Thursday, August 20, 2020





VAALMEEKI RAMAYANA IN TELUGU POEMS WITH ENGLISH TRANSLATION 

(WITH ENGLISH TRANSLATION)

BALA KANDA PRADHAMA SARGA 

BLOG 3 

73 to 101 poems







వాల్మీకి రామాయణాన్ని చక్కని, సులభమైన తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలనే నా సంకల్పానికి ఇది నాంది. నారద మహాముని వాల్మీకి మహర్షికి భవిష్యత్తులో జరగబోయే రామ గాధను వివరించే అంశంతో ఈ కధ ప్రారంభమవుతుంది. సంస్కృత శ్లోకాలను కూడా జతపరిచాను. తెలుగు పద్యాలకు సుళువైన ఆంగ్ల పదాలతో అనువాదము కూడా చేయడం జరిగింది.

బాల కాండము, ప్రధమ సర్గములో 101 పద్యాలలో 72 పద్యాలు మొదటి ,రెండవ బ్లాగులో ఇవ్వడం జరిగింది.  .    

English:  This is my introduction part of a Herculean effort of translating Valmeeki Ramayana into simple Telugu poems. This part contains a description of Sage Narada predicting and narrating the story of Sree Rama to Sage Valmeeki. I reproduced the original Sanskrit Slokas. (It is not an exact translation of the Sloka, though) I translated each poem into simple English. 

This blog contains, Bala Kanda, Pradhama Sarga' 73 to 101 poems out of 101  poems I wrote. Bless Me with kind heart.


గణపతి ప్రార్ధన

గణము లెల్ల నీదు కనుసన్నలలొ మెల్గు
యతులు యెల్ల నీకు సుతుల సమము
ప్రాస (ఈటె) విసురు బోయ వ్రాసిన గాధను
వ్రాయ పద్యములుగ వరము నివ్వు !





మానిని 

వాలియు తమ్ముడు యుద్ధము చేయగ వారటు లావిధి రాముడు తా 
చెల్వుకు చేసిన బాసను మానిచి చాపపు బాణము తోడను యా 
వాలిని గూలిచి రాజుగ చేసెను వానర జాతికి మిత్రుడు లాం
గూలియు భూమిజ జాడక నుంగొన  కట్టడ సేసెను వానరులం !   73    

తాత్పర్యము

వాలి మరియు యాతని తమ్ముడు సుగ్రీవుడు యుద్ధము సేయ దొడగిరి. శ్రీ రాముడు తాను మిత్రుడు సుగ్గ్రెవునకు చేసిన వాగ్దానము మేరకు, తన చాపము తోడ బాణము వేసి యా వాలిని గూల్చెను. తదుపరి తన మిత్రుడు సుగ్రీవుని వానర జాతికి రాజుగ చేసెను.  సుగ్రీవుడును తన సైన్యము నెల్లను సీత జాడ వెదకుటకై సిద్ధము చేసి తగీన ఆఙ్ఞ లిచ్చెను.  

   

                  
  
तो गृध्रस्य वचनात् संपातेः हनुमान् बली |
शत योजन विस्तीर्णम् पुप्लुवे लवण अर्णवम् 

"Then, upon the word of Sampaati, the eagle and elder brother of Jataayu, the efficacious Hanuma leaped forth the salty ocean, which breadth-wise is in a hundred yojana-s...


तत्र लंकाम् समासाद्य पुरीम् रावण पालिताम् |
ददर्श सीताम् ध्यायन्तीम् अशोक वनिकाम् गताम् |

"On reaching the city Lanka ruled by Ravana, Hanuma has seen Seetha, where she is lodged in Ashoka gardens and meditating on Rama alone...


निवेदयित्वा अभिज्ञानम् प्रवृत्तिम् च निवेद्य च |
समाश्वास्य च वैदेहीम् मर्दयामास तोरणम् ||


"Hanuma on presenting the remembrancer, an emblematic ring of Rama to Seetha, also on delineating the sad disposition of Rama to her, thus on solacing Vaidehi, he started to smash the welcome-arch of that beautiful Ashoka gardens. 

पंच सेन अग्रगान् हत्वा सप्त मंत्रि सुतान् अपि |
शूरम् अक्षम् च निष्पिष्य ग्रहणम् समुपागमत् |


"On wiping out five army chiefs, seven sons of ministers, and on kneading down a gallant demon named Aksha Kumara, Hanuma had to enter into the captivity of a powerful weapon darted by Indrajit, the son of Ravana... 


अस्त्रेण उन्मुक्तम् आत्मानम् ज्ञात्वा पैतामहात् वरात् |
मर्षयन् राक्षसान् वीरो यन्त्रिणः तान् यदृच्छया || 
ततो दग्ध्वा पुरीम् लंकाम् ऋते सीताम् च मैथिलीम् |
रामाय प्रियम् आख्यातुम् पुनः आयात् महाकपिः || 

"Though the release from the weapon's captivity is known to him by the boon of Brahma, and though he is valiant enough to pulverise all the demons, but to see and talk to Ravana, thus to gauge the strength of enemy, Hanuma is intentionally tolerant of the demons and their making monkey of him when they fastened him with ropes and dragged him to Ravana's court. After an audience with Ravana Hanuma burnt that city Lanka, except where Seetha, the princess of Mithila is stationed, and then to narrate the pleasant news of locating Seetha, he again got back to Rama, for he is a great monkey... 

सः अभिगंय महात्मानम् कृत्वा रामम् प्रदक्षिणम् |
न्यवेदयत् अमेयात्मा दृष्टा सीता इति तत्त्वतः || 


"That inestimable intellectual Hanuma on approaching that great-souled Rama, and on performing circumambulation around him in reverence, subtly submitted that, 'Seen... Seetha...'


స్రగ్ధర 

రాజాఙ్ఞం మేరకున్ యార్యుల దలచి వానరోత్తంబు లొక్కో దిశం 
భూజానిం జాడనుం జూపగ యెవరు మోపరో యంచుదా బోవగా 
రామా నేనెప్పుడో పూర్వ జనమము నుండి రామా ననుం బ్రొవవా
యన్వేడంగా కలో మాయయో హనుమ కావయీ నాటికిం వచ్చితే!   74

తాత్పర్యము

రాజాఙ్ఞ ప్రకారము వానరులు తమ పెద్దలను పూజించి ఒక్కొక్కరు  ఒక్కో దిక్కుకు పయన మయిరి. యెవరు ముందుగా సీత జాడను కనుగొనునో యని పోటా పోటీగ వారు పరుగిడుచుండిరి. హనుమంతుడు రామునికి ప్రణమిల్లి "శ్రీ రామా! నేను పూర్వ జన్మము నుండి నన్ను బ్రోవమని వేడుచుండగా కలయో, మాయయో యనునటుల నన్ను రక్షించుటకు ఈ నాటికి తరలి వచ్చితివా " యని భక్తి పారవశ్యమున బలికెను.  


మహాస్రగ్గర:

యనుచుం సామీరి యా వాయు సుతుడు మరలె యామ్యది క్కుకుసం పా    
తియనెండోపక్కి  హన్మంతు కలిసి హనుమ ధారుణీ బుత్రికం  రా 
వణుడా లంకాధి పుండీవ లకడ దిశను లంకకుం గొంపోవ గా 
గన నా యగ్రజుం చండాడి తను వెడలెను కూళుడే మందు హన్మా! 75

తాత్పర్యము

ఈ విధముగా శ్రీ రాముని ప్రార్ధించి యా సమీర సూనుడు (వాయు పుత్రుడు) యముని (దక్షిణ) దిశగా తరలి వెళ్ళెను. అలా హనుమ వెడలు చుండగా సంపాతి యను యొక పక్షి రాజము ఆతనికి తారసిల్లి, భూమిజను రావణుడను లంకాధిపతి దక్షిణ దిక్కుకు గొంపోవుటయును, యది చూసి అడ్డగించిన తన యన్నను రావణుడు యుద్ధమున గాయపరచిన వృత్తాంతమును  దెలిపెను. 


మత్త కోకిల

ఆంజనే యుడు లంక కేగెను యోజనాలను దూకిస
మ్మీచముం యవ లీల దాటి సమీర బుత్రుడు రావణు
బట్టణంబున చె ట్టు నీడన భూమిజం గనె శోకము
నా యశోక వనాన రాముని నామముం జపియించు చూ! 76

తాత్పర్యము

అయోనిజ వృత్తాంతమును సంపాతి కడ వినిన హనుమంతుడు, నూరు యోజనముల వెడల్పు గల సముద్రమును యవలీలగ దాటి యొక వృక్షము నీడన శోకించుచూ కూరుచుని రామ నామము జపించుచున్న జానకిని గాంచెను. 



మత్త కోకిల
 రాము డిచ్చిన యంగుళీకము రాము బత్నికి యిచ్చియా  
యాంజనేయుడు యమ్మ నే వస్తి యా రఘూద్వహు దూతగా    
నీ తలంపున యా వనంబుల సంచరించుచు మాత నీ 
తోడులేక దుఃఖాన మా నృపు తోడు చేకొనె పొందుగా  !   77  

తాత్పర్యము

ఆంజనేయుడు, శ్రీరాముడు తన గుర్తుగా ఇచ్చిన యంగుళీకమును జానకీ దేవి కిచ్చి, "అమ్మా! నేను వాయు పుత్రుడైన హనుమను. నేను రామచంద్రుని దూతగా వచ్చాను. శ్రీ రామచంద్రుడు నీ తోడు లేక దుఃఖాన్నే తన తోడుగా చేసుకొని వనములందు సంచరించుచున్నాడు" యని బలికెను. 


మత్త కోకిల

రామపత్నిని యాంజనేయుడు యూరడించిన పిమ్మటా 
యా వనంబుకు చేటు చేసెను యాగ్రహమ్మున లంకకొ
చ్చినచే టుకు రావణాసురు సేన రోషము తోడయా
యాంజనేయుతొ పోరు సేయగ యా కపీశ్వరు ధాటికీ!   78  

తాత్పర్యము

ఆ విధముగా జానకి మాతను ఊరడించిన హనుమా, మితి మీరిన యాగ్రహముతో అశోక వనమును నాశనము చేసెను. లంకకొచ్చిన యీ యాపదకు, ఉక్రోషులైన రావణ సైన్యము రోషముతో కపి వీరునితో పోరిరి.


మత్త కోకిల

రావణాసురు సేనలో గల వీరు లెందరొ కూలిరీ
మంత్రి పుత్రులు యేడు మంది కుమారు డంబడు రాక్షసుం 
డూ దణాయు లెందరొ కూలగ డీలుపడ్డ యనీకి నా 
రావణాసురు చెంత కేగి యశోక వాటికి రమ్మనా!    79

తాత్పర్యము

ఆ పోరులో రావణాసురుని సేనలో గల ఎందరో వీరులు మరణిచిరి. యేడుగురు మంత్రిపుత్రులు, కుమారులైన అంబడు, రాక్షసుడు, యెందరో సేనానులు నేల కూలగా దిగాలు 

మత్త కోకిల

రావణాసురు డాగ్రహమ్మున రామ బంటుతొ పోరగా 
మేఘనాధుని బంపగా హనుమంతు డావర బుత్రుతో
పోరు లోపల సోలగా వర బుత్రు డాతడు బమ్మ య
మ్మేయగా కపి వీరుడా పసి మేఘ నాధుతొ యోడగా! 80


తాత్పర్యము

కోపముతో రుద్రుడైన రావణుడు హనుమను కూల్చగా తన కొమరుడైన ఇంద్రజిత్తుని పంపెను. ఆంజనేయుడు వర ప్రసాది యైన మేఘనాధుడు వేసిన బ్రహ్మాస్త్రముతో మూర్చ బోయెను.  

ఆ:
యింద్ర జిత్తు ననుమ యెదిరించి పోరులొ
గెలువ తగిన బలము గల్గి యుండి 
రావణు గలువ యాతని బలమును
జూడ మేఘ నాధు చేత నోడె! 81

తాత్పర్యము

ఇంద్రజిత్తును పోరులో యోడించగల శక్తి యుండి కూడ వాయు పుత్రుడు రావణుని యొకపరి చూచు ఇచ్చతో తానే స్వయముగా యాతని చేతిలో యోడెను.




తే.గీ.



వాయు సూనుడు వెడలెను వోర్మి తోడ

శతృ సేనలు తన నెంతొ సేయ గేలి

కట్టి వేసి తనను కొట్టు కొనుచు పోగ

కోతి యనుచును తన తోడ క్రీడ లాడ! 82

తాత్పర్యము

రావణ సేనలు తనను కట్టి వేసి "కోతి" యనుచు త్తనను గేలీ చేయుచు, దారి పొడవున తనను కొట్టుకొనుచు పోయినను అంజనీ సూనుడు ఎంతో ఓర్పుతో కోపగించక వారితో సంతసమున రావణు సభకు తరలి వెళ్ళెను.


కం:

రావణు సభలో హనుమడు
తా వానర చే ష్టల యసుర నృ పుని వేధించం
గా వాయు సుతు పొగరణచ
గా  వాలము తగుల బెట్ట గసురులు కసిగా!   82

తాత్పర్యము


రావణుని సభలో హనుమంతుడు తన వానర చేష్టలతో రాక్షస రాజుని వేధించగా, రాజాఙ్ఞతో యసురులు హనుమ పొగరణుచు నిమిత్తమున యాతని వాలమునకు నిప్పంటించిరి.


సీ:

హనుమంతు వాలము ననలము కాల్చగ 
       అతి వేగముగ బోయి యనిల సుతుడు

కాలిచె లంకను కపి చేష్టల తోను  
       అవనిజ యుండెడి యశోక వనము 

విడిచె లంక జనులు వణకుచు పరుగిడ 
       చూడ వచ్చె హనుమ చిచ్చు పెట్టె 

లంక కొచ్చెడు కీడు లవమును చూపెను 
       చేటని లంకకు చాటి బలికె 

వాయు సుతుడు మరలె వార్త చెప్ప 
సీత జాడ గని యశోక వాటి 
పలు దిశలను  లంక పరికించి రావణు 
బలము యెంచి తనుచు బలికె హనుమ! 83

తాత్పర్యము

అటుల తన వాలమును కాల్చగా ఆంజనేయుడు వాయు వేగమున పరుగిడుచూ, అశోక వనమును విడిచి మిగిలిన లంకనెల్ల యగ్నికి యాహుతి చేయ దొడగెను. లంకా వాసులు భయముతో యటునిట పరుగిడ "చూచి రమ్మన కాల్చి వచ్చె" నను రీతి లంకా దహనము చేసెను. లంకకు భవిష్యత్తులో రాబోయే పెను ముప్పును లవమంత వారికి చూపెను.


లంక నుండి తిరిగి వచ్చిన కపీశుడు రామునితో తాను లంకా నగరమున యశోక వనమున సీత జాడ కనుగొనిన తీరును,  లంకా నగరమును యన్ని దిక్కులనుండి పరికించిన తీరును , రావణుని బలమును గూర్చియు వివరముగ చెప్పెను. 

ततः सुग्रीव सहितो गत्वा तीरम् महा उदधेः |
समुद्रम् क्षोभयामास शरैः आदित्य सन्निभैः |

"Then, Rama along with Sugreeva and other monkeys has gone to the seashore of Great Ocean, and when Ocean-god is unyielding to give way, then he started to put the Ocean-god to turmoil with his arrows, as with Sun-god who puts an ocean to turmoil with his sunrays..

శార్దూలము

సుగ్రీవాదుల తోడ కూడి మైథిలీ శ్యాముడు శౌండికు పం 
క్తిగ్రీవుం పురమందు సీత యెటనో గానగ జాడను యా
శుక్రాచార్యుని శిష్యు దున్మ సమరోత్సాహపు తేజము తో   
యాక్రోశమ్మున ముందు కేగ కపులా మారుతి యానతితో!   84

తాత్పర్యము


మత్తేభ విక్రీడితము


సరితా నాధుని చేరగా యుబుకు క్షారాబ్ధి దయా హీనుడా 
దరి బోవం రహదారి నీ  ననుచు బందాటంబు సేయంగ యా 
తరి సీతాపతి యల్క బూని తన శక్తిం యుక్తి మేర పయో
నిధియ స్త్రమ్ముల చెదురు పర్చగా పానీయా ధిపుండదరే!   85    

తాత్పర్యము    

दर्शयामास च आत्मानम् समुद्रः सरिताम् पतिः |
समुद्र वचनात् च एव नलम् सेतुम् अकारयत् ||

"The Ocean-god revealed himself and upon the word of that Ocean-god alone, Rama put up vanara Nala to build a bridge across the ocean... 

तेन गत्वा पुरीम् लंकाम् हत्वा रावणम् आहवे |
रामः सीताम् अनुप्राप्य पराम् व्रीडाम् उपागमत् || 

"On going to the city Lanka by that bridge and on eliminating Ravana in battle, Rama redeemed Seetha, but he subsequently came down with much humiliation, since redeeming Seetha in enemy's place might become controversial...


మత్త కోకిలము.  




సాగరేంద్రుడు రామ భద్రుతొ సాద రమ్ముగ యిట్లనే

చెంగలించటు లంక చేరగ సేతు వొక్కటి కట్టుమా 

సాగరుం డటు బల్కగా నర వానరాదుల తోడుగా

లంక చేరియు వేగమే నెఱ కయ్య మందున రావణుం!     86

తాత్పర్యము

   



మత్తకోకిల 



గూల్చి రాముడు రాక్షసాదుల కాటి కంపి యశోక వా

టిం లవంబు బలంబు లేక కఠోర వాసము సేయు యా

కీలినీ సుత సీత గాచియు  కాలి  మండెడు కీలలం

శీలము పరిక్షించగా గుణ శీల భూజను కోరగా!   87

తాత్పర్యము






ताम् उवाच ततः रामः परुषम् जन संसदि |
अमृष्यमाणा सा सीता विवेश ज्वलनम् सती |

"Then Rama spoke harsh words to Seetha among the assemblages of monkeys, demons, and others, but she that Seetha being husband-devout has entered the burning fire intolerant of those unkindly words of Rama...


తరళము:

రఘురాముం డిటు వానరు ల్నర రాక్షసాదుల సమ్ముఖ మం
దు కఠో రాత్ముడై బల్కగా  మహితాత్ము రాలు భూమిపుత్రి జా 
నకి సాధ్వీ మణి భర్త మాటతొ తాను దూకె నగ్గి యగ్ని దే 
వు కృపం స్వఛ్ఛమై రఘురాము మానవతి మ్రొక్కె భక్తితో!      88

తాత్పర్యము



ततः अग्नि वचनात् सीताम् ज्ञात्वा विगत कल्मषाम् |
कर्मणा तेन महता त्रैलोक्यम् स चराचरम् || 
स देवर्षि गणम् तुष्टम् राघवस्य महात्मनः ||
बभौ रामः संप्रहृष्टः पूजितः सर्व देवतैः ||

"Then, upon the word Fire-god,, and Rama realised that Seetha is rid of sins and he is very highly gladdened. And when all the gods reverenced him for his great accomplishment in eliminating Ravana, Rama shone forth with his self-resplendence. Thus all the three worlds inclusive of their mobile and sessile beings, all gods with the observances of hermits have become exultant for this great accomplishment of the great souled Raghava... 

మాలిని

ధరణిజ గను రామా స్వాతి ముత్యమ్ము వోలెన్
మెఱయు ననల తీక్ష్ణమందు కాంతిల్లు యభ్ర
మ్ము రుచి రవణు యీభామా మణిం చేకొనంగా
అరణి సుతుడు యా స్వాహేశు డర్ధించ రామా!  89

తాత్పర్యము




अभ्यषिच्य च लंकायाम् राक्षस इन्द्रम् विभीषणम् |
कृतकृत्यः तदा रामो विज्वरः प्रमुमोद ह ||

"Enthroning Vibheeshana as the chieftain of demons in Lanka, then feeling that his task is fulfilled, Rama indeed rejoiced highly getting rid of febrility about any uncertainty of fulfilling his promises, excepting for Jatayu... 



మానిని


పావకు డీవిధి వేడగ రాముడు పావన జన్ముడు రాఘవు డా

రావణు శత్రువు వానరు నేస్తుకు వేల్పులు తాపసి కిన్నెర గాం 

ధర్వులు దీవన లీయగ రావణు దమ్ముని రాజుగ చేసియు దా

యవనీ జాతయు దమ్ముడు పావని యాదిగ సాగె యయోధ్యకుం!    90

తాత్పర్యము


    
देवताभ्यो वराम् प्राप्य समुत्थाप्य च वानरान् |
अयोध्याम् प्रस्थितः रामः पुष्पकेण सुहृत् वृतः || 

"Rama obtained boon from gods to get all the dead monkeys up on their feet as though woken up from sleep, and he travelled towards Ayodhya by Pushpaka aircraft, with all the good hearted friends around him...

भरद्वाज आश्रमम् गत्वा रामः सत्यपराक्रमः |
भरतस्य अंतिकम् रामो हनूमंतम् व्यसर्जयत् || 


"Rama, the truth-valiant, has gone to the hermitage of Sage Bharadwaja en route, and he has also sent Hanuma to the near of Bharata beforehand... 

पुनः आख्यायिकाम् जल्पन् सुग्रीव सहितः तदा |
पुष्पकम् तत् समारूह्य नंदिग्रामम् ययौ तदा ||


"Then on boarding Pushpaka aircraft again after leaving the hermitage of Bharadwaja, and telling episodes jovially to Sugreeva and others about the events in the days of his exile in forests, while flying overhead of the very same places, Rama went to Nandigrama, where Bharata is available...


మానిని

సంగర మందున కూలిన వానర సైనికు లందరి జీవము
రాగను దేవత దీవన తోడను రాముడు పుష్పక మందున
యేగెను రాజ్యము నేలగ దారిలొ యాగెను యాశ్రమ మందున 
శీఘ్రమె చేరెను సోదరు చెంతకు సంతస మాయెను యెంతయొ!    91

తాత్పర్యము
  


नंदिग्रामे जटाम् हित्वा भ्रातृभिः सहितो अनघः |
रामः सीताम् अनुप्राप्य राज्यम् पुनः अवाप्तवान् 


"That impeccable Rama rejoining with all of his brothers in the village Nandigrama removed his matted locks of hair along with them. Thus he, on regaining Seetha and on discarding hermit's role again became a householder, and he regained his kingdom also... 


प्रहृष्टो मुदितो लोकः तुष्टः पुष्टः सुधार्मिकः |
निरामयो हि अरोगः च दुर्भिक्ष भय वर्जितः ||

"When Rama is enthroned then the world will be highly regaled and rejoiced, exuberant and abundant, also rightly righteous, trouble-free, disease-free, and free from fear of famine..." Thus Narada is foreseeing the future and telling Valmiki. 


మత్త కోకిల

నంది ధామము చేరి యన్న కనిష్టులం దనురక్తితో
వేద ఘోషల నాద ఘోషల వజ్ర కోటిర ధారియా
సీత తోడుగ రాజ్య భారము చేకొనా ప్రజ లెల్లరూ
మోద మాహ్లాద శాంతి భోగ మమోఘ రంజన శీలతా! 92

తాత్పర్యము

మత్త కోకిల

సంతృప్తి  యుపశాంతి పేమము సేమ ముండుచు నీతితో
బాధ లన్నవి రోగ మన్నది భీతి యన్నది లేకనూ
నీతి మంతులు రామ రాజ్యపు నాగరీకులు యెన్నగా
సాధ్వులా రాజ్యమందు మానవతీ లతాంగులు యెంచగా!    93

తాత్పర్యము
    
\\

न पुत्र मरणम् केचित् द्रक्ष्यन्ति पुरुषाः क्वचित् |
नार्यः च अविधवा नित्यम् भविष्यन्ति पति व्रताः || 


"While Rama is on the throne men will not see the deaths of their children anywhere in their lifetime, and the ladies will remain husband-devout and unwidowed during their lifetime..


మత్త కోకిల

ఇవ్విధంబున దాతృ సూనుడు యీ విధానము నంతయూ
భావ్యమం దగునో తపోధన పుట్ట జాతుడ సమ్యమీ
దివ్యుడా రఘువంశ జాతుడు దండ ధారుడు రాముడే
లంగ రాజ్యము హర్ష మొందిరి లోకు లంచును బల్కెగా!    94       

తాత్పర్యము    



न च अग्निजम् भयम् किन्चित् न अप्सु मज्जन्ति जन्तवः |
न वातजम् भयम् किन्चित् न अपि ज्वर कृतम् तथा ||
न च अपि क्षुत् भयम् तत्र न तस्कर भयम् तथा |


"In the kingdom of Rama there is no fear for subjects from wildfires, gale-storms or from diseases, and there is no fear from hunger or thieves, nor the cattle is drowned in floodwaters, 


नगराणि च राष्ट्राणि धन धान्य युतानि च || १-१-९३
नित्यम् प्रमुदिताः सर्वे यथा कृत युगे तथा

"May it be a township or a remote province, it will be replete with coin and grain, and as to how people lived in high gladness during the earlier Krita era, likewise people will live in Rama's period also with the same gladness... [1-1-93b,

మత్త కోకిల

ఇవ్విధంబున దాతృ సూనుడు యీ విధానము నంతయూ
భావ్యమం దగునో తపోధన పుట్ట జాతుడ సమ్యమీ
దివ్యుడా రఘువంశ జాతుడు దండ ధారుడు రాముడే
లంగ రాజ్యము హర్ష మొందిరి లోకు లంచును బల్కెగా!    95

తాత్పర్యము

        

अश्वमेध शतैः इष्ट्वा तथा बहु सुवर्णकैः |
गवाम् कोट्ययुतम् दत्त्वा विद्वभ्यो विधि पूर्वकम् |
असंख्येयम् धनम् दत्त्वा ब्राह्मणेभो महायशाः || 


"On performing hundreds of Horse-Rituals and rituals wherein plenteous gold is bounteously donated, likewise on donating millions of cows and uncountable wealth to Brahmans and scholars, that highly illustrious Rama will proceed to Brahma's abode, in future... 

राज वंशान् शत गुणान् स्थाप इष्यति राघवः |
चातुर् वर्ण्यम् च लोके अस्मिन् स्वे स्वे धर्मे नियोक्ष्यति || 


"In this world Raghava will establish kingly dynasties in hundredfold and he will be maintaining the four-caste system positing each in his own probity, may it be caste-bound or provincial-kingdom-bound probity, in order to achieve a perfect social harmony... 

दश वर्ष सहस्राणि दश वर्ष शतानि च |
रामो राज्यम् उपासित्वा ब्रह्म लोकम् प्रयास्यति 


"On reverencing the kingdom for ten thousand years plus another one thousand years, i.e. for a total of eleven thousand years, Rama voyages to the abode of Brahma...


इदम् पवित्रम् पापघ्नम् पुण्यम् वेदैः च संमितम् |
यः पठेत् राम चरितम् सर्व पापैः प्रमुच्यते |

"This Ramayana is holy, sin-eradicating, merit-endowing, and conformable with the teachings of all Vedas... and whoever reads this Legend of Rama, he will be verily liberated of all his sins...


एतत् आख्यानम् आयुष्यम् पठन् रामायणम् नरः |
स पुत्र पौत्रः स गणः प्रेत्य स्वर्गे महीयते ||



"Any man who reads this lifespan-enriching narrative of actuality, Ramayana, the peregrination of Rama, he will be enjoying worldly pleasures with his sons and grand sons and with assemblages of kinfolks, servants et al., as long as he is in this mortal world and on his demise, he will be adored in heaven...


पठन् द्विजो वाक् ऋषभत्वम् ईयात् |
स्यात् क्षत्रियो भूमि पतित्वम् ईयात् ||
वणिक् जनः पण्य फलत्वम् ईयात् |
जनः च शूद्रो अपि महत्त्वम् ईयात् ||


"A man reading this Ramayana happens to be a Brahman, one from teaching-class, he obtains excellency in his speech, and should he be Kshatriya person from ruling-class, he obtains land-lordship, and should he be Vyshya person from trading-class, he accrues monetary-gains, and should he be a Shudra person from working class, he acquires his personal excellence..." Thus Sage Narada gave a gist of Ramayana to Sage-poet Valmiki. [1-1-100]



ఆట వెలది

అశ్వ మేధ మనెడి యాగము లను చేసి
పశుల దాన మిచ్చె పదుల కోట్లు
పసిడి దాన మిచ్చె బ్రాహ్మణో త్తములకు
లేదు రాజ్య మందు లవము లోటు! 96

తాత్పర్యము

రామ రాజ్య మందు సామ్యమె స్వామ్యము
వృత్తు లందు జనులు వాసి యుండ
ఏలె రాజ్య మాత యాయుకము మిగుల
యొక్క దశము శతము  యోగి రాజ!  97

తాత్పర్యము

బ్రహ్మ లోక మేగె పావన జన్ముడు
రామ కధను వినగ రమ్య మౌగ
వేద శాస్త్ర ములను వినిన పుణ్యము వచ్చు
పాప ముక్తు డగును పాడ కధను! 98

తాత్పర్యము

రామ నామ జపము రామాయణ పఠన
జన్మ ఫలము చూడ జనుల వరము
వంశ వృద్ధి యగును వర్ణించ రాముని
దేవ భూమె యతని ధామ మగును!  99

తాత్పర్యము

వేల్పు తపసి చెప్పె వాల్మీకి మునికిని
రామ కధను ఎంతొ రమ్య ముగను
భజన సేయు డయ్య భవ బంధములు దొల్గ
రామ రామ రామ రామ రామ!      100

తాత్పర్యము


రామ గాధలొ బాల కాండలొ రాఘవాత్మజు గాధనూ
సమ్య మీశుడు పుట్టపుట్టువు సాధు పుంగవు తోడనూ
రామ భక్తితొ రాము శక్తిని రామ నామము వాసినీ
రామ భక్తుడు నారదుం డభిరాము గాధను పాడెనూ!   101


తాత్పర్యము


इति वाल्मीकि रामायणे आदि काव्ये बाल काण्डे प्रथमः सर्गः ||

Thus, this is the 1st chapter in Bala Kanda of Valmiki Ramayana, the First Epic poem of India.























No comments:

Post a Comment