Monday, June 15, 2015


వాణీ శతకము - రెండవ భాగము 

VANI SATAKAMU - PART II


This is is the second lot of the 200 poems I penned. Book will soon come out. 

16. 
చూడ యావ కాద కడు చేదు నువు నూనె
కార ముప్పు గలుప యూరగాయ
మావి ముక్క గలుప యావ కాయయది కదా
వాణి పలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):

ఆంధ్రుల అభిమాన ఊరగాయ "ఆవకాయ" మీద ఒక చిన్న పద్యం.

ఆవ రుచి చూస్తే చేదుగా ఉంటుంది గానీ, సమ పాళ్ళలో ఉప్పూ, కారమూ, నువ్వుల నూనే, మామిడి ముక్కలు కలిపి తిని చూస్తే ఊరగాయ "ఆవకాయ" మజా వేరు కదా.

English: If we taste mustard seeds these taste bitter. If we grind it into powder, mix with suitable amount of salt, chilly powder, til oil it becomes “uuragaaya” (pickle), if we mix unripe mango pieces this pickle is called “aavakaaya”. During season, this is a small scale industry in AP and this is exported world wide. Taste it, it will be Heaven on Earth.


17.
పురుషు డనుచు పరుష పదములు బలుకుచు
భార్య చెంత నీదు బ్రతిభ జూపి
బరువు బాధ్యతలను బడతిపై బడవేతు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పురుషుడననే అహంకారంతో, భార్య దగ్గర పరుష మైన మాటలు మాట్లాడుతూ, తన ప్రతిభ చూపే పురుషులు బాధ్యతలను మాత్రం భార్య పైనే వేసి తమ సరదాలు తీర్చుకుంటూ ఉంటారు కదా!

English:

With male ego the man speaks harshly with wife to show his superiority, leaves the whole family burden on wife and lives an irresponsible life.

18.

పెండ్లికాక ముందు బశువులా నిలిచుండి
వేలమందు నీవు వేలు బలుక
నీదు పడతి గాదె నిను గని వెల గట్టె,
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పెళ్ళి కాక ముందు, వేలంలో పశువులా నిలబడ్డ నిన్ను, వేల రూపాయలు పెట్టి నీ భార్యయే కదా కొనుక్కున్నది?

English: 

Before marriage, when you stood on the auction platform and as your turn came, was it not your wife who bid the highest and owned you?

19.

మొగని ముందుభార్య మోకరిల్లగ నేల
తాను కొన్న కూర తానె తరుగు
కూర కన్న నీకు కలద యెక్కుడిలువ
వాణి పలుకు మాట నాదు నోట! 1

తాత్పర్యము (తా):

భర్త ముందు చేతులు కట్టుకొని నిలబడ వలసిన అవసర మేమొచ్చింది? తాను కొనుక్కున్న కూరగాయలు తరుక్కునే హక్కు తనకే కదా ఉంటుంది? కొనుక్కున్న భర్తకు కూరగాయల కంటే విలువ ఎక్కువ ఎందుకివ్వాలి?

English:

Why should a wife live a subservient life before the husband. Is she not cleaning and cutting the vegetables she bought. What better value does a husband who was bought in marriage market carry?

20.

మీసమొచ్చెనంచు మిడిసి బడి బడతి
ప్రేమ పేరు జెప్పి మీద బడుచు,
తప్పు యనిన ముప్ప తిప్పలు పెడుదువె
వాణి పలుకుమాటనాదు నోట!

తాత్పర్యము (తా):

నీకు మీసాలొచ్చీ రాగానే, ప్రేమ పేరు చెప్పి ఆడపిల్లలను వేధిస్తూ వారిని నానా అల్లరి పెడతావే. వాళ్ళు తప్పు అని అరిస్తే, వాళ్ళను నానా హింసల పాలు చేస్తావు కదా?

English:  (On Eve Teasing)

Soon after you attain adolescence, you start singing love sols in front of innocent girls. If they it is wrong, you start harassing them.

21.

ప్రేమ దోమ యనుచు బడతిపై కసి గట్టి
గొంతు నులిమి యైన గ్రోసి యైన
నీదు కక్ష తీర దునుమాడితివి కదా
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ప్రేమ, దోమ అంటూ ఆడ పిల్లల్ని వేధించి, వారు కాదంటే కక్ష గట్టి వారి గొంతు నులిమి గానీ, కోసి కానీ చపుతున్నవు కదా, ఇది ఎక్కడి న్యాయం

English: (On increasing violence in the name of love)

You tease young girls with assumed love and if they refuse you kill them by throttling them or cutting their throats. What kind of justice is this?

22.

నీకు ఏమి మిగిలె నినుగన్న దలిదండ్రు
లేమి బావుకొనిరి లంప టమ్ము
గాక యేలనయ్య గర్వ మేమి మిగిలె,
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నువ్వు హింసకు పాల్పడి ఆడ పిల్లల్ని చంపి వేస్తే నీకు ఏమి మిగిలింది, నిన్ను కన్న తల్లి దండ్రుల కేమి మిగిలింది? ఏలనయ్యా నీకు అంత మదము?

English: (On consequences of increased adolescent violence in the name of love)

With so much arrogance, if you kill innocent girls what remained for you in life and what remained to your parents who struggled to bring you to this stage, except life long sorrow?

23.

ఉందమన్న యాస యుగయుగాలు మనకు
ఉందమన్న వార లుండ నీడు యముడు
పోదమన్న వార్కి పెరుగును యాయువు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కర్మ ఫలం తప్పించడం ఎవరికి సాధ్యంమనము ఎన్ని యుగాలు బ్రతుకుతాదామనుకున్నా సమవర్తి సమయానికి తీసుకు వెళతాడు కదా? పోదామన్న వారికి ఆయువు పెరుగుతూనే వుంటుంది కదా?

English:

Who can escape his Karma? Those who want to live perennially, will not as the Lord of Death comes on the pre-destined date. For those who really want  their lives to end, life span goes on increasing.

24.

ఉన్న నాల్గు దినము లుపకారములు జేస
జన్మ రహిత పుణ్య జన్మ చాలు
నంచు నీవు సేయు నరుల సేవ నరుడ
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కర్మ ఫలం తప్పించుకోవాలంటే మరు జన్మ లేకుండా చేసుకోవడమే. అందుకే బ్రతికిన నాలుగు దినాలు ఇతరులకు ఉపకారము చేసి జన్మ రాహిత్యం కోసం నీవు పుణ్యము చేస్తూ దేవుణ్ణి ప్రార్ధించడమే  మార్గం.

English: (How to escape this cycle of birth and death?)

If you want to rid of your Karma, it is through attaining Mukti, a state where you have no rebirth. For this, you should be helpful to the needy and do selfless service and pray the Gods to grant you such Mukti, freedom from birth-death cycle.

25.
మాత నే నిను దలచి శతకము రాయ
ఇంత దనక యొక్క యడ్డు లేక
యొక్క వంతు నొక్క నొకటిగ సంపూర్తి
సల్పి నాడ నిన్ను దలచి వాణి!

తాత్పర్యము (తా):

అమ్మా వాణీ! నిన్ను తలచుకొని, శతక శకటం పైన పయనిస్తూ ఒక వంతు ప్రయాణము నీ కృప వల్ల ఇంత దనుక పూర్తి చేసినాడను తల్లీ!

English: (Praying Goddess Vaani for her mercy)

Mother VaaNee! With your blessings I started a journey, on a vehicle to complete a 100 mile journey and without hurdles I could complete one fourth of it till date.

26.


నైజ ముప్పు కాగ నిజము నిప్పు వలెను
యగ్ని యందు పేలు యుప్పు నెపుడు
నీవు దాచు నిజము నిను బేల్చు నొకపరి
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నీ నైజం ఉప్పు లాంటిదైతే, నిజమనేది నిప్పు లాంటిది. ఉప్పు ఏదో ఒక రోజు నిప్పులో పేలక తప్పదు. అల్లాగె నీ నైజంలో నువ్వు దాచిన నిజము పేలి ఏదో ఒక రోజు నిన్ను పేల్చక తప్పదు.

English:

If your nature is like raw salt, truth is like fire. One day the truth you hid in your nature will crack in fire and break you into pieces.


27.

కదప కాలు రాక ముదుసలి యొక్కండు
సిగ్గు యెగ్గు లేక సోమ రొకడు
భార మెవరు యనుచు ధరణి యచ్చెరు వందె
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కాలు కదప లేని ముసలి వాడొకడు, అన్నీ బాగుండి పనీ చేయని సోమరి పోతొకడు, వీళీద్దర్లో నాకు భారమెవరని భూదేవి అచ్చెరువొందుతోందట!

English:

“Out these two, an old man confined to bed unable to do anything and a youth having all healthy limbs unwilling to do anything, who is more of a burden for me?” the Earth is lamenting.

క్రింది మూడు పద్యాలూ ఆడపిల్లల్ని అమ్ముకుండే  మన  సంస్కృతి  పైన.

28.

ఆడపిల్ల యచట యరువది వేలట
నల్లగొండ లోన నడుచు రీతి
బాలురయిన నీకు బహు కష్ట మగునొకొ
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆడ పిల్లల మార్పిడి ముఠాలు నల్లగొండ పట్టణంలో అరవై వేలకు కొంటున్నారట. బాలురకు విలువ లేదక్కడ.

English:

In Nalgonda town the human traffickers are buying a girl for Rs.60,000/- from State Homes.(News reports)  Their is no value for boys there.

29.

అష్టకష్టముల యవలీల భరియించి
ఆడ బిడ్డ కన్న హాని యనుచు
విడిచి పోయె తల్లి విడిది యెచట బిడ్డ 
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నవ మాసాలూ మోసి, ఆడ బిడ్దను కంటే హాని కలుగుతుందని మూఢ నమ్మకంతో, తల్లి బిడ్డను ఎక్కడో వదిలి వేసి వెళ్ళి పొయింది. నీకు నివాస మెక్కడ, బిడ్దా?

English:

After bearing the kid for nine months with difficulty, the mother left the baby somewhere as she felt, in her belief, it is harm to have a girl child. Child! Where is your abode child?

30.

రాక్షసాధములు నిను రక్ష చేసెద మనుచు 
వీధి యందు నిన్ను వెలను కట్ట 
మధ్యవర్తులెవరొ మారు బేరము సేసె
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

విధంగా ఆడబిడ్దకు వెలకట్టి కొన్న మధ్యవర్తులైన రాక్షసాధములు తనను వీధిలో వెలను కట్టి అమ్మిరి కదా?

English:

These demons who bought you for a price, auctioned in you in the midst of a road and sold you to the highest bidder, Oh! Girl! Pity! 
(Most of these girls are landing in prostitute dens) 

                                          ###################################

2 comments:

  1. Suryakamthini prapamchaniki parichayam cheyalanukovdam dussahasam.
    Suryabhagavanudi mundu mokarilladame maha prasadam, manushyulaku.

    Meevanti medhavulatho okato remdo vakyalu sambhashimchadame oka adrushtam, sir.
    Ee padyalanu pogidi, padhimandiki parichayam cheyalanukovadam, naaboti alpa manavulaku thagadu. Kani intha mahadbhuthamayina padyalu nalaga inkondaru chadivi anamdinchalane abhilasha nannu urukoneeyadu. Anduke ee URL naa FB page lo copy chesukuntunnau.

    Namaskaralatho,
    @chandu1302

    ReplyDelete
  2. Thank you for your kind words. Please be following this line. You will get 200. Please be sharing the link on whatsapp too, if possible. Thank you again.

    ReplyDelete