Sunday, April 24, 2016

VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE



VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE 



తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11  తరగతి తరువాతతెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూ
తదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషాపుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానేమిగిలి పోయిందిఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నానుకాని ఏనాడూ ఒక్క పద్యంకూడ పూర్తి చెయ్యఠలేదు.

It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకునా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టానుచిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణసూత్రాలులఘువులుగురువులువృత్తాలుయతిప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నానునాభార్య సలహా తీసుకున్నానుపద్యం పూర్తయ్యాకఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చునాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పిందికుదరలేదుసరైనపదంవదిలెశాను.
ఇక మీ ఓపిక.

At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.

వాణి శతనానికి నాందీ పద్యము.

కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!

Dedicated to Goddess of Knowledge, Vani.

నా చదువుల రాణి వాణికి అంకితం.

Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.




 




వాణి శతకం PART 7




జనని సేవ చేయ చికిచికి యగుటొప్పు  

లంక చేర హనుమ లేశ్య మవడె 

భరత మాత కొలుతు బడబాగ్ని ప్రొఢునై   

వాణి పలుకు మాట నాదు నోట! 263

No

English:



To serve the Mother, it is appropriate to become small.  Did Lord Hanuma not become a tiny monkey to cross the fates of Lanka? I will turn courageous to fight the raging fires of dissonance to serve my Mother Land! 



దుర్ముఖి నామ వత్సర శుభాకాంక్షలు 




వచ్చె నేడు యుగాది వత్సర దుర్ముఖి


ముఖము చాటు చేసె మన్మధుండు

దుర్ముఖమ్ము నకును దూరము యుండగ 

వాణి పలుకు మాట నాదు నోట! 264


యుగము మారె నేడు యుగాది పండుగ

శోష వచ్చి వెడలె శోభకృత్తు

క్రోధి వత్సరమట క్రొంగొత్త వెలుగట

వాణి పలుకు మాట వినర నరుడ!



మన్మధ తర్వాత దుర్ముఖి కదండీ, అందు చేత 

English:

This is an invitation to the Telugu New year Durmukhi! Durmukhi entered today. Durmukhi literally means "An unpleasant Face". Previous year was Manmadha! (CUPID) Once the Durmukhi entered the scene the Manmadha hid his face, as he wanted to keep himself away from unpleasantness.


వలపు తీపి ప్రేమ పులుపును కలగల్పి
కొత్త వధువు లేత కొబ్బ రవగ
చేదు వగరు కలుప చేష్టలుడిగె యత్త  

వాణి పలుకు మాట వినర నరుడ!  265

English: 

Telugu new year is invited by experiencing six varieties of taste buds. Mixing the sweet taste of affection and sour love, the new bride turns to tender coconut. Once she mixed the bitterness and acridity in the recipe the mother-in-law lost all senses. (A pun on the new bride and mother in law relationships)




సతమతమ్ము యవకు గతమును తలచుకు  

గ్రహము రాశి మారె నిగ్రహించు  
కాక ఫలము (కోకిల) పాడె క్రొంగొత్త రాగము 
వాణి పలుకు మాట వినర నరుడ! 266

English: Oh! Man! Do not get confused or confounded living in the past. The planet changed their position in the new year. Take a pause. The Cuckoo bird started singing in a new tune .



చింత  వేప మావి చిగురులు వేసెను   

చెరుకు గడలు తీపి కబురు చెప్పె  
రామ చిలుక చెప్పె రాశి ఫలము వాసి
వాణి పలుకు మాట వినర నరుడ!   267 

English: On the Imli and Neem trees new grown tender leaves are giving a pleasantness. The sugar cane is saying sweet words in conversation. The parrot on the tree is telling the future. (parrotology) 




వలపు పులుపు కలిపి వధువు యుగాదొచ్చె

చెరుకు గడల తీపి తీసుకొచ్చె  
చేదు వగరు కలిపి జాగ్రత్త యనిచెప్పె 
వాణి పలుకు మాట వినర నరుడ!   268



జీవితంలో చేదూ , వగరూ కూడా ఉంటాయి, చూసి ముందడుగు వెయ్యమని యుగాది పచ్చడి సందేశం! 

English: The new bride Yugaadi has entered with the sour taste of love with the sweetness of sugar cane. It added the bitterness and acridity to caution that life is not just sweet or sour but bitter and acrid too. 



కులము కుళ్ళు పైన గళము లేపెడి మీ 
వెనుక నున్న వారు వేరె కులమె 
నేను నీవు కలువ మనమంత కాదొకొ 
వాణి పలుకు మాట నాదు నోట!  269

English: This poem is regarding the crooks who shout in the name of caste less society by grouping people of their own caste behind them. Guys! You shout against caste in the society? Which caste are those behind you?Are they from all castes? Only when you take me into your groups you and me turn to "WE".



కరువు నేల జనుల కన్నీరు తుడువగ 
   కారులొ వెడలె యమీరు యొకడు   



ఖాను ఇంటి నిండుగ స్నానపు గదులెన్నొ    
   జలము ధారగ వచ్చు నాల లెన్నొ  



దొరగా రింటిలొ నీరు, కరువు సీమ  
   కార్చడానికి లేదు కనుల నీరు  



కాసుల రాసులు కాణి కి పరుగులు




    ధనికుల పేదల దారె వేరు 

త్రోవ చూప డాయె త్రవ్వగ బావులు  
కాసు రాల్చ డాయె ఖాను సాబు  
నీటి మూట కట్టె మాటల తోడనె 
కనుల నీరు కార్చె కరువు తీర! 270

English: recently Amir Khan visited a drought-hit village in Beed, Maharashtra. This poem is not about Mr. Khan but rich people who shed crocodile tears. To wipe out the tears of drought hit population a rich man (amir) went in car worth a ten millions. Back at his home there are umpteen number of bath rooms, many numbers of water pipes where water flows like a water falls, there is plenty of water in the house of the rich, in the land of drought even tears dried up.  "Bundles of notes and struggle for penny" , this aptly describes the rich-poor gap.

The rich man does not show a way to dig new wells, he wont donate a penny for helping the thirsty but he packs sweet words in a watery bundle and drops lots of tears to drive away drought.



పగుల కొట్టు ఖాళి పొట్టని తెలుగోడ 
చట్ని నెయ్యి పొడుము చేర్చి వేడి 
ఇడ్లి వడ దోశ సాంబారు తవితీర 
వాణి పలుకు మాట నాదు నోట!  271

English: Just a fun poem on the Idly Vada breakfast in AP state. Break the empty stomack (Break the fast) with Idly and Vada adding spicy chutney, spicy, tasty powder made of curry leaves and sambar. Add dosa as addendum.


విద్య లేని వాడు వింత పశువు నాడు
చదువు కొనని వాడు చవట నేడు 
చదవ లేని వాడు చట్ట సభలొ తేలు 
వాణి పలుకు మాట నాదు నోట! 272

(బెంగాలు పరిస్థితి)

English: I read that in Bengal many candidates for MLA election are illiterates, mainly TMC party.  A satire. Once upon a time it was considered that an illiterate was like a rare animal. Now, if we do not "BUY" education he is a moron. Added to this, now those who can not read or write are landing in legislatures.



భూమి కొక్క దినము భామ కొక్క దినము
కాచు కొనక వారి దోచు టేల  
కరువు లోన కూడ బరువు మ్రోయరె వారు 
వాణి పలుకు మాట నాదు నోట!  273

English: we have a day for EARTH and a day for WOMAN. Instead of protecting them we are looting them of their assets the trees and the honor. Do the Earth and the Woman not bear the burden of the world even in scarcity and penury?


భూ భూమి మి దినము నేడు భరత భూమి దినము
మాత యన నోట మాట రాదె
జైలు కెళ్ళు వారి జేజేలు కొట్టరె
వాణి పలుకు మాట నాదు నోట! 274
English: Another one on Earth Day. Earth Day means it is Earth of India Day for us. But we turn dumb when asked to call her "MOTHER" But we hail those who go jails and return of bail.

చెట్టు తోన చెప్పి పుట్టతోనను చెప్పి
భూమి పడెను ఎంతొ బాధ నేడు 
నరుల ఆశ పెరిగె నరకము నాకాయె
వాణి పలుకు మాట నాదు నోట! 275

English: Earth Day again. The earth waled by telling the tree and the burrow that greed of man multiplied and I am suffering hell.

నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు 
నీరు లేదు నేడు నిజము లేదు 
బీట వేసె భూమి కాటు వేసెను కల్ల
వాణి పలుకు మాట నాదు నోట!  276

English: Our ancestors used to say water knows the valley and God knows the truth. But there is neither truth nor water. Earth dried up and lies are biting. 

బడికి వెళ్ళ హక్కు గుడికి వెళ్ళగ హక్కు
బాధ్య తెవరి కొద్దు బరువు వద్దు 
ఊరి దారి వేరు ఉలిపి కట్టెది వేరు
వాణి పలుకు మాట నాదు నోట!  277

English: A satire on people in Universities and all groups demanding their rights for entering Temples etc.,  People seek right in Universities and for entering temples. None wants to take responsibility. The whole world is moving one side and these guys to the other side.

పెదవి విప్పలేదు పదవి వదల లేదు 
కామి కాడు గాని మౌన గామి ll
కావడెత్తి మోసె కాంగ్రెస్సు పాపాలు
వాణి పలుకు మాట నాదు నోట! 278

English: He never parted his two lips to talk nor did he ever leave his post as PM.  He is not SENSUAL but is SILENCUAL . He shcarried the sins of Congress on his shoulders.

                                           ############################ 


Manikya veena mupanalayanteem 

madalasam manjula vaagvilasaam||
maahendra neel dyuti komalaangi||
maatanga kanyaam manasasmaraami||