ్వు చెరగదు. ఆమె మేని పసిమి చూసి బంగారము కూడా చిన్న బుచ్చుకుంటుంది. నేను ఈమెను ఎప్పుడు సృష్టించాను అనే అయోమయంలో బ్రహ్మ కలవర పడ్డాడు. (వయసు గుర్తు పట్ట లేక). కాని ఆమెను కట్టుకున్న పొట్టి భర్తకు మాత్రమే తెలుసు ఆమె వయసు. చూడండి.  

English: It is difficult to guess the age of women. See this woman. Highly educated and the smile never leaves her face. Even gold feels jealous of the color of her skin. Tent age. The Creator is confused unable to reconcile the date He created her and her apparent present age. Only her husband knows her age. What if there is no gold? You have a mind of an innocent child. There are no ornaments, your smile is enough. There are no buildings, but your children are your life. You are my leading light, I am yours.






మూడు రోజులనుండి 20 సార్లు చూసా... ఇప్పటికి అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడో.....

రాచరికము పోయె రాచ పుండు మిగిలె
ప్రజల రాజ్య మొచ్చె పుండు ముదిరె
యిజము యేది యైన నిజము బల్క నపుడు 
కలియె రాజ్య మేలు కాల మహిమ! 314

తాత్పర్యము 

రాచరికం పోయి రాచ పుండు మిగిలింది. ప్రజా స్వామ్యమొచ్చి పుండు ముదిరింది.నిజము చెప్పనపుడు ఏ యిజమైతే ఏమిటి? కాల మహిమ కదా? కలే వచ్చి రాజ్యమేలుతున్నాడు.  

English: Monarchy has gone, leaving behind a "cancer". Democracy came and the cancer aggravated. When one does not speak truth, whichever is the "ism", it does no benefit to people. Fate has it that "KALI" , the Yuga Lord is ruling nations.


కాసు తగల బెట్టి కొవ్వు పెంచెను నాడు
కొవ్వు కరగ నేడు కాసె దిక్కు
లిపొ సక్ష ననుచు లక్షలు తగలేసె
కర్మ ఫలము మిగిలె కొవ్వు రూపు! 315

తాత్పర్యము 

డబ్బు ఉన్నపుడు విచ్చలవిడిగా ఖర్చు చేసి కొవ్వు పెంచాడు.ఆ కొవ్వు కరగడానికి ఇప్పుడు ఆ డబ్బే అవసరమైంది. పొట్ట చుట్టూ కోయించుకోడానికి  (లిపోసక్షన్) లక్షలు ఖర్చు చేశాడు.  కొవ్వు రూపంలో కర్మ ఫలము మిగిలింది.   
English: When rich, he spent money recklessly and accumulated fat.  Now the same money came to his rescue for reducing fat. He spent millions on Liposuction.  The result of past Karma! 


గుణము పణము పెట్టి పణమును పెంచెను  
ధనము కుదువ బెట్టి గుణము కొనగ 
తృణము గుణము దొరుక ఘనమాయె జగమున
దాన మీగ గుణము తానె వచ్చె! 316

తాత్పర్యము 

గుణాన్ని తాకట్టు పెట్టి, ధనాన్ని పెంచాడు. ఆ ధనాన్ని తాకట్టు పెట్టి గుణాన్ని మళ్ళీ కొందామంటే తృణమంత గుణము దొరకడం అతి కష్టమయ్యింది.  ఎప్పుడైతే దానాలు చేయడం మొదలెట్టాడో, గుణము తానే తిరిగి వచ్చిందట. 

English:

He pledged his character and earned lots of money. But when he tried to pledge the money to get back his character, he could not find even trace of it. When he started sharing his wealth, the character returned on its own.



                                      // SUBHAM BHUYATH//