ఉత్తరాఖండ్ వరదల నేపధ్యంలో ఆ హృదయవిదారక ఘటనకుస్పందించి నేను ఆశువుగా వ్రాసిన ఆటవెలది పద్యాలు, తాత్పర్యము, ఆంగ్లానువాదము.
గంగ పొంగె నకట కొండల నడుమన
కనులు మూడు తెరిచె గౌరి మగడు
గంగ గౌరి వాదు కలత పెట్టెనొ యేమొ
గంగ పార దోలె గౌరి మగడు !
తాత్పర్యము
గంగ, గౌరి సవతుల నడుమ నిరంతరాయంగా సాగే వాదులాటతో శిరో భారము భరించ లేక పరమశివుడు గంగాదేవిని ఉధృతంగా క్రిందికి వదిలాడా ఏమి? ఆయన మూడో కన్ను తెరవగానే గంగాదేవి ఒక్క ఉదుటున కొండల మధ్యకు దుమికిందా ఏమి?
English Translation
Did Lord Shiva send Mata Ganga to earth unable to bear the headache of the constant bickering of his two wives Ganga and Gauri. Did River Ganga leaped from the Heavens, afraid she being when the Lord opened his third eye?
బిచ్చ మెత్తు నీకు పడతులిద్ద రెదుకు
పక్క నొకరు నీకు పైన యొకరు
సవతి పోరు నీకు శిరసు భార మయెగ
గంగ కంటి నీరు పొంగి పొరలె !
తాత్పర్యము
బిచ్చమెత్తి బ్రతికే శివుడా! నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా? పక్కనే ఒకరైతే , నెత్తిన ఒకరు అవసరమా? వారిద్దరి సవతి పోరు ఎక్కువై గంగ కంటి వెంట వచ్చిన కన్నీటి ధారలలో మేము కొట్టుకు పోవలసిందేనా ముక్కంటీ !
English Translation
Oh! Lord Shiva you sustain yourself begging for alms. Is it needed for you to have one wife by your side and another on your head? Unable to bear her constant quarrels with Gauri , it seems Ganga is weeping copiously , in the process shedding floods of tears that are making our lives miserable. We, humans, are drowning in the floods of tears and reaching your Abode.
తండ్రి నలుగుచుండ తల్లులిరువురి మధ్య
పుత్ర పుత్రికలకు బాధ కాదె
వీడు లేదు నీకు కాడెగ నివసము
సుతుల కావుమయ్య సతిని పిలిచి !
తాత్పర్యము
అయినా! తండ్రీ శివుడా! ఇద్దరు తల్లుల నడుమన తండ్రి మనశ్శాంతి కోల్పోయి నలిగి పోతూ ఉంటే పుత్రులకు, పుత్రికలకు బాధ కాదా? నీకేమయ్యా? ఇల్లు లేదు, వాకిలి లేదు. స్మశానమే ని ఇల్లు కదా? మాకు ఉన్న ఇళ్ళు కొట్టుకు పోతే మేమేం చేయాలి. నీ సతిని వెనుకకు పిలిచి మమ్మల్ని కాపాడరాదా?
English Translation
Lord Shiva! You do not need a house. Graveyard is your place of living. But in the waters of Ganga our houses are getting washed away. Call back Ganga and save us from destruction.
ధనులు కొనగ పసిడి ధనతేరసు యనుచు
పేద వెదుకు కూడు పండుగనుచు
ధనము యెటుల వచ్చె జనులడుగరెపుడు
పేదరికుల గోడు పట్ట దసలు!
తాత్పర్యము
ధనతేరస్ అని ఒక కొత్త పండుగ కని పెట్టారు పసిడి వణిజులు. ఆ రోజున ధనం కూడబెట్టిన వారు బంగారం కొంటారు. ఇంకా ధనం వస్తుంది, ఇంకా ధనం వస్తుంది అని. (వీరు కర్మ సిద్ధాంతం నమ్మరేమో. ధర్మం ఎలాగైనా నమ్మరు) అదే ధనతేరస్ నాడు పేదవాడు పట్టెడన్నం కోసం వెదుకుతాడు కదా? ధనవంతుడు అంత ధనం ఎలా సంపాదించాడు? (ధర్మ మార్గానా, లేదా అధర్మాన్ని అంది పుచ్చుకున్నాడా?) ఎవరూ ఆడగరు. అలాగే పేదవాడి గోడు ఎవరికి పట్టదు.
English Translation
Bullion merchants invented another festival, Dhanterus! That day, the filthy rich buy gold with the treasure they earned. Reason is that if they buy gold that day, they will become richer. (These guys seem not to trust Karma theory nor Dharma theory) . The same Dhanterus Day, a poverty stricken guy searches for a bowl-full of alms. No one asks how the rich earned the money; was it through fair or foul means. Similarly no one bothers about the wailing poor.
మీటు మీటు (#metoo) యనుచు మగవారి మెడ చుట్టు
ఉరిని వేసి వారి యుసురు దీయ
సీత మగని కోరి సీత నిడుము బెట్టు
శూర్పణఖలె సగము చూడ తరచి!
తాత్పర్యము
ఆ మధ్య మీ టూ అని ఉద్యమం మొదలు పెట్టారు. "నన్ను కూడా చెరబట్టారు" అని. ఈ ఉద్యమంలో పేరు కనబడితే ప్రముఖుల జాబితాలో చేరినట్టే. "సిగ్గు చిన్నప్పుడే పోయింది. పరువు పందిట్లో పోయింది " అని సామెత. ఇలాంటి సంఘటనలు దురదృష్టవశాత్తూ జరిగినా దానికి న్యాయపరంగా పరిష్కారం చూసుకుంటారు. పేరు బయటకి రానివ్వరు. కాని వీరు అలా కాదు. పబ్లిసిటీ ఇచ్చుకొని గొప్ప వారి మవుదామనే. మరి వీరిలో , సీత భర్తను కోరిన శూర్పణఖలు ఎంతమందో? కదా!!
English Translation
Recently a #metoo movement started in full swing. "I was too molested" is catch phrase. If a name appears in this movement they become overnight celebrities. "Lost shame when she was a kid and lost prestige while getting married" is a saying. Even if such incidents do happen by ill-luck, women try to hide their name and seek legal remedy. But with these ladies it is not so. In reality , how many of these belong to the Surpanakha clan , who wanted to enjoy the company of Sita, the pious wife of Lord Rama? Is it not?
వాణి పూజ సేయ వొరవడి స్థిరమాయె
లక్ష్మి దేవి పూజ లెటుల సేతు
అత్త కోడ లొకచొ యుండుట సాధ్యమె
వాణి యలిగి యిల్లు వదిలి వెడలొ?
తాత్పర్యము
మామూలుగా నాకు సరస్వతీ దేవి పూజచేసే ఆనవాయితీగా వస్తోంది. అలాటిది ఇప్పుడు దీపావళికి కొత్తగా లక్ష్మీదేవి పూజ చేయడం ఎలా? అత్తా , కోడళ్ళు ఒక చోట ఉండరంటారు కదా? మరి లక్ష్మీ దేవి పూజ చేస్తే వాణి వెళ్ళి పోతుందేమో! అమ్మో !
English Translation
I am a devotee of Goddess Saraswathi. Today, as per new trend, can I perform pooja of Goddess Lakshmi ? It is said that mother-in-law and daughter -in-law do not stay at one place. If I pray Goddess Lakshmi, it is possible Goddess Vani will leave me. Can I bare the loss?
మెతుకు దొరకదాయె మండెడి కడుపుకు
చిన్న తనము నందు శిక్ష యేకొ
బొక్కసమ్ము నిండ బోలెడు ధనముండె
మెతుకు యెక్క దాయె మాయ యేమొ!
తాత్పర్యము
ఇది ఒక వింత. చిన్నతనంలో ఆకలిగా ఉన్నప్పుడు, మండే కడుపుకు ఒక్క మెతుకు దొరికేది కాదు, అదేమి శిక్షో ? వయసు పెరిగాక ఇనప్పెట్టె నిండా డబ్బైతే ఉంది కాని తినాలనే ఆశలేదు కదా?
English Translation
This a paradox. In childhood , I used to be very hungry. But I was not getting a morsel of food. Now, when I earned huge and there is money everywhere, I do not have the urge or desire to eat.
దొంగ - దొర
తల్లి కడుపు నింప దొంగతనము జేసి
జనమ యంత గడిపె జయిలు నందె
బొక్కసమ్ము నింప బొక్కి ప్రజల సొమ్ము
బెయిలు రాగ మరల బొక్క దొడగె !
తాత్పర్యము
దొంగ ఎవరు ? దొర ఎవరు? చిన్నతనంలో అమ్మ కడుపు నింపడానికి దొంగతనం చేసి దొరికి జన్మంతా కారాగారంలో గడిపాడు ఒకడు. అదే కోట్ల కొద్ది ప్రజాధనం బొక్కి , బెయిల్ తీసుకుని దర్జాగా తిరుగుతూ, మళ్లీ అదే నేరం చేస్తున్నాడు ఇంకొకడు. వీరిలో దొంగెవరు, దొర ఎవరు?
English Translation
Another paradox. In childhood a guy committed theft to feed a hungry mother, got caught and spent life in jail. Another guy looked public money, got bail and again started looting. Who is a thief and who is a Lord?
వలస పోయినోడు అలసి సొలసి పోయి
కొండ పగుల గొట్టె కండ కరుగ
ధనపు కొండ కట్టె ధనికుడు అతి యాస
ప్రాణ మొదిలె నకట పేద కూలి!
(ఉత్తరాఖండ్ వరదలు)
తాత్పర్యము
పొట్ట కూటి కోసం వలస పోయిన కార్మిక కుటుంబాలు అలసి, సొలసి కండలు కరిగపోయేట్లు కొండలను పగుల కొట్టారు, ఎందుకు? ధనం కొండలుగా పేర్చాలనే ధనాశతో ధనికులు అక్రమంగా ఆనకట్టలు కడుతుంటే , వారిచ్చే నాలుగు రూకలతో కడుపు నింపుకోడానికే కదా? ధనికుల ఆశకు వరదలు వస్తే ప్రాణం వదిలేది వారే కదా?
English Translation
While the haves are violating all rules and constructing barrages illegally , the migrant labor are straining their muscles and nerves and are breaking the unbreakable hills and bullocks. For what? Just to fill their empty stomachs with the peanuts offered by the rich. If ultimately nature revolts and floods inundate the area, who lose their lives? The migrant labor only!!
పని వాళ్ళు- డబ్బులు అనే విషయంలో అభిప్రాయ భేదాలు మూడు.
Domestic workers- and the money we pay them is an issue that bothered me since childhood. There are three kinds of people if we observe the phenomenon.
1. డబ్బులు ఇస్తే వాళ్ళకి నెత్తిన కళ్ళొస్తాయి.
70 శాతం ఇలానే ఆలోచిస్తారు.
పని వారు పని చేస్తారు. వారికి దారి లేదు కాబట్టి.
ఇది అధముల ఆలోచన.
1. If we pay them enough they become arrogant. 70% of people think like this. Even if we pay them less they work as there is no other option for them.
This is the thinking of people with the lowest morality.
2. పని చేశాడు కాబట్టి, డబ్బులు ఆశిస్తాడు. 25 శాతం ఇలా ఆలోచిస్తూ అయిష్టంగానే డబ్బు ఇస్తారు. వీరు మధ్యములే కాని అధములకు దగ్గరగా, ఉత్తములకు దూరంగా ఉంటారు.
ఇది అధమ-మధ్యమ ఆలోచన.
2. The second type think he expects to be paid as he worked. So, though unwilling, they pay grudgingly. This type of people vacillate between morality and immorality. Action is moral but thought is amoral.
This is the thinking of people with low morale but middle of the road amorality.
3. భగవంతుడు ప్రతి మనిషిని ఒకే రకంగా సృష్టించ లేదు. వారు అంత కష్టపడితే తిండి లేదు. కొందరికి అపరిమితంగా ఇస్తాడు.. మనం తినే దాన్ని కొంత పంచుదాం. ఇష్టమైతే పని చేస్తారు. వీలు లేనప్పుడు చేయరు. కాని వాళ్ళు కూడా మనలాగే ఆరోగ్య కరమైన భోజనం తినాలి అని అవసరమైన దాని కంటే ఎక్కువ వండి వేడిగానే వాళ్ళకు పెడతారు. చివరకు వీరికి ఏమీ మిగలదు, తృప్తి తప్ప.
ఇది ఉత్తముల ఆలోచన.
3. "God created the human race differently. Those who work hard find it difficult to fill their stomachs with nutritious food. But God gives few people with unlimited resources. Let us share our bounty with them. They work when they are able and sometimes they may take rest. But they should also eat healthy food like us. " Thinking so, some people distribute food by preparing more than required by them Finally they may be left with nothing, but satisfaction of having helped others.
ఈ పాఠం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పచ్చడి పెట్టండమ్మా అని ఎవరైనా అడిగితే వారానికి సరిపడా ఇచ్చి గిన్నె ఉంచేసుకో అనేది. (మడి కదా). బియ్యం అడిగితే గిద్దెడు అడిగితే మానెడు ఇచ్చేది.
I learned this from my mother. If anyone asked for pickle for food once, she used to give enough for a week and also the vessel in which it was given. If anyone asked a 100 grm rice she used to give a kilo.
ఎలాగైనా మా తల్లి బంగారు తల్లి కదండీ! ఆమె ఆశిస్సులతోనే నా పిల్లలు మంచి పౌరులయ్యారు.
All said, my mother was a Goddess. With her blessings only our children are in high positions.
మా తల్లి ఇంకో పదేళ్లు బతక కూడదా? నేను కాశీకి టికెట్లు, ఐదు నక్షత్రాల హోటల్లో రూమ్ బుక్ చేశా. మా అల్లుడు స్వీడన్ తీసుకెళ్తానని చెప్పాడు. కర్మ ఫలం.
Why did God not give my mother another ten years of life? In fact, I booked tickets and room in a star hotel for Kasi trip. My son-in-law to show her Europe. But if we plan a thing our Karma plays its game differently.
A tribute to her.
శార్దూలవిక్రీడితము
తల్లీ నిన్ను దలంచి దానములన్ దండిం జేసితిన్ నీదు, నా
ఫాలాక్షు దయయే భిక్షుకు డగుటం ; భక్తిం నినుం బూజ యె
ట్టులన్ జేయగనా తరంబు యగునా ఠావుల్ దరిన్
యీలాగున్ పరమై సుదూరముగ బోయెన్ తల్లి గాపాడవా !
తాత్పర్యము
అమ్మా! నిను దలచుకొనుచు దండిగా దానములు చేసితిని! నీ దయ, ఆది భిక్షువుడయిన ఆ పరమ శివుని దయయే ఇది తల్లీ! మరి భక్తితో నిను పూజ జేయగా, నా శక్తి సుదూరంగా పోయెనేమో కదా! నీవే తిరిగి వచ్చి నన్ను గావవా!!
English
Oh! Mother! Following your footsteps I helped lots of people. Your kind heart and blessings of the Supreme Beggar resulted in my kind heart ! But when I think of praying you wholeheartedly I feel weak and that my strength has gone to yonder to unknown lands. Mother! Why dont you come back and save me?
అమ్మ శతకం
మా తల్లిగారు నీలంరాజు సుబ్బలక్ష్మి గారు దైవ సాన్నిధ్యాన్ని చేరి 11 సంవత్సరాలయింది. ఆమె స్మృత్యర్ధం "శతక" మొకటి వ్రాయ సంకల్పించాను.ఈ అయిదు పద్యాలు ఉపోద్ఘాతము మాత్రమే. ఆమె జీవిత చరమాంకంలో ఆరు నెలలు నేను, నా భార్య పడిన వేదన ఎన్నటికీ మరువ లేనిది. " ఎక్కడ తిరిగినా నీ దగ్గరకే వచ్చి ప్రాణాలు వదులుతాను" అని ఆమె దశాబ్దాల క్రితం చెప్పిన మాట నిజం చేసి , చివరకు నా చేతుల్లోనే ప్రాణం వదిలింది. మా అమ్మతో నా అనుబంధం అలాంటిది. మా కత్తులకు రెండు వైపులా పదునే.
చేయి, కాలు, నోరు పూర్తిగా పడిపోయినాయి. ఒక డాక్టర్ మేము చేసిన సేవ చూసి ఒక రూపాయి ఫీజు తీసుకోకుండా మూడు నెలలు ఇంటికి వచ్చి ఆయన సాధ్యమైనంత చేశాడు. మాకు నమస్కారం చేసి వెళ్ళాడు.
అదృష్టమో, దురదృష్టమో ఆ భగవంతుడికే తెలియాలి. "యద్భావం తద్భవతి"
ఈ శతకానికి మకుటం " ధర్మ మేమొ దెలిపినట్టి తల్లి నమన !"
My mother , Smt. Neelamraju Subbalakshmamma attained the Abode of God about a decade back. I decided to write a treatise on her life in the form of a Sataka, hundred Telugu poems. The following poems are only prologue. During her last days on bed the anxious days and nights me and my wife spent are unforgettable. Decades back she said with whichever son or daughter she spends her life she would come back to me to die in my hands. She did it. My attachment with my mother was such. Our knives were sharp both sides.
Whether her in death in my hands is good luck or ill-luck, I do not know. Whatever we wish happens.
ఆటవెలది
పక్షవాత మొచ్చి పడియుండ పడకపై
తల్లడిల్లి తమ్మ తపన బడితి
చేత పైస లేక చేతనము యుడుగ
కన్న కొడుకు నన్ను కాచె నమ్మ !
తాత్పర్యము
అమ్మా! నువ్వు పక్షవాతం వచ్చి కదలక, మెదలక మంచం మీద పడి ఉంటే ఎంతో తపన పడ్డాను, తల్లడిల్లి పోయాను. చేతిలో నయా పైసా లేక చేతులు, కాళ్ళు కట్టేసుకు కూర్చుంటే నీ మనవడు ఆదుకొని ధైర్యం చెప్పాడమ్మా.
English Translation
Mother! When you lay down on bed with your hands and feet losing strength me and my wife spent anxious days and nights for six months. With not a single rupee in hand I too was immobile. It was at this juncture my son, your grandson gave me courage asking me to provide the best Medicare whatever the expenditure!
ఆటవెలది
ముద్ద ముద్ద నాకు ముద్దుగ తినిపించి
ఘటము నేను సేయ కష్ట పడుచు
నేయి యెక్కు వేసి నయమున భయమున
కడుపు నింపి నట్టి కరము యెచట!
తాత్పర్యము
చిన్నతనంలో నేను భోజనం దగ్గర రభస చేస్తుంటే ముద్దు చేసి ముద్ద, ముద్ద mm in తినిపించి, ఇంకా మారాము చేస్తే నెయ్యి ఎక్కువ కలిపి నా కడుపు నింపిన చెయ్యి పడిపోయింది కదమ్మా! అప్పుడూ నీకే కష్టం, ఇప్పడూ నీకే కష్టమా?
English Translation
As a child when I was making all kinds of tantrums not to eat food, you were taking all the trouble to feed me little by little. When my tantrums only grew you were adding more geeti appease my hunger. Where is that hand now that fed me. Are troubles yours all through your life, Mother!
ఆటవెలది
ఏడుగురుని కనియు ఏనాడు యలవక
కాలు నిలువ కుండ కరుణ తోడ
కల్పవృక్ష మోలె కొడుకుల కూతుళ్ళ
గరిమ నిలిపి నట్టి కాళ్ళు యెచట !
తాత్పర్యము
ఏడుగురు బిడ్డలను కని ఏనాడూ అలసట యనుకోకుండా , భూమి మీద కాలు ఒకచోట నిలుపక తిరుగుతూ, కల్పవృక్షం లాగా బిడ్డలను కాపాడుతూ మా గొప్పతనాన్ని ఎప్పటికీ పదుగురూ మెచ్చుకొనే రీతిగా పెంచిన ఆ కాళ్ళు ఎక్కడమ్మా? కదలవాయెనే?
English Translation
Mother! You gave birth to seven children but never feeling tired and never resting your feet on ground , like the Divine tree in Heaven you protected us and brought us up in such a way that our greatness remains perennially. Where are those feet now? They lay down on bed without movement.
ఆటవెలది
మంచి మాట తప్ప మత్సర మననేమొ
తెలియ కుండ పెంచ తపన పడియు
భర్త పోయి నంత పట్టెడన్నము లేక
సిగ్గు పడిన నోరు చితికి పోయె !
తాత్పర్యము
నోటినుండి మంచిమాటే తప్పితే , అసూయ ద్వేషాలకు తావివ్వక , మాకు ఆ చెడు ఆలోచనలు రానీయకుండా పెంచడానికి ఎంతో తపన పడితివి కదా? అలాంటిది, నాన్నగారు చనిపోయిన తరువాత పట్టెడన్నము లేక నోరు పెగలక, సిగ్గు పడితివి కదమ్మా!
English Translation
We always heard only good words from you. You never permitted the two enemies jealousy and hatred to enter our minds. For that you strained your nerves. But after the demise of father, the same voice that taught us all the good became voiceless as you suffered abject poverty and felt shy to ask for food.
ఆటవెలది
ఆరు నెలల పాటు యవ్విధంబు నలసి
కడకు యొక్క దినము కన్ను మూయ
చితికి నిప్పు బెట్టి బతికితి శిలవోలె
పరుల దుఃఖము కూడ బాధ మోసి !
తాత్పర్యము
ఆరు నెలల పాటు ఆ విధంగా మంచాన పడి అలసి , చివర కొక రోజున నువ్వు కనులు మూయగా , నేనే చితికి నిప్పు పెట్టి, ఇతరుల దుఃఖాన్ని కూడా బాధగా మోసి శిలలాగా బ్రతికాను కదమ్మా.
English Translation
Struggling in bed for six months one day you closed your eyes forever. I only lit the funeral pyre and swallowing the grief of others too in my heart, I lived like a rock till now.
ఆటవెలది
English Translation
You filled water tanks with mud and made plain land out of it to construct houses not leaving even a yard land. Now, water unable to find way to flow freely inundated your houses. Is it not your own fault? Why do you blame others?
ఆటవెలది
English Translation
An inch space is not allowed between construction and construction. Hey ! Selfish human ! You swallowed the benefits of the five elements of nature. Now the five elements, water (floods), earth (quakes) , sky (pollution) , wind (cyclones) and fire (accidents) are taking revenge on human race!
ఆటవెలది
English Translation
Nation got polluted. Morality remained a distant dream. The thirst for earning and hoarding multiplied. Where is a citizen daring enough to question the immorality?
ఆటవెలది
English Translation
In the country bribery and corruption spread. The rich are filling the Temple Coffers with ill-gotten wealth. The have-nots never goes near a Temple Hundi (collection box). On the whole, it seems this jungle justice seems to have started in places of worship.
No comments:
Post a Comment