Monday, April 4, 2016

VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE

U


VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE 




తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11  తరగతి తరువాతతెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూ
తదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషాపుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానేమిగిలి పోయిందిఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నానుకాని ఏనాడూ ఒక్క పద్యంకూడ పూర్తి చెయ్యలేదు.

It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకునా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టానుచిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణసూత్రాలులఘువులుగురువులువృత్తాలుయతిప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నానునాభార్య సలహా తీసుకున్నానుపద్యం పూర్తయ్యాకఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చునాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పిందికుదరలేదుసరైనపదంవదిలెశాను.
ఇక మీ ఓపిక.

At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.

వాణి శతనానికి నాందీ పద్యము.

కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!

Dedicated to Goddess of Knowledge, Vani.

నా చదువుల రాణి వాణికి అంకితం.

Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.







వాణి శతకం PART 6




ఆ.నలుగురి మెప్పుకు నాట్యము చేయకు

     నటరాజు మెప్పుకె నెమలి యాడు

సరిగమ పాడగ శ్రోతల  వెదుకకు

      కోకిల పాడగ జగతె శ్రోత 

వలపు సంద్రము లోన యలలకు బెదరకు

      నదులు చేరి యటనె నాట్య మాడు 

బ్రదికి యుండిన నాడు వెదుకకు స్వర్గము 

      నీవు బ్రదుకు  నేల నాక మౌగ

పక్షి చెప్పు నీకు పరమార్ధ సారము

నదులు చెప్పు నీకు నడవడెటుల 

స్వంత బుద్ధి చేర్చి స్వర్గము భువి దించు 

వాణి పలుకు మాట నాదు నోట! 248



Inspiration: 
“You've gotta dance like there's nobody watching,

Love like you'll never be hurt,

Sing like there's nobody listening,

And live like it's heaven on earth.” 




Do not dance for the pleasure of and praise from patrons. When the peacock dances it devotes the dance to Nataraja, the Lord of Dance, Lord Shiva.

Do not search for audience when you  sing Sa, Re, Ga, Ma (classical music) . The Cuckoo sings and the whole world is the audience.

In the great Ocean of LOVE, do not fear the tides. All the rivers join the oceans and dance in unison with the tides.

The Earth you live on is Heaven. Why do you search for heaven somewhere else? 

The bird teaches you the essence of Divinity. Rivers teach you how to love and live. Your own wisdom brings  the Heaven down to earth. ( Learn to live like it is Heaven on earth. do not despair). 


జంట సూత్రమ్ములు జీవించ జగతిని
మర్మ మెరిగి జగతి మాయ కాదు
కల్ల జగతి యెల్ల కపట నాటక మంచు
వాణి పలుకు మాట నాదు నోట!  249
Inspiration:
“There are only two ways to live your life. One is as though nothing is a miracle. The other is as though everything is a miracle.”

బతుకు టన్న నిన్ను వెదుకు కొనుట కాదు
బ్రహ్మ చేసి నట్టి బొమ్మవె గద
నిజము తెలియు మరల నిను నీవు సృష్టింప
వాణి పలుకు మాట నాదు నోట! 250

Inspiration: 

“Life isn't about finding yourself. Life is about creating yourself.”

Life is not searching for yourself or your soul. After all, you are doll made by the Creator, Lord Brahma! Only when you re-create (reinvent) yourself you will realize the real truth about yourself. 

The #JNUROW

చదువుల గుడులవి శిరమోడి ప్రణమిల్ల
       కోతి మూక లాడు కాన కాదు 
విద్య యాలయములు వాగ్దేవి నెలవులు 
     ముష్కర మూకల మనికి (వాసము) కాదు
వెల లేని గురువులు తలిదండ్రి మరు రూపు 
  ద్రోహ చింతను నేర్పు దొరలు కాదు 
విఙ్ఞత వినయము వెదజల్లు వనమది 
   మదపు టేనుగు మూక పధము   కాదు  

జనులు పన్ను కట్ట జున్ను తినుచు
కన్న తల్లి మీద కత్తి దూయు 
ఖరుల లంక కాదు విరుల తీవ,   
వాణి పలుకు మాట నాదు నోట! 251

English:

Universities are Temples of education, not forests where monkeys play pranks. Educational Institutes are abodes of Goddess Saraswati, not the abode of goons and miscreants. Valuable teachers are expected to act as parents, not "His Lordships" who teach revolt and revolution. College is a beautiful garden where the fragrance of knowledge and humility are spread and not mud track for a wild elephant to trample upon and crush.  

They enjoy Custard milk on tax payers's money and plan to stab the Motherland in the back. Do they imagine that it is Lanka where monsters reside? No! It is a tender, beautiful flower creeper. 


బుద్ధుడు బుట్టిన భూమియె భారతి
     కమ్మ్యూనిజము పేర కేక లేల
నాలంద వెలసిన నందన వనమిది
     నాగు బామును బోలు నందు డేల
తాత నెన్న విఙ్ఞుడు తక్షశిల విపంచి
     పరమ శుంఠడైన పౌత్రు డేల
వాల్మీకి వ్యాసుడు విరిసిన వనమున
     కనుకట్టు చేసెడు కన్న యేల



ప్రతిభ సున్న చూడ పదులు మూడు వయసు

జనము సొమ్ము దినుచు జగడ మేల
విద్య మిధ్య యాయె వెత మిగిలె భారతి
వాణి పలుకు మాట నాదు నోట! 252

English: 

Bharat is where Lord Buddha was born. Why shout trash in the name of Communism? This is the "NANDANA VANA" (Heavenly Garden) where  Nalanda University brought out talented students. Do we need the serpent like King Nanda back again? Their grandfather (Chanakya)  was knowledgeable and the Lord Brahma of Takshasila University.  Why are we looking at moronic grandsons in Universities?  Why do we see charmers like the Kanhaiyas in grandiose garden in which Valmiki and Vyasa bloomed. (Valmiki was from hunter community, Vyasa was a Brahmin as per mythology).

Wisdom is NIL and ag crossed the thirties. They swallow subsidies from tax payers' money and fight with the government representing the tax payers.  Learning has become a mirage and misery remained with Bharat Mata, with such prodigal children. 


The #CongressMelodrama



దిగ్విజయుడు పేరు దిక్కు లేక తిరిగె
స్వంత రాష్ట్రము నందె చింత చెంది \
పిచ్చిదంబరుడట పిచ్చెక్కి తిరిగేను
కొడుకు నిర్వాకము కొరివి యంట
సిద్దరామయ్యట చిరుబురు లాడేను 
గడియార మనగానె కపటి వోలె
వీరభద్రుడు కుంగె విరివిగ యాస్తులు 
జప్తు సేయగ యీడి జాలి వీడి
తాత పేరు చెప్పి నేతులు తాగేరు
గాంధి పేర సూపి భ్రాంతి యొకటి
కాంగిరేసు సేయు దొంగ జపము చూడు
వాణి పలుకు మాట నాదు నోట! 253

English: 

His name is Digvijaya.(The conqueror of all sides)  But, today he is sadly roaming in his own state not knowing which side to go. His name is P. Chidambaram. Now he is roaming like a mad guy, stung by the actions of his son. The man named Siddaramaiah gets perturbed if one says the magic word "Watch". Veerabhadra gets stung by the attachment of properties by the ED. 

They enjoy cow ghee being heirs to royal blood. They name Gandhi as a mirage and resort to Tantrik Maya. Their name is Congress Party. 
Lord Shiva: 

బేసి కన్నుల వాడు పెను జోగి భైరవుడు
    అయిదు మోముల వేల్పు ఆది భిక్షు
గరళ కంఠుడు వాడు గంగ ధరుడు
   మృత్యుంజయుడు వాడు మదన రిపువు
ఫాల నేత్రుడు వాడు పశుపతి పశువుడు
    సదా శివుడె వాడు సాంబ శివుడు
సాంబు డన్నను వాడె సోముడు వాడెగ
    భైరవి పతి వాడె భవుడు వాడె

శూలము యొకచేత శంఖము మోవిపై
సగము దేహ మందు శక్తి నిలిపి
నగజ కూడి యాడ నటరాజు యాతడె
వాణి పలుకు మాట నాదు నోట! 254

English:¹

The Lord with three yes (odd number), He is a great Sanyasin. He is Bhairava, the Lord of Ganas. He is the Lord with five faces. He is the first mendicant (asker), He is the lord with poisoned throat, He is the Lord who bears Ganges on his head, He is Immortal, He is the enemy of Cupid, He is the Lord with an eye on forehead,  He is the Lord of animals, the Animal itself, He has many names Samba Siva, Sada Siva, samba, Soma, He is the husband of Parvati, He is bhava.

He is the Nataraja who dances with the Daughter of Himalayas,Trident in one hand, Conch in the other and enshrining half his body with the Goddess Shakthi. 



మరుభూమి బసవాని ముక్కంటి వేల్పుకు
   అభిషేకము సేతు  యావు పాల
జింక చర్మపు ధారి చంద్రధరు శంభును
   పూజింతు మనసార  భస్మ ధార
అంబరీషు డచలుడు అంబపతి ఈశుకు
   అంజలి ఘటింతు  యడకువగను
నాగభూషణు వాని నంది వాహనుకును
   షాష్టాంగమును సేతు శ్రద్ధ మీర
   
విషపు గళమె గాని వరమిచ్చు వేలుపు
రౌద్ర గుణమె గాని రక్షకుండు
కాల కంఠు వాని కయి మోడ్చి మ్రొక్కెద
వాణి పలుకు మాట నాదు నోట! 255

English:

I will hold the ritual of bathing the Lord whose abode is graveyard and who has odd eyes, I will pray the Lord who wears deer skin, who wears Moon on forehead, with a ashes. I will bow with humility to Lord Ambareesa, the unmoving, the husband of Amba and Eesa. I will bow on all eight organs before the Lord whose ornaments are serpents, whose vehicle is the Bull God.

He has poison in His throat but he grants lots of boons, He is said to be anger personified but he is the Savior of Humanity. I will fold my hands to pray him,  the God with serpents round his neck. 

Lord Vishnu; (Only Names)



అంబుజనాథుడు యరవిందాక్షుడు
     విరజుడు వనమాలి విష్ణు మూర్తి
పద్మజనాభుడు  పుండరీకాక్షుడు
     దేవ దేవు డతడు తాత తాత
ఈశ్వరే శ్వరుడౌగ ఈశ్వరు ప్రతిరూపు
   అచ్యుతు డుపేంద్రుడు యవ్యయుండు
వేద గర్భుడు యతడె వేదమె యాతడు
   పద్మ నాభుడు వాడు పరము వాడె


చక్ర మొక చేత శంఖము యొక చేత
శేష శయ్య పైన సేద దీరు
విశ్వ రూపు వాడు విశ్వమె వాడట
వాణి పలుకు మాట నాదు నోట! 255 


The Father:
తూలనాడగ లేదు తండ్రిని యేనాడు
   యెంచ లేదుగ  తప్పు యేమరచియు

తండ్రి ఋణము తీర్చ తాపత్రయ పడితి
   గురువు తానై మోసె బరువు కాదె

కడుపు నిండ తినెనొ క్షుద్బాధ యలసెనొ
   జ్ఙానిగ నను చేసె జ్ఙాత నాన్న

తాను చూపిన దారి నే నడిచి తెపుడు
   తల్లి ఋణము మిన్న తీర్చు కొనగ

మారె కాలము నేడు మరుగుజ్జు నయిపోతి
ధనము లేని వాడు ధరకు బరువు
కాలు పిలుపు కొరకు కయి మోడ్చి మ్రొక్కితి
వాణి పలుకు మాట నాదు నోట! 256

English:

I never shouted on my father nor did I point out any error/mistake on his part. (To err is human, he might have committed a billion blunders). I always tried to repay his debt. Did he not bear my burden (till I was 19 yrs.) being my friend, philosopher and guide?

I do not know when he ate stomach-full or when he was tired of hunger and depravity. But he, the wisest man on the earth made me the wisest possible heir. I always trod on the path he had shown and repaid the debt of my mother (I never mocked her poverty or depravity).

Times have changed and today the "giant" I was, I  turned into a Lilliput. The "poor and deprived" is a burden on the Mother Earth. I am waiting for the call from Lord Yama.  (Sooner the better)

(This is a Telugu poem as a tribute to the Telugu Proverb "Charity beyond self is like a trade transaction that boomerangs ab initio)



(తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము  అనే సామెతకు తెలుగులో  సీసం)

The Truth and The lie.

నిజము నడువ వేగ నిరోధము లెన్నొ
   నత్త నడక నడుచు నిక్క మెపుడు

కల్ల దారిలొ లేవు గతుకులు గోతులు
     అడ్డు లేక చనును అనృత మెపుడు

బంధు విరోధియౌ బలక కున్నను బొంకు
     కపటి చెంతను చేరు ఖరుల గుంపు

కాకఫలము పాడ కోకిల యొంటరె
     కాకి యరువ చేరు కాకులెన్నొ

ధార్తరాష్ట్రు వెంట తమ్ములు నూర్గురు
పాండు పుత్రు లెంచ పంచకమ్ము
మంది లెక్క కాదు మంచితనమె లెక్క
వాణి పలుకు మాట నాదు నోట!   257

English: 

When truth decides to take a walk, multitude are the speed breakers on the way to regulate its spread. In the way a lie there are no pot holes nor impediments and it spreads fast without hindrance. If you do not tell a lie you will incur wrath of kith and kin and become their foe (Yadardha vaadi Bandhu virodhi, but malevolent guys flock behind the con artist. When the Cuckoo bird sings it sings alone (no other Cuckoos join him) but when a crow kaws the whole crow community joins him. 

There are hundred Kauravas, but only five Pandavas. It is always dharma that counts not the numbers.  

The father:

జనమ నిచ్చిన తండ్రి జగమెరిగిన తండ్రి
     త్యాగ నిరతుడాత  త్యాగి యోగి

జ్ఙానియె తండిరి జనయిత జనకుడు
     తనయు యున్నతి చూసి తనరు తండ్రి

కంటి రెప్పల వోలె కాచిన యా తండ్రి
     సుతుని సుతుల గాచు సమయు తనక

తనయుల ప్రేమకై తపియించు యాతండ్రి
     నింద బడగ యెంత నలత చెందొ

తరము మారె తండ్రి తలరాత మారెగ
కొడుకు మారి పెండ్లి కుమరు డాయె
తండ్రి మంచి యెల్ల తప్పుగ యగుపించె
వాణి పలుకు మాత నాదు నోట!  258

English:

Father is the one who gave birth to the son. He is the one who knows the ways of the world. He is the wise one, the father. He is the one who enjoys, feels the pride of the growth of his son. the father who looked after the son as he eyelids protect the eyes, protects the sons of the sons till his last breath. How much that father who starves to be fed by the love of his sons, gets depressed, disheartened and dispirited when he has to be maltreated by the same sons? 

Generations changed, genre changed and the writing on the forehead of fathers changed. Son turned to husband. Whatever good the fathers have done is now looking a bummer. 

Sonia: 

అనధికా రధినేత అధిరాజ్య యధిపతై
    అనుకరణము సేసి యాఙ్ఞ లీయ

బధిరు డంధుడు మూగ పేడి సమునొకని
    కొలువు కూటము సేయ కట్టు సేసి

బంధు వర్గమును గూడి భూమి భారతి దోచి
    భావి తరమువారి భవిత దోచి

న్యాయ స్థానము నేడు నేర చరిత తోడ
    దేశ ద్రోహుల కూడి దొమ్మి సేసె

పూట కొక్క మాట పాట పాతదె కద
లౌక్య రాజ్య మనుచు లజ్జ వీడి
మతము పేర చీల్చె మంధర ముసలము
వాణి పలుకు మాట నాదు నోట! 259

English: 

As the unauthorized woman (who is not a leader) was given orders as if she were ruling, as she made a deaf, dumb, equivalent of gay made the in-charge to rule the nation, as she joined forces with relations to loot the precious land owned by Bharat Mata and looted the future of posterity, the same woman is today attacking democratic institutions by sleight of hand when the Courts are digging her criminal past.

She changes word each second. But the shameless song of secularism remains the same, This modern day Mandhara divided the State in the name of religion and creates rift among communities.


WhatApp: 

వాట్సాపు ప్రేమలు వాట్సాపు పెళ్ళిళ్ళు
బ్రహ్మ తలలు తిప్పె దిమ్మ తిరిగి
వాణి వీణ వదిలి వాట్సాపు  వాడగ
వాణి పలుకు మాట నాదు నోట! 260

English:

Love is on WhatsApp, marriages are on whatsApp. the Creator Brahma turned his four head in shock, as he found Vani leave Veena and hold WhatsApp on smart phone.

The miracle of family life:

సగటు జీవులు మేము సత్యము తెలియగ
     మనసు విప్పి చూడు మర్మ మొండు

తెలవారక మునుపె తిమిరారి తూర్పున
     సప్తాశ్వ రధముపై రాక మునుపె
   
తలిదండ్రి తములేచి తనయుల విద్యకై
     వృద్ధికై తపియించి వట్టి వడిసి

చిరునవ్వు చెదరక చిడిముడి పడకనె
     తనయుల యున్నతి తృప్తి చూడ

చిత్ర మదియె కాదె చిటిపొటి యెటులౌను
తల్లి తండ్రి మనసు తెరిచి చూడు
కాన వచ్చు తృప్తి తనయుల ఘనకీర్తి
వాణి పలుకు మాట నాదు నోట! 261

English:

We feel we are average. But if we dig deep and seek truth, the secret is different. (We are not average). 

Even before it is dawn and the opponent of darkness, the Sun God comes on his Seven Horse Chariot, the parents wake up and struggle for the education and future of their sons. The smile on their faces never fades and they never get irritated as they feast their eyes with the growth of the sons and their satisfaction. 

Is it not a wonder? How can it be trivia?  (చిటిపొటి ) Open up the hearts of the parents, you will find the delight and the grandeur of their sons. 

How can we be average, is the human race not great with the family bonding? 

The grandson: 


తండ్రి తండ్రి మరచె తనయుని తనయుడు
   తండ్రి తల్లి నేర్ప ద్వేష భాష

కంటి రెప్ప నేడు కంటినె పొడిచేను
   నలుసు పడిన దనుచు నేత్ర మందు

పరుల ధనము యాయె పట్టిపట్టి యకట
   విశ్వ ధాత తాత విస్తు పడగ

వేల వత్సరములు వెలిగిన నా భూమి
   సోనియ చేతను సొలయు రీతి

తండ్రి తప్పు లెంచు తనయుడు తనలోనె 
తనయు గొప్ప చూసి తనరు చుండు 
తెరుచు  కనులు వేగ  తనయుడు ప్రశ్నింప
వాణి పలుకు మాట నాదు నోట! 262
 
       
English: 

The son of son (grandson) today forgot who his father's father was, as his father's mother taught only the language of hatred.  The eyelid stabbed the eye, on the premise that there was a speck there in. Just as India as a Nation that  has shone billions of years suffered in the hands of a foreigner Sonia, the son's son (Patti Patti) became property of a third party to the surprise and shock of his Creator himself.. 

The son, who finds fault with everything the father does, prides in his own son's wisdom. But a day is not far off when the son's son will question the son and he opens his eyes to reality. 
                             

                                           ##########################



या देवी सर्वभुतेषु
Ya Devi Sarvabhutesu
Devi Durga 

Devi Durga 



नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः ।

नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम् ॥१॥

Namo Devyai Mahaa-Devyai Shivaayai Satatam Namah |
Namah Prakrtyai Bhadraayai Niyataah Prannataah Sma Taam ||1||


1.1: Salutations to the Devi, to the MahadeviSalutations Always to Her Who is One with Shiva (the Auspicious One).

1.2: Salutations to Her Who is the Auspicious (being One with Shiva) Primordial Source of Creation and Controller of Everything; We Bow Alwaysto Her.

http://greenmesg.org/mantras_slokas/devi_durga-ya_devi_sarvabhutesu.php


flowers




No comments:

Post a Comment