Monday, October 8, 2018

STORIES OF PANCHATANTRA IN SIMPLE TELUGU POEMS - TELUGU WITH ENGLISH TRANSLATION



PART 6 

WITH ENGLISH TRANSLATION




For more than two and a half millennia, the Panchatantra tales have regaled children and adults alike with a moral at the end of every story. Some believe that they are as old as the Rig Veda. There is also another story about these fables. According to it, these are stories Shiva told his consort Parvati. The present series is based on the Sanskrit original.
A king, worried that his three sons are without the wisdom to live in a world of wile and guile, asks a learned man calledVishnu Sharman to teach them the ways of the world.

Since his wards are dimwits, Vishnu Sharman decides to pass on wisdom to them in the form of stories. In these stories, he makes animals speak like human beings. Panchatantra is a collection of attractively told stories about the five ways that help the human being succeed in life. Pancha means five and tantra means ways or strategies or principles. Addressed to the king's children, the stories are primarily about statecraft and are popular throughout the world

                                                                                                                               
             

विद्वत्त्वं  नृपत्वं  नैव तुल्यं कदाचन  



स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते  


Scholar and king are never comparable. King is 



worshipped in his country, but scholar is worshipped 




everywhere. 







మిత్ర లాభ గాధ ముగిసిన పిదపను
మిత్ర భేద కధను మొదలిడగను
విష్ను శర్మ యాన విష్నువు యాశీస్సు
తెలుగు తల్లి యొక్క దీవ నొండు ! 1


తాత్పర్యము



మిత్ర లాభము యనెడి కధ ముగిసిన పిదప, మిత్ర భేదము యనెడి కధను సుళువైన తెలుగు పద్యములుగా వ్రాయుటకు శ్రీ మహావిష్ణువు యాశీస్సు మరియు శ్రీ విష్ణు శర్మ యానతి యయినది..


EnglishAfter completion of the part containing the story of "Gaining of Friends" Lord Vishnu blessed and the author "Panchatantra" Sree Vishnu Sarma ordered that I proceed to translate the next part "Losing of Friends" in simple Telugu Poetry form.


జంబుకమ్ము కదిలె శబ్దపు దిక్కుకు  
కాన శబ్ద మొచ్చు కారణమును 
కొంత దూర మేగి కనుగొనె యొక భేరి
భయము గొల్పు సద్దు భేరి సేసె!  41

తాత్పర్యము

ఈ విధముగ యోచించిన నక్క శబ్దము వచ్చిన దిశకు వెళ్ళీ చూడగా అక్కడ యొక యొద్ధ భేరి కాన వచ్చెను. ఆ భేరియే శబ్దము సేయుచుండెను. 

English: 

So thinking, the fox went in the direction of the sound and found a drum there. It was this drum that was making the fearful sound,



పెద్ద చెట్టు కింద పడియుండె నా భేరి

గాలి వీచ చెట్టు కొమ్మ లూగి

పడగ భేరి పైన పెద్ద శబ్దము చేసె 

భయము వీడి నక్క భేరి చీల్చె!  42



తాత్పర్యము



ఆ యుద్ధ భేరి ఒక పెద్ద వృక్షము కింద యున్నది. గాలికి ఆ చెట్టు కొమ్మలు ఊగి ఆ భేరి పైన పడ గానే పెద్ద శబ్దమొచ్చుచుండెనని గమనించిన నక్క భయము వదిలి ఆ భేరిని పగుల గొట్టెను.  





English: The drum was lying under a big tree. When the branches of the tree fell on the drum, it was making huge sound. Knowing the truth, the fox was rid of fear and it broke the drum open.


కధను చెప్పి బలికె కరటక మిత్రుడు

ఆఙ్ఞ యయిన నేను యడవి యెల్ల
యరసి యరచి రెవరొ యంత భీకరముగ
యెరిగి మరలి వత్తు యాన తిండు!  43





తాత్పర్యము

కరటకుని మిత్రుడైన దమనకుడు, పింగళకుని చూసి ఇట్లు పలికెను. "రాజా! మీరు ఆనతిచ్చిన నేను యడవి యెల్ల గాలించి ఇంత భయంకరముగ అరిచినదెవరో తెలుసుకొని రాగల వాడను. ఆనతిండు"


English: The friend of Karataka, Damanaka said, "Oh! King! If you order me I will make thorough search of the forest and find out who made such horrendous sound"


రాజు యానతీయ రయమున చనియెను

శబ్ద మర్మ మెరుగ జంబుకమ్ము
మృగ రాజు మదిని మెదిలె సంశయమోటి
నక్క వినయములను నమ్మ దగునె!  44





తాత్పర్యము

రాజు యానతి తీసుకొని దమనకుడు శబ్ద రహస్యమును చేదించుటకు వేగముగా వెడలెను. కాని మృగరాజు మనసులో ఒక సందేహము తలెత్తెను. "ఈ నక్క వినయములను నమ్మ వచ్చునో లేదో?" 

English: Taking permission from the King, Damanaka hurried into the forest to know the origin of the sound. But Pingalaka had a doubt in his mind whether the wily fox can be trusted.














No comments:

Post a Comment