Sunday, August 8, 2021


                          వాణి శత శతి


ఆకలి- ఆశ


మెతుకు దొరకదాయె మండెడి కడుపుకు

చిన్న తనము నందు శిక్ష యేకొ

బొక్కసమ్ము నిండ బోలెడు ధనముండె 

మెతుకు యెక్క దాయె మాయ యేమొ! 


దొంగ - దొర


తల్లి కడుపు నింప దొంగతనము జేసి

జనమ యంత గడిపె జయిలు నందె

బొక్కసమ్ము నింప బొక్కి ప్రజల సొమ్ము 

బెయిలు రాగ మరల బొక్క దొడగె !


ఆటవెలది


పంచదార కన్న పరదార తీపిjరా 

వీటి కన్న మిన్న వేశ్య వాడ

పిలక జుత్తు కన్న పిల్లి గడ్డమె ముద్దు 

సెక్యులరుల నీతి సాని రీతి !


దార = భార్య   వీడు = ఇల్లు 


పంచదార కన్న పక్కవాడి భార్య తీయగా ఉంటుందిట. ఇంటి కన్న సానివాడ సుఖంగా ఉంటుందట. పిలక జుట్టు, ఎబ్బే! పిల్లి గడ్డం, అబ్బో ఎంత ముద్దో? 

కుహనా లౌకికవాదం (Pseudo Secularism) సానితో సంసారం లాంటిదే.


,

భాగ్యవంతుడేమొ భోగి మంటలు వేసె

కాసు లేని వాడి కడుపు మండె

భాగ్య మున్న వాడు భోగి పండుగనియె

ధనము లేని వాడు దండుగనియె! 


భోగి పండుగొచ్చె పాత యల్లుడ రార

బూజు దులుపు  కాస్త పిండి రుబ్బు

కాన్క తీసుకోర కొత్త యల్లుడ వచ్చి 

భోగి వచ్చు మరల బూజు వచ్చు!


ఆటవెలది


సుఖము కొఱకు వెదికె సొమ్ము మూటలు గట్టి

సుఖము కొఱకు తిరిగె సాని వాడ 

సుఖము దొరకదాయె సోలిపోయె మగడు 

దార చెంత చేర దొరికె సుఖము ! 


తాత్పర్యము


వేమన కవి పద్యాలు చదువని వారుండరు. "విశ్వదాభి రామ వినుర వేమ" తెలుగు జాతీయ మయింది అన వచ్చు.


అలాంటి వేమన కవి భార్య నగలతో సహా పరాయి ఆడువారి పాలు చేసి, ఒక సందర్భంలో ఈ ఐహిక సుఖాల పట్ల విముఖత వచ్చి ఈ జగత్తులో ఉన్న కల్మషాల్ని కడిగి వేస్తూ పద్యాలు వ్రాస్తారు.  ఈ పద్యానికి ప్రేరణ ఒక విధంగ వారి జీవితం, వారి లాగా దొరకని ప్రదేశాల్లో సుఖము వెదుకుతూ , చివరి వరకు మారని ప్రబుద్ధుల గురించి. "నాతి చరామి" అని  మూడు ముళ్ళు వేసిన భార్య దగ్గర దొరకని సుఖం వేరెక్కడ దొరుకుతుంది? 


సుఖము దొరుకుందని డబ్బు మూటలు కట్టుకొని తిరిగాడు. సుఖం ఎక్కడ ఉందని సాని వాడల్లో తిరిగాడు. ఎంత డబ్బు ఇచ్చినా, ఎందరు వేశ్యలతో సుఖించలేక అలసి పోయి భార్య ముఖములోకి ప్రేమగా చూశాడు. ఎక్కడా దొరకని ఆనందం ఆమె ముఖ దర్శనంలో దొరికింది. 


యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః


English Translation


There may no one who did not read poems by Yogi Vemana. "Viswadabihrama Vinura Vema" has become a catch-phrase in Telugu. 


Originally Vemana , the poet , felll into the trap of women of suspicious character and spent lot of money hoping to get pleasure. At one time he steals his wife's ornaments to give to the a women. But one incident changes his attitude about life and its pleasures. Finally he finds pleasure in the face of his wife who got tied to him through marriage. Then he turns into a great poet attacking the ills in this society.


This poem is a mirror reflection of his life. He roamed carrying bundles of money in search of pleasure . He roamed in areas where women lure men for material gains. But the whole lot of money he spent, the whole lot of women  with whom he sought physical satisfaction could not give him pleasure. Finally he looked into the face of his wife whom he he promised while tying the knot not to ditch her and the pleasure he was seeking was found there.


పదునెనిమిది పోయె పది తొమ్మిది వచ్చె

తిట్లు పోయె సిగల పట్లు వచ్చె

జగడ మాగ దంచు జగతి వగచె నయ్యొ

నేతి బీర కాయె నీతి యకట!


https://www.eenadu.net/newsdetails/16/2019/01/01/38984/clashes-in-new-year-celebrations


సందు సందు చూడు మందు బాబుల నేడు

పిల్ల పాప లకట పస్తు లుండ

దినపు కూలి తోడ తాగి తందనలాడె

ప్రభుత మురిసె చూసి పన్ను మూట!


In every street you find drunkards dancing after drinking with their daily wages, even as their kids slept starving. Govt is elated about tax income. Pity 2019! 


కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి "పుష్ప విలాపము" కావ్యాన్ని  చెవులారా విన్న నల్ల నోట్లు  తమ వేదనని ఈ విధముగా వెల్లడించాయట. అదే "నోట్ల విలాప" గాధ! 


నీ పూజ కోసమై పూలు తెద్దామని ఉదయాన్నే ఉద్యానవనములోకి పోయాను ప్రభూ! పూల బాలలు తల్లీ వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు 


నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో 

రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా

ప్రాణము తీతువా” యంచు బావురుమన్నవి, క్రుంగిపోతి, నా

మానసమందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై 

 

నీ కాలే కడుపు నింపుటకై ఋణము కొరకు ఉదయాన్నే ఓ పెద్ద మనిషిని కలువ బోతిని ప్రియ సఖీ! అతని ఇంట లక్ష్మీ దేవి నాట్య మాడుచున్నది. అంతట  


అతడొక ఉక్కు బీరువ కడ నిలిచి చివాలున తలుపు తెరిచి చేతులు

చాచె నంతలో నోట్లన్నియు జాలిగ "నోళ్ళు" తెరిచి మా మానము కొల్ల 

గొడితివే యంచు బావురు మన్నవి, అపుడెదో నా మానస మందొక  

యోచన గల్గెను, వాణి కృప బయల్వెడలె "నల్ల ధన" విలాప గాధయై!  


జడమతుల మేము, ఙ్ఞాన వంతుడవు నీవు  

బుధ్ధి యున్నది, భావ సమృద్ధి గలదు;

బండ బారెనటోయి నీ గుండెకాయ! 

శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?


విలువ కల వారమేము, విలువ లెరుగ వీవు

బుద్ధి యున్నది నీకు భావ "శుద్ధి"  లేదు

లంచమని యరిచెనోయి నీ "మంచు" గుండె

"నల్ల" బడితిమి మేము నీ వల్ల నేడు! 


ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా

తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ముల లోన స్వేచ్చమై 

నూయల లూగుచున్ మురియు చుందుము; ఆయువు దీరునంతనే

హాయిగ కన్ను మూసెదము ఆ యమ చల్లని కాలి వ్రేళ్ళపై  


విలువలు గలుగు నాల్గు దశకముల్ ముద్రించిన భరత మాత 

జాతీయత కాచుకొందుము ఆయమ బిడ్డల చేతుల స్వేఛ్చమై 

తిరుగాడుచు మురియుచుందుము, ఆయువు తీరునంతనే 

ఆర్బియై చెస్టులో సేద దీరి యగ్నికి పూజ చేతుము హాయిగా!  


గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం 

గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే 

త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో 

తాళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే! 


తెల్లగ మెరియుచుందుము విరి మల్లెల వోలె; మమాదరించు 

భరతావని బిడ్డల యాసల దీర్తుము; మిము బోంట్ల స్వార్ధానికి   

యౌదుము బలి పశువులం; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో 

బంధింతువె బాత్ రూములో; తెల్లని మమ్ము నలుపు సేతువే!  


ఆత్మసుఖము కోసమయి అన్యుల గొంతుల కోసితెచ్చు పు 

ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి  

శ్వాత్ముడు స్వీకరించునే? చరాచరవర్తి ప్రభుడు మా పవి 

త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?


అత్యాస తోడ  అన్యుల గొంతు  పిసికి తెచ్చు 

పాపాల పుట్ట ! నీకు నిదుర ఎటుల వచ్చు? నల్లని నోట్లు 

దేవుడు స్వీకరించునే? చట్టమును కాచు ప్రభుడు మము 

విముక్తి చేయడే? నడమంత్రపు సిరి నడ్డి విరచడే? 


ఊలు దారాలతో గొంతు కురి బిగించి 

గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము

అక్కట! దయలేనివారు మీ యాడువారు!


మించు లంచాలతో పేదల పొట్ట గొట్టి

శుచియౌ మమ్ముల నలుపుగ మార్చి పేర్చి 

దాచుకొందురు పరువు మర్చి పరుపు కింద

అకట! సిగ్గు లేని వారు మీ బొగ్గు దొంగలు!  


బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు

సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?

ఆందమును హత్య చేసెడి హంతకుండ!   

మైల పడిపొయె నోయి నీ మనుజ జన్మ!


బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు

సహజ మగు నీతి నీలోన చచ్చెనేమి?

చట్టమును చంపెడి చండాలుండ 

నల్ల బడిపొయె నోయి నీ నరుని జన్మ!


అట్లు దూషించు నల్ల ధనమును ఋణము స్వీకరించ లేక కాలే కడుపుతో తిరిగి వచ్చితిని, నా శ్వేత హృదయాంజలిని  స్వీకరించి కడుపు నింపుకొనుము ప్రియ సఖీ!

తేటగీతి 

కప్పు పగిలిన కాఫీకి ముప్పు వచ్చు

చెప్పు తెగినచొ కాలికి తిప్ప లొచ్చు

టిప్పు లీయవొ బట్లరు తిట్ట వచ్చు

తప్పు చేయకె తలకిటు నొప్పి వచ్చు!

సరదాగా ఓ పద్యం 

తాత్పర్యము 

ఒక్కోసారి మనం తప్పు చేయకనే తలనొప్పి తెచ్చుకుంటాం కదా. కప్పు పగిలితే కాఫీకి ముప్పు వస్తుంది. చెప్పు తెగితే కాలికి తిప్పలే కదా. హోటల్లో టిప్పులు ఈయకపోతే బట్లర్ తిట్టొచ్చు. మనం నిమిత్త మాత్రులం.




కొత్త నోట్ల కొరకు  కొలువయి రిట చూడు

పేద వార లెల్ల పనులు మాని

నేర గాళ్ళ నోట్లు నలుపు తెలుపు చేయ

బుద్ధి యెపుడు వచ్చు పేద నీకు? 

Whose money?


తాత్పర్యము 


నోట్ల రద్దు కాగానే ధనవంతులందరూ , తమ నల్ల ధనాన్ని కొత్త నోట్లతో మార్చుకోవడానికి, లేదా ఆ డబ్బు జన్ ధన్ ఖాతాల్లో వేయడానికి పేద వారిని పంపితే, వాళ్ళు తమ పనులు వదలి బ్యాంక్  ల ముందు క్యూలు కట్టారు కదా? అది వారి ధనమేనని మళ్లీ తాము మోస పోతున్నామని వారికి అవగాహన లేదు కదా? ఋ


English


Once demonetization was announced the rich handed over their black money to the poor to be exchanged to new notes or credit into their Jan Dhan accounts. The poor abstained from their work, to help the rich. After all, it is their own money looted by the rich now again they are getting looted of.


పీఠ మెక్కె కాని పదవి కాంక్ష లేదు 

సోనియమ్మ కొడుకు సోకు మాడ

జనుల కావ నేడు శివుని భక్తు డయెగ

ప్రమధ గణము లెల్ల పొగిడి పాడ!


ఆలయమును సచివు లాలయమును గూల్చి

వాస్తు శాస్త్ర మంచు వాదు చేసె

శాస్త్ర మేమి చేయు శాసనాసురులను

మింగు వారి గుడుల లింగములను !


యెత్తి పోతలంచు యెత్తి పోసిరి డబ్బు 

పెచ్చులూడి పోగ పక్షమందె

చెదలు తినెను యనిరి సిమ్మెంటు గోడను

ఇనుము మింగి నట్టి ఎలుక భంగి ! 

బిజెపికి ఓటు వేయండి - ఎలుకలు తిన్న ఇనుము, చెదలు తిన్న సిమెంటు కక్కించండి)


దొరల రాజ్యమందు దోమలె రాజులు 

ఫామ్ హౌసు లోన పామె మంత్రి

కాల్వలన్ని పూడ్చి కుంటలె మిగిల్చె

భవనములను చేసె బొంద దొడ్డి!


బిజెపికి ఓటు - ప్రగతికి చోటు



యూరి దాడి పాప మూరికె పోదని

ఉరిమి చెప్ప వారు వినక పోయె

ఉరికి భరత సేన ఉరివేసె శత్రుల

వారి భూమి పైనె గోరి కట్టె!


2nd September, 2020 మా నలుబది నాలుగవ వివాహ పర్వదినము.  ఒక రాత్రి ముందే వ్రాశాను. రేపు  మళ్ళీ ఏ ధ్యాసలో ఉంటానో!


నలుబదేండ్లు యయెన నాల్గు క్షణముల

కలలు కనుచు మనము కాఫి తాగి

ప్రేమ దోమ సద్దు పెండ్లిలొ దరి చేర్చి

పూల తోట లోన మాల మార్చి!


(ఈ కాఫీ కధ హోటల్ సరోవర్ లో)


We exchanged garlands in Public Gardens after getting married in Registrar"s Office, MJ Market, in 1977. Those days it was a daring act of my wife. And she stood by me in poverty and prosperity! A great woman,  a greater mother!


చింత లేదు నాకు చెంతను నీవుండ 

వ్యధల బతుకు తీపి కధగ మార్చి 

నావ నడిపి తీవు నడి సంద్రము నందు 

క్షణము క్షణము నన్ను కాచు కొనుచు!


On Vani, my inseparable companion


మగని చాటు పిందె మరువపు పూదండ

వాణి రాణి యంచు బాణి కట్టి

వందనములను తెలిపె యందు కొనరటయ్య 

వాణి పలుకు మాట నాదు నోట! 


వాణి చంద్రుల శుభోదయం, నమస్సుమాంజలులు!


మాతృ భాష దినము మాత వందన మమ్మ

దేశ భాషలందు తెలుగు లెస్స

వాడి పోయె నేడు వాడుక మరువగ

లేని భాష నెటుల లెస్స యనుట!


గీత గీసె భ్రాత త్రేతా యుగము నందున

రమణి గీత దాట రామాయణము 

యుగము మారె గీత యర్ధమె మారెను 

భాగవతుని బోధె భారతమ్ము! 


కలియె యేలు చుండ కల్లు గీత వరము

కాలు ఒకటె నటగ కలికి నడువ

కల్లు తాగినంత కాలితొ పని లేదు 

గాలి లోన తేలి కాలు బిలుచు!


గణప పూజ సేయ గరిక దొరకదాయె 

గరిక పాటి వారి గరిమ యేటి

కదల రాయె జనులు మొలుచు టెటుల గరిక

శలవు నీయ వయ్య శరణు శరణు  !


నలుగు పిండి తోడ నీదు జనన మాయ

తెలుగు పండి మాకు తెలివి హెచ్చె

గరిమ గంపె డుండె గరిక దొరికె చాలు

గరిక పాటి దీవ్న కవిత పోటి! 


వేద భాష వినుచు వొడలు మరిచితేమొ

చతుర భాషణ విని చెమ్మ గిలెనొ 

సంస్కృతమ్ము వినగ చంద్రయా న్మేగేమొ

కవిత పొంగి పుట్టె గరిక పాటి!


ఙ్ఞాన మొక్క వంక చతురత యొక వంక 

బదుకు రీతి నీతి పలుకు తునక 

పంచదార చిలక పలుకుల వెనుక ఏ

గుట్టు దాచి తయ్య గరికపాటి!


అన్ని దానములలొ అన్న దానమె మిన్న

లేని వాని కచట లేదు చోటు

గుడిని మింగు వాడె గుడిలొ యన్నము మింగు 

కడుపు కాలు వాడు గుడికె రాడు!


అలసి సొలసి నాకు యక్షరములను నేర్పె

క్షరము యగుచు నాకు ౘదవు నేర్పె

క్షణము బదికి యున్న ఋణము తీర్చెద మన్న 

కనులు తెరిచి చూడ కాన రారె! 


My Father - My God.


మా నాన్న గారు నాకు దైవం కంటే ఎక్కువ. ఎంత మంది అలా ఉంటారో నాకు తెలియదు.  చివరి రోజుల్లో తిండికి కూడ  కరువైనా బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం వచ్చినా డిగ్రీ పూర్తి కాకుండానే చేరొద్దు అని ఆపిన ఘనుడు. డిగ్రీ కాగానే భీమా సంస్థలో ఉద్యోగం వచ్చింది. పెద్ద జీతం. ఆయన ముఖంలో ఆనందం మర్చి పోలేను.  ఎన్నో కలలు. ఆయన్ను హైదరాబాద్ తెచ్చి ప్రాక్టీస్ ( డాక్టరు ) పెట్టించి కాలు మీద కాలు వేసుకొని బ్రతికేట్లు చేయాలని. నేను ఉద్యోగంలో చేరిన రోజే ఆయన ఆస్పత్రి పాలు.  చంద్రుడి ప్రతిభ, వృధ్ధి చూడకుండా ఆయన 44 వ రోజు స్వర్గస్ధులయ్యారు.  మాయ. 46 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన కలలో కొస్తారు.  నేనే మరణం అంచుల్లో ఉన్నాను.  మరి ఇంకా ఆయన కలలేమిటి? కుర్చీలో కూర్చుని నన్ను చదివంచడ మేమిటి.? నేను నా పిల్లలకి అడిగిన పుస్తకాలన్నీ కొన్నాను.  వేలల్లో.  కాని కూర్చుని ౘదువు చెప్పలేదు. వాళ్ళు చాల గొప్ప వాళ్ళయారు.  అమ్మ పుణ్యం. కాని నాన్న అంటే కూడ వాళ్ళకి ప్రాణం. 


మా నాన్నకు ఒక రోజు లేదు. అన్ని రోజులు ఆయనదే. ఇది నా హృదయం నుంచి వచ్చిన ఆవేశం.


బోర్డరులో ఇమ్రాన్ ఖాన్

చార్మినార్లొ అసదుద్దిన్

దోనొంకొ బహుత్ పరేషాన్

ఓ! కూనలమ్మ!


సాధు లంటె (ఆర్ ఎస్ ఎస్) భయం వాడికి

నాధూరాం భయం వీడికి 

భయమేలర సొంత నీడకి 

ఓ! కూనలమ్మ!


మాస్కె నీకు దిక్కు మౌనమె నీ భాష

తాళ మేయ తలుపు తలపె ఘోష

అంటరాని తనము యొంటరి తనముయు

కరొన యుగము నందు కదలి వచ్చె!


బంధ మసలె లేదు బంధు గణము రారు 

ఫోను యొకటె యాయె కన్ను చెవులు 

కాళ్ళు వాచి పోయె కదలక కూర్చుని 

గుండె యెపుడు యాగొ గుబులె యెపుడు!


కనగ కనగ కనగ కరొన యుధృతాయె

చదువ వినగ మనసు చెదిరి పోయె

ఆసు పత్రి కేగ ఆరు లక్ష లగునొ 

యింటి మందు తినగ యముడె వచ్చొ!


లావు యొక్క లవము లేదు లక్ష్మి విభుడ

సిరిని పంపి జనుల శంక దీర్చు 

గరుడు కాన తిచ్చి కరొన మింగమనవ

వైద్య మేదొ చూపు వరద రాజ!


ఆ.వె.

దేవుడేడ కనడు కోవిడె యంతట

కంట కనగ రాదు జంటె యుండు 

గుడులు లేవు చదువ బడులు లేవు 

భవిత యేమి యగునొ పాలు పోదు!


ఆ.వె


కరువు కమ్ము కొనియె బరువు యాయె బతుకు 

పక్క వాడు బలుక భయము యాయె

కూలి రాక పోయె ఆలి కుమిలి పోయె

తిండి లేక బిడ్డ తల్లడిల్లె !


ఆ.వె


పాప మెవరి దయ్య శాపము జగతికి 

ముక్తి మార్గ మేదొ చెప్ప వయ్య

అవని కావు మయ్య అవతారము దాల్చి 

కరొన మింగవయ్య గరళ కంఠ!


ఈద్ రోజునె ఏల బాధ 

అమర్ నాథ్ ఆగ లేద

హిందువంటె మనిషి కాద 

ఓ!కూనలమ్మ!


నెహ్రు చేసిన పెద్ద తప్పు

కాశ్మీరులొ రగిల్చె నిప్పు

మోడీ, షా చేశారొయ్ ఒప్పు

ఓ! కూనలమ్మ!


చదువు మాని జే ఎన్ యు విద్యార్ధి

అరిచెనండి 'ఆజాదీ' "ఆజాదీ"

తెలియడండి వాడు కర్మకు ఖైదీ 

ఓ!కూనలమ్మ! 


మూడు వందల డెబ్భై

దేశానికి పెను ముప్పై

ముగ్గురికి డబ్బే, డబ్బై 

ఓ! కూనలమ్మ!


ఫాస్టు బౌలర్ ఇమ్రాన్ ఖాన్

స్పిన్ను అయ్యి పరేషాన్ 

ఒంటరాయె నేడు పాకిస్తాన్

ఓ!కూనలమ్మ!


నిన్న జగమంతా

రామమయం 

కరోనా మరచారా 

ఇంకా నయం !


నిన్న అన్నా 

ఏడున్నావు రామన్నా

కరోనా అంది 

ఈడ్నే ఉన్నా చూడన్నా !


నిన్న ముక్కు మూసుకు 

రామజపం చేశామన్నా

చాలదు నోరు కూడ 

మూస్కో మంది కరోనా!


రాముణ్ణి తాకాలని 

ఎంతో తపన పడ్డా 

రాముడన్నడు సామాజిక 

దూరం దగ్గర రాకు బిడ్డా!


నిన్ను నీవు కాపాడుకొ

అదె నేను మెచ్చేటిది అనె రాముడు

మాయ మంత్ర మేమిలేదు

నీ యత్నం తోనె పోవునయ్య కోవిడు!


వలువ లొదిలి పెట్టె వేమన కవి నాడు

విలువ లొదిలె నేడు వామ పక్షి

చెడియు బతికి వేమ శతకము వ్రాయగ

చెడును చూపి బతికె శకున పక్షి!


వంగపండు వెడలె నింగి దాటి యెటకొ 

పాట రాసి యతడె పాడి యలరె 

గజ్జె కట్టి యతడు గలగల నర్తించె 

స్వర్గ మందు పండు సేమ ముండు!


ఉత్తరాంధ్ర వంగపండు రాలి పోయింది!


తోపు లాటలేగ తిరుమల గుడిలోన 

బ్రేకు దర్శన మెది పేద కచట

కూటి కొరకు లైను కాటికెడల లైను

ధనము యున్న వేరె దారి యుండు!


కోవిడన్న నేమి గోవింద యన నేమి

ఇచ్చు కాదె ముక్తి యెంచి చూడ 

డబ్బు యున్న చాలు దర్శనము సులువు 

దైవమయిన యాత డాక్టరయిన!


కరోనా కాలం.


ప్రపంచాన్ని ఒక 

గ్రామంగా చేసిన మనం (Global Village)

ప్రతి గ్రామాన్ని ఓ ప్రపంచంగా 

మారుస్తున్నాం!


అంటరానితనాన్ని 

రూపు మాపిన మనం 

మనిషిని ఆరడుగుల దూరం

నిలబెడుతున్నాం! 


ధనవంతులు ధనహీనులు 

ఒకటై కరోనా ధాటికి 

తలవంచుక 

నడుస్తున్నాం!


కుటుంబ వ్యవస్థ కాదా

మన ఊపిరి 

సామాజిక దూరం బాబూ

కుటుంబం సిగ గోసిరి! 


మనిషికి మనిషికి 

మధ్య ఈ అంతరానికి 

అంతమెపుడు 

చెప్పడం ఎవరి తరం!


దుమికి చూడ నేల దైవమెటకు బోవు 

కుమ్ములాటలేల కోవెలందు 

మంచి చెడులు మరచి ముందు వారిని తొక్కి

రాతి బొమ్మ చూడ యాత్ర మేల!


మన్ను నుంచి మింటి వరకు వ్యాపించిన 

మనుగ డతడె యెరయ మరణ మతడె 

మనలొ యున్న యాత్మ మన బాహ్యము యతడె

ఆత్మ దర్శనాని కాత్రమేల!


కంచిలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మరణించిన దురదృష్టకర సంఘటనకు నా వేదన!


ఆటవెలది 


శ్రీకి దగ్గ రుండు శ్రీ రామ చంద్రుడు 

పరశు రాము బలము పరశువె కద

బలము యింపు యెంతొ బలరామునకునగు 

రామ నామ మొకటె రంజనమ్ము!


(ఇది కేవలం వ్యాఖ్య మాత్రమే. యెందు చేతనంటే బలరాముడు తరువాయి         యుగము వాడు)


కత్తి వాడ వచ్చు కూరగయలు తరగ

కోయ వచ్చు గొంతు కత్తి తోడ

కొట్ట వచ్చె మేకు కత్తితొ గోడకు

కత్తి కేల చెప్పు సుత్తి గోల!


అగ్ర రాజ్యము వైపు అడుగులు మనవైతె

ఉగ్ర రాజ్య మవగ ఉరుకు పాకు (పాకిస్తన్) 

భ్రష్టు చేసి పోయె పరదేశి యసురులు 

సంస్కృ తొకటె మనకు సాయ పడెను!


చదువు కొందమన్న సరిగ కానగ రాదు 

వ్రాదమన్న చేయి వాచు చుండె 

వయసు గార్ధభమయె మనసు పరుగు తీసె (హయము వోలె)

వయసు మనసు పోరు వృధ్ధు కకట!


తేటగీతి 


సూర్య వందన మొక్కటి చేదమన్న 

రాహు వడ్డు వచ్చెనుగ రేయి వచ్చె

మోడి తోడుగ కూడినే యోగ జేయ

రాహు లొచ్చెను చూడరె రచ్చ సేయ!


Yoga Day


చంద్రునికో నూలు పోగు 

సూర్యునికో వందనము 

యోగులకో ఆసనము 

భోగములకు సన్యాసము 

మోదీకో ధన్యవాదము

అందరికీ పుణ్య నాదము!

#InternationalYogaDay



జల్లి కట్టు ఉల్లి పొట్టు పంచెల కట్టు

యేటి గట్టు మీద యెంకి గుట్టు

కాదు ఏది కవుల భాషకు తీసికట్టు

సకల జనుల మాటె చద్ది మూట.


సినేమాలు లేక నటులు, చదువరులు లేక మేము.

Saturday, March 6, 2021

Book I : Bala Kanda - The Youthful Majesties

Chapter [Sarga] 7

A6
l
al lz4m

Introduction

The truthful and upright characters of the ministers of Dasharatha are portrayed, who make the rulership meaningful with THEIR virtuous, skilful and efficient administration. Along with the political ministers, the religious ministry is also portirayed.

    వాల్మీకి రామాయణము
           బాలకాండము 
           యువతేజము
          
             ఏడవ సర్గము 
ఈ సర్గమునందు దశరధుని మంత్రుల యొక్క సత్యసంధత మరియు సత్య నిష్ఠ గురించి చెప్పబడింది. ఈ సద్గుణములతో వారు దశరధుని రాజ్య పాలన అర్ధవంతముగ నెరపి తమ సద్గుణములతో, నేర్పరితనముతో మరియు సామర్థ్యముతో దశరధుని పాలనను అర్ధవంతముగా నెరపుచుండిరి. రాజకీయంగానే కాక మత సంబంధమైన విషయములలో కూడా మంత్రులు ప్రతిభ చూపుచుండిరి. 

***************************
ప్రధమ కాండము-ఏడవ సర్గము

                    శ్లోకము 1.

तस्य अमात्या गुणैर् आसन् इक्ष्ह्वकोस्तु महात्मनः |
मंत्रज्ञाः च इङ्गितज्ञाः च नित्यम् प्रिय हिते रताः ||

సత్య అమాత్య గుణైర్ ఆసన్ ఇక్ష్వాకోస్తు మహాత్మనః!
మంత్రఙ్ఞాః చ ఇంగితఙ్ఞః చ నిత్యమ్ ప్రియ హితే రతాః! 1-7-1
 १-७-१
1. mahaaatmanaH tasya ikshwakuH tu = for great soul, to him, one born in Ikshwaku-s, Dasharatha; guNaiH = those with epitomised attribute; mantraj~naH cha = tactful, also; iN^gitaj~naH cha = adroit ones, also; nityam priya hite rataH = always, in welfare alone, obliged to; amaatyaa = ministers; aasan = are there.

The misters for the great soul from Ikshvaku kings of Emperor Dasharatha, are epitomised ones of their tactfulness, adroitness and are always obliged to undertake welfare activities of their king and the kingdom. [1-7-1]


ఆటవెలది 
యుక్తి నీతి పరులు పంక్తి రధుని మంత్రి 
వర్యు లెల్లరు జన హితమె మతము 
ప్రభుని ప్రభుతయందుపాలన పటిమతొ
సూర్య వంశ కీర్త సకల దిశల!

            ...శ్లోకము 2
अष्टौ बभूवुः वीरस्य तस्य अमात्या यशस्विनः |
शुचयः च अनुरक्ताः च राजकृत्येषु नित्यशः || १-७-२

అష్టే బభూవుః వీరస్య తస్య అమాత్య యశస్విన్!
శుచయః చ అనురక్తాః చ రాజకృత్యేషు నిత్య యశః! 1-7-2
2. viirasya = of the valiant one; yashasvinaH = glorious king; tasya = his; shuchayaH = clean at heart; nityasaH = all time; raaja kR^ityeSu = in king' s, works; anuraktaaH cha = involved in, also; amaatyaaH = ministers; aSTaH bhabhuvuH = eight, are there.
Eight ministers are there for that valiant and glorious King Dasharatha, who are clean at heart and are involved in the works of the king and kingdom at all time. [1-7-2]

ఆటవెలది 
ధీర పంక్తి రధుడు దివ్యమయిన రాజు 
అష్ట మంత్రు లమిత నీతి పరులు 
మనసు నిర్మలముగ మనసార ప్రభువుకు 
ప్రభుని కార్య ములలొ బరగు వారు!

1-7-2 

धृष्टिर् जयन्तो विजयो सुराष्ट्रो राष्ट्र वर्धनः |
अकोपो धर्मपालः च सुमंत्रः च अष्टमो अर्थवित् || १-७-३

శ్లోకము 3 , 4
దృష్టి, జయంతో, విజయో, సురాష్ట్రో రాష్ట్ర వర్ధనః
అకోపో, ధర్మపాలః, చ సుమంత్రః, చ అష్టమో అర్థావితు!! 1-7-3

ఋత్విజౌ ద్వౌ అభిమతౌ తస్యాః తామ్ ఋషి సత్తమౌ!
వశిష్ఠో వామదేవః చ మంత్రిణా చ తథా అపరే! 1-7-4  
వచనం
దృష్టి, జయంత, విజయ, సురాష్ట్ర, రాష్ట్ర వర్ధన,, అకోప, ధర్మపాల, సుమంత్ర, అనెడి అష్ఠమ మంత్రులు, వశిష్ఠుడు, వామదేవుడు అనెడి
ఇరువురు వేద పండితులైన మత గురువులు, వీరు కాక మత సంబంధమైన సలహాలు చెప్పుటకు అనేకమంది ఇతర మతగురువులు దశరధుని ఆస్థానమును అలంకరించి యుండిరి. 
ఆటవెలది 
దృష్టి, రాష్ట్ర వర్ధ ధర్మపాల విజయ
 జయతకోప యాది జటిలు లలర
వామదేవుని జత వశిష్ఠుడుయు కూడి
ఇతర మతగురువులు యుండి రచట! 

3. dhR^iSTiH = Dhristi; jayantaH = Jayantha; vijayaH = Vijaya; suraaSTraH = Suraashtra; raaSTra vardhanaH = Raashtravardhana; akopaH = Akopa; dharmapaalaHcha = Dharmapaala, also; SumantraH = Sumantra; aSTamaH = eighth; abhavat = will be.
Dhristi, Jayantha, Vijaya, Suraashtra, Raashtravardhana, Akopa, Dharmapaala, are seven, and Sumantra is the eighth one. [1-7-3]

ऋत्विजौ द्वौ अभिमतौ तस्याः ताम् ऋषि सत्तमौ |
वशिष्ठो वामदेवः च मंत्रिणः च तथा अपरे || १-७-४
4. tasyaaH = to him, Dasharatha; vashiSTaH = Vashishta; vaamadevaH cha = Vamadeva, also; dvau = two; taam R^iSisattamau = those, saints, of eminence; abhimatau = acquiescent; R^itwijau = Vedic ritual-authorities; tathaa apare = like that, furthermore; mantriNaH cha = ministers, also [are there.]
Two venerable saints of eminence are religious ministers for they are authorities in Vedic rituals, namely Vashishta and Vamadeva, who are the acquiescent with religious matters, and apart from these two some more religious ministers are also there to King Dasharatha. [1-7-4]

सुयज्ञो अपि अथ जाबालिः काशय्पो अपि अथ गौतमः |
मार्कण्डेयः तु दीर्घायुः तथा कात्यायनो द्विजः || १-७-५
एतैः ब्रह्मर्षिभिर् नित्यम् ऋत्विजः तस्य पौर्वकाः |

సుయఙ్ఞా అపి అథ జాబాలిః కశ్యపో అపి అథ గౌతమః !
మార్కండేయః తు దీర్ఘాయుః తథా కాత్యాయనో ద్విజః !!
1-7-5
ఏతేః బ్రహ్మర్షిభిః నిత్యమ్ ఋత్విజః తస్య పౌర్వకః!!
1-7-6 a


5, 6a. suyaj~no api = Suyajna, also; atha jaabaaliH = then, Jaabaali; kaashaypaH api = Kashyapa, also; atha gautamaH = then, Gautama; maarkaNDeyaH tu = Maarkandeya, also; diirghaayuH tathaa = Deerghaayu, like that; kaatyaayanaH = Kaatyayana; dvijaH= Brahman; etaiH = along with them; brahmarSibhiH = Brahma-sages; nityam = always; R^itvijaH = ritual scholars; tasya paurvakaaH = his ancestral pundits.
Suyajna, Jabaali, Kaashyapa, Gautama, Maarkandeya, Deerghaayu, and then Kaatyayana are the scholarly Brahmans acting as religious ministers, and along with them there are also Brahma-sages who are always the ancestral ritual scholars for Dasharatha's family. [1-7-5, 6a]

ఆటవెలది 
బ్రహ్మ ఋషులు పెక్కు పంక్తి రధుని కొలువు
కశ్యపుండు మరియు కాత్య యనుడు 
సుయజనుడునుకూడిసుజనులు
ఎనమండ్రు 
సూర్య వంశమునకు సొబగు కూర్చ!

1-7-5, 1-7-6 a

विद्या विनीता ह्रीमंतः कुशला नियतेन्द्रियाः || १-७-६
श्रीमन्तः च महात्मनः शास्त्रज्ञा धृढ विक्रमाः |
कीर्तिमन्तः प्रणिहिता यथा वचन कारिणः || १-७-७
तेजः क्षमा यशः प्राप्ताः स्मित पूर्व अभिभाषिणः |

విద్యా వినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః ! 1-7-6b
శ్రీమంత చ మహాత్మానః శాస్త్రఙ్ఞ దృఢ విక్రమః
కీర్తిమంతః ప్రణిహితా యయా వచన కారిణః!! 1-7-7
తేజా క్షమా యశః ప్రాప్తాః స్మిత పూర్వ అభి భాషణాః ! 1-7-8a 

6b, 8a vidyaa viniita = in scriptures, well-versed; hriimantaH = shun bad deeds; kushalaaH = skilful; niyataH indriyaH = with regulated, senses; sriimantaH cha = affluent ones; mahaaatmanaH = great, souls; shastra j~naa = sciences, knowers of; dhR^iDha vikramaH = firmly, courageous; kiitrimantaH = distinguished, ones; praNihitaaH = quiet souls; yathaa vachana kaarinaH = as per, their word, doers of [true to their word]; tejaH kshamaa yashaH = they have magnificence, patience, fame; praaptaaH = valiant ones; smitaH puurva abhibhaashana = smile, afore, while, they converse.
All the ministers are well versed in scriptures, they shun bad deeds, skilful ones in their duties with their senses regulated. Those great souls are affluent, knowers of all sciences, firmly courageous, and they are distinguished and quiet-souls, and those ministers are true to their word. They are magnificent, patient and famed ones and they smile afore they converse. [1-7-6b, 8a]

అందరు మంత్రులు వేద వేదాంగములను క్షుణ్ణంగా పఠించిన వారును, దుష్ట  కార్యములకు దూరంగా ఉండెడి వారును, తమ ఇంద్రియ నిగ్రహముతో కార్యనిర్వహణా నేర్పరులును అయి యుండిరి.  ఆ మహాత్ములు ధన , ధాన్యములు సమృద్ధిగా కలవారును, సకలశాస్త్ర పారంగతులును, అత్యంత ధైర్యశాలురును, ప్రతిష్టాత్మకమైన వారును, శాంతి కాముకులును, మాటకు కట్టుబడి యుండడి వారును అయి యుండిరి.  వారు అద్భుతమైన తేజోవంతులు, ఓర్పు కలవారు, యశోవంతులు, చెరగని చిరునవ్వుతో పలకరించు వారును అయియుండిరి. 
కందము

మంత్రులందరు వేదము 
వేదాంగములను పఠించి వినయము 
మీరన్
సాధారణముగ సజ్జన 
సాధుజనుల రీతి బరగెడు సామము
తోడన్!
 
क्रोधात् काम अर्थ हेतोर् वा न ब्रूयुर् अनृतम् वचः || १-७-८
तेषाम् अविदितम् किंचत् श्वेषु नास्ति परेषु वा |
क्रियमाणम् कृतम् वा अपि चारेण ఫअपि चिकीर्षितम् || १-७-९

క్రోధాతు కామ అర్ధ హేతోర్వా న బ్రూయుర్ అనుపమ వచః 
1-7-8b
తేషామ్ అవిదితమ్ కించత్ శ్లేషు నాస్తి పరేషు
వా !
క్రియమాణమ్ కృతమ్ వాపి చారేణ అపి చికీర్షితమ్ !! 1-7-9


8b, 9. krodhaat kaama artha hetoH vaa = in anger, in greed, for monetary, reason of, either; anR^itam = untruthful; vachaH = words; na bruuyuH = never, they speak; teshaam = to them; a viditam = unknown; kimchat = a little; sveSu = in their own [country]; naasti = not there; pareSu vaa = in other [countries,] either; kriyamaaNam = that is happening; kR^ritam = already happened; vaa api = either, that too; chaareNa = through agents; chikiirSitam = that is going to be undertaken [by others, is not there.
They never speak untruthful words in anger or in greed or for monetary reasons either. There is nothing unknown to them, even a little, in their own country or in the others either, or about everything that is happening or has happened, or that is going to happen, for they know them through agents. [1-7-8b, 9]

వారు క్రోధముతో కాని, దురాశతో కాని, ధనాశతో కాని ఎప్పుడూ మాటలాడెడి వారు కాదు.  తమ దేశమున కాని, పరదేశమున కాని సూక్ష్మ సమాచారము కూడా వారి దృష్టికి రాకుండా పోయెడిది కాదు. ఏ సమయమునైనా జరిగెడిది కాని, తత్పూర్వం జరిగినది కాని, భవిష్యత్తులో జరుగబోయేడిది కాని వారు గూఢచారుల ద్వారా తెలుసు కొనెడి వారు. 



कुशला व्य्वहारेषु सौहृदेषु परीक्षिताः |
प्राप्त कालम् यथा दण्डम् धारयेयुः सुतेषु अपि || १-७-१०
కుశలా వ్యవహారేషు సౌహార్దేషు పరీక్షితాః!
ప్రాప్త కాలమ్ యథా దణ్డమ్ ధార్యేయుః సుతేషు అపి ! 
1-7-10
10. vyavahareSu = in administration; kushalaaH = efficient; sauhR^ideSu = in their friendships; pariikshitaaH = well examined [by the king]; sutaH api = to their sons, even; praapta kaalam yathaa = comes, time, according to [if situation demands]; daNDam dhaarayeyu = punishment, they impose.
They are efficient in administration and their friendships are well examined by the king, and those ministers impose punishment even on their own sons, if situation demands it. [1-7-10]

పరిపాలనయందు కార్యదక్షులు. చక్రవర్తి ఎల్లవేళలా వారి స్నేహితులను నిశితంగా పరిశీలించెడి వారు. తత్కారణముగా, మంత్రులు అవసరమును బట్టి తమ పుత్రులను సైతము శిక్షించుటకు వెనుకాడెడి వారు కాదు. 

कोश संग्रहणे युक्ता बलस्य च परिग्रहे |
अहितम् च अपि पुरुषम् न हिंस्युर् अविदूषकम् || १-७-११
కోశ సంగ్రహణే యుక్తా బలస్య చ పరిగృహే!
అహితమ్ చ అపి పురుషమ్ న హింస్యుర్ అవిదుషకమ్! 
1-7-11
11. kosha samgrahaNe yukataa = treasury, in collections, dutiful; balasya cha parigrahe = of armies, also, militarising; a hitam cha api puruSam = unfriendly, also, even, a person; a vi duushakam = not, really, blameworthy; na himsyuH = do not, torture.
In collections to their treasury and to militarise their armies they are dutiful, even an unfriendly person will not be tortured, if he were not really blameworthy. [1-7-11]

కోశాగారము నింపుటయందు, సైనికులను నియమించి, శిక్షణ నిచ్చుట యందు వారు నిపుణత చూపెడి వారు. తప్పు చేయని వారిని వారెట్టి పరిస్థితి యందైననూ హింసించెడి వారు కాదు. 

वीराः च नियतोत्साहा राज शास्त्रम् अनुष्ठिताः |
शुचीनाम् रक्षितारः च नित्यम् विषय वासिनाम् || १-७-१२
  వీరాః చ నియతోత్సాహ రాజ శస్త్రమ్ అనుష్ఠితాః!
శుచీనామ రక్షితారః చ నిత్యమ్ విషయ వాహినామ్ ! 
1-7-12
12. viiraH = valiant; niyata utsaaha = engineered enthusiasm; raaja shaastram = political science; anuSTitaaH = administrators of; viSaya vaasinaam = in kingdom, dwelling ones [subjects of kingdom.]; suchiinaam = clean persons; nityam = at all times; rakshitaaraH = protectors.
They are valiant ones with engineered enthusiasm, administrators of political science, clean persons and protectors of subjects of their kingdom at all times. [1-7-12]

వారు సాంకేతిక నైపుణ్యం కలిగిన ధీరోదాత్తులు, రాజనీతి శాస్త్ర కోవిదులు, రాజనీతి ప్రకారమే పాలన చేసేది వారు, నిర్మల హృదయులు అయియుండి ప్రజలను ఎల్లవేళలా కాపాడెడి వారు.


ब्रह्म क्षत्रम् अहिंसन्तः ते कोशम् समपूरयन् |
सुतीक्ष्ण दण्डाः संप्रेक्ष्य पुरुषस्य बलाबलम् || १-७-१३
బ్రహ్మ క్షత్రమ్ అహింసనః తే కోశమ్ సమ పూరయన్ 
సుతీక్ష్ణ దండాః సంప్రేక్ష్య పురుషస్య బలా బలమ్!!  1-7-13
13. brahma kshatram = Brahmans, Kshatriya-s; te a himsantaH = they, do not, persecute; kosham samapuurayan = treasury, to fill up; puruSasya = person's; bala a balam = strength, weakness; samprekshya = after assessing; sutiikshNa danDaaH = high, degree, punishment givers.
They do not persecute Brahman-s and Kshatriya-s to fill-up the treasury, and high degree punishments will be given on assessing that person's, or the offender's strength and weakness. [1-7-13]

వారు బ్రాహ్మణులను , క్షత్రియులను 

शुचीनाम् एक बुद्धीनाम् सर्वेषाम् संप्रजानताम् |
न आसीत् पुरे वा राष्ट्रे वा मृषा वादी नरः क्वचित् || १-७-१४
శుచీనామ్ ఏక బుద్ధీనామ్ సర్వేషామ్ సంప్రజానతామ్!
న ఆశీత్ పురే వా రాష్ట్రేవా మృషావాదీ నరః క్వచిత్ !! 1-7-14
14. suchiinaam = decent ones; ekabudhinaam = one, minded, [in league with]; sarveSaam = all of them; samprajaanataam = administering; kwachit = anywhere; pure vaa raaSTre vaa = in capital, or, in kingdom, either; mR^iSa vaadii naraH = lies, speaking, person [liar]; na aasiit = is not, there.
All of those ministers are clean administrators of kingdom, and are in league with each other, as such there is none anywhere, either in capital or in country, a liar. [1-7-14]

कश्चिन् न दुष्टः तत्र आसीत् पर दार रतिर् नरः |
प्रशांतम् सर्वम् एव असीत् राष्ट्रम् पुरवरम् च तत् || १-७-१५
15. tatra = there; duSTaH = evil-minded; para daara ratoH naraH = in other's, wife, interested, man; kaschit na aasiit = anyone, none, is there; sarvam raaSTram = all, kingdom; tat pura varam cha = that, capital, also; prashaantam eva aasiit = undisturbed, only, it is there.
None with an evil-mind or with an interest in other man's wife is there, and thus on whole in the kingdom and also like that in the capital, there is an undisturbed society. [1-7-15]

सु वासस सु वेषाः च ते च सर्वे शुचिव्रताः |
हितार्थः च नरेन्द्रस्य जाग्रतो नय चक्षुषा || १-७-१६
16. te cha sarve = they, also, all; su vaasasaH = well dressed; su veshaaH cha = well decorated, also; suchi vrataaH = decency, observing; narendrasya hitaarthaH cha = of king, in the interest of, also,; naya chakshuSaa = truthful-eyed; jaagrataH = are diligent.
Well-dressed and well-decorated and they the ministers of King Dasharatha, observe decency in the interest of the king and also of the kingdom, with diligence and with a truthful-eye. [1-7-16]

गुरोर् गुण गृहीताः च प्रख्याताः च पराक्रमे |
विदेशेषु अपि विज्ञाता सर्वतो बुद्धि निश्चयाः || १-७-१७
17. guroH = from their mentor, mother, father and teachers; guNa gR^ihiitaH = good qualities, acquired; paraakrame = expertise; prakyaataH = renowned; sarvataH = in all affairs; buddhi nischayaH = intellectual, determinations; videsheSu api = in foreign countries, also; vij~naataaH = famous.
They acquired good qualities from their mentors and they are renowned by their expertise, and even in foreign countries they are famous for their intellectual determinations in all affairs. [1-7-17]

अभितो गुणवन्तः च न च आसन् गुण वर्जिताः |
सन्धि विग्रह तत्वज्ञाः प्रकृत्या संपदान्विताः | १-७-१८
18. abhitaH = versatile; guNavantaH cha = virtuous ones, also; na cha aasan = not, also, there is; guNa varjitaaH = virtue, discarded ones; sandhi = truce; vigraha = war; tatvaj~naH = determiners; prakR^ityaa = by nature; sampada anvitaaH = opulence, possessing.
Versatile and virtuous are they the ministers and there is none who discarded his virtuosity, and they are the determiners of truce or war, and by their nature they possess opulence. [1-7-18]

मंत्र संवरणे शक्ताः शक्ताः सूक्ष्मासु बुद्धिषु |
नीति शास्त्र विशेषज्ञाः सततम् प्रिय वादिनः || १-७-१९
19. mantra samvaraNe shaktaaH = strategies, their confidentiality, capable of; shaktaaH = capable of; suukshmaasu = micro-affairs; buddhiSu = applying mind; niiti shaastra vishesha j~naH = moral, science, comprehensively, known; satatam priya vaadinaH = always, gentle, articulators.
They are capable to keep up the confidentialities of strategies, and also capable to apply their mind even in micro-affairs, and they know moral science comprehensively, and above all, they are gentle articulators. [1-7-19]

ईदृशैः तैः अमात्यैः च राजा दशरथोऽनघः |
उपपन्नो गुणोपेतैः अन्वशासद् वसुंधराम् || १-७-२०
20. anaghaH = exalted - [here, not sinless, but exalted king]; dasarathaH = Dasharatha; guNa upetaiH = good-natured; iidR^ishaiH = suchlike [that efficacious]; taiH amaatyaiH cha = with those, ministers, also; upapannaH = accompanied with; vasundharaam = the earth; anvashaasat = ruled.
Accompanied with such of those effectual and good-natured ministers the exalted king Dasharatha ruled the earth. [1-7-20]

अवेक्षमाणः चारेण प्रजा धर्मेण रक्षयन् |
प्रजानाम् पालनम् कुर्वन् अधर्मम् परिवर्जयन् || १-७-२१
विश्रुतः त्रिषु लोकेषु वदान्यः सत्य संगरः |
स तत्र पुरुषव्याघ्रः शशास पृथ्वीम् इमाम् || १-७-२२
20-21. puruSa vyaaghraH = manly, tiger [most generous among people]; chaareNa avekshyamaa = by spies, observing; prajaaH = people; rakshyan = to protect; dharma = virtuously; prajaanaam paalanam kurvan = to people, good rule, to give; a dharmaan pari varjayan = unrighteousness, entirely, giving up; vadaanyaH = generous; satya sanagaraH = truthful, avowedly; triSu lokeSu vishrutaH = in three, worlds, renowned; pR^ithviim imaam = the earth, this one; saH = he, Dasharatha; tatra = from there; shashaasa = ruled.
He that most generous one among men, Dasharatha, while observing through spies, and to protect people righteously, and to give a good governance to them, he forsook unrighteousness and became a generous king avowed to truthfulness alone, and thus he that Dasharatha ruled the earth, which rulership is renowned in all the three worlds. [1-7-21,22]

न अध्यगच्छत् विशिष्टम् वा तुल्यम् वा शत्रुम् आत्मनः |
मित्रवान् नत सामन्तः प्रताप हत कण्टकः |
स शशास जगत् राजा दिवि देव पतिर् यथा || १-७-२३
23. mitravaan = one who has many friends; nata saamanta = subdued, provincial kings; prataapa hata kanTakaH = by valour, eliminated, thorniness; aatmanaH = to himsef; vishiSTam vaa = a superior one, either; tulyam vaa = equal one, or; shatrum = an enemy; na adhyagacChat = not encountered; divi devapatiH yathaa = in Heaven, Indra, like; saH shashaasa jagat = he, ruled, the world.
Emperor Dasharatha has not encountered either a superior or an equal in his kingship, and to him there are many friends, subdued are his provincial kings and eliminated is thorniness by his own valour. He thus ruled the world like Indra would in Heaven. [1-7-23]

तैः मंत्रिभिः मंत्र हितेः निविष्टैः
वृतोऽनुरक्तैः कुशलैः समर्थैः |
स पार्थिवो दीप्तिम् अवाप युक्तः
तेजोमयैः गोभिः इव उदितः अर्कः || १-७-२४
24. mantra hite niviSTaiH = in stratej~n, conducive, concerned; anuraktaiH = interested in; kushalaiH = well skilled; samarthaiH = efficient; taiH mantribhiH = with those, ministers; vR^itaH = surrounded by, in the company of; saH = he; paarthiva = king; uditaH arkaH [yathaa] = rising, Sun [as with]; yuktaH tejomayaiH gobhiH yuktaH = along with, resplendent, sunrays, having; diiptim avaapa = brilliance, obtained.
In the company of those ministers, who are conducive to the strategies, interested in the king and subjects as well, skilful and efficient ones, he that King Dasharatha obtained brilliance, like the rising Sun along with resplendent sunrays. [1-7-24]

Tuesday, March 2, 2021

ఉత్తరాఖండ్ వరదల నేపధ్యంలో ఆ హృదయవిదారక ఘటనకుస్పందించి నేను ఆశువుగా వ్రాసిన ఆటవెలది పద్యాలు, తాత్పర్యము, ఆంగ్లానువాదము. 

గంగ పొంగె నకట కొండల నడుమన 

కనులు మూడు తెరిచె గౌరి మగడు

గంగ గౌరి వాదు కలత పెట్టెనొ యేమొ

గంగ పార దోలె గౌరి మగడు ! 

తాత్పర్యము 

గంగ, గౌరి సవతుల నడుమ నిరంతరాయంగా సాగే వాదులాటతో శిరో భారము భరించ లేక పరమశివుడు గంగాదేవిని ఉధృతంగా క్రిందికి వదిలాడా ఏమి? ఆయన మూడో కన్ను తెరవగానే గంగాదేవి ఒక్క ఉదుటున కొండల మధ్యకు దుమికిందా ఏమి? 


English Translation

Did Lord Shiva send Mata Ganga to earth unable to bear the headache of the constant bickering of his two wives Ganga and Gauri. Did River Ganga leaped from the Heavens, afraid she being when the Lord opened his third eye? 

బిచ్చ మెత్తు నీకు పడతులిద్ద రెదుకు

పక్క నొకరు నీకు పైన యొకరు

సవతి పోరు నీకు శిరసు భార మయెగ

గంగ కంటి నీరు పొంగి పొరలె !

తాత్పర్యము 

బిచ్చమెత్తి బ్రతికే శివుడా! నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా? పక్కనే ఒకరైతే , నెత్తిన ఒకరు అవసరమా? వారిద్దరి సవతి పోరు ఎక్కువై గంగ కంటి వెంట వచ్చిన కన్నీటి ధారలలో మేము కొట్టుకు పోవలసిందేనా ముక్కంటీ !

English Translation

Oh! Lord Shiva you sustain yourself begging for alms. Is it needed for you to have one wife by your side and another on your head? Unable to bear her constant quarrels with Gauri , it seems Ganga is weeping copiously , in the process shedding floods of tears that are making our lives miserable. We, humans, are drowning in the floods of tears and reaching your Abode.


తండ్రి నలుగుచుండ తల్లులిరువురి మధ్య 

పుత్ర పుత్రికలకు బాధ కాదె

వీడు లేదు నీకు కాడెగ నివసము

సుతుల కావుమయ్య సతిని పిలిచి !

తాత్పర్యము 

అయినా! తండ్రీ శివుడా! ఇద్దరు తల్లుల నడుమన తండ్రి మనశ్శాంతి కోల్పోయి నలిగి పోతూ ఉంటే పుత్రులకు, పుత్రికలకు బాధ కాదా? నీకేమయ్యా? ఇల్లు లేదు, వాకిలి లేదు. స్మశానమే ని ఇల్లు కదా? మాకు ఉన్న ఇళ్ళు కొట్టుకు పోతే మేమేం చేయాలి.  నీ సతిని వెనుకకు పిలిచి మమ్మల్ని కాపాడరాదా? 


English Translation

Lord Shiva! You do not need a house. Graveyard is your place of living. But in the waters of Ganga our houses are getting washed away. Call back Ganga and save us from destruction.


ధనులు కొనగ పసిడి ధనతేరసు యనుచు

పేద వెదుకు కూడు పండుగనుచు

ధనము యెటుల వచ్చె జనులడుగరెపుడు 

పేదరికుల గోడు పట్ట దసలు!


తాత్పర్యము 

ధనతేరస్ అని ఒక కొత్త పండుగ కని పెట్టారు పసిడి వణిజులు. ఆ రోజున ధనం కూడబెట్టిన వారు బంగారం కొంటారు. ఇంకా ధనం వస్తుంది, ఇంకా ధనం వస్తుంది అని. (వీరు కర్మ సిద్ధాంతం నమ్మరేమో. ధర్మం ఎలాగైనా నమ్మరు) అదే ధనతేరస్ నాడు పేదవాడు పట్టెడన్నం కోసం వెదుకుతాడు కదా? ధనవంతుడు అంత ధనం ఎలా సంపాదించాడు? (ధర్మ మార్గానా, లేదా అధర్మాన్ని అంది పుచ్చుకున్నాడా?) ఎవరూ ఆడగరు. అలాగే పేదవాడి గోడు ఎవరికి పట్టదు. 


English Translation


Bullion merchants invented another festival, Dhanterus! That day, the filthy rich buy gold with the treasure they earned. Reason is that if they buy gold that day, they will become richer. (These guys seem not to trust Karma theory nor Dharma theory) . The same Dhanterus Day, a poverty stricken guy searches for a bowl-full of alms. No one asks how the rich earned the money; was it through fair or foul means. Similarly no one bothers about the wailing poor. 


మీటు మీటు (#metoo) యనుచు మగవారి మెడ చుట్టు

ఉరిని వేసి వారి యుసురు దీయ

సీత మగని కోరి సీత నిడుము బెట్టు

శూర్పణఖలె సగము చూడ తరచి!


తాత్పర్యము

ఆ మధ్య మీ టూ అని ఉద్యమం మొదలు పెట్టారు.  "నన్ను కూడా చెరబట్టారు" అని. ఈ ఉద్యమంలో పేరు కనబడితే ప్రముఖుల జాబితాలో చేరినట్టే. "సిగ్గు చిన్నప్పుడే పోయింది. పరువు పందిట్లో పోయింది " అని సామెత. ఇలాంటి సంఘటనలు దురదృష్టవశాత్తూ జరిగినా దానికి న్యాయపరంగా పరిష్కారం చూసుకుంటారు. పేరు బయటకి రానివ్వరు. కాని వీరు అలా కాదు. పబ్లిసిటీ ఇచ్చుకొని గొప్ప వారి మవుదామనే. మరి వీరిలో , సీత భర్తను కోరిన శూర్పణఖలు ఎంతమందో? కదా!!

English Translation

Recently a #metoo movement started in full swing. "I was too molested" is catch phrase. If a name appears in this movement they become overnight celebrities. "Lost shame when she was a kid and lost prestige while getting married" is a saying. Even if such incidents do happen by ill-luck, women try to hide their name and seek legal remedy. But with these ladies it is not so. In reality , how many of these belong to the Surpanakha clan , who wanted to enjoy the company of Sita, the pious wife of Lord Rama? Is it not? 


వాణి పూజ సేయ వొరవడి స్థిరమాయె

లక్ష్మి దేవి పూజ లెటుల సేతు

అత్త కోడ లొకచొ యుండుట సాధ్యమె

వాణి యలిగి యిల్లు వదిలి వెడలొ?

తాత్పర్యము 

మామూలుగా నాకు సరస్వతీ దేవి పూజచేసే ఆనవాయితీగా వస్తోంది.  అలాటిది ఇప్పుడు దీపావళికి కొత్తగా లక్ష్మీదేవి పూజ చేయడం ఎలా?  అత్తా , కోడళ్ళు ఒక చోట ఉండరంటారు కదా? మరి లక్ష్మీ దేవి పూజ చేస్తే వాణి వెళ్ళి పోతుందేమో! అమ్మో !

English Translation

I am a devotee of Goddess Saraswathi. Today, as per new trend, can I perform pooja of Goddess Lakshmi ? It is said that mother-in-law and daughter -in-law do not stay at one place. If I pray Goddess Lakshmi, it is possible Goddess Vani will leave me. Can I bare the loss?


మెతుకు దొరకదాయె మండెడి కడుపుకు

చిన్న తనము నందు శిక్ష యేకొ

బొక్కసమ్ము నిండ బోలెడు ధనముండె 

మెతుకు యెక్క దాయె మాయ యేమొ!

తాత్పర్యము 

ఇది ఒక వింత. చిన్నతనంలో ఆకలిగా ఉన్నప్పుడు, మండే కడుపుకు ఒక్క మెతుకు దొరికేది కాదు, అదేమి శిక్షో ? వయసు పెరిగాక ఇనప్పెట్టె నిండా డబ్బైతే ఉంది కాని తినాలనే ఆశలేదు కదా? 

English Translation 

This a paradox. In childhood , I used to be very hungry. But I was not getting a morsel of food. Now, when I earned huge and there is money everywhere, I do not have the urge or desire to eat.

దొంగ - దొర

తల్లి కడుపు నింప దొంగతనము జేసి

జనమ యంత గడిపె జయిలు నందె

బొక్కసమ్ము నింప బొక్కి ప్రజల సొమ్ము 

బెయిలు రాగ మరల బొక్క దొడగె !

తాత్పర్యము 

దొంగ ఎవరు ? దొర ఎవరు? చిన్నతనంలో అమ్మ కడుపు నింపడానికి దొంగతనం చేసి దొరికి జన్మంతా కారాగారంలో గడిపాడు ఒకడు. అదే కోట్ల కొద్ది ప్రజాధనం బొక్కి , బెయిల్ తీసుకుని దర్జాగా తిరుగుతూ, మళ్లీ అదే నేరం చేస్తున్నాడు ఇంకొకడు. వీరిలో దొంగెవరు, దొర ఎవరు? 

English Translation 

Another paradox. In childhood a guy committed theft to feed a hungry mother, got caught and spent life in jail. Another guy looked public money, got bail and again started looting. Who is a thief and who is a Lord? 



వలస పోయినోడు అలసి సొలసి పోయి

కొండ పగుల గొట్టె కండ కరుగ 

ధనపు కొండ కట్టె ధనికుడు అతి యాస 

ప్రాణ మొదిలె నకట పేద కూలి!

(ఉత్తరాఖండ్ వరదలు)

తాత్పర్యము 

పొట్ట కూటి కోసం వలస పోయిన కార్మిక కుటుంబాలు అలసి, సొలసి కండలు కరిగపోయేట్లు కొండలను పగుల కొట్టారు, ఎందుకు? ధనం కొండలుగా పేర్చాలనే ధనాశతో ధనికులు అక్రమంగా ఆనకట్టలు కడుతుంటే , వారిచ్చే నాలుగు రూకలతో కడుపు నింపుకోడానికే కదా? ధనికుల ఆశకు వరదలు వస్తే ప్రాణం వదిలేది వారే కదా? 

English Translation

While the haves are violating all rules and constructing barrages illegally , the migrant labor are straining their muscles and nerves and are breaking the unbreakable hills and bullocks. For what? Just to fill their empty stomachs with the peanuts offered by the rich. If ultimately nature revolts and floods inundate the area, who lose their lives? The migrant labor only!! 


పని వాళ్ళు- డబ్బులు అనే విషయంలో అభిప్రాయ భేదాలు మూడు.

Domestic workers- and the money we pay them is an issue that bothered me since childhood. There are three kinds of people if we observe the phenomenon.


1. డబ్బులు ఇస్తే వాళ్ళకి నెత్తిన కళ్ళొస్తాయి. 

70 శాతం ఇలానే ఆలోచిస్తారు.  

పని వారు పని చేస్తారు.  వారికి దారి లేదు కాబట్టి. 

ఇది అధముల ఆలోచన.


1. If we pay them enough they become arrogant. 70% of people think like this. Even if we pay them less they work as there is no other option for them.

This is the thinking of people with the lowest morality.

2. పని చేశాడు కాబట్టి, డబ్బులు ఆశిస్తాడు. 25 శాతం ఇలా ఆలోచిస్తూ అయిష్టంగానే డబ్బు ఇస్తారు.  వీరు మధ్యములే కాని అధములకు దగ్గరగా, ఉత్తములకు దూరంగా ఉంటారు. 

ఇది అధమ-మధ్యమ ఆలోచన.


2. The second type think he expects to be paid as he worked. So, though unwilling, they pay grudgingly. This type of people vacillate between morality and immorality. Action is moral but thought is amoral.

This is the thinking of people with low morale but middle of the road amorality.


3. భగవంతుడు ప్రతి మనిషిని ఒకే రకంగా సృష్టించ లేదు. వారు అంత కష్టపడితే తిండి లేదు. కొందరికి అపరిమితంగా ఇస్తాడు.. మనం తినే దాన్ని కొంత పంచుదాం. ఇష్టమైతే పని చేస్తారు. వీలు లేనప్పుడు చేయరు. కాని  వాళ్ళు కూడా మనలాగే ఆరోగ్య కరమైన భోజనం తినాలి అని అవసరమైన దాని కంటే ఎక్కువ వండి వేడిగానే వాళ్ళకు పెడతారు. చివరకు వీరికి ఏమీ మిగలదు, తృప్తి తప్ప. 

ఇది ఉత్తముల ఆలోచన. 

3. "God created the human race differently. Those who work hard find it difficult to fill their stomachs with nutritious food. But God gives few people with unlimited resources. Let us share our bounty with them. They work when they are able and sometimes they may take rest. But they should also eat healthy food like us. "  Thinking so, some people distribute food by preparing more than required by them Finally they may be left with nothing, but satisfaction of having helped others.


ఈ పాఠం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.  పచ్చడి పెట్టండమ్మా అని ఎవరైనా అడిగితే వారానికి సరిపడా ఇచ్చి గిన్నె ఉంచేసుకో అనేది. (మడి కదా). బియ్యం అడిగితే గిద్దెడు అడిగితే మానెడు ఇచ్చేది. 

I learned this from my mother. If anyone asked for pickle for food once, she used to give enough for a week and also the vessel in which it was given. If anyone asked a 100 grm rice she used to give a kilo.

ఎలాగైనా మా తల్లి బంగారు తల్లి కదండీ! ఆమె ఆశిస్సులతోనే నా పిల్లలు మంచి పౌరులయ్యారు. 

All said, my mother was a Goddess. With her blessings only our children are in high positions.

మా తల్లి ఇంకో పదేళ్లు బతక కూడదా? నేను కాశీకి టికెట్లు, ఐదు నక్షత్రాల హోటల్లో రూమ్ బుక్ చేశా. మా అల్లుడు స్వీడన్ తీసుకెళ్తానని చెప్పాడు. కర్మ ఫలం.

Why did God not give my mother another ten years of life? In fact, I booked tickets and room in a star hotel for Kasi trip. My son-in-law to show her Europe. But if we plan a thing our Karma plays its game differently.


A tribute to her. 


శార్దూలవిక్రీడితము 

తల్లీ నిన్ను దలంచి దానములన్  దండిం జేసితిన్ నీదు, నా 

ఫాలాక్షు దయయే భిక్షుకు డగుటం ; భక్తిం నినుం బూజ యె

ట్టులన్ జేయగనా తరంబు యగునా ఠావుల్ దరిన్

యీలాగున్ పరమై సుదూరముగ బోయెన్ తల్లి గాపాడవా !  

తాత్పర్యము

అమ్మా! నిను దలచుకొనుచు దండిగా దానములు చేసితిని! నీ దయ, ఆది భిక్షువుడయిన ఆ పరమ శివుని దయయే ఇది తల్లీ! మరి భక్తితో నిను పూజ జేయగా, నా శక్తి సుదూరంగా పోయెనేమో కదా! నీవే తిరిగి వచ్చి నన్ను గావవా!!

English

Oh! Mother! Following your footsteps I helped lots of people. Your kind heart and blessings of the Supreme Beggar resulted in my kind heart ! But when I think of praying you wholeheartedly I feel weak and that my strength has gone to yonder to unknown lands. Mother! Why dont you come back and save me?



అమ్మ శతకం 

మా తల్లిగారు నీలంరాజు సుబ్బలక్ష్మి గారు దైవ సాన్నిధ్యాన్ని చేరి  11 సంవత్సరాలయింది. ఆమె స్మృత్యర్ధం "శతక" మొకటి వ్రాయ సంకల్పించాను.ఈ అయిదు పద్యాలు ఉపోద్ఘాతము మాత్రమే. ఆమె జీవిత చరమాంకంలో  ఆరు నెలలు నేను, నా భార్య పడిన వేదన ఎన్నటికీ మరువ లేనిది.  " ఎక్కడ తిరిగినా నీ దగ్గరకే వచ్చి ప్రాణాలు వదులుతాను" అని ఆమె దశాబ్దాల క్రితం చెప్పిన మాట నిజం చేసి , చివరకు నా చేతుల్లోనే ప్రాణం వదిలింది. మా అమ్మతో నా అనుబంధం అలాంటిది. మా కత్తులకు రెండు వైపులా పదునే.

చేయి, కాలు, నోరు పూర్తిగా పడిపోయినాయి. ఒక డాక్టర్ మేము చేసిన సేవ చూసి ఒక రూపాయి ఫీజు తీసుకోకుండా మూడు నెలలు ఇంటికి వచ్చి ఆయన సాధ్యమైనంత చేశాడు. మాకు నమస్కారం చేసి వెళ్ళాడు. 

అదృష్టమో, దురదృష్టమో ఆ భగవంతుడికే తెలియాలి. "యద్భావం తద్భవతి" 

ఈ శతకానికి మకుటం " ధర్మ మేమొ దెలిపినట్టి తల్లి నమన !" 

My mother , Smt. Neelamraju Subbalakshmamma attained the Abode of God about a decade back. I decided to write a treatise on her life in the form of a Sataka, hundred Telugu poems. The following poems are only prologue. During her last days on bed the anxious days and nights me and my wife spent are unforgettable. Decades back she said with whichever son or daughter she spends her life she would come back to me to die in my hands. She did it. My attachment with my mother was such. Our knives were sharp both sides.

Whether her in death in my hands is good luck or ill-luck, I do not know.  Whatever we wish happens.




ఆటవెలది 

పక్షవాత మొచ్చి పడియుండ పడకపై

తల్లడిల్లి తమ్మ తపన బడితి

చేత పైస లేక చేతనము యుడుగ

కన్న కొడుకు నన్ను కాచె నమ్మ !

తాత్పర్యము

అమ్మా! నువ్వు పక్షవాతం వచ్చి కదలక, మెదలక మంచం మీద పడి ఉంటే ఎంతో తపన పడ్డాను, తల్లడిల్లి పోయాను. చేతిలో నయా పైసా లేక చేతులు, కాళ్ళు కట్టేసుకు కూర్చుంటే నీ మనవడు ఆదుకొని ధైర్యం చెప్పాడమ్మా.

English Translation

Mother! When you lay down on bed with your hands and feet losing strength me and my wife spent anxious days and nights for six months. With not a single rupee in hand I too was immobile. It was at this juncture my son, your grandson  gave me courage asking me to provide the best Medicare whatever the expenditure!


ఆటవెలది 

ముద్ద ముద్ద నాకు ముద్దుగ తినిపించి

ఘటము నేను సేయ కష్ట పడుచు

నేయి యెక్కు వేసి నయమున భయమున

కడుపు నింపి నట్టి కరము యెచట! 

తాత్పర్యము

చిన్నతనంలో నేను భోజనం దగ్గర రభస చేస్తుంటే ముద్దు చేసి ముద్ద, ముద్ద mm in తినిపించి, ఇంకా మారాము చేస్తే నెయ్యి ఎక్కువ కలిపి నా కడుపు నింపిన చెయ్యి పడిపోయింది కదమ్మా! అప్పుడూ నీకే కష్టం, ఇప్పడూ నీకే కష్టమా?

English Translation

As a child when I was making all kinds of tantrums not to eat food, you were taking all the trouble to feed me little by little. When my tantrums only grew you were adding more geeti appease my hunger. Where is that hand now that fed me. Are troubles yours all through your life, Mother!

ఆటవెలది 

ఏడుగురుని కనియు ఏనాడు యలవక

కాలు నిలువ కుండ  కరుణ తోడ

కల్పవృక్ష మోలె కొడుకుల కూతుళ్ళ 

గరిమ నిలిపి నట్టి కాళ్ళు యెచట  !

తాత్పర్యము

ఏడుగురు బిడ్డలను కని ఏనాడూ అలసట యనుకోకుండా , భూమి మీద కాలు ఒకచోట నిలుపక తిరుగుతూ, కల్పవృక్షం లాగా బిడ్డలను కాపాడుతూ మా గొప్పతనాన్ని ఎప్పటికీ పదుగురూ మెచ్చుకొనే రీతిగా పెంచిన ఆ కాళ్ళు ఎక్కడమ్మా? కదలవాయెనే? 

English Translation

Mother! You gave birth to seven children but never feeling tired and never resting your feet on ground , like the Divine tree in Heaven you protected us and brought us up in such a way that our greatness remains perennially. Where are those feet now? They lay down on bed without movement.

ఆటవెలది 

మంచి మాట తప్ప మత్సర మననేమొ

తెలియ కుండ పెంచ తపన పడియు

భర్త పోయి నంత పట్టెడన్నము లేక

సిగ్గు పడిన నోరు చితికి పోయె !

తాత్పర్యము

నోటినుండి మంచిమాటే తప్పితే , అసూయ ద్వేషాలకు తావివ్వక , మాకు ఆ చెడు ఆలోచనలు రానీయకుండా పెంచడానికి ఎంతో తపన పడితివి కదా? అలాంటిది, నాన్నగారు చనిపోయిన తరువాత పట్టెడన్నము లేక నోరు పెగలక, సిగ్గు పడితివి కదమ్మా!

English Translation

 We always heard only good words from you. You never permitted the two enemies jealousy and hatred to enter our minds. For that you strained your nerves. But after the demise of father, the same voice that taught us all the good became voiceless as you suffered abject poverty and felt shy to ask for food.

ఆటవెలది 

ఆరు నెలల పాటు యవ్విధంబు నలసి

కడకు యొక్క దినము కన్ను మూయ

చితికి నిప్పు బెట్టి బతికితి శిలవోలె 

పరుల దుఃఖము కూడ బాధ మోసి !

తాత్పర్యము

ఆరు నెలల పాటు ఆ విధంగా మంచాన పడి అలసి , చివర కొక రోజున నువ్వు కనులు మూయగా , నేనే చితికి నిప్పు పెట్టి, ఇతరుల దుఃఖాన్ని కూడా బాధగా మోసి శిలలాగా బ్రతికాను కదమ్మా. 

English Translation

 Struggling in bed for six months one day you closed your eyes forever. I only lit the funeral pyre and swallowing the grief of others too in my heart, I lived like a rock till now.

ఆటవెలది 

చెఱువు లన్ని పూడ్చి చేసి భూమి చదును
గజము వదల కుండ కట్ట యిండ్లు
నీరు దారి లేక నిలచి యిండ్లను ముంచ
తప్పు నీది కాదె తిట్టె దెవరి?

తాత్పర్యము 

చెఱువు లన్నీ పూడ్చివైచి , భూమిని చదును చేసి , ఒక గజము కూడ స్థలము వదలకుండా ఇళ్లు కట్టి , నీరు పారే దారిలేక నిలిచి పోయి యిండ్లను ముంచితే , తప్పు నీదే కదా ఇతరులను దూషించనేల? 

English Translation

You filled water tanks with mud and made plain land out of it to construct houses not leaving even a yard land. Now, water unable to find way to flow freely inundated your houses. Is it not your own fault? Why do you blame others?


 ఆటవెలది 

యింటి యింటి నడుమ యింత స్థలము లేదు
పంచ భూతములను పంచు కొనిరె
స్వార్థ పరుడ నీకు శాస్తి చేసెను కాదె
నీరు, గాలి, నేల , నింగి, నిప్పు!

తాత్పర్యము 

ఇంటికి, యింటికి మధ్య కించిత్ స్థలము లేదు కదా? పంచభూతములను పంచుకొనిరి కదా? ఓ స్వార్థజీవీ ! ఇపుడు ఆ పంచభూతములయిన నీరు (వరదలు) , గాలి (తుఫాను), నేల (భూకంపం) నింగి (కాలుష్యం) నిప్పు (అగ్ని ప్రమాదాలు) ఇపుడు నీకు శాస్తి చేస్తున్నాయి కదా!


English Translation

An inch space is not allowed between construction and construction. Hey ! Selfish human ! You swallowed the benefits of the five elements of nature. Now the five elements, water (floods), earth (quakes) , sky (pollution) , wind (cyclones) and fire (accidents) are taking revenge on human race!

ఆటవెలది 

కలుషితమయె జాతి కలలొ మిగిలె నీతి
దాహ మెక్కుడాయె ధనము మింగ
మందు దొరక దాయె మనిషి దురాశకు
పెదవి తెరచి యడుగు పౌరుడేడి?

తాత్పర్యము 

జాతి కలుషితం అయింది.  నీతి కలలోనే మిగిలింది.  ధనము మింగుదామనే దాహం (ధనదాహం) ఎక్కువయింది. మనిషి దురాశకు మందేదీ? అడిగే ధైర్యమున్న పౌరుడెక్కడ? 

English Translation

Nation got polluted. Morality remained a distant dream. The thirst for earning and hoarding multiplied. Where is a citizen daring enough to question the immorality? 

ఆటవెలది 

లంచగొండితనము లావు గాయె నిచటె
దండిగున్న వాడు హుండి నింపె
తిండి లేని వాడు హుండి దరికి రాడు
గుడిలొ మొదలు యాయె యడవి నీతి! 
(ఆటవిక నీతి)

తాత్పర్యము 

లంచగొండితనం అధికమయింది. దండిగా ఉన్నవాడు హుండి నింపుతున్నాడు. తిండి లేని వాడు హుండి దరిదాపుల్లోకి పోడు.ఈ ఆటవిక న్యాయం గుడిలోనే మొదలయిందా యేమి? 

English Translation

In the country bribery and corruption spread. The rich are filling the Temple Coffers with ill-gotten wealth. The have-nots never goes near a Temple Hundi (collection box). On the whole, it seems this jungle justice seems to have started in places of worship.




మాతృవందనం - లక్ష్మీ శతకం

3.

పదునాలు గేడులు పట్టణ వాసపు 
ఆశలాశయముల నచటె వదలి

వెడలితి వమ్మరొ వసతులు దొరకని
పల్లెకు మగని వైభవపు నీడ

కంటివి కదమ్మ కొడుకు లయిదుగుర 
కూతురు లిద్దరి కష్టముగను

పెంచితి గదయమ సంచిత కర్మలు
ఫలితము నోర్పును బలము నిడగ

పండుగ యను భావన తోడ పరిఢవిలుచు
పతియె దైవ మనుచు పూజ సేసి
రాము నిసతివలెనె సుబ్బ రాము సతిగ
ధర్మమేమొ దెలిపినట్టి తల్లి నమన!

తాత్పర్యము 

మా అమ్మకు పదునాలుగేండ్ల వయసులో డాక్టరు నీలంరాజు సుబ్బరామయ్య గారితో వివాహం జరిగింది.  ఆ రోజు వరకు ఆమె పట్నంలో పెరిగింది. పల్లె జీవితం తెలియదు. విద్యుశ్ఛక్తి లేని యిళ్ళు. పాయఖానాలు లేని ఇళ్ళు. మైలు దూరం నడవ వలసిన పరిస్థితి.  ఈ రోజు తలచుకుంటే మా అమ్మకి మేము ఏమీ చేయలేక పోయామా అని దిగులుగా ఉంటుంది. నా కొడుకు వాళ్ళమ్మని దేవత లాగా చూసుకుంటున్నాడు. 

పదు నాలుగేళ్ల పట్న వాసం ఆశలు, ఆశయాలు వదులు కొని , ఏ వసతులు లేని పల్లెటూరుకి కేవలం మగని ప్రేమ, ధీరత్వం, వైభవము చూసి వెళ్ళి ఉన్నావా తల్లీ! అయిదుగురు మగ పిల్లలను, ఇంటికి లక్ష్మి కళ కావాలనే నాన్న గారి ఆశకు తల వంచి ఇద్దరు ఆడ పిల్లలను అతి కష్టంగా కని నీ పూర్వ జనమ సుకృతంతో ఓర్పు, బలము కూడగట్టుకొని పిల్లలను పెంచడమే పండుగ యని భావించి, భర్తనే దైవంగా కొలుస్తూ , సుబ్బరామయ్య గారి భార్యవే కాదు, సాక్షాత్తు శ్రీ రాముని భార్యను తలపిస్తూ మాకు  ధర్మ భిక్ష పెట్టినట్టి తల్లీ నీకు వందనం !

English

My mother married my father Doctor Neelamraju Subbaramaiah at the age of fourteen. Till then she enjoyed life of a town with all facilities. She never even visited a village till then. The village had electricity in few rich houses. Toilets were scarce. For toilet she had to go a mile before dawn, first time in her life. If I look back now, I feel that we, as her children, did great injustice to her. Today my son looks after his mother like a Goddess? Did we do it so? 

Meaning: Leaving behind the hopes and aspirations of fourteen years of town life, just to enjoy life with a loving, daring and respected husband , did you choose the tough life of a village , oh! Mother? Giving birth to five boys and two daughters (daughters on the wish of our father that daughter are Laksmi's incarnations) , you brought us up with the inner strength accumulated during your past births. You brought us up like it was a festival in the house and treating our father as your God. Though you were in reality the wife of Subbaramaiah , you were equal to the wife of Lord Ramaiah. Oh! Mother! I bow to your wisdom of teaching us morality in life


మాతృ వందనం - లక్ష్మీ శతకం 

4.

పొదు పొద్దుననె లేచి బొగ్గుల కుంపటి
వూది వూది కనులు వాచి పోగ
కట్టెల పొయిమీద కాగు నిండుగనీరు
సలసల కాగించి సిద్ధముంచ

కట్టెలు బొగ్గులు కాలక మొరయించ 
పొగ జూరిన కనుల పార నీరు
ఒక్క యొక్క నలుసు పక్క మీద కదల
పలుదోమి గ్లాసెడు పాలు బట్ట 

క్షణ క్షణము యొడలును క్షరము సేయ
చదువు నేర్వని యమతానె చదువు నేర్ప
 బడుల కెడలగ బిడ్డల బరుగు బెట్టి 
ధర్మ మేమొ దెలిపి నట్టి తల్లి నమన!  

అమ్మ అయిదు గంటలకే లేచి బొగ్గుల పొయ్యి వెలిగించి పొగతో కనులు వాచేట్లు ఊదుతూ ఉండేది. ఆరు గంటలకు శ్రీ రాములు అని అటెండరు 'బాబూ! లేవండి! అమ్మా! లే తల్లీ!" అని నిద్ర లేపేవాడు. అప్పటికే కట్టెల పొయ్యిమీద కాగులో నీళ్ళు కాచి ఉంచేది. అందరికీ పళ్ళు తోమి, పాలు ఇచ్చి తయారు చేసి చద్దెన్నం ముద్దలు పెట్టి ఒక్కొక్కడిని తయారు చేసి బడులకు పరుగెత్తించేది. ఈ బొగ్గులు, కట్టెలు కాలక వచ్చే పొగతో కళ్ళు ఎర్రగా ఉండిన కాళిక లాగా ఉండేది. (కోపమొస్తే కాళిక లాగానే ఉండేది లెండి). అక్షరం ముక్క రాని అమ్మ బిడ్డల చదువుల మీద పెట్టిన శ్రద్ధ అద్వితీయం! లేకపోతే ఈ
పద్యాలు వ్రాయడం సాధ్యమేనా? 
అమ్మా ! నీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. 

English Translation

Mother used to wake up at 5.00 AM and light the coal fire to heat milk first. At six one attender used to come and wake us up all. Mother used to complete our daily morning chores, give us milk, dress and comb us and rush us to our schools. What with the coal and wood not burning properly the strain of making them burn used to make her eyes red and filled with tears. She used to look like Kalika Devi then. (When angry also she was Apara Kalika, that was different) . The most exhilarating fact is the woman, who never studied beyond third class used to drain her whole energy to see that her children excel in studies, with discipline. Or else would it have been possible for me to write this poem? Oh! Mother! I bow to to you in reverence!

In 2005 when she came back to our house after 9 years.

In 2006, after she stayed with us for a year and more. What a recovery!!!

కలము బలము పోయె కుల బలము పెరిగె
కలిని మింగె చూడ కులపు యుగము
సోలి పోయె కలియు సంకుల పోరులొ
క్షరము యాయె కద యక్షరము నేడు !

మాతృ వందనం- లక్ష్మీ శతకము

5.

సీసము

చేతికెముకలేదు చెయిజాచి యెఱుగదు
దానమడిగెవరు తిరిగి పోరు
నాకుదెలిసినమాయమ్మ నేనెఱిగిన
నాతల్లి దానగుణమున మిన్న
శ్రీ కృష్ణుని నలుపు స్ఫోటక మచ్చలు
మనసు తెలుపు నాన్న మంచివారు
యనుచు మాయమ్మ యొప్పుకొనెనొ యేమొ
పది నాలుగు యేండ్లు పెద్ద మగని

తేటగీతి 

బాధ పడిన యటుల గాని పడితి కష్ట 
మనుచు గాని యమ్మ మనసున గాని మాట
లందు గాని తల్లి లవము చింత లేక
ధర్మమేమొ దెలిపినట్టి తల్లి నమన!

తాత్పర్యము 
మా నాన్నగారు నల్లటి నలుపు.  చిన్నప్పుడు మశూచి సోకి ఆ మచ్చలు జీవిత మంతా ఆయన ముఖాన ఉండేది. మా అమ్మ తెల్లటి తెలుపు. అందగత్తె అనలేము కాని చక్కని సౌందర్యవతి. సంసారం , పిల్లలు, భర్తే ఆమె ప్రపంచం. దానంలో బలి, శిబి లను మించింది. ఆమెను అడిగి తిరిగి ఖాళీ చేయులతో వెళ్ళిన వారు. ఆమె కొంగు పట్టుకుని (ఆడంగాడు అని ఎగతాళి చేసే వాళ్ళు మా అన్న దమ్ములు) తిరిగే వాడినేమో నాకూ ఆ అలవాటే వచ్చింది. (రంతి దేవుడు అని మా మేనకోడలు పేరు పెట్టింది). మా నాన్నగారికి, అమ్మకి వయసులో 14 ఏళ్ళు తేడా! కేవలం ఆయనకి ఉన్న పేరు, ప్రతిష్ఠలు , మంచితనము చూసి ఒప్పుకుందేమో! కాని నాకు తెలిసి ఆమె ఎప్పుడూ ఆయన్ని చేసుకున్నందుకు కించిత్ చింతించిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడూ ఆమెకు దేవుడే!

English Translation

My father was pitch black . And his face had spots of smallpox, throughout his life. My mother was very white-skinned and though not very beautiful she was looking pretty.  May be she chose him as he was very famous then and known in his circles as a perfect gentleman. Family, children and husband only were her world. In charity she excelled even those like Bali and Sibi. No one returned empty-handed after seeking her help. As I was aljways revolving around her (though being mocked as Brihannala by my siblings), seems I got the same charitable attitude. I never across her regretting her decision of marrying him nor did I see opposing his word. He was demi-God in her view till the end.