1-2 శ్లోకములు
ఆటవెలది
ధర్మ మొకటె యెరుగు ధన్యుడు వాల్మీకి
రామ కధను పాడ రుటము కలుగు
నారద ముని పలికి నెనరు పరిఢవిల్ల
మబ్బు త్రోవ వెడలె మరలి స్వర్గమునకు! 1
రుటము = శక్తి
3,4,5 శ్లోకములు
ఆటవెలది
ధాత సుతుడు వెడల తదుపరి వాల్మీకి
తృప్తి చెంది వెడలె తమస నదికి
జలములందు దిగుచు చెప్పె శిష్యుని తోడ
నదిలొ జలము లెంతొ నిర్మలములు!
ఆటవెలది
సత్పురుషుల మనము శుద్ధ మెటుల యుండొ
అటులె నదిలొ నీరు యలరు చుండె
జలము లందు సేతు జపమును స్నానము
నాదు యుదక పాత్ర నిమ్ము శిష్య!
6 నుంచి 15 వ శ్లోకం వరకు
ఉత్పలమాల
కారుజ సూనుడా విధము గా వనముం తిలకించుచున్ యహో
ధారుణి రామణీయకము గాంచియు యబ్బుర మొందియున్ మనో
నిగ్రహ శాలియైన ముని నృంగవు డంతట చూచె నచ్చటన్
క్రూరుడు యొక్కనిం గనియె గైరికు బాణము దెబ్బ కక్కటా !
ఆటవెలది se
కామ కేళి యందు కాలమే తెలియని
క్రౌంచ జంట పయిన కరుణ లేక
మృగ జీవనుండు మగ పక్కి జంపగ
మగడు ప్రాణ మొదల మరణించె చెలియతా !
ఆటవెలది
క్రౌంచ పక్షుల గని కరుణతొ వాల్మీకి
ధర్మ శీలు డతడు దయతొ యనియె
పక్షి జంట జంపి పరమ పాపివి యైతి
చేర కాలు నీకు సమయ మాయె !
16 వ శ్లోకం
ఆటవెలది
క్రౌంచ పక్షుల గని కరుణ రసము పొంగ
శ్లోక మొకటి చెప్పి శోకమునను
అబ్బురమున ఋషియు ఆలోచనను చేసె
ఇట్టి పలుకు నాకు ఎటుల వచ్చె!
17, 18 వ శ్లోకములు
ఆటవెలది
శాస్త్ర కోవిదుండు శిష్యునితొ బలికె
ఛందొ బద్ధ మయిన శ్లోక మొండు
నాల్గు పాదములతొ నొప్పుచున్నది యిది
వాద్య యుక్తముగను పాడుటకును!
అక్షరములు గనగ యెంతయొ లయముగ
పలుకులను గనగ ప్రాస యతులు
సమము నాయము యొండు సేసెను శ్లోకము
సంతసించితేను చట్టు గనరొ !
చట్టు= శిష్యుడు
19, 20, 21, 22 శ్లోకములు
అవ్విధంబు బల్కి యా ముని వర్యుడు
మదిని నిలిపి యదియె మరలి వెడల
శిష్యు డటులె యట్టి శ్లోకము పఠియించి
మరువ కుండు నటుల మదిని నిలిపె!
వినయు డయిన శిష్యు వాత్సల్య మున జూచి
ఆశ్రమమున జనియె యెంతొ ముదము
మానిషాద శ్లోక మర్ధ సహితముగ
తలచు కొనుచు మునియు తనము చేసె!
23 వ శ్లోకం
సృష్టి కర్త బ్రహ్మ చతుర్ముఖుడు ధాత
స్వయముగ తను వచ్చె సంతసముతొ
ఋషిని చూడ తలచి రయమున విచ్చేసె
పుట్ట పుట్టువాయె పుణ్య జీవి!
పుట్ట పుట్టువు= పుట్ట నుండి జన్మించిన వాడు, వాల్మీకి.
24, 25 శ్లోకములు
కనియు బ్రహ్మ దేవు కయిమోడ్చి వాల్మీకి
పాద పద్మములకు ప్రణమిల్లి
సేవలన్ని జేసి సంతస ముప్పంగ
కుశల ప్రశ్న లడిగె కమల జన్ము!
కమల జన్ముడు = కమలము నందు జన్మించిన వాడు, విధాత.
26, 27, 28, 29 శ్లోకములు
ಆటవెలది
తదుపరి ఋషికి యుప దేశము సేయగ
అర్ధ మగు నటుల యా మునికిని
ఉచిత యాసనమున ఉపవిష్టు డయెను
ఆసిను డగు మనుచు యానతిచ్చె!
ఆటవెలది
వినయ శీలు డయిన వాల్మీకి మునియును
ఉపవిష్టు డయెను యుచితముగను
కర్త తనకు ఎదుట కూర్చుని యున్నను
మరువ డాయె క్రౌంచ దీనవస్థ!
ఆటవెలది
మరల మరల చదివె మానిషాద యనుచు
మనసు కరుగ పాడె మానిషాద
బోయ చేసి నట్టీ పాప కార్యము ది తలచి
కలత చెందె దయతొ కుమిలి పోయె!
30, 31 శ్లోకములు
తేటగీతి
బ్రహ్మ యనుమతి దొరికె యనెడి భావ మొండు
మనసు నందు కరుణను మెదలగ యెలమి తోడ
మానిషాద యనుచును మహర్షి బలికె ప్రీతి
ధాత బలికె దయతోడ మునివర్య వినుము శ్రద్ధ!
కందము
ధర్మా త్ముడతడు ప్రజలతొ
ధర్మా చరణము చేయించు దయయును యెంతో
కారుణ్యము నను రణమున
ధీరుడు యవనిలొ యెంతయు ప్రధ గల యా!
కందము
శ్రీ రాముని చరితము మన
యారాముని దయతహో కరుణతొ రమా
నారాయణునకు బ్రియుడగు
నారద మునిచే గారము గ నుడివి న కధన్!
కందము
శ్రీరాముని ఘన చరితము
యా రాముని సోదరుండు లక్కుమనుడు సీ
యా రాముల కధ