Monday, June 29, 2015

వాణి త్రిశతి- 300 తెలుగు పద్యాలు TRANSLATION INTO ENGLISH AND EXPLANATION IN TELUGU PART 3

వాణి త్రిశతి- 300 తెలుగు పద్యాలు

TRANSLATION INTO ENGLISH AND EXPLANATION IN TELUGU

PART 3



వాణి త్రిశతి- 300 తెలుగు పద్యాలు

TRANSLATION INTO ENGLISH AND EXPLANATION IN TELUGU

PART 3









వాణి శతకం 3



101.

తండ్రి బోయి నేడు దశాబ్దము లవగ
గుఱుతు కొచ్చె వారి గతము నేడు
బ్రతికి యుండ ఎపుడొ బిండము బెట్టెదో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కొంతమంది సుపుత్రులు, తండ్రి పోయిన దశాబ్దాల తరువాత నూరేండ్ల పండుగనో, ఆయన పేరుతో అన్నదానం చేస్తున్నామనో ప్రచారానికి పెద్ద, పెద్ద బొమ్మలు పెట్టి ఆర్భాటం చేస్తారు. నిజానికి వీళ్ళు ఆయన బ్రతికుండగానే వృద్ధాశ్రమంలో చేర్చో, సూటి పోటి మాటలతోనో పిండం పెట్టినంత పని చేస్తారు


English:

Some children make a vaniy show with large ictures of their parents decades after their death in the name of centenary celebrations or charity shows. But, the fact is, when they were alive these children would have harassed them or left them in old age homes to fend for themselves.

102.

అన్న దమ్ము మధ్య యాత్మ కధల ఘోష
పోయినొళ్ళ యాత్మ పొగను బెట్ట
నీదు లోపములను నిలువెత్తు జూపరో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
అన్నదమ్ములు ఒకరి నొకరు తిట్టుకోడానికి ఆత్మ కధలు వ్రాసుకోనక్కర లేదు. అది స్వర్గాన ఉన్న తల్లి దండ్రులకు ఆత్మ శాంతి నివ్వదు. ఎవరు చేసిన తప్పులు వారు చెప్పుకుంటే వేరే వారికి అవి చెప్పవలసిన  లేదు.

English:

Brothers, instead of blaming each other for their plight, should come out with their mistakes in life that effected all. That only gives peace to the departed ancestors.

103.

నీట నుండు చేప నీట నుండగ నీక
వలను వేసి తీసి వాస నందె
మత్స్య ముండు నీటె ముత్య ముండును గద
వాణి బలుకు మాట నాదు నోట
(దుర్మార్గుడని తెలిసి కదిలించి, కవ్వించి వాడు నన్ను తిట్టాడు బాబోయ్ అని పెళ్ళాం దగ్గరేడిస్తే ఊరుకో పిరికి వెధవా అంటుంది. చేపలు పట్టడమెందుకు. వాసన అని ఏడ్చుడెందుకు. అదే సముద్రంలో ముత్యాలుంటాయి, వాసన రావు. ఓపిగ్గా కూర్చుని పట్టు కొమ్మని సారాంశము. చేపల్ని వాటి మానాన వదిలెయ్యి. నచ్చిన వారు పట్టుకుంటారు).

తాత్పర్యము (తా):

నీటిలో బ్రతికే చేపను నీటిలోనే ఉండనీక, వల వేసి పట్టుకొని, వాసన చూసి "పాడు వాసన" అని తిట్టుకోవడమెందుకు? దానిని నీటిలోనే బ్రతకనీయ వచ్చు, లేదా వాసన నచ్చే వాడినే పట్టుకోనియ్య వచ్చు కదా? (అనవసర  విషయాలు మాట్లాడి అవతలి వాడు ప్రతిస్పందిస్తే బాధ పడటం దేనికి?)

English:

An advice to those who pick up quarrels without reason and then if the other person reacts cry their hearts out. Why should one catch the fish that is playing in water, smell it and say it is bad smelling and blame it? You can let it live in water or allow it to be caught by the one who likes the smell.

104.

పలుకరించు యోగి పలు మారు తను తాను
అంతరంగ ఙాన మవధరింప
నీవు నేను సేయ నవ్వు కొందురు గాదె
వాణి బలుకు మాట నాదు నోట

(నీతో నువ్వు ఒక సారి మాట్లాడుకోమంటే నీ ఆత్మతో సంభాషించి ఙానాన్ని పెంచుకొమ్మని. మనతో మనం మాట్లాడుకుంటూ వీధి లోకి పోతే పిచ్చోడనుకుని రాళ్ళుp వెయ్యొచ్చు అని సారాంశము)

తాత్పర్యము (తా):
యోగి యయిన వాడు, సర్వ సంగ పరిత్యాగి, తనలో తాను పలు మార్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన తన ఆత్మతో , తద్వారా సర్వ వ్యాపి యయిన ఈశ్వరుడితో సంభాషిస్తూ ఉంటాడు. పులిని  చూసి నక్క వాత పెట్టు కున్నట్లు మనం కూడా అనుకరిస్తే నలుగురూ నవ్వి పోరా? (సూక్తులు విని నేర్చుకోవాలి కానీ ప్రతిదీ అనుకరించాలనుకొవడం బుద్ధి పొరపాటు

English:

An ascetic, a yogi who left all the worldly possessions talks with himself many a time and smiles in himself. He must be talking to his soul and through it to the Param Aatma, the Gad within himself. If we imitate him, world will consider us as mad and laugh at us. (Quotes are for learing not all are for imitating)

105.

అహంభావ మన్న యది యెటులన్నరో
మాట కటువు కాని మనసు తీపి
వేము చేదు మార మందాకు గాదటె
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కేవలం మాట కరుకుగా ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని అహంభావి అని ఎలా చెప్ప గలం? అతని మాట కరుకుగా ఉన్నా మనసు వెన్న లాగా మెత్తగా ఉండొచ్చు కదా? వేప ఆకు తింటే చేదుగా ఉంటుంది. కానీ దాని లోపల ఎన్ని ఔషధ గుణాలుంటాయి?

తాత్పర్యము (తా):

( మందాకు యనగా herbal plant) తత్వము మారిన మనిషిని విమర్శించడం సబబా అనేది పద్య సారాంశము)
English:

We can not brand a person arrogant simply because he talks harsh. His heart might be soft like butter. Is not the Neem leaf that is bitter a useful medicine with many good qualities?

106.

చిన్న తనపు బొమ్మ చెప్పును కధలను
చిత్త మెట్లు మారు చెప్పు టెట్లు
వేచి యున్న బండి వేగ మెట్లు దెలియు
వాణి బలుకు మాట నాదునోట!
(చిన్న తనపు బొమ్మలు nostalgia కాదు . రోజు గుణం ప్రధానము అని సారాంశము)

తాత్పర్యము (తా):

చిన్న తనంలో మనం తీసుకున్న, గీసుకున్న చిత్రాలు ఎన్నో తీపి గురుతులతో కూడిన కధలు చెప్తాయి. కాని వయసు పెరిగిన కొలదీ గుణం ఎలా మారిందో చెప్పాలంటే ఇప్పటి ప్రవర్తనే రుజువు కదా?

English:

The photos we take, the selfies we painted during childhood tell many a story, that we call nostalgia. But, who knows how each changed in his character as he grows up. For that the bench mark is his present behaviour only.

107.

పేరు గొప్పదిబ్బ యూరు యనునటుల
వృక్ష మేమి జెప్పు వంశ యశము
తాత నేయి నాక మూతి వాసన జూతె
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మా తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా వంశ వృక్షం చూస్తే వంశం గొప్పతనమెలా తెలుస్తుంది? What are you at present is more important.
English:

Our ancestors were royal. They were eating food in gold plates. This is what the “Family Tree” tells. It is not nostalgia. What are you at present is more important.

108.

బిడ్డ జాతకమ్ము బహు బాగ రాసెను
తాను బోవు వేళ తెలియడాయె
తనయు డేడ్చె ఖర్చు తలకు మించేని
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

జాతక రత్న తండ్రి పిల్లల జాతకం చాలా బాగా వ్రాసి పుస్తకంలో భద్ర పరిచాడు కాని, తను పోయే వేళ మాత్రం తెలియక చేతిలో చిల్లి గవ్వ లేకుండా మరణిస్తే, జాతకుడైన కొడుకు, కర్మ కర్చుల గురించి వగచాడే?

English:

Astrologer father wrote the predictions of his sons and carefully kept the book with him. But unable to predict his own death, he died penny less. And the rich sons cried over the funeral expenses.
1
109.

భార్య కడుపు మాడ్చి బుత్రుల బెంచగ
తాను పోవు వేళ యొకడు లేడాయె
యల్లు డొచ్చి బలుకు యెకసక్కె మాటలు,
వాణి బలుకు మాట నాదు నోట! 151

 (మనిషి కట్టె యయ్యాక మోయడానికి దొరికిన వ్యక్తే బ్రహ్మ ఙాని. అయిన వాళ్ళు తప్పించుకుంటే ఉన్న వాళ్ళే మోస్తారని సారాంశము)

తాత్పర్యము (తా):

భార్యకు కూడా కడుపు నిండుగా తిండి పెట్టకుండా పిల్లల్ని పెంచితే, ఆమె పోయే నాటికి ఒక్కడూ కనపడకుండా పోయాడే. పైపెచ్చు, కర్మ కాండ కర్చులు పెట్టడానికి కూడా తటపటాయించారే పిల్లలు? బయట వాడైన అల్లుడు వచ్చి ఏగతాళి చేసే స్థితికి తెచ్చుకున్నారు కదా పిల్లలు?

English:

Even without feeding wife properly, father brought up children. By the time she passed away, none was availabale to carry her body. And the son-ln-law, mocks she died like an orphan.

110.

బతికి యుండగ బుండు వాసన వెగటాయె
శవము చూడ కొంత సమయ ముంచు
యనెడి బుత్రు నేమి యనెడు శాస్త్రములును,
వాణి బలుకు మాట నాదు నోట!

The son who left the country unable to bear the smell coming out of the body of the mother on bed, asks the son who looked after her, bearing all, to keep the dead body until he comes. What should we call such a son?

(తల్లి మంచాన బడి పుండ్ల వాసనతో ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్న కొడుకు మీద ఏనాడూ తల్లి మంచం దగ్గర లేకుండా, కుళ్ళి శల్య మౌతున్న శవాన్ని ఇంట్లో ఉంచుకో మేము రెండు రోజుల తరువాత వస్తామూ,అమ్మని చివరి సారిగా చూడాలి అని శవ పంచాయతీ పెట్టే ప్రబుద్ధుల గురించి చిన్న ఆట వెలది)

తాత్పర్యము (తా):

తల్లి మంచాన వేదన పడుతుంటే విదేశాల్లో ఉన్న పిల్లలు కనీసం చూడడానికైనా రాకుండా, ఆమె పోయాక మాకు చివరి సారి అమ్మను చూడాలని ఉంది, రెండు రోజులు సవాన్ని ఉంచు అని హుకుం జారీ చేస్తే, అన్ని నెలలూ వాసన భరించిన కొడుకు, కోడలూ పరిస్థితి ఏమిటి? (ఇది చాలా ఇళ్ళల్లో జరుగుతున్నది. మా ఇంట్లో కూడా జరిగింది)


111.

బతికి చెడిన వాడు బతికించు ఇతరుల
చెరచి బతుక నెంచ చేరు యముని
చీమ కుట్ట గానె చేరదె కాలుని
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

బాగా బ్రతికి జీవితంలో దెబ్బ తిన్న వాడు ఇతరులకు సహాయం చేసి బ్రతికించడానికి ప్రయత్నిస్తాడు. ఇతరులను చెరిచి బ్రతకాలనుకునే వాడు త్వరగా యముణ్ణి చేరుకుంటాడు. చీమ కుట్టగనే చచ్చి పోతోంది కదా?

A person who lived a luxurious life and fell from grace, tries to help the needy as he knew the pitfalls. The person who wants to enjoy at others’ misery will soon reach hell. Does the ant that bites not die instantly?


112.

కాశి వెళ్ళ జూచు కాగల వరుడును
మూడు ముళ్ళు వేసి మొగుడు యయ్యె
అరుంధతిని జూప యప్పు గానగ వచ్చె
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఇది చాలా పెళ్ళిళ్ళల్లో జరిగే తమాషా తతంగం. పెళ్ళికి ముందు, వరుడు కాశీ వెళతానంటాడు. తీసుకొచ్చి బలవంతంగా పిల్లకి మూడు ముళ్ళు వేయిస్తారు. దాని తరువాత, పట్ట పగలు అరుంధతిని చూపిస్తారు. "అరుంధతి సంగతేమో గానీ ఆరు లక్షల అప్పు కనబడుతోంది" అన్నాట్ట పెళ్ళి కోసం అప్పులు చేసిన వరుడు.

English:

In many Hindu marriages (especially Brahmins) just before marriage the boy walks to go to Varanaasi, to take Sanyasa. But he will be forced to tie the knot. Then, they show a star in the morning also. That is Arundhati. The boy laments, he does not see Arundhati but a debt of six lakhs rupees made for marriage! A funny ritual!

113.

అన్న దమ్ము నడుమ యగ్గి రాచల్లుడు
యత్త మామ నెటుల యాదరించు
కాడు బోవు వేళ కట్నంబు యడుగడా
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే అల్లుడు, అత్త, మామలను ఎలా గౌరవంగా చూస్తాడు? వారు కాటికి పోయేటప్పుడు కుడా, వెనకబడి కట్నమడుగుతాడేమో

English:

The son-in-law of the family that ignites fire between brothers-in-law, treats his parents-in-law with contempt only. He may run behind the dead bodies of them demanding more dowry.


114.

అన్న దమ్ము చెల్లి యనువు నుండగ
అల్లు డేల మిమ్ము గిల్లు చుండు
కట్న మడుగ చేరు కటకటాల వెనుక
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే అల్లుడు, అత్త, మామలను ఎలా గౌరవంగా చూస్తాడు? వారు కాటికి పోయేటప్పుడు కుడా, వెనకబడి కట్నమడుగుతాడేమో

English:

If the brothers and sisters stand on one word, how can the son-in-law harass the family for more dowry? If he exceeds the limitations of law, he will find himself behind bars.


115.

సోదర బ్రేమ బోయి స్వార్ధమ్ము నిండగ
బయటి వారి నడుమ పల్చనవరో
మిత్ర భేద కధను మరచితి రెటులయా
వాణి బలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

సోదరుల మధ్య ప్రేమ నశించి, ఎప్పుడైతే స్వార్ధం పెరుగుతుందో, అప్పుడు బయటి వారి ముందు చులకన అవుతారు కదా! "మిత్ర భేదము" కధ మరిచి పోయారా?

English:

If the natural love between siblings gives place to extreme selfishness, the whole lot becomes laughing stock in front of others. Did they forget the “Mitra Bheadamu” (rivalry between friends) moral story?

116.

నీదు తండ్రియె నిజమని నీకు తెలియ
నీదు తనయుడు తప్పులు నీవి యెంచె
వేప చెట్టుకు కాయునె వెలగ పండు
తేట బలికెను బాణి నాదు బాణి!

తాత్పర్యము (తా):

నీ తండ్రి చెప్పింది, చేసింది సరి యయినదే అని నువ్వు తెలుసుకునే లోపు, నువ్వు చెప్పిన్స్, చేసిన్స్ దానిలో తప్పులెంచే కొడుకు ఉంటాడు. వేప చెట్టుకి వలగ పండు పుట్టదు కదా!

English:

By the time you realize that what your father did and said was right, you may already have a son who picks up your mistakes. How can a neem tree bear an (elephant) apple fruit?



117.

తల్లి దండ్రులు బతుకగ డబ్బు లెక్క
తీరి పోవ తద్దినమున తీర్చు లెక్క
వారు తినెడి మెతుకు తుదకది కాకి లెక్క
తేట బలికెను బాణి నాదువాణి!

తాత్పర్యము (తా):         

తల్లి, దండ్రులు బ్రతికి యుండగా వారి మీద ఎంత కర్చు పెట్టామనేది లెక్క.వారు పోగానే, వారి ఆస్తి పంచుకునే లెక్క. చివరికి వారు తినే మెతుకు కాకికి లెక్క.

English:

When parents are alive, the children calculate how much money they were spending on them. When they pass away, immediately they calculate the booty to be shared. Ultimately, the proverbial crow that eats the grains kept fot it in the ceremonies, finalizes the calculation.


118.

ఆమ్మ బంచు కొనిరి అన్నయు దమ్ముడు,
ఆరు నెలలు ఇచట ఆరు యచట
కడకు తన్ను కొనిరి కర్చుల మీదట,
వాణి పలుకు మాట నాదు నోట!

 తాత్పర్యము (తా):        

అమ్మ నీ దగ్గర ఆరు నెలలూ, నా దగ్గర ఆరు నెలలూ ఉంటుందని, జీవితమంతా ధారపోసి పెంచిన, తల్లిని పంచుకొని, ఆమె కాల ధర్మం చెందాక ఎవరెంత కర్చు పెట్టారనే విషయంలో కొట్టుకున్నారట. ఎంత దౌర్భాగ్యం?

English:

Two brothers shared the burden of mother that sacrificed her life, to bring them up for six months each. And when she passed away, they fought over the expenses each one bore on her welfare.

119

కన్న ప్రేమకు విలువను కట్టె నొకడు
నన్ను కనినదనినెటుల నమ్మ గలను
యనుచు నొక్కడు చితికి ని ప్పెట్ట డాయె
తేట బలికెను బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

ఒక తనయుడు, కన్న తల్లి ప్రేమకు విలువ కట్టి, ఈమె నన్నే కన్నది అని ఆధారం ఏమిటి అని అడిగి, ఆమె చితికి నిప్పు పెట్టడానికి నిరాకరించాడత. (యదార్ధ ఘటన ఆధారంగా)

English:

One son valued the love his biological mother and refused to perform last rites as he did not believe he was her biological son. (this poem is based on a real incident)

120.

కలిసి వచ్చిన సిరిదా కూడ బెట్టె
పెట్ట డెవరికి తన చేత పట్టె డైన
యముడు గొంపోవ తన వెంట యేమి వచ్చె
తేట బలికెను బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

కాలం కలిసి వచ్చినప్పుడు, సిరిని లెక్క లేకుండా కూడ బెట్టడు. అవసరంలో ఉన్న వాడికి, ఆకలైన వాడికి ముద్ద పెట్టి ఎరగడు. కాలుడు  వచ్చి తీసుకు వెళ్ళేటప్పుడు ఏమి వెంట తీసుకు వెళ్ళ గలిగాడు.

English:

When time was in favor, he earned and hoarded a lot of wealth. He never helped the needy or hungry.When the God of Time, Lord of Death took his breathe away, what accompanied him?



121.

దోశ వడ ఇడ్లి తినవయ దక్షిణాన
పావు వడ భాజి తినవయ పశ్చిమాన
వెన్న రోటిని తినవయ వుత్తరాన
తేట బలికెను బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

భారత దేశం అనేక రుచుల, అబిరుచుల సంస్కృతుల సమ్మేళనం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి. దక్షిణానికి వెళ్తే, దొస, ఇడ్లీ, వడ, పశ్చిమాన రుచికరమైన పావు, భాజీ, వడ, ఉత్తరాన వెన్న రొట్టె (నాన్) దొరుకుతాయి. కానీ మళ్ళీ ఇవన్నీ దేశంలో అందరూ ఆదరించే వంటకాలే.

English:

India is a country with differing tastes and cultures, but unified as a nation. If you go South you get recipes of Idly, Vada, Dosa the delicious, in the West you get Pav, Vada, Bajee very tasty, in the North you get delicious, soft naan (roti) with butter. But, the whole population relishes these dishes.



122.

లఘువు తీసి దీర్ఘము గురులాయె మనకు
ప్రాస వాడెడి బోయీడు పరగె యతిగ
లఘువు గురువులు యతి ప్రాస లయ్యె పదము
తేట బలికెను గీతి నాదు వాణి!

ఇచ్చట ప్రాస యనగా ఈటె, పదము పాదమునకు రూపాంతరము. యతి వాల్మీకి.

తాత్పర్యము (తా):

లఘువు దీర్ఘము తీసి గురువుగా మారింది. (శిష్యుడు విద్య నేర్చి గురువు అయినట్లుగాప్రాస (ఈటె) వాడే వాల్మీకి యతి అయ్యాడు. లఘువు, గురువు, ప్రాస, యతి యే కదా, పద్య పాదానికి మూలము?

There is no English translation as it is poem with jugglery of words in Telugu.

124.

నీటి యందు యుండును చేప నిలకడగను
బయటి కొచ్చిన తెలియును బాధ ఏమొ
భార్య పొగబెట్ట చూడుము భర్త బాధ
తేట బలికెను గీతి నాదు వాణి!

తాత్పర్యము (తా):

నీళ్ళల్లో ఉండే చేప తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ చిన్న చేపలని మింగుతూ కాలం గడుపుతుంది. బయటకు  వస్తే కదా దాని ఆటలు తెలిసేది. భార్య నెమ్మదిగా ఉన్నప్ప్పుడే, భర్త దౌర్జన్యం. ఒక్క సారి ఆమె పొగబెడితే బయటికొచ్చిన తరువాత ఆమె విలువ తెలుస్తుంది.

English:

A fish in water will be playing, preying on smaller fish. Once out of water, it will be fish out of water. Like that, husband harasses wife who is docile. Once, she revolts and throws him out he knows her value.



125.

పెరటి చెట్టు కాయ మందుకు పనికి రాదు
వీట కవి యున్న యింతయు విలువ లేదు
నీదు స్త్రీ కన్న జారిణి నీకు బ్రీతి
తేట బలికెను గీతి నాదు వాణి!

తాత్పర్యము (తా):

మన పెరట్లో ఉన్న చెట్టు మందుకు పనికి రాదు. మన ఇంట్లోనే కవి ఉన్నా విలువ లేదు. భార్య కన్నా పరాయి స్త్రీ భోగం ఎక్కువ ప్రీతి!

English:

The medicinal plant that grows in our backyard is not fit for use. The poet in our own house has no value. Man goes behind another woman discarding his own. What morals?

126.

బిడ్డ (ఆడపిల్ల) పుట్టిన దీపము బెట్టు నౌగ
వారసుడు బుట్ట దీపము వూదు దేల
ఏలమారెను నా జాతి యిట్టి రీతి
తేట బలికెను గీతి నాదు వాణి.

తాత్పర్యము (తా):

ఆడ పిల్ల పుడితే ఇంట్లో దీపం పెడుతుంది కదా? వారసుడు పుట్టాడని పుట్టిన రోజున దీపమార్పే సంస్కృతి ఎక్కడనుంచి వచ్చింది? మన సంస్కృతికి ఏమి అయ్యింది?

English:

If a girl child is born, she will light the lamp in the house. Why are we putting of candles when a baby boy is born? What happened to our culture?

127.

పుణ్య మన నేమి యడుగును పాప చింత
పాప మన నేమి యెరుగడు పుణ్య జీవి
పాప పుణ్యము లెరుగడు బడుగు జీవి
తేట బలికెను బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

పుణ్య మంటే ఏమిటి అని అడుగుతాడు పాప చింత చేసే వాడు. పాపమెంటే తెలియదు పుణ్యాత్మునికి. పాప, పుణ్యాలు రెండూ తెలియవు పేద వాడికి. (ఆలోచించే సమయం కూడా ఉండదు)

English:

A sinner never knows what is “sacred”. A sacred man never knows what sin is. The person who is in search of livelihood never thinks about what is sacred and what sin. He has no time for that.

128.

భోజనము బెట్టి గను వాని భావుకతను
భజన జేసి జూడుము వాని భాజనమ్ము
చూడు మంతము నధికారి సామర్ధ్యమ్ము
తేట బలికెను బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

భోజనము కడుపు నిండా పెడితే వ్యక్తి భావుకత అప్పటికి కానీ బయటికి రాదు. (కడుపు కాలే వాడు కవిత్వమేం చెప్తాడు). భజన చేసి (పొగిడి) చూడుము వాని యోగ్యత. (పొగిడితే గానీ వానిలో సామర్ధ్యము బయటికి రాదు). అధికారంతమున చూడు అయ్య వారి సౌభాగ్యము.
English:

Fill the hungry stomach. Then only the real poetry comes out of him. Adulate him to the maximum, he shows his power. See the official after he lose power. (Power feeds him)

50.
ఆటవెలది నేను యర శతకము రాయ
వాణి నాడు నేడు తోడు నిలిచె
రాసెద మిగులు సగము రస తేట గతి తోట
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
128.

కాలు డొచ్చు వేళ నలుగురు నిను మోయ
కాలు వేళ నెవరు కాన రారు
బంధు మిత్రు లంచు (లెనసి) బతుకంత వగచెదె
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

జీవితమంతా బంధువులూ, మిత్రులూ అని వారి గురించి బాధ పడతావు కానీ, నువ్వు పోయాక నలుగురు నిను మోసే వాళ్ళు దొరకరు. నీ కట్టె కాలే వేళ ఒక్కరూ దగ్గర నిలబడరు కదా.

English:

You grieve for your friends and relations throughout life. But when you reach the graveyard, you may not get four people to vcarry your body. Nor, none stays near when the body is cremated.

129.

నీదు పనిని నీవు నిపుణత సేయంగ
శివుని యాఙ్న ఏల శివుడు ఏల
శివుడు ఏమి సేయు సోమరి నీవైన
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నీ పని నువ్వు నైపుణ్యంతో చేస్తే శివుడు ఎందుకు, ఆయన ఆఙ్న యెందుకు? నువ్వు సొమరి వైతే, శివుడు మాత్రం ఏం చేస్తాడు?

English:

If you do your work skilfully, why do you require God or His help? If you are lazy what can God too do to help you?


130

ఏది నిజము కల్ల యదియేది యరయగ
బుట్టు గిట్టు టెల్ల గుట్టు గాగ,
కర్మ ఫలము కాక వేరు మర్మ మున్నదే
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నిజము ఏది, కల్ల ఏది. పుట్టుట, గిట్టుట అనేది అంతా భగవంతుని మాయలో భాగమే కదా? అంతా కర్మ ఫలమే
కదా?
English:

What is Truth, what is a Lie! The whole creation is still mystery. This birth and and death are part of the fruits of Karma carried from birth to birth.


131.

ఆడ బిడ్డ పుట్టు నాడ నీ వనృత
మనుచు మాట లాడ జనులు నిజము
తెలియు ననుచు యాడ నలుసు నటె విడిచె
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):

అబద్ధ మాడే వాళ్ళే ఆడ పిల్లని కంటారని సామేత విని, తాను అబద్ధమాడిన సంగతి బయట పడుతుందేమోనని క్న్న బిడ్డను దారిలో వదిలేసి వచ్చిందట అమాయకురాలు. (అబద్ధం చెప్పని దెవరు, ప్రపంచంలో)

English:

There is a saying in Telugu that the lady who tells lies begets girl child, an innocent lady left the girl she delivered there itself fearing that she would be exposed. Who lies not in this world?

132.

పగలు సూర్యు డొచ్చు పడమర బోవును
నెలబాలు చూడ నెలయు గడిచె,
ఆమ్మ నిన్ను గాచు జన్మలు జనమలు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పగలొచ్చే సూర్యుడు, పడమర పోయి మళ్ళీ మరునాడే కదా కనపడతాడు. చందమామ, మనకి పూర్తిగా కనపడటం  మొదలయ్యేది నెలకొక్క సారే కదా? కాని నిన్ను తల్లి జన్మ, జన్మలకూ కాపాడుతూనే ఉంటుంది కదా? వారిని పూజించే మనము, తల్లిని ఎందుకు దూరంగా ఉంచుతున్నాము?

English:

The Sun comes in the morning and goes West to return only next morning. The Moon starts appearing only every month. But mother looks you after forever. Why do we adore them as Gods and throw out mothers?


133.

కన్న తండ్రి, గురువు జందె మేయ నొకడును
రక్ష సేయునొకరు, బిక్ష వేయు
నొకరు పితలు యయిదుగురు బుత్రుకు
వాణి బలుకు మాట నాదు నోట

ఇది శంకరనారయణ శబ్ద రత్నాకరంలో "పిత" అనే పదానికి అర్ధం ఇచ్చేటప్పుడు రాసిన విషయం .పద్య రూపంలో.
ఇక్కడ బిక్షము అంటే పొషించే వాడు అని అర్ధం. బ్రహ్మచర్య దీక్షలో ఇది భాగం. అంత వరకే.

తాత్పర్యము (తా):

బ్రహ్మచర్య దీక్ష చేపట్టే వటుడికి తండ్రి సమానులు ఐదుగురట. కన్న వాడు, గురువుజంధ్యమేసిన వాడు, బిక్ష వెసే వాడు, రక్ష చేసే వాడు ఐదుగురూ తండ్రి సమానులే.

English:

For a boy after the thread ceremony there are five people who are equivalent to father. The man who is biological father, the one who puts sacred thread around, the teacher, the man who feeds and the One that protects.

134.

తల్లి కష్ట పడగ తనవంతు సాయము
చేయ డెపుడు కొడుకు చేత నయిన
వధువు చూడ యడుగు వచ్చునా వంటని
వాణిబలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
తల్లి వంట ఇంట్లో నానా యాతన పడుతుంటే సాయ పడని మగ వాడు, పెళ్ళి చూపుల సమయంలో ఆడ పిల్లని "వంట వచ్చా " అని అడుగుతాడు? ఎలా వస్తుంది, అమ్మాయీ నీలాగే చదువుకుంది కదా? వివక్షకు ఇంకో రూపం.

English:

This is another example of how we discriminate girls. The boy, that never lent a helping hand in her household chores, asks the bride to be “Do you know cooking?”. “How can she, when she is equally educated?

135.

పాలు యమ్ము వాడు బలమును యిచ్చును
బిచ్చ మెత్తు శివుడు ఇచ్చు ముక్తి
మద్య మమ్ము వాడుమత్తును పంచును
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మనం రోజూ చూసే విషయాలల్లో కూడా అంతర్లీనంగా  ఉన్న అర్ధాన్ని గ్రహించము. పాలు అమ్మే వాడు, మనకి బలం ఇస్తాడు. రోజూ బిచ్చమెత్తుకునే శివుడు ముక్తి ఇస్తాడు. మద్య మమ్మే వాడు మత్తెక్కిస్తాడు.

English:

The man who sells milk provides strength to our body. Lord Shiva who is supposed to live on alms provides salvation. The man who sells liquor sends us into intoxication. Though we daily see these, we do not think about them much.

136.

పాలవాడు కలుపు పాలును నీరును
మద్య మమ్ము వాడు మిధ్య చూపు
వర్తకములె రెండు వాసన తేడరా
వాణి బలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):

రెండూ వర్తకాలే!   పాలమ్మే వాడు నీరు కలిపి అమ్మి మోసం చేస్తాడు. మద్యమమ్మే వాడు మిధ్య చుప్పిస్తాడు. రెండూ వ్యాపారాలయినా వాసన వేరే (పద్ధతి)

English:

The milk seller adds water and cheats us. The liquor seller shows us the other world, mixing what, we do not know. Both are commercial. But only the smell(the way) differes.

137.

బతికి యుండ ముద్ద బెట్ట బరువు యాయె
కర్మ కాండ జరుగ కాన రావె
శిక్ష ఏది తల్లి శిక్షణ ఎట నీకు
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కన్న వారు బ్రతికుండగా వారి కడుపు నింపడం బరువనుకున్న కొడుకు, కనీసం వారు పోయాక చివరి చూపు చూడడానికి కూడా రాలేదు కదా? వీరికి తల్లి ఇచ్చిన శిక్షణ ఎక్కడ పోయింది? శిక్ష ఏమిస్తే సరి పోతుంది?

English:

When parents are alive the son thought they were a burden. At least when they paased away, he did not come to see their body. Where did the training of mother vanish? What kind of punishment he deserves?

138.


చదువు రాక యున్న బతుకగ వచ్చును 

ఙాన తృష్ణ యున్న జన్మ వరము

అక్షరమ్ము రాక యధికారి కాడొకో

వాణి బలుకు మాట నాదు నోట!  



తాత్పర్యము (తా):

బ్రతకడానికి కేవలం చదవడం పరీక్షలలో ఉతీర్ణులవడం మాత్రమే అవసరం లేదు. ఙాన తృష్ణ ముఖ్యం. అక్షరం రాని వాడు కూడా కృషితో అధికారి అవడం చూస్తున్నాం కదా.

English:

For making a gainful living, education and passing out examinations is not the only way. If you have the inclination to gain knowledge there are many ways. Are we not seeng people in higher power circles, who do not have basic education?



139.


వాద పటిమ యున్న వేద పండితుడును 

కటిక శ్రమ కోర్చి కాడె ఙాని 

పెద్ద వారు బడలు ఫలమును నీకివ్వ 

వాణి బలుకు మాట నాదు నోట!  


తాత్పర్యము (తా):

వెదాలను చదివి, వాదనలో తన ప్రతిభ చూపించే పండితుడు ఎంతో కష్ట పడి కదా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మీ పెద్ద వాళ్ళు కష్ట పడి ఫలం నీకిచ్చారు.

English:

The highly erudite Vedic scholar passed through many trials and tribulations, served teachers and improved his knowledge and prowess to argue. Your position today is owning to the troubles the parents went through.


140.


బద్ధకమ్ము నీది బెద్ద వారి ననకు 

నీకు వచ్చు విద్య నీవు నేర్వు 

జాత కర్మ గలియు ననుచు కూర్చొన బోకు

వాణి బలుకు మాట నాదు నోట!  

తాత్పర్యము (తా):

నీ సోమరి తనానికి నువ్వు చదువుకోకుండా, విద్యా వ్యవస్థని, నీ పెద్ద వారిని, గురువులనూ తిడుతూ కూర్చుంటే ఫలమేముంటుంది? నీక విద్య మీద ఆసక్తి ఉందో అదే నేర్చుకో. మన కర్మ బాగా లేదంటూ జాతకాలని తిట్టుకుంటూ  కూర్చోకు.

English:

Don’t blame the elders, the education system and the teachers for your failure in examination due to your laziness. Whatever you are adept at, you learn that. Do not sit at one place blaming the stars for failure. Rise and win!

141.

వయసు యడ్డు కాదు విద్య నేర్వగను 

త్రోవ తప్ప బోకు తామసమున 

గదిలి యుద్ధమందు గెలిచియె నిలువుము

వాణి బలుకు మాట నాదు నోట!



తాత్పర్యము (తా):

విద్య నేర్వడానికి వయసు అడ్డు కాదు. తామస బుద్ధితో, త్రోవ తప్ప వద్దు. కదిలు యుద్ధంలో గెలిచే వెనక్కు రమ్ము.

English:

There is no age restriction to gain knowledge. With your mean mentality do not go astray. Rise. Fight and win.


142.

బావి యందు కప్ప బావియె జగమను

బయటి కొచ్చి జూడ బుట్టె రోత

బాల్య మందె జూడు బాధ్యత యననేమి

వాణి బలుకు మాట నాదు నోట!

(బాల్యంలో ఏమీ పట్టించుకోకుండా, నన్ను ముట్ట బోకు నామాల కాకి అనుకుంటూ ఉండి కాటికి దగ్గరవుతున్న సమయం లో "గుర్తుకొస్తున్నాయి" అని చెప్పే వాళ్ళకి సందేశం


తాత్పర్యము (తా):

బాల్యంలోనే బాధ్యత తెలుసుకొని, తన తల్లి, దండ్రులకి, అన్న దమ్ములకి అండగా ఉండే వాడు పెద్దయిన తరువాత బాధ్యతలంటే బరువనిపించదు కదా! బావిలో ఉండే కప్ప బావే ప్రపంచమనుకుంటే, బయటి కొచ్చి చూస్తే అంతా రోతగా ఉంటుంది కదా!

English:

Frog in the well thinks it is the world. When it comes out the whole world looks like hell. If a son takes responsibility from childhood and looks after family, he won’t feel it is burdensome as he grows.

143.


తండ్రి బతికి యుండ తెలియుట బాధ్యత 

అప్పు చేసె లేక యడుగు కొచ్చె

కష్ట పడగ వారు కలిమి నీదాయెగ

వాణి బలుకు మాట నాదు నోట!



తాత్పర్యము (తా):

రోజు తమ కలిమి చూసుకొని మురిసే వారు తమ తండ్రి తమను పెంచి, పెద్ద చెయ్యడానికి అప్పే చేసారో, అడుక్కు తెచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా?

English:

The children who flaunt their wealth today, never thing hoe their father brought them up. Did he borrow, beg or steal (in some cases)


144.


క్షమయె తండ్రి గుణము క్షమ కోర తప్పేమి

తనయు వీరంగమ్ము తాళ  లేక 

కొడుకు మాట మీర కోతిలా ఎగురుదే

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

తన చిన్న తనంలొ తాను చేసిన తప్పులకి తండ్రి క్షమాపణ చెప్పాడంటే బాధ పడే వాడు, తన కొడుకు వీరంగం ఓర్వలేక కుప్పి గంతులు వేస్తాడే. క్షమించడం తండ్రి గుణం కాదా?

English:

The person, who feels that his father had to seek apology for his idiosyncrasies, today dances like a monkey on hearing his son is opposing him. Is it not the basic quality of a father to seek apology on behalf of children.

145.


పచ్చ కామెర రాగ పచ్చగా కనిపించు

అడవి యెల్ల మర్రి జడలు గాను 

మనసు మంచి దైన వనమెల్ల బూలెగా

వాణి బలుకు మాట నాదు నోట!

(మనసు నిర్మలంగా ఉంటే మర్రి జడల వనము కూడా 
మల్లె వనంలా కనిపిస్తుంది

తాత్పర్యము (తా):

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగే, అడవి యంతా మర్రి జడలుగా, భయంకరంగా అనిపిస్తుంది. మంచి మనసుతో చూస్తే అదే వనం పూల వనంగా తోచదా?

English:

The jaundiced eye sees the whole world as yellow. The forest looks eerie with Banyan trees. If the heart is pure, the same forest looks like a flower garden.

146.

నీవు బెట్టు ముద్ద నిలువెల్ల దోపిడీ 

పరులు యదియె సేయ ఫల మాశి యించి

మత్సరమ్ము వీడి మనసును కడుగరో 

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

నువ్వు చేసిన చిన్న దానం కూడా నిలువు దోపిడీ చేసి ఇచ్చినంతగా చెప్పుకుంటావు. అదే ఇతరులు చేస్తే ఏదో ఆశించి చేశారని ప్రచారం చేస్తావు. మాత్సర్యమనే (అసూయ) శత్రువునుజయించి మంచి మనసుతో చూస్తే నిజం బోధ పడుతుంది.


English:

Whatever little charity you do, you speak high of it and say you donated your whole property. If the same is done by others you spread a canard that it was quid pro quo. Leave jealousy aside and see with pure heart,


147.


యుగము మారె రెండు యుగమ్ములు గడిచెను

రామ రాజ్య మందు రాజ నీతి

కృష్ణు డొచ్చె రీతి భక్తికి మారగ

వాణి బలుకు మాట నాదు నోట!  

తాత్పర్యము (తా):

త్రేతా యుగం పోయి రెండు యుగాలు మారినాయి. త్రేతా యుగంలో రాముడు, రాజ నీతిని ధర్మంగా పాటించాడు. ద్వాపరంలో, రాజనీతి, భక్తి రీతి తెలిపాడు శ్రీకృష్ణుడు.


English:

Post Treata Yug, two Yugas changed. In Treta Yug, Lord Rama ruled as per the rule book. In dvaapara Sree Krishna taught us Bhaki Maarg (Devotion) with rule of law.


148.


రాము డాదరించె సవతి తల్లి వరము

సవతి తల్లి బెంచె సత్య బతిని

(కలిది) కాల మహిమ కాదె కన్న తల్లి మరువ

వాణి బలుకు మాట నాదు నోట!  

తాత్పర్యము (తా): రాముడు సవతి తల్లి మాటని ఆదరించాడు. శ్రీకృష్ణుడు సవతి తల్లి ప్రేమలోనే పెరిగాడు. కాల మహిమో, కలి మహిమో ఇప్పుడు కన్న తల్లికే విలువ లేకుండా పోయి, స్త్రీ జాతి చులకన అయ్యింది కదా?

English:

Lord Rama respected the word of his step mother’s word. Lord Sree Krishna was brought up by his step mother. Is it curse of time or Kali, that today we forget our biological mother too and ill treat women?


149.



రాము డన్న బ్రేమ సోదరులకు 

త్యాగ బుద్ధి యందు యోగి యతడు

కాల మహిమ గాదె వెల గట్టె దమ్ముల

వాణి బలుకు మాట నాదు నోట!  

తాత్పర్యము (తా):

శ్రీ రామచంద్రుడికి తన తమ్ములంటే ఎంతో ప్రేమ. త్యాగ బుద్ధిలో మహా యోగి ఆయన. రోజు, తమ్ముడి సంపాదనకే విలువ కాని మనిషికి లేదే?

English: Sree Rama loved his brothers immensely. In sacrifice he is a Yogi for all times. What times have come, brothers are valued on their assets and liquidity?


150.


శీలమన్న నేమి శారీరకమె గాదు

భక్తి శివుని పైన రక్తి ఎటనొ

సూక్తి ముక్టావళియు రిక్తమౌ యట్టిచో

వాణి బలుకు మాట నాదునోట!  



తాత్పర్యము (తా):

శీలమనేది కేవలం శారీరకమే కాదు. మన్సు కూడా నిర్మలంగా ఉన్నవాడే శీలవంతుడు. శివ పూజలు చేస్తూ భక్తి ఇక్కడ, రక్తి మాత్రం పరాయి స్త్రీ మీదా అయితే, ఇంకా సూక్తి ముక్తావళి శూన్యమే కదా!

English:

Character is not related to acts of bodily senses. Even heart should be oure. Sitting in a Temple of God, if one’s mind wandes on sensual pleasures, the whole moral lessons are garbage.

151.


సత్ప్రవర్తన యన సత్సంగ మొకటేన 

సూక్తి చెప్పు వాడు సజ్జనుండె

సూక్తి వినెడి వాడు శుద్ధి యెపుడగునొ

వాణి బలుకు మాట నాదునోట!  


తాత్పర్యము (తా):
కేవలం సత్సంగాలు జరిపి సూక్తులు వింటే సత్ప్రవర్తన వస్తుందా? సూక్తులు చెప్పేవాడు సత్ప్రవర్తన కలిగిన వాడేనా అని మనం ఎప్పుడైనా చూస్తున్నామా? ఇంతకీ సూక్తులు వినేవాడు ఎప్పటికి సద్బుద్ధి నేర్చుకో కలుగుతాడు?

English: If you want to mend yourself, mere hearing preaching by Priests will not suffice. Should we not look into the moral background of the Priest or Preacher? If that is the case, when will the listener turn to Good Samaritan?


No comments:

Post a Comment