You have enemies? Good. That means you've stood up for something, sometime in your life.
The Churning of the life of
ocean 7th Part
"జీవితమనేది పరిష్కరించ వలసిన సమస్య కాదు. అనుభవించాల్సిన నిజం." ఈ నిజాన్ని నేను పూర్తిగా అనుభవించాను. అనుభవాలనుంచి గుణ పాఠాలు నేర్చుకున్నాను. నేర్పాను. అయ్యీ, కాని వాళ్ళని వదిలేశాను. ఏమీ కాని వాళ్ళకి సహాయం చేస్తున్నాను.
“Life is not a problem to be
solved but a truth that we should experience” This truth, I experienced
totally. From experiences, I learned a lot of lessons. I taught the lessons to
others. I left all those that peripherally belonged to me and really did not. I
am helping those who are outsiders totally, to pursue their lives within my
means.
ఆ తరువాత ఒక్క సారే మా వూరు వెళ్ళాను. ఒక శని వారం రోజు బయలుదేరి వెళ్ళి మళ్ళీ సోమ వారం తిరిగి వచ్చాను. మా నాన్న గారిని ఉంచిన ప్రైవేటు ఆస్పత్రిలో వాళ్ళు "లాభం లేదు ఇంటికి తీసుకు వెళ్ళ మన్నారట". ఇంటికి తేవడానికి మా ఇంటి యజమాని ఒప్పుకోలేదు. రోగిని ఇంట్లో పెట్టుకుంటే అరిష్టమన్నాడట. ఎదిరించే ధైర్యం లేదు. డబ్బు ఖర్చు చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యలేదు. చెయ్యలేని మా తమ్ముడు నిస్సహాయంగా . ఉన్నాడు ఇవన్నీ కనీసం నాకు వ్రాయ లేదు. మా ఇంటి యజమాని ప్రభుత్వ ఆస్పత్రికి ఆహారం పమిణీ చేసే కాంట్రాక్టరు. ఆయనే చెప్పి ఒక బెడ్డు ఇప్పించాడు. నర్సింగు లేదు. అంతా మా తమ్ముడే చేశాడుట. నేను వెళ్ళేటప్పటికి కోమాలో ఉన్నారు. 20 ఏళ్ళ వయసు. ఏడిచాను, గుండెలవిసేలా. జనవరి 24 న ఆయన ప్రాణం పోయింది. ఈ వార్తా మోసుకొచ్చింది మా మేనమామ గారే. "పద పోదాం" అని సెలవు ఒక్క రోజు తీసుకున్నాడు మా ఆఫీసరు దగ్గర. రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే వెళ్ళాము.
Later, I visited my home town
only once. I started one Saturday and returned on Sunday night, as there was
neither leave nor funds enough to travel frequently.
The Private Hospital where my
father was convalescing told our people that his days were numbered and any
more treatment there was only a financial burden. (With my mental set up, I
would have borrowed more money and made him spend his last days in comfort of a
private hospital him and would have seen he died comfortably. That was how I
loved him and that was my confidence level). Our house owner flatly rejected to
bring him into the premises, as he said it would be bad omen, it seems. None
dared oppose him. Those who could spend money conveniently avoided
responsibility. My younger brother was left with no money, neither was he
adept, nor willing to raise borrowings like me. Nobody informed me these
developments. (What I would have done was a facet of my life). Our house owner,
who was official contractor, to supply food in the Government Hospital arranged
a bed, with no nursing or no doctor visits. He was in coma, when I went there
with flies having a field day. My younger brother looked after all his needs
including cleaning the bowels. I was 20 then. I wept my heart out. I returned
the same day. On January, 24th, exactly 45 days after I joined a
job, he left the world leaving behind two unsettled sons and two school going
daughters. My uncle, Sri Penumaka Ramachandra Rao, brought this sad news also,
took one day LOP leave from the officer and took to me to home town, purchasing
my ticket too. He was too loving and too sacrificing. He is still, at age 86.
May God give him a long life.
ఎంత దుస్థితి? మా నాన్నగారి పార్ధివ శరీరాన్నిరోడ్డు మీద మురుగు గుంట కింద పడుకో బెట్టారు. ప్రధాన ద్వారం గుండా లోపలికి తేవెడానికి వాస్తు అడ్డమొచ్చిందని మా యజమాని పేచీ పెట్టాడు. ఎంత క్రూరత్వం? నీచమైన ఆచారాలు? శవ దహన మయ్యింది. చలి రోజులు. మేము తండ్రి పోయి ఏడుస్తుంటే మా వదిన వాళ్ళ ఆయన చన్నీళ్ళ స్నానం చెయ్యాల్సొచ్చిందని ఏడవడం మొదలెట్టింది. ఏమి సంస్కారమండీ? ఇవన్నీ నా మనసును చాలా గాయ పరిచాయి. అసలే వ్యవస్థ మీద పొరాడాలనే కక్ష. తోడుగా ఇవన్నీ. ఇంకా నన్ను మూర్ఖుడిని చేశాయి. ఎదిరించడం ఎక్కువయ్యింది. చెప్ప దలుచుకుంది సూటిగా చెప్పడం మొదలెట్టాను. శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. నా కక్ష ద్విగుణీకృతమవుతూనే ఉంది. భవిష్యత్తులో నా జీవన గమనానికి ఆ రోజున పడ్డ బీజం. కోపం అనే అంతః శతృవు కాటేసింది. 50 ఏళ్ల వయసు వరకూ అదే కోపం. ఎదురుగా ఎవరున్నా దులిపేయడమే.
"జీవితమనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు. నిన్ను నువ్వు పునః సృష్టించుకోవడం."
When I reached home in our
town, I saw the most pathetic position of the life and death of my father. The
man, who loved all, lived like a lion, was lying outside, just by the side of
an open drain. Our house owner did not allow him inside as, according to him,
Vaastu would not allow it. What kind of anarchy? What kind of superstitions? I
was hurt badly that day. Cremation was complete. We were crying that our father
was no more and my sister- in -law started crying that her husband had to bathe
in cold water during winter! All these incidents left an indelible mark of hurt
on my psyche. Already, my inclination was to fight till the end that which I
considered was superstition. My resolve only increased that day. I became
almost a fool in the mad world. I started opposing everyone with precision.
What I wanted to tell, I was telling without mincing. The number of my enemies
was growing by the day. That made me more and more stubborn. Seed was sown for
my future growth and fall and growth and fall and growth. The internal enemy
“uncontrollable anger” entered my sub conscious. It did not leave till 50,
leaving me totally shattered in life.
“Life is not about knowing
yourself, but re-creating yourself”
10 వ రోజున ధర్మోదకాలు వదలడానికి బాపట్ల దగ్గర మా నాన్న గారి జన్మ స్థలానికి రావాలి అన్నారు. అన్నీ జీతం నష్టం సెలవులే. వెళ్ళాను. ఆ పల్లెటూరు చేరేటప్పటికి చాలా పొద్దు పోయింది. చీత్కారాలు. తండ్రి మీద ప్రేమ ఉంటేగా? అని అన్న దమ్ముల హేళనలు. పురోహితుడు "బుద్ధుందిటయ్యా?" అని తిట్లు. ఒక రోజు ముందు సెలవు తీసుకోవచ్చు కదా, ఈసడిపంపులు. మళ్ళీ మంగలిని పిలవాలి, విసుగు. నాకు కోపం. సెలవు ఎవడిస్తాడు. రోజుకి 12 రూపాయలు పోతాయి. ఎవడు వింటాడు. బ్రాహ్మణ్యం మీద కోపం. ఆ కులంలో పుట్టినందుకు కోపం. ఈ ఆచారాలంటే కోపం. ఎదురు తిరగాలి. ఎంత అవకాశముంటే అంత మార్చాలి. నిర్ణయం అయ్యింది. అమలు పరిచాను. శతృవులు పెరిగారు, ఇంటా, బయటా. ఈ రోజూ అలాగే ఉన్నాను. నా వృత్తి కాక పోయినా మంత్రాలన్నీ విని నేర్చుకున్నాను. ఈ రోజు అభిషేకాలూ, పూజలూ చేస్తాను. నా పద్ధతి లోనే. ఎవర్నీ బాధ పెట్టను. వాస్తుని నమ్మను. చాలా ఉన్నాయి,. తరువాత.
I returned back to Hyderabad
the same day after cremation. It was heart breaking to leave my mother and
sisters that day. I was asked to come to
the native village of my father, some kilometres away from Bapatla, AP. All the
leave I tookjumpedwas on Loss Of Pay, as I was on probation. I reached the
village very late in the day. Immediately all the people l on me like wild
animals. Harsh words! “Does he have love on father?” mocked by brothers. “Do
you have sense?” the priest. “Can’t he have taken one more day leave?”, other
relations. Who gives leave? I have to lose Rs.12/- per day if I take leave and
it is difficult to get that one day leave too. In addition, the probation
period gets extended by the number of LOP leaves and I would remain junior to
my batch mates, in case promotions were given. That day I hated Brahminism. I
hated myself for being born in a Brahmin family. I hated the superstitions and
diktats of the pseudo- learned. I decided. To the extent possible, I will
change the system. I became suddenly unorthodox still remaining a devout Hindu
and Brahmin. Enemies grew inside and outside. I was almost banished from the
family circles. But I continued my higher learning. I got by heart all the
Vedic chants just by hearing in temples. Today I perform all rituals in my
house even though it is not the profession of our sect in Brahmins. I can
perform a marriage too, if needed. I remained true Brahmin, but too unorthodox
to be accepted by my pseudo- orthodox family members. In future chapters.
నాలుగు రోజులు మకాం. నాకు ఏమీ తెలియదు. సంతకాలు పెట్టమన్నారు. పెట్టాను. పొలం అమ్మేశారు. చవగ్గా. ఎవరు కర్చు పెట్టిన కర్మ కర్చులు వాళ్ళు తీసుకున్నారుట? మిగిలింది మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి డిపాజిట్టు చేశారుట. అప్పులు తీర్చారో లేదో గుర్తు లేదు. మా స్నేహితుడి వాళ్ళ ఇంట్లో చేసిన అప్పు మాత్రం తీర్చ లేదు. మా ప్రధానోపాధ్యాయుల దగ్గర తీర్చలేదు. మా ఎం ఎల్ ఏ గారి కోడలుకి తీర్చలేదు. ఎందుకంటే ఇవన్నీ నేను 1976 లో తీర్చాను. ఆ కధ తరువాత.
I stayed there four days. I
did not know anything what transpired. They asked me to sign some papers. I
signed. They sold the remaining farm land at the cheapest rate, desperate sale.
People who spent on funeral rituals collected back their money. The rest, I was
told, was deposited for my sisters’ marriages. I do not remember whether they
repaid any loans which I jointly raised with my father. But the loan with my
friend’s family, my Head Master of school and the daughter-in-law of the local
MLA remained unpaid. I repaid them in 1976. There is a story there too. At the
appropriate juncture. I could not bear the scene nor could I forget.
నేను బయలుదేరే ముందు చివరి ఘట్టం. అమ్మని ఒక చోట కూర్చోబెట్టి బిందెలతో చల్ల నీళ్ళు పోయడం, తెల్ల చీర ఇవ్వడం, గాజులు పగల కొట్టడం. చూడ లేక పోయాను. ఛీ! పాడు ఆచారాలు. ఆమెకు 46 ఏళ్ళు. జీవితంలో అన్ని రోజులూ గుర్తుకు ఉండవు. కొన్ని క్షణాలు మాత్రమే గుర్తుంటాయి. మా అమ్మ మళ్ళీ అందరి మాదిరిగానే బ్రతికింది. పూర్వపు పద్ధతులకు ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు.
Before I departed from there
the last scene made an indelible negativism on my mind. Mother was made to sit at one place.
Pots of cold water was poured on her. It was winter just as it was winter to my
brother. But my sister- in- law did not cry. She was given a white saree by
Sree Penumaka Ramachandra Rao, my uncle who was crying copiously. (He loved us
all, unadulterated love!)/ What kind of culture? She was 46 then. Too young.
“We do not remember all days in life. But few moments can never be erased from
the sub-conscious” My mother lived like all normal women afterwards. We all
opposed the ancient superstitions.
“Life is really simple. But we
make it complicated by our foolish beliefs.”
ఇది అయ్యాక ఇక మిగిలింది, సంసారం మళ్ళీ ఎలా నిలదొక్కుకోవాలి. ఎక్కడుండాలి. మా తమ్ముడి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలూ, ఆడ పిల్లల స్కూళ్ళూ అయ్యాక ఏం చెయ్యాలి. పెద్దాయన హైదరాబాదులో, రెండు మద్రాసులో, మూడు ఇంకా ఉద్యోగం లేదు. నేను హైదరాబాదులో. కొత్త ఉద్యోగం. అన్నయ్య దగ్గరే ఉంటున్నాను. ఇంత పెద్ద సంసారం హైదరాబాదులో బ్రతకడం కష్టం. అందరం తలకొక 50 రూపాయలిచ్చి అక్కడే వుంచుదామని ఆయన, కాదని నేను కొన్నాళ్ళు తర్జన, భర్జనలు పడ్డాము. ఈ లోగా మా మూడో అన్నయ్యకి సిండికేటు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. మా తమ్ముడి డిగ్రీ పూర్తయ్యింది. ఆయనకి నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో పోస్టింగు. అది ఒక పెద్ద పల్లెటూరు లాంటి పట్టణం. ఒక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ అందరూ ఉండాలని నిర్ణయం అయ్యింది. వెళ్ళారు. వెళ్ళిన నాలుగు నెలలకి ఉత్తరాల మీద ఉత్తరాలు. "ఈ వూరులో ఉండటం కష్టం. ఆడ పిల్లలకి ఏమన్న జరిగితే నా బాధ్యత లేదు. నువ్వే ఏమన్నా చేసి వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి" అని మా పిరికి భీముడు వ్రాయడం, వెంట, వెంటనే మా అమ్మ వీడు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు, వెంటనే వచ్చి తీసుకెళ్ళు అని మా అమ్మా, తమ్ముడూ వెనకాలే సందేశాలు. అప్పటికే మా పెద్ద చెల్లెలు అక్కడ జూనియర్ కాలేజీలో చేరింది. ఇక్కడ అడ్మిషన్లు అయి పొయ్యాయి. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. పెద్దాయన ససేమిరా అలా కుదరదు. నేను ఒక్క రూపాయి సహాయం చెయ్యను అని బల్ల గుద్ది చెప్పాడు. జీవితంలో వెరే వాళ్ళకి సహాయ పడడం ముఖ్యం. అలా చెయ్యలేకపోతే కనీసం వారిని బాధించకుండా ఉండగలగాలి.
After all this, the issue was
how to re- settle the family and a decision is to be made where to keep them.
Who will look after all? What should we do after my brother’s final year
graduation is complete and schools of my sisters were closed. My eldest brother
was in Hyderabad, second one in Madras, third one still job less, me in
Hyderabad with my eldest one, living on tenterhooks. “We cannot live
comfortably in Hyderabad with such big family” was my brother’s argument. I was
seriously opposing it, though he proposed all of us could contribute Rs.50/-
each to make them comfortable there! We were continuously squabbling. In the
mean-time my third brother got a job in Syndicate Bank, not without
recommendation, from his friend with whom he had a fist fight in scol. (See how
God links people and issues). My youngest brother completed his degree with
flying colors. Despite all the family troubles. He was awarded the National
Merit Scholarship, the second in family.. The service he did to my father and
family paid rich dividends to him. He was such a nice boy those days. (We used
to look similar if seen from the backside. Once, later years, one of his
friends hugged me from behind and exclaimed “You Son of a B…., it was usual in
AP to call friends like that. Where were you? I turned back and seeing his face
told him “I am the elder son of the b…” and laughed. Till he got down, he was
apologizing. Funny incidents. ) My third brother was posted in b aig
village-cum town, Atmakuru near Nellore town. As he had to stay alone my family
decided to shift there much to the relief of my eldest brother. (My mother,
sisters, younger brother travelled in the back of the lorry behind the goods
for 14-15 hours during night) What a fall for our family! After four months, I
started receiving letter after letter from the timid third brother. He was
writing that the village was full of demons, they might do anything to my
sisters, already a few were after her (she was very pretty before she turned
fatty, even now she is fatty but still very pretty. In fact, her husband can
reimburse the dowry he extracted from us with 24% interest for her pretty face
and her attachment to her family. But! Alas! He demanded more from my mother
just a week before she went into coma!). Behind his letters followed letters
from my mother and brother that he was constantly pestering them to leave and
he was not sleeping nor was he allowing anyone to sleep. He was so courageous,
even now he is. I told my elder brother that we could bring them to Hyderabad
and live together until all settle in life. He said “NO” very firmly and
threatened that I brought them, he would not give that Rs.50/-, he promised
earlier.
“To help others in life is
important. If not possible, we should desist from hurting others!
ఈ లోగా, నేను వేరే ఇల్లు వెదకడం మొదలు పెట్టాను. అదే ప్రాంతంలో. ఇక్కడ ఉండొద్దు. నా పరువు పోతుంది, అని ఆయన. నీకు ఉంటే కదా పోవడానికి అని నేనూ రోజూ యుద్ధం. చెప్పాను కదా. ఎంతటి వాడితో అయినా అలానే మాట్లాడే వాడిని. ఈ లోగా ఒక ఒక గొప్ప వింత జరిగింది. మా అన్నయ్య ఇంటి పక్క పోర్షను ఖాళీ అయ్యింది. అద్దె 170 రూపాయలు. ధైర్యం చేసి మా ఇంటి ఓనరుని అడిగాను. ఆయన సలహా చెప్పాడు, ఒకే ఇంట్లో పక్క, పక్కన ఉండటం మంచిది కాదేమో ఆలోచించుకో అని. మీ అన్నయ్య బాధ పడతాడేమో అని కొంచెం తటపటాయించాడు. ఇంట్లో ఏమనుకున్నరో ఏమో మర్నాడు పిలిచి సరే అన్నాడు. మరి అంత అద్దె కడతావా అని అడిగాడు. కడతాను, మా తమ్ముడికి టెలిఫోను డిపార్ట్ మెంటులో 135 రూపాయల స్టైపెండుతో జూనియర్ ఇంజినీరుగా వచ్చింది. నా జీతం పెరిగి 430 రూపాయలయ్యింది. (మేము చేరంగానే జీతాల సవరణ జరిగింది, డీ ఏ పెరిగింది) మా అన్నయ్య 50 రూపాయలు పపుతాడు. పెద్దాయన ఇచ్చినా తీసుకోను అని చెప్పాను. సరే ఇల్లు తీసుకుని అడ్వాన్సు ఇచ్చాను. అప్పుడు మా అన్నయ్యకి చెప్పాను. ఇక ఒక కిటికీ దగ్గర నిలబడి, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చేసినట్లు ధర్మోపదేశం చెశాడు. నువ్వు ఎంత చేసినా వాళ్ళు నిన్ను పొగిడి నెత్తికెక్కించుకుంటారనుకోబోకు. నీ డబ్బంతా ఇప్పుడే వాళ్ళ మీద పెడితే రేపు నీ భార్యా, పిల్లల విషయ మేమిటి. నీకేమన్నా కష్టమొస్తే, "ఒక్కండును, ఒక్కండును, ఒక్కండును నీ దరికి రాడు" ఇంకా చాలా చెప్పాడు. నిర్ణయం అయిపోయింది . అమ్మా వాళ్ళు వస్తున్నారు, ఖండితంగా అని చెప్పాను. జీవితంలో మనం సమాధానం చెప్ప వలసిన మొదటి, అత్యవసరమైన ప్రశ్న మనం వేరే వాళ్ళకి ఏం చేస్తున్నామనేది. మా ఇంటి ఓనరుతో మాట్లాడాడు . మీ ఇంటి విషయాలు అనవసరం కూడా అని "తాబులాలిచ్చేశాను. తన్నుకు చావండి" అన్నట్లు మొహం మీద కొట్టినట్లు చెప్పాట్ట. వచ్చేశాడు. నాకు తెలియదు. నేను ఇల్లు తీసుకుని, అడ్వాన్సు ఇచ్చి మా అమ్మ వాళ్ళని తీసుకు రావడానికి టిక్కట్లు రిజెర్వు చేయించాను.అందర్నీ తీసుకుని, 12 పెట్టెలతో ఆత్మకూరు నుంచి నెల్లూరు, అక్కడ నుంచి హైదరాబాదు. సామాను ట్రక్కులో వచ్చింది.
So, I decided to bring them to
Hyderabad on my own risk. I started searching a portion in the vicinity as the
area was already familiar to me and my uncles both paternal and maternal lived
nearby. “Do not stay here. I will lose my respect my eldest brother told me.
“If you have any respect, there is fear of losing. So do not fear on that
count” I firmly told him. I was talking like that then and still I talk like
that now, only I changed it to pun and say what I want to say now, so that the
others do not have scope to argue. A lesson in life. A funny opportunity came
my way then. The portion adjacent to my brother’s portion fell vacant. The rent
was Rs.170/-. Without losing time I approached the house owner without the
knowledge of my brother. He advised me as an elderly person, just to think if
it would be appropriate for brothers to stay in the same house in adjacent
portions. He also expressed a doubt whether my brother would feel bad. (He was
a nice gentleman. Until my sister got job in 1981, viz. for seven years he did
not increase the rent. Then he made it Rs.250/- He allowed us to stay there for
11 years). I do not know what transpired in their home, he called me next day
and nodded assent. But he asked me, “Can you bear Rs.170/- as rent?” I told him
my younger brother got posting as Junior Engineer in Telephone Department with
a stipend of Rs.135/- p.m. and my salary increased to Rs.430/- (salary revision
took place soon after we joined and DA increased). And my third brother
promised Rs.50/- per month and that I would not take help from the eldest even
if offered. So I paid advance and took the portion on rent. Then only I
informed my brother. Shell-shocked, he stood near a window (I remember the
scene as it happened just now) and like Lord Sree Krishna preached Gita to
Arjuna, he preached me life Geeta, He told, “Whatever you do, never be under
the misguided impression that they would flatter you and hail you, ”Thou” Our Saviour!,
If you spend your total earnings on the family (and it is not sufficient, you
have to borrow) what will happen to your own wife and children in future? And
if you are in trouble, you will be left like Karna in the midst of the battle
and none will rescue you” He told me many more realities about life. (The part
that none would come to my rescue came true later). I told him firmly, “Mother
and family are coming” and closed the discussion.
“The one question we should
answer in life fast and firm is what we can do to the others” I answered that
question. My life remained an unanswered question.
He talked to our house owner.
It seems he told him he was not concerned with our family matters and as an
owner he gave the portion to another tenant. I booked tickets to and from
Nellore and brought my mother, two sisters from Nellore to Hyderabad, with
twelve boxes/suitcases etc., It was tedious journey, from Atmakur to Nellore to
Hyderabad. We reached home.
20 ఏళ్ళ వయసుల అది సాహసమే. అందరూ నాకు ఎదురే. ఒంటరిగానే పోరాడాను. ఇంటికి వచ్చాము. మా పోర్షను ముందు ఒక పెద్ద వరండా ఉండేది. ఒక పెద్ద హాలు, ఒక కిచెనూ. హాల్లో ఒక చెక్క పార్టిషనూ, కిచెన్లో ఒకటి. పక్క పోర్షన్లో మ్ముడు రూముల్లో మా అన్నయ్య. వచ్చి వరండాలో సామాను పెట్టి బెల్లు కొట్టాము. తలుపు తియ్య లేదు. మా తాళం చెవి ఆయన దగ్గరే ఉంది. 20 నిమిషాలు బెల్లు కొడుతూనే ఉన్నాము. తియ్యలేదు. చివరికి మా వదిన తలుపు తీసి లోపలికెళ్ళి పోయింది. ఆ రోజు ఎలాగో అక్కడే గడిపి, మర్నాడు మా ఇంట్లో కెళ్ళాము. కొత్త జీవితం ప్రారంభం. గ్యాస్ స్టవ్ లేదు. మామూలు జీవితం. మా పెద్ద చెల్లెలుని ఇంటర్లో చేర్చాలి. అదంటే నాకు ఆరో ప్రాణం. ఒక్క క్షణం వదిలే వాణ్ణి కాదు. ఏమడిగినా సిద్ధం. అప్పు చేసైనా సరే కొనే వాణ్ణి. ఈ విషయంలో మా పిరికి భీమసేనుడి అభిప్రాయం. ముఖ పుస్తకంలో.
It was adventurous at age 20.
Everybody was against my bold step. I was standing alone with the family
burden. Our portion used to have a big open balcony in the front, a big hall
and a kitchen. The hall and kitchen were separated by wooden partitions.
Adjacent, three-room portion was occupied by my brother. We came home, sat in the
balcony and rang the bell. For twenty minutes the door was not opened. We sat
there. After 20 minutes, my sister- in -law opened the door, left in a huff
without talking. Our keys were in their house. It was a kind of tense
situation. We spent the day there and entered our portion next day. There was
nothing in the house. Luggage came in a truck. We had no gas stove. We
spent time like a lower middle- class family. My first task was to admit my
elder sister in Junior College. She was my beautiful rose that was flowering
every day. I was never leaving her in thoughts and actions. I used to get her
whatever she asked for, even borrowing money. If there was a tear in her eye I
used to cry. After all this, the post made by my third brother in Face
Book. It is self-explanatory. I wrote a few poems on the life led by such
people. It is a better-read in Telugu. I am leaving the translation part.
Sudhakara Rao Neelamraju
May 18 ·
It is true that I did not come
to Hyderabad asI was in Shaghai.Atleast whether you waited till your elders to
come.Do you remember that the utterences you made in front of the public and
Purohit. You already killed when she was alive. What makes you to burn the pyre
when the younger brother was thre. Are you proud of the actions. "You
don't havr thr patience to wait till the elder sister of your wife to get
marry."You ruinrd her life also..For all five brothers and sisters there
is only one mother. We can can not cut in to her pieces. It it is her wish to
stay back with you for reasons well knowno you. (Verbatim. No corrections made.
sic.)
ఆయన కోసమే వ్రాసిన కొన్ని పద్యాలు. సామాజిక స్పృహ ఉన్నవారెవరైనా ఇవి చదివి నిజం తెలుసుకుంటారు.
1.నీట నుండు చేప నీట నుండగ నీక
వలను వేసి తీసి వాస నందె
మత్స్య ముండు నీటె ముత్య ముండును గద
వాణి బలుకు మాట veda vaakku! 156
(దుర్మార్గుడని తెలిసి కదిలించి, కవ్వించి వాడు నన్ను తిట్టాడు బాబోయ్ అని పెళ్ళాం దగ్గరేడిస్తే ఊరుకో పిరికి వెధవా అంటుంది. చేపలు పట్టడమెందుకు. వాసన అని ఏడ్చుడెందుకు. అదే సముద్రంలో ముత్యాలుంటాయి, వాసన రావు. ఓపిగ్గా కూర్చుని పట్టు కొమ్మని సారాంశము. చేపల్ని వాటి మానాన వదిలెయ్యి. నచ్చిన వారు పట్టుకుంటారు).
1.An advice to those who pick
up quarrels without reason and then if the other person reacts cry their hearts
out. Why should one catch the fish that is playing in water, smell it and say
it is bad smelling and blame it? You can let it live in water or allow it to be
caught by the one who likes the smell.
2.
అన్న దమ్ము మధ్య యాత్మ కధల ఘోష
పోయినొళ్ళ యాత్మ పొగను బెట్ట
నీదు లోపములను నిలువెత్తు జూపరో
వాణి బలుకు మాట నాదు నోట!
2. Brothers, instead of
blaming each other for their plight, should come out with their mistakes in
life that affected all. That only gives peace to the departed ancestors.
3.
తనదు కడుపు మాడ్చి తనయుల బెంచగ
యామె పోవు వేళ యొకడు లేడాయె
యల్లు డొచ్చి బలుకు యెకసక్కె మాటలు,
వాణి బలుకు మాట నాదు నోట! 151
(మనిషి కట్టె యయ్యాక మోయడానికి దొరికిన వ్యక్తే బ్రహ్మ ఙాని. అయిన వాళ్ళు తప్పించుకుంటే ఉన్న వాళ్ళే మోస్తారని సారాంశము)
3. Even without feeding wife
properly, father brought up children. By the time she passed away, none was
available to carry her body. And the son-ln-law, mocks she died like an orphan.
4.
బతికి యుండగ బుండు వాసన వెగటాయె
శవము చూడ కొంత సమయ ముంచు
యనెడి బుత్రు నేమి యనెడు శాస్త్రములును,
వాణి బలుకు మాట నాదు నోట!
(తల్లి మంచాన బడి పుండ్ల వాసనతో ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్న కొడుకు మీద ఏనాడూ తల్లి మంచం దగ్గర లేకుండా, కుళ్ళి శల్య మౌతున్న శవాన్ని ఇంట్లో ఉంచుకో మేము రెండు రోజుల తరువాత వస్తామూ,అమ్మని చివరి సారిగా చూడాలి అని శవ పంచాయతీ పెట్టే ప్రబుద్ధుల గురించి ఈ చిన్న ఆట వెలది)
4. The son who left the
country unable to bear the smell coming out of the body of the mother on bed,
asks the son who looked after her bearing all, to keep the dead body until he
comes. What should we call such a son?
5.
బతికి చెడిన వాడు బతికించు ఇతరుల
చెరచి బతుక నెంచ చేరు యముని
చీమ కుట్ట గానె చేరదె కాలుని
వాణి బలుకు మాట నాదు నోట!
5. The man who lived a
rich life and became a pauper donating freely all his wealth knows the horrors
of poverty and helps others. The man who wants to spoil lives of others will
reach hell soon. The ant that bites gets killed immediately.
6.
అన్న దమ్ము నడుమ యగ్గి రాచల్లుడు
యత్త మామ నెటుల యాదరించు
కాడు బోవు వేళ కట్నంబు యడుగడా
వాణి బలుకు మాట నాదు నోట!
6. The son-in-law who
ignites fire between brothers and pours oil on it could never have treated his
in-laws properly. Even before their death, he would have demanded money.
7.
అన్న దమ్ము చెల్లి యనువు నుండగ
అల్లు డేల మిమ్ము గిల్లు చుండు
కట్న మడుగ చేరు కటకటాల వెనుక
వాణి బలుకు మాట నాదు నోట!
7. If brothers are
united, how can a son-in-law of family spread hatred between them? If he asked
dowry from a dying mother-in-law, he would have been behind bars if brothers
were united.
8.
సోదర బ్రేమ బోయి స్వార్ధమ్ము నిండగ
బయటి వారి నడుమ పల్చనవరో
మిత్ర భేద కధను మరచితి రెటులయా
వాణి బలుకుమాట నాదు నోట!
8. If selfishness gives place
to natural love between brothers, will they not become laughing stock in front
of others? Did these guys forget the “Mitra Bheadam” in Pancha Tantram?
On second thought I translated
the poems too.
ఇక్కడ మీకు రెండు విషయాలు బోధ పడతాయి. ఆయన మూర్ఖుడు, పిరికి వాడు, తను చెప్పిందే వేదం అని పట్టు బట్టే మనస్తత్వం. మహా పిరికి. కానీ ద్వేషమనేది ఆయన్ని దహిస్తూనే ఉంది. ఇంకా చాల ఉన్నాయి చెప్తే. ఇక్కడ నా భార్య కుటుంబ వ్యవహహారాన్ని బయటకు తెచ్చి, తన భార్య కుటుంబం గురించి (నాకు సంబంధించనిది), తన వియ్యంకుడి కుటుంబం గురించి చెప్పే అవకాశం ఇచ్చాడు. అవసరమనిపిస్తే చెప్తాను. నా బ్యాంకులో ఏమి జరిగిందో నా మీద ఆరోపణలూ దాచకుండా చెప్పాను. మౌనమే సమాధానం. వాళ్ళ బ్యాంకులో ఏం జరిగిందో నేను రుజువులతో బయట పెట్ట గలను. కానీ నాకేం అవసరం? ఇది నా కధ ఊళ్ళో వాళ్ళది కాదు కదా? ఆయన దగ్గర డబ్బుంటే నా దగ్గర అమూల్యమైన సంస్కారం ఉంది. నా భార్య అక్కకు పెళ్ళి కాకుండా నేను పెళ్ళి చేసుకున్నానని ఆయన ఆరోపణ. ఆ సందర్భంలో వివరిస్తాను. సాక్షులు చాలా మంది. తరువాత ఇది ఎలాగైనా చెప్పే వాడిని.
Here you will realize two
naked truths. He is foolish and timid. He wants to hide these two qualities
behind one another. Because he is a fool and timid too, he tries to insist that
his word should carry weight. (This affected the family and more so, me, still
he does not realize). But the hatred he developed for others, not only, me
still is burning within self and burning him. Here, by poking his nose in the
affairs of the family of my wife, (of which his knowledge is minimal) he gave
an open invitation to talk about the family of his wife (of which I know more)
and the family of his son’s in-laws? Will I do that? It depends on his further
utterances. Or else, this is my life, my story. I already said that incidents
that do not have bearing on my life find no place here. He persisted, persisted
and persisted that I should reveal charges on me in my Bank. I did it. He
became mum and unfriended me on Face Book. A person should carry conviction not
only to tell truth but to face truth. I know what happened in his bank, with
proof. But it is not my concern. He crossed all limits of decency commenting on
my wife’s sister and anyhow as I am narrating my story, I would have mentioned
that too. He probably lost all sense of propriety in his foolishness and anger.
The matter of my marriage will find major place in my story. I will narrate at
the appropriate place. There are many witnesses. Hope he stops denigrating
others for his sadistic pleasure.
ఇక జీవిత భీమా ఆఫీసులో నా జీవితం. చాలా ఒడిదుడుకుల తర్వాత, కుటుంబం స్థిర పడింది. మా చెల్లెల్ని చేర్చడానికి అన్ని కాలేజీల్లో సేట్లు అయి పోయాయి. అదే సంవత్సరం నారాయణ గూడాలో రామ భద్ర కాలేజని తెరిచారు. ఎక్కడా సేట్లు దొరకని వాళ్ళు అక్కడ చేరారు. మా చెల్లెల్ని తీసుకెళ్ళాను. ఆ ప్రిన్సిపాలు నన్ను చాలా గౌరవంగా చూశాడు. మొదటి సారి నా సైజు మీద మాట్లాడని వాడు ఆయనే. పేరు గంగాధరం. మా చెల్లెలు మార్కులు చూసి ఎగిరి గంతేశాడు. ఇన్ని మార్కులొచ్చినమ్మాయిని మా కాలేజీలో ఎందుకు చేరుస్తారు అన్నాడు. తప్పదు, మా ఇంటికి దగ్గర అని అబద్ధం చెప్పాను. ఇంతకీ ఎన్ని మార్కులో తెలుసా . 365/600 కి. ఏమీ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మా చెల్లి. అప్పటికి బంగారు తల్లి. "నీ పాదముపై పుట్టు మచ్చనై చెల్లెమ్మా" అని తరువాత వందేమాతరం రాసి పాడితే సినిమా చూసి వలా, వలా ఏడ్చాను. అది మాత్రం నేను తన జీవితంపై పెద్ద బురద ముద్ర లాగానే చూసింది తరువాత రోజుల్లో. అన్నీ వస్తాయి. ఇదో ఉద్గ్రంధం.
Now, about my life in Life
Insurance Corporation of India. After many ups and downs, family settled in
Hyderabad, but not before my own finances took a severe beating. Then came the
issue of admitting my sister in Junior College. Seats in colleges were filled
up. That year one new Junior College by name Ramabhadra Junior College, was
opened in Narayanguda, near our house. I accompanied my sister there. That
principal respected me a lot. First time in my life, he did not comment on my
size. He was pleased with my communication skills. His name was Gangadharam.
All students who could not get seats in other colleges got admitted there. He
saw my sister’s marks and jumped in joy. “Why are you admitting such a bright
girl in our college?” he asked. As it is nearer to our house, I lied. Do you
know the marks? 365/600. Where no other tree grows, Castor tree is
the best, a Telugu saying. She was my fairy queen those days and even now. “ I
will remain forever as a birth mark on your foot” wrote one Telugu lyricist. I
wept copiously seeing the scene in the film, as I remembered her. I wanted to
remain a birth mark. But, she washed me out from her life as a mud spot. This
is going to be an Ithihas in itself.
చాలా ఎక్కువ ఫీజు. అప్పు చేసి కట్టాను. అప్పులు చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య అయ్యింది చిన్న తనం నుంచీ. అప్పులు చేసే వాడిని. వడ్డీలు కట్టేవాడిని. వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేసే వాడిని. నేను అనుభవించింది చాలా తక్కువ. వేరే వాళ్ళు అనుభవించిందే ఎక్కువ. (ఒక సారి ఒక సర్దార్జీ నన్నడిగాడు "మేనేజరు గారి పిల్లలకి ఇంత మామూలు డ్రస్సులా? తిండి పెడుతున్నారా లేదా? అంత పేద వాళ్ళుగా ఎందుకు పెంచుతున్నారు" అని. గర్వం పెరగ కూడదని, నా దగ్గర డబ్బుల్లేవు కాబట్టి అని చెప్పాను . నేను ఇస్తాను అన్నాడు. వద్దు అని చెప్పాను . ఆయనే తరువాత నేను చాలా మంచి వాడిని అని బ్యాంకులో బల్ల గుద్ది వాదించాడు. ధన్యుణ్ణి, సర్దార్! నా భార్య కూడా చాలా చవక రకం చీరలు వేసుకొనేది. బంగారం లేదు. సదా కృతఙ్నుడిని.)
I paid very heavy fees as it
was new college and building fund was more. I borrowed and paid. Borrowing was
a game of the left hand for me. I was borrowing, paying interest, to pay
interest I was borrowing more. It was a vicious
circle. But it was inescapable, because of my love to my family and my soft
heart to those suffering. The funds I enjoyed was less and the funds I spent on
family was more from then till 1986. (At one point of time, one
Sardarjee, who was a client asked me why a Manger’s children were so shabbily
dressed like poor guys? I told him I wanted them not to think they were
children of a Manager and that I was not having money also. He offered
assistance. I refused. This man later argued emphatically in my bank that I was
the best Manager the bank ever had. Thank you, SardarJee! Even my wife
was wearing the cheapest of sarees. There was neither gold nor silver. Thank
her!)
కాలేజీలో చేరాక మా చెల్లికి చాలా ఖరీదయిన డ్రెస్సులు కొన్నాను. మంచి బ్యాగు, ఏమి అడిగితే అది. తండ్రి లేడు అనే లోపం లేకుండా చూశాను. (దాని పెళ్ళయ్యాక వాళ్ళ మామగారు నన్ను వేనోళ్ళ పొగుడుతూ, నీ లాంటి మనిషిని నిన్నే చూసానొయ్, అని వ్రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గర ఉంది. ప్రచురిస్తాను. హైదరాబాదులో ఉంది). దాన్ని చెడగొడుతున్నావు అని మా అన్నయ్య, అమ్మా, తమ్ముడూ అందరూ తిట్టే వాళ్ళు. దాని పేరు తలుచుకుంటే నాకు ఆనందం వేసేది. దానికి కన్నీళ్ళొస్తే ఏడిచే వాడిని. అదే నా ప్రపంచం. ఇదెందుకు చెప్పానంటే నేను చేసిన అప్పులు రామదాసు లాగె సత్కార్యానికే పోయి, నేను శిక్ష అనుభవించాను, రామదాసు లాగా. "నువు కులుకుతూ కూర్చుండేవు" అని చెప్పలేను కదా. దాని వైభోగం నాకు ఆనందమే ఇప్పటికీ. నాకు అసూయ అంటే తెలియదు.
After she joined college, I
purchased her good dresses, a fine bag. Whatever she asked was present the next
morning. I treated her in a way she would forget she had no father. I became
her father. My brothers and mother used to object my pampering her. (After her
marriage her father --in law wrote a letter to me. “You are the only person
like yourself I have seen in my life that treated a sister like that with the
scarce resources. I still retained the letter though I lost my life. I will
post it here at appropriate place. When I thought of her, I used to feel
elated. If she had tears, I used to cry. Why I am telling all this is that now
she lives in a palatial bungalow, with the amount of gold one envies and she is
one of the richest. Like Ramadas, I spent my money for a good job. But like
him, I do not blame my sister, “You are enjoying my wealth and I am suffering
from a life time curse”. For, envy never entered my mind. I always thank God
for what he had given me lot of courage, a wife that is an asset and children
that are loving and caring
నా పెద్ద కూతురికి దాని పేరే పెట్టాను. లక్ష్మీ రాజ కుమారి అని. వాళ్ళ మామగారికి ఆనందంగా వ్రాశాను. ఆయన బ్రతికి ఉండే వాళ్ళ పేర్లు పెట్ట కూడదు అని వ్రాశారు., లక్ష్మీ కుమారి అని పెట్టాను. మరి నా భార్య సంతోషంగా ఒప్పుకుంది కదా. ఆమె కూడా స్త్రీ కాదా, వీళ్ళ లాగా?
I named my eldest daughter
after her. Lakshmi Raja Kumari. I wrote a letter to her father-in-law seeking
blessings. He wrote back saying that one should not name people after those who
are still living and hence suggested Lakshmi Kumari. It is her name now. My
wife did not fast or shout on me. She is also a woman driven by all human
passions. But she is different.
సరే! ఇక ఆఫీసు. భీమా సంస్థలో అప్పట్లో వింత పరిస్థితులు ఉండేవి. చాలా బలమైన కమ్యూనిస్టు యూనియను. బీ జే పీ వాళ్ళ యూనియన్లో చేరాను. అప్పట్లో నేను బలమైన కాంగ్రెస్సు వాదిని. కమ్యూనిస్టులన్నా, బీజేపీ అన్నా కోపముండేది. (జన సంఘ్) దీనికి మా నాన్న గారి ప్రభావం ఎక్కువ. (ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు కాలేజీలో రొటరాక్ట్ క్లబ్బు లో ఉన్న పేరు చూసి ఏ బీ వీ పీ వాళ్ళు కాలేజీలో ఉండగా నన్ను మెంబరుగా చేర్చారు. నేను ఆర్ ఎస్స్ ఎస్స్ కి పూర్తి వ్యతిరేకం. వాళ్ళకి చెప్పాను. నా అభిప్రాయాలు మారవని. నిద్ర లేస్తె చదవడం నాకు జన్మతః వచ్చింది. తింటూ కూడా చదివే వాణ్ణి. దాంతో రాజకీయాల మీద ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి. ఇప్పటి పిల్లలకి కూడా అదే చెప్తాను. చదవండి. దేశానికి ఉపయోగ పడుతుంది అని) అయినా చేర్చుకున్నారు. వెంకయ్య నాయుడంటే చాలా గౌరవముండేది. ఆయన మీటింగులన్నీ వినే వాడిని. విశ్లేషించే వాడిని. మర్నాడు చర్చ పెట్టే వాడిని. ఆయన్లో తప్పులు వెదికి మరీను. అప్పుడే రాజకీయ విశ్లెషణ చెయ్యడం ప్రారంభించాను. నా వాదనలు చాలా మంది వినే వారు. నా ప్రాణ స్నేహితుణ్ణి కూడా చేర్పించాను. ఆ సమయంలో విజయవాడలో ఒక పెద్ద సదస్సు జరిగింది. నన్ను, మా స్నేహితుడినీ మరి కొంత మందినీ మా వూరి నుంచి పంపారు, కార్యకర్తలుగా. ప్రొద్దున్న గడిచింది. రాత్రి అందరికీ క్రింద చాపలేసి పడుకోమన్నారు. కొంతసేపు పడుకున్న తరువాత సంశయ మొచ్చింది. నాయుడు గారెక్కడ అని. హోటల్లో పడుకున్నారు అని. ఏ సీ హోటలు. ఆయన ఇక్కడికి రావాలి, లేదా మాకు కూడా హోటల్లో రూము లివ్వమని అన్నాను. అందరికీ కోపమొచ్చింది. క్రమశిక్షణ అన్నారు. ఆయనకు లేని క్రమ శిక్షణ మాకెందుకు అన్నాను. పెద్ద గోల అయ్యింది. కొందరు అటూ, కొందరు ఇటూ. ఏమయ్యిందో తెలియదు. మీకు ఇష్టం లేక పోతే వెళ్ళి పొండి అన్నారు. మేము కొంత మందిమి వెళ్ళి పొయ్యాము. వెళ్ళెటప్పుడు చెప్పాను, నాయకుడు కార్యకర్తల్తో కలిసి ఉండాలి. ప్రత్యేక మైన సదుపాయాలు ఉండకూడదు అని. ఆ కధ అంతటితో ముగిసింది. వాళ్ళు నన్ను తీసేశారు ఏబీవీపీ నుంచి.(కానీ ఈ సంఘటనకి, నా కాంగ్రెస్సు మీద ప్రేమకీ ఏ సంబధం లేదు. ప్రతిదీ విశ్లేషించే అలవాటు వేణ్ణూలుకుంది)
Now, let us go to my office
life. Those days, in LIC of India a peculiar situation prevailed. There was a
strong communist union and a Union affiliated to BMS, a wing of BJP (then Jana
Sangh). I joined BMS. At that time I was a staunch Congress supporter. I used
to hate communists and Jana Sangh equally. My father had maximum influence in
this regard on me. I have to tell one matter here. With the popularity I gained
as a Rotaract Member, the local unit of ABVP approached me that time in college
in my town. I was strongly against the ways of RSS back then. I told them I
won’t change my opinion about their parent organization. Reading books, papers
and whatever comes way was and is my forte. Even while eating, I was reading
something that my children imitated and continue to read. Hence, I had some
firm opinions about politics of the day. I tell children now too to read.
It will be useful to the nation. Even after I told them this, they admitted me
as they considered me as a value addition. I used to have great respect for
Venkaiah Naidu those days. I never missed his speeches with punch. I used to
analyze and start discussion on his speech, even pointing out the negatives in
his speech. My friends used to like my analysis. Political analysis started in
my life too early. I got my best friend too admitted as we were inseparables.
That time a grand meeting of ABVP took place in Vijayawada. We were deputed to
represent our town wing along wih few others. First day morning session over,
post dinner, we were asked to sleep on mats in a big hall. After sometime, I
got a doubt where Mr. Naidu was. I asked the organizers. He was resting in an
AC Hotel. I told them frankly that either he should sleep in the hall or we
should be sent to hotel too. There was commotion. People started speaking
discipline. I said if the leader was not disciplined, we had no need. The hall
was divided into two wings. I do not know what happened. But we were asked to
leave. We packed and left to our town. Later we were removed from ABVP. But the
incident had no bearing on my Congress love. Analyzing everything became
part of my life.
భీమా సంస్థలో ట్రైనింగు అయి పోగానే సరెండర్స్ అనే సెక్షన్లో వేశారు. 12 ఫైళ్ళు ఇచ్చారు. పక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ రోజు 4 గంటల వరకూ పట్టింది. రెండో రోజు 12 గంటల కల్లా పని అయి పోయింది. ఆఫీసరు కిచ్చాను. ఇంకా చేస్తావా అని అడిగాడు. అవుననన్నాను. ఇంకో 20 ఇచ్చాడు. ఇది పక్క సెక్షన్లో కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి తెలిసింది. కోప్పడ్డారు. నీ లాగా మేము పని చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయా? నువ్వు పెండింగు పెడితే ఇంకొంతమందికి ఉద్యోగాలొస్తాయి అని గీతోపదేశం చేశారు. (తరువాత వచ్చిన యమ గోల సినిమాలో "మేము పని చెయ్యం, ఇంకోళ్ళని చెయ్యనివ్వం అని రామా రావు చెప్తాడు. పశ్చిమ బెంగాలులో ఇది ఇప్పటికీ నడుస్తుంది). ఏం చేస్తాం. మరునాటి నుంచీ రెండు గంటలు బయటా, రెండు గంటలు సీట్లో అలవాటు చేసుకున్నాను.తరువాత నెమ్మదిగా బస్ స్టాపుల్లో నిలబడటం అందమైన అమ్మాయిలని చొంగ కార్చుకుంటూ చూడడం, 11 గంటలకి (అప్పుడు రాక పోతే సెలవు పెట్టాలి) రావడం అలవాటయ్యింది. ఇక్కడే ఇంకో ఐదుగురు నా లాటి యూనియన్ బాధితులు తగిలారు. అందరం బస్ స్టాపుల్లో తిరిగే వాళ్ళం. ప్రొబేషన్ అయి పొయ్యాక కొత్త పద్ధతి కనుక్కున్నాం. అక్కడికి దగ్గర్లో మీర టాకీసు. వారానికి కొత్త సినిమా. ప్రతి వారం సంతకం పెట్టడం, పక్క సెక్షన్లో పని ఉందని నాలుగు చిత్తు కాగితాలు పట్టుకుని సినిమా చూసి, లంచ్ చేసి వచ్చి గంటలో పని పూర్తి చేసే వాళ్ళం. కొన్నాళ్ళయ్యాక సెక్షన్ మార్చారు. ఇది ప్రీమియంస్. ఇక్కడ ఒక షీటు ఇచ్చే వారు. జర్నలు. దాంట్లో పాలిసీ నంబర్లుండేవి. అవి చూసి లెడ్జర్లలో తేదీ వ్రాయడం, నంబర్ సరి చూసుకుని. 250 కోటా. మొదటి రోజు అర గంటలో పని అయ్యి పోయింది. జీతాలు పెరుగుతూనే ఉన్నాయి. లాభం లేదనిపించిది. రెండో రోజు 1000, మూడో రోజు 2000, ఇలా 10,000 వరకూ వెళ్ళాను. ఆ సెక్షనుకి ఒక ముస్లిం సెక్షన్ హేడ్ ఉండేవాడు. ఆఫీసరుకి చెప్పాడు. తొందరగా చేస్తున్నాడు, తప్పులు పోతాయని. యూనియన్ వాళ్ళొచ్చారు. నా ఇష్టం అని చెప్పాను. ఆఫీసరు మీద అరిచి వెళ్ళారు. అప్పుడు దైవ సహాయం అని మళయాలీ ఆఫీసరు. వాళ్ళ ఎదురుగా నన్ను కోప్పడి "నువ్వు ఎదిరించ దలచుకుంటే రేపు 15,000 చెయ్యి. నేను అండగా ఉంటాను. అని చెప్పాడు. చేశాను. ముకుందన్ అని డివిషనల్ మేనేజర్ నన్ను పిలిచి నన్ను పిలిచి నా సర్వీసులో ఎవరూ చెయ్య లేని పని చెశావోయ్ అన్నారు. అంతే. వేల మంది పని చేసే ఆఫీసులో నా పేరు మోగింది . నా బ్యాచులో నలుగురూ కూడా యూనియన్ కి ఎదురు తిరిగారు. మొత్తం మారి పోయింది. కోటా సిస్టం గోవిందా. దాని తరువాత జే ఆర్ కే మూర్తి అనే ఆఫీసరు వచ్చాడు. ఆయన నన్ను తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీసు నుంచి కొంత మందిని 90 రోజుల సర్వీసు మీద తీసుకునే వారు. ఎక్కవ మంది మా సెక్షనుకే వచ్చారు. వాళ్ళకి నన్ను బాసుని చేశాడు. రోజూ మా సాయుబు గారితో తగాదేనే. అందర్నీ చెడగొడుతున్నాడు. ఇలా అయితే పని అంతా అయి పోతుంది. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు అని. ముష్టి యుద్ధాల దాకా వెళ్ళేది. కుర్ర బ్యాచ్ అంతా నా వెనకాలే. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని పెళ్ళి చేసుకొమ్మని అడిగారు. రోజూ లంచ్ లు, గిఫ్టులు ఇలా ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూసే వారు. ఆ జీవితమే జీవితం. ఏ సెక్షన్ కెళ్ళినా చాలా మర్యాదగ చూసే వాళ్ళు, పని చెయ్యడం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది. ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను మొదలు పెట్టాక, యూనియన్ కేవలం మీటింగులకే పరిమిత మయ్యింది. సంవత్సరంలో నేను, నేనుగా గుర్తించ బడ్డాను. పొట్టి రెబెల్ గా.
After the fifteen days’ oral
training, I was allotted to Surrenders’ section. I was given 12 files, the
quota for the day. I learned the calculations from seniors and I completed work
by 4’o clock. Next day, by 12’o clock I finished the work. I handed over the
files to the officer. He asked whether I would do more. I took 20 more files
and finished. News reached the communist union in the next section. They came
and taught me Geeta. “If we worked fast like you, you would not have got job.
If you work so fast there will be no pending work and no further recruitment.
Hence, complete your quota and keep with you” Later in one Telugu picture,
N.T.Ramarao says “We neither work nor allow others to work” after he
establishes a union in hell and preaches the workers there how to avoid work.
(Yama Gola). There was a rumor that this sentence was uttered by NTR on the
spur of the moment and it became very famous. Even now, in West Bengal the same
rule rules. From next day, I used to spend two hours in seat and two outside,
depending on the load of work. Later, I started to spend time in bus stop till
10.30 AM looking at girls getting into busses and dreaming. I used to reach
office by 11’o clock, the time at which they used to mark absent. (Even though
there was 10- minute rule and if we crossed it two times, leave was marked,
officers were not daring to implement it. Such was the grip of unions those
days.) Here only, I got acquainted with five more guys. We used to be called
“Agraharam Batch” as all were Brahmins. We used to be together wherever we
went. We used to loiter in bus stops and reach at 11 AM. After confirmation, we
devised a new strategy. There was one talkies nearby, where pictures used to
change every week. We used to sign, take some scrap in hand as if we had some
work in the other section, go to the picture, have lunch and finish work by
evening and go home. Spending time idly at that age was horrendous experience.
If we read books, it came under indiscipline. This was discipline. (reason why
country is like this). After few days I was shifted to Premiums Section, Ledger
Department. At 10’o clock the section head, a Muslim, used to hand over a sheet
containing policy numbers, name, amount paid and date of payment. Huge ledgers
were in large cup boards and, we were provided with high chairs to reach to the
top. We have to compare details and write date in the ledger. The quota was
250. First day, I completed it in half an hour. Our salaries were on the rise
continuously. There was no work to do. I decided one day, I had to break the
jinx. I did 1000 postings, next day 2000 and I reached up to 10,000 postings
one day. My section head got panicked. He complained to the officer that doing
so fast I might commit errors. He asked him to verify. Union people came and
bombarded the office. Mr. Divasahayam, the officer, cajoled them by saying he would
advise me and advised me to reach 15,000. My friends too opposed the quota
system and the union. The quota system failed. Many followed us and were doing
work as much as they can. Lazy guys continued with old practice. At that time
we got a new officer, MR.JRK Murthy. He made me his close aide. At that time,
recruitment of temporary hands was being done by LIC for 90 days. Many used to
come to our section. I was made in charge of them by-passing my immediate boss.
I was guiding them to do the maximum turn out. This led to daily arguments with
my boss. One day, in anger I threw the journal on his face and he made a big
issue. He wanted my immediate suspension. Our Divisional Manager, Mr. Mukundan,
called me and congratulated and with his usual tact saw the issue was resolved.
During this period only, two
girls proposed marriage to me. They were giving gifts, lunch to me. (Don’t
worry. My wife met them after they were married. She knows all my life
stories). I became a talking point. Many used to show lot of love and respect
to me. Many employees were willing to work more but were afraid of the strong
arm tactics of unions. Within a year, I was recognized on my merit and on
my size, as a little rebel.
మన జీవితంలో మనకున్న ఒకే ఒక్క గౌరవం మనమేంటో ప్రక్క వాళ్ళు గుర్తించడం. నా విషయంలో అది అక్షరాలా నిజమయ్యింది. నా జీవితమే ఓ సందేశమయ్యింది. వ్యవస్థకు ఎదురు తిరగల్సిందే అనే నా పట్టుదల ఇంకా పెరిగింది. గర్వమూ పెరుగుతుంది కదా?
“The only respect we have in
life is our neighbors and co-workers recognizing our worth” My life became a
message. My resolve to oppose the system multiplied. With it my self-pride and
arrogance too! Two sides of the coin.
##########################
No comments:
Post a Comment