Sunday, August 8, 2021


                          వాణి శత శతి


ఆకలి- ఆశ


మెతుకు దొరకదాయె మండెడి కడుపుకు

చిన్న తనము నందు శిక్ష యేకొ

బొక్కసమ్ము నిండ బోలెడు ధనముండె 

మెతుకు యెక్క దాయె మాయ యేమొ! 


దొంగ - దొర


తల్లి కడుపు నింప దొంగతనము జేసి

జనమ యంత గడిపె జయిలు నందె

బొక్కసమ్ము నింప బొక్కి ప్రజల సొమ్ము 

బెయిలు రాగ మరల బొక్క దొడగె !


ఆటవెలది


పంచదార కన్న పరదార తీపిjరా 

వీటి కన్న మిన్న వేశ్య వాడ

పిలక జుత్తు కన్న పిల్లి గడ్డమె ముద్దు 

సెక్యులరుల నీతి సాని రీతి !


దార = భార్య   వీడు = ఇల్లు 


పంచదార కన్న పక్కవాడి భార్య తీయగా ఉంటుందిట. ఇంటి కన్న సానివాడ సుఖంగా ఉంటుందట. పిలక జుట్టు, ఎబ్బే! పిల్లి గడ్డం, అబ్బో ఎంత ముద్దో? 

కుహనా లౌకికవాదం (Pseudo Secularism) సానితో సంసారం లాంటిదే.


,

భాగ్యవంతుడేమొ భోగి మంటలు వేసె

కాసు లేని వాడి కడుపు మండె

భాగ్య మున్న వాడు భోగి పండుగనియె

ధనము లేని వాడు దండుగనియె! 


భోగి పండుగొచ్చె పాత యల్లుడ రార

బూజు దులుపు  కాస్త పిండి రుబ్బు

కాన్క తీసుకోర కొత్త యల్లుడ వచ్చి 

భోగి వచ్చు మరల బూజు వచ్చు!


ఆటవెలది


సుఖము కొఱకు వెదికె సొమ్ము మూటలు గట్టి

సుఖము కొఱకు తిరిగె సాని వాడ 

సుఖము దొరకదాయె సోలిపోయె మగడు 

దార చెంత చేర దొరికె సుఖము ! 


తాత్పర్యము


వేమన కవి పద్యాలు చదువని వారుండరు. "విశ్వదాభి రామ వినుర వేమ" తెలుగు జాతీయ మయింది అన వచ్చు.


అలాంటి వేమన కవి భార్య నగలతో సహా పరాయి ఆడువారి పాలు చేసి, ఒక సందర్భంలో ఈ ఐహిక సుఖాల పట్ల విముఖత వచ్చి ఈ జగత్తులో ఉన్న కల్మషాల్ని కడిగి వేస్తూ పద్యాలు వ్రాస్తారు.  ఈ పద్యానికి ప్రేరణ ఒక విధంగ వారి జీవితం, వారి లాగా దొరకని ప్రదేశాల్లో సుఖము వెదుకుతూ , చివరి వరకు మారని ప్రబుద్ధుల గురించి. "నాతి చరామి" అని  మూడు ముళ్ళు వేసిన భార్య దగ్గర దొరకని సుఖం వేరెక్కడ దొరుకుతుంది? 


సుఖము దొరుకుందని డబ్బు మూటలు కట్టుకొని తిరిగాడు. సుఖం ఎక్కడ ఉందని సాని వాడల్లో తిరిగాడు. ఎంత డబ్బు ఇచ్చినా, ఎందరు వేశ్యలతో సుఖించలేక అలసి పోయి భార్య ముఖములోకి ప్రేమగా చూశాడు. ఎక్కడా దొరకని ఆనందం ఆమె ముఖ దర్శనంలో దొరికింది. 


యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః


English Translation


There may no one who did not read poems by Yogi Vemana. "Viswadabihrama Vinura Vema" has become a catch-phrase in Telugu. 


Originally Vemana , the poet , felll into the trap of women of suspicious character and spent lot of money hoping to get pleasure. At one time he steals his wife's ornaments to give to the a women. But one incident changes his attitude about life and its pleasures. Finally he finds pleasure in the face of his wife who got tied to him through marriage. Then he turns into a great poet attacking the ills in this society.


This poem is a mirror reflection of his life. He roamed carrying bundles of money in search of pleasure . He roamed in areas where women lure men for material gains. But the whole lot of money he spent, the whole lot of women  with whom he sought physical satisfaction could not give him pleasure. Finally he looked into the face of his wife whom he he promised while tying the knot not to ditch her and the pleasure he was seeking was found there.


పదునెనిమిది పోయె పది తొమ్మిది వచ్చె

తిట్లు పోయె సిగల పట్లు వచ్చె

జగడ మాగ దంచు జగతి వగచె నయ్యొ

నేతి బీర కాయె నీతి యకట!


https://www.eenadu.net/newsdetails/16/2019/01/01/38984/clashes-in-new-year-celebrations


సందు సందు చూడు మందు బాబుల నేడు

పిల్ల పాప లకట పస్తు లుండ

దినపు కూలి తోడ తాగి తందనలాడె

ప్రభుత మురిసె చూసి పన్ను మూట!


In every street you find drunkards dancing after drinking with their daily wages, even as their kids slept starving. Govt is elated about tax income. Pity 2019! 


కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి "పుష్ప విలాపము" కావ్యాన్ని  చెవులారా విన్న నల్ల నోట్లు  తమ వేదనని ఈ విధముగా వెల్లడించాయట. అదే "నోట్ల విలాప" గాధ! 


నీ పూజ కోసమై పూలు తెద్దామని ఉదయాన్నే ఉద్యానవనములోకి పోయాను ప్రభూ! పూల బాలలు తల్లీ వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు 


నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో 

రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా

ప్రాణము తీతువా” యంచు బావురుమన్నవి, క్రుంగిపోతి, నా

మానసమందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై 

 

నీ కాలే కడుపు నింపుటకై ఋణము కొరకు ఉదయాన్నే ఓ పెద్ద మనిషిని కలువ బోతిని ప్రియ సఖీ! అతని ఇంట లక్ష్మీ దేవి నాట్య మాడుచున్నది. అంతట  


అతడొక ఉక్కు బీరువ కడ నిలిచి చివాలున తలుపు తెరిచి చేతులు

చాచె నంతలో నోట్లన్నియు జాలిగ "నోళ్ళు" తెరిచి మా మానము కొల్ల 

గొడితివే యంచు బావురు మన్నవి, అపుడెదో నా మానస మందొక  

యోచన గల్గెను, వాణి కృప బయల్వెడలె "నల్ల ధన" విలాప గాధయై!  


జడమతుల మేము, ఙ్ఞాన వంతుడవు నీవు  

బుధ్ధి యున్నది, భావ సమృద్ధి గలదు;

బండ బారెనటోయి నీ గుండెకాయ! 

శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?


విలువ కల వారమేము, విలువ లెరుగ వీవు

బుద్ధి యున్నది నీకు భావ "శుద్ధి"  లేదు

లంచమని యరిచెనోయి నీ "మంచు" గుండె

"నల్ల" బడితిమి మేము నీ వల్ల నేడు! 


ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా

తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ముల లోన స్వేచ్చమై 

నూయల లూగుచున్ మురియు చుందుము; ఆయువు దీరునంతనే

హాయిగ కన్ను మూసెదము ఆ యమ చల్లని కాలి వ్రేళ్ళపై  


విలువలు గలుగు నాల్గు దశకముల్ ముద్రించిన భరత మాత 

జాతీయత కాచుకొందుము ఆయమ బిడ్డల చేతుల స్వేఛ్చమై 

తిరుగాడుచు మురియుచుందుము, ఆయువు తీరునంతనే 

ఆర్బియై చెస్టులో సేద దీరి యగ్నికి పూజ చేతుము హాయిగా!  


గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం 

గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే 

త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో 

తాళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే! 


తెల్లగ మెరియుచుందుము విరి మల్లెల వోలె; మమాదరించు 

భరతావని బిడ్డల యాసల దీర్తుము; మిము బోంట్ల స్వార్ధానికి   

యౌదుము బలి పశువులం; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో 

బంధింతువె బాత్ రూములో; తెల్లని మమ్ము నలుపు సేతువే!  


ఆత్మసుఖము కోసమయి అన్యుల గొంతుల కోసితెచ్చు పు 

ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి  

శ్వాత్ముడు స్వీకరించునే? చరాచరవర్తి ప్రభుడు మా పవి 

త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?


అత్యాస తోడ  అన్యుల గొంతు  పిసికి తెచ్చు 

పాపాల పుట్ట ! నీకు నిదుర ఎటుల వచ్చు? నల్లని నోట్లు 

దేవుడు స్వీకరించునే? చట్టమును కాచు ప్రభుడు మము 

విముక్తి చేయడే? నడమంత్రపు సిరి నడ్డి విరచడే? 


ఊలు దారాలతో గొంతు కురి బిగించి 

గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము

అక్కట! దయలేనివారు మీ యాడువారు!


మించు లంచాలతో పేదల పొట్ట గొట్టి

శుచియౌ మమ్ముల నలుపుగ మార్చి పేర్చి 

దాచుకొందురు పరువు మర్చి పరుపు కింద

అకట! సిగ్గు లేని వారు మీ బొగ్గు దొంగలు!  


బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు

సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?

ఆందమును హత్య చేసెడి హంతకుండ!   

మైల పడిపొయె నోయి నీ మనుజ జన్మ!


బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు

సహజ మగు నీతి నీలోన చచ్చెనేమి?

చట్టమును చంపెడి చండాలుండ 

నల్ల బడిపొయె నోయి నీ నరుని జన్మ!


అట్లు దూషించు నల్ల ధనమును ఋణము స్వీకరించ లేక కాలే కడుపుతో తిరిగి వచ్చితిని, నా శ్వేత హృదయాంజలిని  స్వీకరించి కడుపు నింపుకొనుము ప్రియ సఖీ!

తేటగీతి 

కప్పు పగిలిన కాఫీకి ముప్పు వచ్చు

చెప్పు తెగినచొ కాలికి తిప్ప లొచ్చు

టిప్పు లీయవొ బట్లరు తిట్ట వచ్చు

తప్పు చేయకె తలకిటు నొప్పి వచ్చు!

సరదాగా ఓ పద్యం 

తాత్పర్యము 

ఒక్కోసారి మనం తప్పు చేయకనే తలనొప్పి తెచ్చుకుంటాం కదా. కప్పు పగిలితే కాఫీకి ముప్పు వస్తుంది. చెప్పు తెగితే కాలికి తిప్పలే కదా. హోటల్లో టిప్పులు ఈయకపోతే బట్లర్ తిట్టొచ్చు. మనం నిమిత్త మాత్రులం.




కొత్త నోట్ల కొరకు  కొలువయి రిట చూడు

పేద వార లెల్ల పనులు మాని

నేర గాళ్ళ నోట్లు నలుపు తెలుపు చేయ

బుద్ధి యెపుడు వచ్చు పేద నీకు? 

Whose money?


తాత్పర్యము 


నోట్ల రద్దు కాగానే ధనవంతులందరూ , తమ నల్ల ధనాన్ని కొత్త నోట్లతో మార్చుకోవడానికి, లేదా ఆ డబ్బు జన్ ధన్ ఖాతాల్లో వేయడానికి పేద వారిని పంపితే, వాళ్ళు తమ పనులు వదలి బ్యాంక్  ల ముందు క్యూలు కట్టారు కదా? అది వారి ధనమేనని మళ్లీ తాము మోస పోతున్నామని వారికి అవగాహన లేదు కదా? ఋ


English


Once demonetization was announced the rich handed over their black money to the poor to be exchanged to new notes or credit into their Jan Dhan accounts. The poor abstained from their work, to help the rich. After all, it is their own money looted by the rich now again they are getting looted of.


పీఠ మెక్కె కాని పదవి కాంక్ష లేదు 

సోనియమ్మ కొడుకు సోకు మాడ

జనుల కావ నేడు శివుని భక్తు డయెగ

ప్రమధ గణము లెల్ల పొగిడి పాడ!


ఆలయమును సచివు లాలయమును గూల్చి

వాస్తు శాస్త్ర మంచు వాదు చేసె

శాస్త్ర మేమి చేయు శాసనాసురులను

మింగు వారి గుడుల లింగములను !


యెత్తి పోతలంచు యెత్తి పోసిరి డబ్బు 

పెచ్చులూడి పోగ పక్షమందె

చెదలు తినెను యనిరి సిమ్మెంటు గోడను

ఇనుము మింగి నట్టి ఎలుక భంగి ! 

బిజెపికి ఓటు వేయండి - ఎలుకలు తిన్న ఇనుము, చెదలు తిన్న సిమెంటు కక్కించండి)


దొరల రాజ్యమందు దోమలె రాజులు 

ఫామ్ హౌసు లోన పామె మంత్రి

కాల్వలన్ని పూడ్చి కుంటలె మిగిల్చె

భవనములను చేసె బొంద దొడ్డి!


బిజెపికి ఓటు - ప్రగతికి చోటు



యూరి దాడి పాప మూరికె పోదని

ఉరిమి చెప్ప వారు వినక పోయె

ఉరికి భరత సేన ఉరివేసె శత్రుల

వారి భూమి పైనె గోరి కట్టె!


2nd September, 2020 మా నలుబది నాలుగవ వివాహ పర్వదినము.  ఒక రాత్రి ముందే వ్రాశాను. రేపు  మళ్ళీ ఏ ధ్యాసలో ఉంటానో!


నలుబదేండ్లు యయెన నాల్గు క్షణముల

కలలు కనుచు మనము కాఫి తాగి

ప్రేమ దోమ సద్దు పెండ్లిలొ దరి చేర్చి

పూల తోట లోన మాల మార్చి!


(ఈ కాఫీ కధ హోటల్ సరోవర్ లో)


We exchanged garlands in Public Gardens after getting married in Registrar"s Office, MJ Market, in 1977. Those days it was a daring act of my wife. And she stood by me in poverty and prosperity! A great woman,  a greater mother!


చింత లేదు నాకు చెంతను నీవుండ 

వ్యధల బతుకు తీపి కధగ మార్చి 

నావ నడిపి తీవు నడి సంద్రము నందు 

క్షణము క్షణము నన్ను కాచు కొనుచు!


On Vani, my inseparable companion


మగని చాటు పిందె మరువపు పూదండ

వాణి రాణి యంచు బాణి కట్టి

వందనములను తెలిపె యందు కొనరటయ్య 

వాణి పలుకు మాట నాదు నోట! 


వాణి చంద్రుల శుభోదయం, నమస్సుమాంజలులు!


మాతృ భాష దినము మాత వందన మమ్మ

దేశ భాషలందు తెలుగు లెస్స

వాడి పోయె నేడు వాడుక మరువగ

లేని భాష నెటుల లెస్స యనుట!


గీత గీసె భ్రాత త్రేతా యుగము నందున

రమణి గీత దాట రామాయణము 

యుగము మారె గీత యర్ధమె మారెను 

భాగవతుని బోధె భారతమ్ము! 


కలియె యేలు చుండ కల్లు గీత వరము

కాలు ఒకటె నటగ కలికి నడువ

కల్లు తాగినంత కాలితొ పని లేదు 

గాలి లోన తేలి కాలు బిలుచు!


గణప పూజ సేయ గరిక దొరకదాయె 

గరిక పాటి వారి గరిమ యేటి

కదల రాయె జనులు మొలుచు టెటుల గరిక

శలవు నీయ వయ్య శరణు శరణు  !


నలుగు పిండి తోడ నీదు జనన మాయ

తెలుగు పండి మాకు తెలివి హెచ్చె

గరిమ గంపె డుండె గరిక దొరికె చాలు

గరిక పాటి దీవ్న కవిత పోటి! 


వేద భాష వినుచు వొడలు మరిచితేమొ

చతుర భాషణ విని చెమ్మ గిలెనొ 

సంస్కృతమ్ము వినగ చంద్రయా న్మేగేమొ

కవిత పొంగి పుట్టె గరిక పాటి!


ఙ్ఞాన మొక్క వంక చతురత యొక వంక 

బదుకు రీతి నీతి పలుకు తునక 

పంచదార చిలక పలుకుల వెనుక ఏ

గుట్టు దాచి తయ్య గరికపాటి!


అన్ని దానములలొ అన్న దానమె మిన్న

లేని వాని కచట లేదు చోటు

గుడిని మింగు వాడె గుడిలొ యన్నము మింగు 

కడుపు కాలు వాడు గుడికె రాడు!


అలసి సొలసి నాకు యక్షరములను నేర్పె

క్షరము యగుచు నాకు ౘదవు నేర్పె

క్షణము బదికి యున్న ఋణము తీర్చెద మన్న 

కనులు తెరిచి చూడ కాన రారె! 


My Father - My God.


మా నాన్న గారు నాకు దైవం కంటే ఎక్కువ. ఎంత మంది అలా ఉంటారో నాకు తెలియదు.  చివరి రోజుల్లో తిండికి కూడ  కరువైనా బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం వచ్చినా డిగ్రీ పూర్తి కాకుండానే చేరొద్దు అని ఆపిన ఘనుడు. డిగ్రీ కాగానే భీమా సంస్థలో ఉద్యోగం వచ్చింది. పెద్ద జీతం. ఆయన ముఖంలో ఆనందం మర్చి పోలేను.  ఎన్నో కలలు. ఆయన్ను హైదరాబాద్ తెచ్చి ప్రాక్టీస్ ( డాక్టరు ) పెట్టించి కాలు మీద కాలు వేసుకొని బ్రతికేట్లు చేయాలని. నేను ఉద్యోగంలో చేరిన రోజే ఆయన ఆస్పత్రి పాలు.  చంద్రుడి ప్రతిభ, వృధ్ధి చూడకుండా ఆయన 44 వ రోజు స్వర్గస్ధులయ్యారు.  మాయ. 46 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన కలలో కొస్తారు.  నేనే మరణం అంచుల్లో ఉన్నాను.  మరి ఇంకా ఆయన కలలేమిటి? కుర్చీలో కూర్చుని నన్ను చదివంచడ మేమిటి.? నేను నా పిల్లలకి అడిగిన పుస్తకాలన్నీ కొన్నాను.  వేలల్లో.  కాని కూర్చుని ౘదువు చెప్పలేదు. వాళ్ళు చాల గొప్ప వాళ్ళయారు.  అమ్మ పుణ్యం. కాని నాన్న అంటే కూడ వాళ్ళకి ప్రాణం. 


మా నాన్నకు ఒక రోజు లేదు. అన్ని రోజులు ఆయనదే. ఇది నా హృదయం నుంచి వచ్చిన ఆవేశం.


బోర్డరులో ఇమ్రాన్ ఖాన్

చార్మినార్లొ అసదుద్దిన్

దోనొంకొ బహుత్ పరేషాన్

ఓ! కూనలమ్మ!


సాధు లంటె (ఆర్ ఎస్ ఎస్) భయం వాడికి

నాధూరాం భయం వీడికి 

భయమేలర సొంత నీడకి 

ఓ! కూనలమ్మ!


మాస్కె నీకు దిక్కు మౌనమె నీ భాష

తాళ మేయ తలుపు తలపె ఘోష

అంటరాని తనము యొంటరి తనముయు

కరొన యుగము నందు కదలి వచ్చె!


బంధ మసలె లేదు బంధు గణము రారు 

ఫోను యొకటె యాయె కన్ను చెవులు 

కాళ్ళు వాచి పోయె కదలక కూర్చుని 

గుండె యెపుడు యాగొ గుబులె యెపుడు!


కనగ కనగ కనగ కరొన యుధృతాయె

చదువ వినగ మనసు చెదిరి పోయె

ఆసు పత్రి కేగ ఆరు లక్ష లగునొ 

యింటి మందు తినగ యముడె వచ్చొ!


లావు యొక్క లవము లేదు లక్ష్మి విభుడ

సిరిని పంపి జనుల శంక దీర్చు 

గరుడు కాన తిచ్చి కరొన మింగమనవ

వైద్య మేదొ చూపు వరద రాజ!


ఆ.వె.

దేవుడేడ కనడు కోవిడె యంతట

కంట కనగ రాదు జంటె యుండు 

గుడులు లేవు చదువ బడులు లేవు 

భవిత యేమి యగునొ పాలు పోదు!


ఆ.వె


కరువు కమ్ము కొనియె బరువు యాయె బతుకు 

పక్క వాడు బలుక భయము యాయె

కూలి రాక పోయె ఆలి కుమిలి పోయె

తిండి లేక బిడ్డ తల్లడిల్లె !


ఆ.వె


పాప మెవరి దయ్య శాపము జగతికి 

ముక్తి మార్గ మేదొ చెప్ప వయ్య

అవని కావు మయ్య అవతారము దాల్చి 

కరొన మింగవయ్య గరళ కంఠ!


ఈద్ రోజునె ఏల బాధ 

అమర్ నాథ్ ఆగ లేద

హిందువంటె మనిషి కాద 

ఓ!కూనలమ్మ!


నెహ్రు చేసిన పెద్ద తప్పు

కాశ్మీరులొ రగిల్చె నిప్పు

మోడీ, షా చేశారొయ్ ఒప్పు

ఓ! కూనలమ్మ!


చదువు మాని జే ఎన్ యు విద్యార్ధి

అరిచెనండి 'ఆజాదీ' "ఆజాదీ"

తెలియడండి వాడు కర్మకు ఖైదీ 

ఓ!కూనలమ్మ! 


మూడు వందల డెబ్భై

దేశానికి పెను ముప్పై

ముగ్గురికి డబ్బే, డబ్బై 

ఓ! కూనలమ్మ!


ఫాస్టు బౌలర్ ఇమ్రాన్ ఖాన్

స్పిన్ను అయ్యి పరేషాన్ 

ఒంటరాయె నేడు పాకిస్తాన్

ఓ!కూనలమ్మ!


నిన్న జగమంతా

రామమయం 

కరోనా మరచారా 

ఇంకా నయం !


నిన్న అన్నా 

ఏడున్నావు రామన్నా

కరోనా అంది 

ఈడ్నే ఉన్నా చూడన్నా !


నిన్న ముక్కు మూసుకు 

రామజపం చేశామన్నా

చాలదు నోరు కూడ 

మూస్కో మంది కరోనా!


రాముణ్ణి తాకాలని 

ఎంతో తపన పడ్డా 

రాముడన్నడు సామాజిక 

దూరం దగ్గర రాకు బిడ్డా!


నిన్ను నీవు కాపాడుకొ

అదె నేను మెచ్చేటిది అనె రాముడు

మాయ మంత్ర మేమిలేదు

నీ యత్నం తోనె పోవునయ్య కోవిడు!


వలువ లొదిలి పెట్టె వేమన కవి నాడు

విలువ లొదిలె నేడు వామ పక్షి

చెడియు బతికి వేమ శతకము వ్రాయగ

చెడును చూపి బతికె శకున పక్షి!


వంగపండు వెడలె నింగి దాటి యెటకొ 

పాట రాసి యతడె పాడి యలరె 

గజ్జె కట్టి యతడు గలగల నర్తించె 

స్వర్గ మందు పండు సేమ ముండు!


ఉత్తరాంధ్ర వంగపండు రాలి పోయింది!


తోపు లాటలేగ తిరుమల గుడిలోన 

బ్రేకు దర్శన మెది పేద కచట

కూటి కొరకు లైను కాటికెడల లైను

ధనము యున్న వేరె దారి యుండు!


కోవిడన్న నేమి గోవింద యన నేమి

ఇచ్చు కాదె ముక్తి యెంచి చూడ 

డబ్బు యున్న చాలు దర్శనము సులువు 

దైవమయిన యాత డాక్టరయిన!


కరోనా కాలం.


ప్రపంచాన్ని ఒక 

గ్రామంగా చేసిన మనం (Global Village)

ప్రతి గ్రామాన్ని ఓ ప్రపంచంగా 

మారుస్తున్నాం!


అంటరానితనాన్ని 

రూపు మాపిన మనం 

మనిషిని ఆరడుగుల దూరం

నిలబెడుతున్నాం! 


ధనవంతులు ధనహీనులు 

ఒకటై కరోనా ధాటికి 

తలవంచుక 

నడుస్తున్నాం!


కుటుంబ వ్యవస్థ కాదా

మన ఊపిరి 

సామాజిక దూరం బాబూ

కుటుంబం సిగ గోసిరి! 


మనిషికి మనిషికి 

మధ్య ఈ అంతరానికి 

అంతమెపుడు 

చెప్పడం ఎవరి తరం!


దుమికి చూడ నేల దైవమెటకు బోవు 

కుమ్ములాటలేల కోవెలందు 

మంచి చెడులు మరచి ముందు వారిని తొక్కి

రాతి బొమ్మ చూడ యాత్ర మేల!


మన్ను నుంచి మింటి వరకు వ్యాపించిన 

మనుగ డతడె యెరయ మరణ మతడె 

మనలొ యున్న యాత్మ మన బాహ్యము యతడె

ఆత్మ దర్శనాని కాత్రమేల!


కంచిలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మరణించిన దురదృష్టకర సంఘటనకు నా వేదన!


ఆటవెలది 


శ్రీకి దగ్గ రుండు శ్రీ రామ చంద్రుడు 

పరశు రాము బలము పరశువె కద

బలము యింపు యెంతొ బలరామునకునగు 

రామ నామ మొకటె రంజనమ్ము!


(ఇది కేవలం వ్యాఖ్య మాత్రమే. యెందు చేతనంటే బలరాముడు తరువాయి         యుగము వాడు)


కత్తి వాడ వచ్చు కూరగయలు తరగ

కోయ వచ్చు గొంతు కత్తి తోడ

కొట్ట వచ్చె మేకు కత్తితొ గోడకు

కత్తి కేల చెప్పు సుత్తి గోల!


అగ్ర రాజ్యము వైపు అడుగులు మనవైతె

ఉగ్ర రాజ్య మవగ ఉరుకు పాకు (పాకిస్తన్) 

భ్రష్టు చేసి పోయె పరదేశి యసురులు 

సంస్కృ తొకటె మనకు సాయ పడెను!


చదువు కొందమన్న సరిగ కానగ రాదు 

వ్రాదమన్న చేయి వాచు చుండె 

వయసు గార్ధభమయె మనసు పరుగు తీసె (హయము వోలె)

వయసు మనసు పోరు వృధ్ధు కకట!


తేటగీతి 


సూర్య వందన మొక్కటి చేదమన్న 

రాహు వడ్డు వచ్చెనుగ రేయి వచ్చె

మోడి తోడుగ కూడినే యోగ జేయ

రాహు లొచ్చెను చూడరె రచ్చ సేయ!


Yoga Day


చంద్రునికో నూలు పోగు 

సూర్యునికో వందనము 

యోగులకో ఆసనము 

భోగములకు సన్యాసము 

మోదీకో ధన్యవాదము

అందరికీ పుణ్య నాదము!

#InternationalYogaDay



జల్లి కట్టు ఉల్లి పొట్టు పంచెల కట్టు

యేటి గట్టు మీద యెంకి గుట్టు

కాదు ఏది కవుల భాషకు తీసికట్టు

సకల జనుల మాటె చద్ది మూట.


సినేమాలు లేక నటులు, చదువరులు లేక మేము.

No comments:

Post a Comment