వాణి త్రిశతి- 300 తెలుగు పద్యాలు
TRANSLATION INTO ENGLISH AND EXPLANATION IN TELUGU
PART 2
వాణి శతకం 2
The following eight poems are translation to the best of my ability, Shakespeare’s Seven Stages of Life in “As You Like It” a philosophy that impressed me at age 18, in my graduation and led me to read the whole lot of Shakespeare dramas with devotion. Must be read in unison to get the full pleasure.
ఈ క్రింది ఎనిమిది పద్యాలు షేక్స్పియర్ వ్రాసిన "మనిషి జీవిత నాటకంలో ఏడు అంకాలు" అనే "As you Like It" అనే డ్రామా లోనిది. ఇది నేను నా 18 వ ఏట చదివిన తరువాత, వారి డ్రామాలు మొత్తం బట్టీ కొట్టి, Walking Shakespeare అని పేరు సంపాదించుకున్నాను. ఎంత గొప్ప వేదాంతమండీ? ఈ ఎనిమిదీ ఒక్క సారి చదివితేనే దాన్లో సారం అర్ధం అవుతుందండీ.
52.
సచ్చు తనక నటన రంగ స్థలము పయిన
వచ్చు నొక్కడు బోయెడి వాడొకండు
ఏడు యంకముల పిదప యముడు వచ్చు
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
చనిపోయే దాకా ప్రతి వ్యక్తీ ఒక రంగ స్థలము పైన నటుడు మాత్రమే. తెర ముందు నటుడు కనుమరగయ్యే లోపు తెర వెనుక నుంచి ఇంకో పాత్రధారి తయారుగా ఉంటాడు. నాటకం ఏడు అంకములు ముగిసే సరికి యముడు వచ్చి కూర్చుంటాడు. నాటకం పరి సమాప్త మవుతుంది.
English:
Original:
And all the men and women merely players;
They have their exits and their entrances,
And one man in his time plays many parts,
His acts being seven ages.
Original:
And all the men and women merely players;
They have their exits and their entrances,
And one man in his time plays many parts,
His acts being seven ages.
The whole world is a stage and we are mere actors playing our role till we breathe the last. One person comes and the other goes, as on a stage. After seven acts, the Lord of Death comes and play ends.
53.
మొదటి యంకము నందున ముద్దు బిడ్డ
తల్లి యొడి లోన ఏడ్చుచు తీరు సేద
చేయుచుండును తగనన్ని చేష్టలెన్నొ
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
మొదటి అంకంలో తల్లి ఒడిలో సేదదీరే పసి పాప, పెద్దగా రోదిస్తూ, ఇంకా ఎన్నో చిలిపి చేస్టలు చేస్తూ తల్లి మనసును ఉల్లాసంగా ఉంచుతుంది
English:
Original:
At first the infant,
Mewling and puking in the nurse's arms.
Original:
At first the infant,
Mewling and puking in the nurse's arms.
In
the first act, it is the baby that rests in the warm bosom of the mother, crying
loud sometimes and indulging in many a mischievous act, to the glee of the
mother.
54.
నత్త బోలిన నెమ్మది నడక తోడ
బడికి బోవగ సంచెడు బరువు తోడ
చేరు రెండవ యంకము చదువు కొనగ
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
రెండవ అంకంలో భుజం మీద సంచెడు బరువుతో, అయిష్టంగానే విద్య నేర్చి ఙ్ఞానమూ, విఙ్ఞానమూ సముపార్జించడానికి నత్త నడక నడిచే బాలిక/బాలుడూ ప్రవేశిస్తారు, తమ పాత్ర పోషించడానికి.
English:
Original:
Then, the whining school-boy with his satchel
And shining morning face, creeping like snail
Unwillingly to school.
Original:
Then, the whining school-boy with his satchel
And shining morning face, creeping like snail
Unwillingly to school.
In
the second act, the reluctant toddler walks slowly with a bag full of books
etc., to the school to improve his knowledge and wisdom through education.
55.
నిట్టు యూర్పుల పాటల నీడ లోన
సేద దీరును వయసున బ్రేమ యందు
ప్రేయసి కను బొమ్మల తలబోసి డస్సి
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
మూడవ అంకంలో, నూనూగు మీసాల లేత వయసు కౌమార దశలో ఉన్న యువకుడు ప్రవెశిస్తాడు. ప్రేయసి విరహ తాపాన్ని తట్టుకోలేక, ఆమె కనుబొమల అందాన్ని వర్ణిస్తూ పాటలు పాడుకుంటూ, నిట్టూరుస్తూ తన పాత్రను పోషిస్తాడు.
English:
And then the lover,
Sighing like furnace, with a woeful ballad
Made to his mistress' eyebrow.
And then the lover,
Sighing like furnace, with a woeful ballad
Made to his mistress' eyebrow.
In
the third part the adolescent enters with a sigh of separation from his lady
love, singing melanchaloic songs on the beauty of her eye brows.
56.
యువత నందును బాధ్యత యెంతొ బెరుగ
యుద్ధ వీరుని వోలెను యోధు డగును
ముక్కు మీదను చిరు కోప మెక్కు డవగ
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
నాలుగవ అంకంలో, జీవితంలో అతి ప్రధాన పాత్ర పోషించడానికి ఉత్సాహంగా యువకుడు ప్రవేశిస్తాడు . ముక్కు మీద కోపం ,మనసులో అకుంఠిత దీక్ష, బాధ్యత పెరిగిన యువకుడు యుద్ధ వీరుని వలె తన పాత్ర పోషిస్తాడు.
English:
Original:
Then, a soldier,
Full of strange oaths, and bearded like the pard,
Jealous in honour, sudden, and quick in quarrel,
Seeking the bubble reputation
Even in the cannon's mouth
Original:
Then, a soldier,
Full of strange oaths, and bearded like the pard,
Jealous in honour, sudden, and quick in quarrel,
Seeking the bubble reputation
Even in the cannon's mouth
In
the fourth part, the effervescent youth, with full of energy and enthusiasm enters
the stage like a soldier to act the most important part in his life.
57.
మేధ పెరుగగ వయసు మీర గాను
చర్చ జరుపును మంచియొ చెడుయొ యనుచు
అనుభ వించును తృప్తిగ యాస్తి యున్ను
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
మధ్య వయసు రాగానే నటుడు పూర్తి, ఙ్ఞానంతో, అనుభవంతో, మంచి, చెడు విశ్లేషిస్తూ రంగ ప్రవేశం చేస్తాడు. తాను సంపాదించి కూడబెట్టిన కొద్ది ధనాన్ని తృప్తిగా అనుభవిస్తూ తన పాత్ర పోషిస్తాడు.
English:
Original:
And then, the justice,
In fair round belly, with a good capon lined,
With eyes severe, and beard of formal cut,
Full of wise saws, and modern instances,
And so he plays his part.
Original:
And then, the justice,
In fair round belly, with a good capon lined,
With eyes severe, and beard of formal cut,
Full of wise saws, and modern instances,
And so he plays his part.
The
middle aged actor enters the scene in the fifth act, with knowledge and wisdom
and ability to discuss what is good or what is bad (a judge) and spends his
life enjoying his wealth.
58.
ముసలి తనమున శక్తి మరుగు పడగ
పోవ బలమును మనసున బాహు లందు
ఒంటి బతుకును నడుపును ఊరు నవ్వ
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
ముసలి వయసు మీదకు వచ్చిన నటుడు శక్తి ఉడిగి, కాళ్ళలోను, బాహువుల్లోనూ, మనసులోనూ శక్తి కోల్పోయి, తన వారు, పర వారూ నవ్వుతుండగా ఒంటరి జీవితాన్ని గడుపుతాడు.
English:
Original
Original
The sixth age shifts
Into the lean and slippered pantaloon,
With spectacles on nose and pouch on side,
His youthful hose, well saved, a world too wide
For his shrunk shank, and his big manly voice,
Turning again toward childish treble, pipes
And whistles in his sound.
The
actor, as he enters the stage in sixth act, is an old, crippled man losing both
physical and mental capabilities and spends a lonely life even as those near and
far mock at him.
59.
మరచి పొవగ తన గతమున్ను తన్ను
తాను బరుల సాయము తోడె తనువు గదల
మరల పొత్తిళ్ళ బిడ్డగ మారి పోవు
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
తనను, తన గతాన్ని మరచి పోయి, వేరే వాళ్ళ సాయం లేకుండా కదల లేని స్థితిలో, ఏడవ అంకంలో ప్రవేశిస్తాడు నటుడు. అప్పుడు మళ్ళీ తాను రంగ ప్రవేశం చేసిన పాత్ర లోకి ప్రవేశిస్తాడు, తిరిగి తెర కను మరుగవడానికి.
English:
Original:
Last scene of all
That ends this strange eventful history,
Is second childishness and mere oblivion,
Sans teeth, sans eyes, sans taste, sans everything.
Original:
Last scene of all
That ends this strange eventful history,
Is second childishness and mere oblivion,
Sans teeth, sans eyes, sans taste, sans everything.
In
the seventh act, the actor forgets himself, his past and in a stage where he
can not do any chores without help, reenters the first stage to disappear
behind the screen permanently. The Drama of Life ends in the seventh Act.
60.
పూల వలచెదు వాటిని పార వైతు
జంతు ప్రేమయు కరిగెను జంపి తినగ
నన్ను బ్రేమింతు నందువు నాకు దిగులు
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
పూలను ప్రేమిస్తానంటావు
వాడుకొని వాడి పోగానే పారవేస్తావు. జంతువుల మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నానంటావు. వాటిని చంపి తింటావు. నన్ను ప్రేమిస్తున్నానంటావు. ఏమొ! నాకు భయంగా ఉంది కదా!
English:
You say you love flowers. But you use them and throw away. You say you
love animals. But you kill them and eat. You say you love me. I am now afraid,
what you will do to me!
61.
ఎప్పుడొదలదు బిడ్డను ఒంటి గాను
వీట వదిలిన నీవామె వెంటె యొందు
మనసు లుండును యమ్మకు ముందు వెనుక
తేట బలికెను ఈ బాణి నాదు వాణి!
తాత్పర్యము (తా):
అమ్మ నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలి పెట్టదు. అత్యవసరంగా వదల వలసి వచ్చినా నువ్వు ఆమె వెంటే ఉంటావు, ఎందుకంటే ఆమె మనసు నీ దగ్గరే వదిలి వెళుతుంది కదా. అమ్మకు ముందూ, వెనుకా రెండు హృదయాలుంటాయేమో!
English:
Mother never leaves you alone. Even if she leaves you at home in emergency,
you are still with her as her heart revolves around you. Who knows, mother has
two hearts one on duty, the other on child?
62.
గుణము యెట్టిదనిన గణియించు టెట్టుల
మనసు విప్పి జూడ మనల తరమె
తల్లి యొకటె చెప్పు తీర్పు యంతయును
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
అన్నదమ్ములలో ఎవరు గుణవంతులని చెప్పడానికి మనము వారి మనసు విప్పి చూసి చెప్ప లేము కదా? తల్లి మాత్రమే సంకోచం లేకుండా గుణ, గణాలను ఎంచ గలదు.
English:
We
can not open the hearts of brothers to decide who is good and who is bad. Only mother
can vouch for their qualities rightly, without any hesitation.
63.
తరచి వేమ (వేమన) జూడు చరితను జదువగ
మంచి యనెదొ యతని జెడ్డ యనెదొ
విశ్వదాభి రామ వినమె బ్రేమ
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
కేవలం ఒక వ్యక్తి గతం మీదనే అతని నేటి గుణాలను ఎంచడం సరి కాదు. అతనిలో ఎంతో మార్పు వచ్చి ఉండ వచ్చు కదా? వేమన చరిత్ర చదివితే, "విశ్వదాభిరామ వినుర వేమ" అని నీతి సూత్రాలు మన నోటి నుండి వచ్చేవా?
English:
We
can not assess the present qualitative attitude of a person, only taking into
account his past behavior. If we read the history of Vemana, would we have
rendered his Satakam (hundred poems) today.
64.
పిరికి వాని తోడ పామరు తోడను
ఙ్ఞానవంతు తోడ జాణ తోడ
తగదు వాదు ఎపుడు తామసు తోడను
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
పిరికి వాని తోటి, పామరుడి తోటి, ఙ్ఞానవంతుడి తోటి, నెర జాణ తోటి, తామస గుణం అధిక పాలులో ఉన్న వాడి తోటి ఎప్పుడూ వాదు తగదు.
English:
Argument with a timid guy, an illiterate ( or foolish guy), a very wise
guy or a Beautiful blonde and with a person afflicted by lowest instinct morally
is futile.
65.
కాల మచ్చి రాదొ కాలుండు బలుకడు
సమవర్తి వచ్చు సమయమునకు
యత్న మేల నయ్య యాత్మ హత్య కొరకు
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
మన కాలం కలిసి రాక పోతే మనకు సహాయ పడడానికి యముడు కూడా రాడు. నిర్ణీత సయానికి ముందు, యముడు మనలను తీసుకు పోడు. అలాంటప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించి మరో పాపం, మరో నేరం ఎందుకు నెత్తిన వేసుకుంటావు? బ్రతికి, శోధించి, సాధించు.
English:
If
our time is not good, why our friends and relations, not even Yama, the Lord of
Death will not help. He comes at the destined hour only. Why do you attempt
suicide and and commit another sin and crime?
66.
నిజము రాగను బయటికి నెలలు బట్టు
గాలి వార్త చేరు గడియయు గడవక
మఱ్ఱి బోదె పడదె మరుగున యూడల
వాణి బలికెను ఈ మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
ఒక నిజం బయటికి పొక్కాలంటే కొన్ని నెలలు పడుతుంది. అదే అబద్ధం క్షణంలో నలు మూలలా పాకుతుంది. మర్రి చెట్టు ఊడలు మర్రి బోదెను కనపడకుండా చేస్తాయి కదా?
English:
Truth
travels months before its real face is seen, while a lie shows its ugly face
immediately. The large banyan tree trunk is covered thickly by aerial roots
that outgrow the original trunk and hides it from view,
67.
చూడ యావ కాద కడు చేదు నువు నూనె
కార ముప్పు గలుప యూరగాయ
మావి ముక్క గలుప యావ కాయయది కదా
వాణి పలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
ఆంధ్రుల అభిమాన ఊరగాయ "ఆవకాయ" మీద ఒక చిన్న పద్యం.
ఆవ రుచి చూస్తే చేదుగా ఉంటుంది గానీ, సమ పాళ్ళలో ఉప్పూ, కారమూ, నువ్వుల నూనే, మామిడి ముక్కలు కలిపి తిని చూస్తే ఊరగాయ "ఆవకాయ" మజా వేరు కదా.
English:
If we taste mustard seeds these taste bitter. If we grind it into powder, mix with suitable amount of salt, chilly powder, til oil it becomes “uuragaaya” (pickle), if we mix unripe mango pieces this pickle is called “aavakaaya”. During season, this is a small scale industry in AP and this is exported world wide. Taste it, it will be Heaven on Earth.
If we taste mustard seeds these taste bitter. If we grind it into powder, mix with suitable amount of salt, chilly powder, til oil it becomes “uuragaaya” (pickle), if we mix unripe mango pieces this pickle is called “aavakaaya”. During season, this is a small scale industry in AP and this is exported world wide. Taste it, it will be Heaven on Earth.
No comments:
Post a Comment