Thursday, September 10, 2015

VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE

VANI TRISATI - THREE HUNDRED POEMS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE 



తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11  తరగతి తరువాత తెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూతదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషా పుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానే మిగిలి పోయిందిఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నానుకాని ఏనాడూ ఒక్క పద్యం కూడ పూర్తి చెయ్యలేదు.

It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకునా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టానుచిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణ సూత్రాలులఘువులుగురువులువృత్తాలుయతిప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నానునా భార్య సలహా తీసుకున్నానుపద్యం పూర్తయ్యాకఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చునాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పిందికుదరలేదుసరైన పదంవదిలెశాను.
ఇక మీ ఓపిక.

At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.

వాణి శతనానికి నాందీ పద్యము.

కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!

Dedicated to Goddess of Knowledge, Vani.

నా చదువుల రాణి వాణికి అంకితం.

Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.






వాణి శతకం





1.

రామ యనిన నాడు రసమయ భావన,
రామ యనిన నేడు రాదొ కీడు,
మతము పెరు చెప్ప మలమల మాడ్చరే,
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
ఒకప్పుడు రామ అని పలుకగానే నరనరాల్లో భక్తి భావన కలిగేదినేడు రామ అనగానే ఏమి ముంచుకొస్తుందోనని భయంఎవరి మతము పేరు వారు చెప్పుకోవడానికి కూడా భయ పడే పరిస్థితి. (ఇదేమి సెక్యులరిజం అని

English:

Once upon a time, if we chanted the name of Rama, people used to go into a trance. Today, the very word Rama became a taboo. Verbal attacks are increasing on people who say they belong to a particular religion. (Is it the secularism we dreamed of?)


2.
నాదు మతముయనిన నగవుల పాల్చేయ
ఇట్టి రీతి ఇంక ఎన్ని దినము
లింక వేచి చూడ లావు లేదు ప్రభూ
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):
నా మతము పేరు చెప్పుకుంటే నన్ను నవ్వుల పాలు చేస్తున్నారుఇలా ఇంకెన్ని రోజులుప్రభూవేచి చూడ నాకు శక్తి లేదురామా?

English:
I am becoming a laughing stock to say the name of my own religion. How many years can I wait like this my Creator? I am losing power to wait further.

3.

జర్నలిజము పేరు జగడమె నడవడి
పేరు గొప్ప వూరు పెద్ద గుబిలి
నోరు దెరువ రాదు నిజము యెన్నటికిన్,
వాణి పలుకు మాటనాదు నోట!

తాత్పర్యము (తా):
పేరుకి జర్నలిజమే. ( గొప్ప శాస్త్రమే).కానీ ప్రస్తుతమున్న జర్నలిజం కేవలంజగడానికి మారు పేరయిజగడిజం అయిందని చెప్పుకోవచ్చుపేరు గొప్పే కానీ ఒక శకున పక్షి లాగా ఎప్పుడూ చెడు చూడడమే అలవాటైంది (గుబిలిఒక రకమైన శకున పక్షిపేపర్ తెరిస్తే అన్నీ అబద్ధాలే.

English: Journalism is a great subject. But, today, it has become synonymous with litigation, and apt to be named as “Jagadism”. Name is great but like a bird that always represents a bad Omen, Media is looking at the bad only. Many a rumor is spread without basis.

4.
దొంగతనమొ ఏమొ దొరల చేతి వడువొ
చర్చి బగుల గొట్ట సెక్యులరులు,వ్యాండలిజము యనుచు వీధిపై మొరుగగ,వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
చర్చులు పగులగొట్టే పని ఎవరు చేశారుదొంగతనమైనా అయి ఉండాలి లేదా పెద్దలు పూనుకొని పని గట్టుకొని చేసి ఉండాలి (ప్రభుత్వాన్నిఇరుకున పెట్టడానికి). సెక్యులరిజం పేరుతో ఇలాంటి తప్పుడు పనులు చేయడమే కాకుండా వీధి కెక్కి "వ్యాండలిజంఅని మొరుగుతున్నారే? (ఒడువుపూనిక)  

English: In the country, at many places churches were broke open. It must be the act of thieves or the determined effort of some secularists to defame government, by attacking churches and barking on streets in the name of “Vandalism”.

Note: This was written in the specific context and is not a general issue.

5.

నీదు పనిని నీవు నిపుణత సేయంగ
శివుని యాఙ్ఞ ఏల శివుడు ఏల
శివుడు ఏమి సేయు సోమరి నీవైన
వాణి పలుకు మాట నాదు నోట! 42

తాత్పర్యము (తా):
నీ పని నీవు నిపుణతతో చేయకుండాశివుని యాఙ్ఞ కాలేదని శివుణ్ణి నిందిస్తే లాభమేమిటినువ్వు సోమరి వైతే శివుడు మాత్రం ఏం చేస్తాడు.

English:

If you don’t do do your work skillfully and blame the Lord, what can the Lord do? If you are lazy, in what way can He come to your rescue?

6.

కాలు డొచ్చు వేళ కదలరు నిను మోయ
కాలు వేళ నెవరు కాన రారు
బంధు మిత్రు లంచు (లెనసిబతుకంత వగచెదె
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
బంధువులుమిత్రులునానీ బేధాలతో బ్రతుకంతా వేదన పడతావు కానికాలుడు (యముడువచ్చే సమయానికి నలుగురైనా నీ వెంట ఉండరునీ కట్టె కాలుతున్నప్పుడు ఎవరూ కన్నీరైనా కార్చరు. (ఉన్న నాలుగు రోజులు అందరూ నీ వాళ్ళే అనిఫలితం  భగవంతుని మీద వదలమని భావన)

English: As long as you live, you cry for friends and relations and thoughts of “mine” and “yours”. But when the Lord of Death approaches, you will not find four people to carry your body, nor any one really sheds tears for you at the pyre. (So, during life time, develop a sense of belonging to the society and pray the Lord, as far as possible. Help others)

7.

బదుకు బ్రహ్మచారి ముదురు బెండ వలెనె
భార్య నిచ్చి చూడు మారు లేత
పడుచు జంట యనుచు పడిపడి పొగడరే
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మానవుల ద్వంద నీతి  పద్యంలో వర్ణించ బడిందిపెళ్ళి కానంత వరకుబ్రహ్మచారిని ముదురు బెండ కాయ అన్న లోకమే పెళ్ళి కాగానే అతను చాలా లేత వయసు కాడు అన్నట్లు  జంట కనబడితే " చూడుపడుచు జంట చూడ ముచ్చటగా లేదూ?"  అని ఆశ్చర్య పడతారు కదా!

English: Hypocrisy in the talk of general public is described in this poem. As long as a boy is not married, he is mocked as a “fully ripe and useless lady’s finger” (can’t cook it). But once he gets married, the same couple is called, “See! How the young couple is looking!”


8.
చెట్టు పుట్ట నరికి చేతనమ్ము తెగటార్చి
నేల యంత కుళ్ల నీవు బొడువ
యవని కుంగె నీదు యతియాస గనియును
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):
చెట్లను నరికిపర్యావరణ చైతన్యాన్ని చేతులార చంపి వేసిభూమిని కుళ్ళ బొడిచావు కదానీ అత్యాసకు భూమి కుమిలికుంగి కంపించింది కదా!

English: You cut trees. You killed the environment with your hands all for your selfish purposes. Seeing your selfishness, earth cried, depressed and drooped and quaked with anger.


9.

వొక్కసారి భూమి విలవిల యరువంగ
పుట్టకొక్క రయిన భూమి జనులు 
దైవ ఘటన యనిన దను యేమి సెయునొకో,వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):
ఒక్కసారిగాభూమి పెద్దగా అరిచి కదిలి పోగాచెట్టు కొకరుపుట్ట కొకరు అయిన ప్రజలు ఇది దైవ ఘటన అని అనుకుంటే ఏమి ప్రయోజనంమీ స్వార్ధానికి మీరే బలవుతున్నారు కదా? ( నేపాల్ భూకంపం సందర్భంగా ఇకనైనా భూమిని కాపాడుకుందాం అని చిన్న సలహా వంటిది

English:  When the earth, crying loudly, moves away from its hemisphere, people ran helter-skelter crying for the lost ones and putting the blame on God. What can He do if your selfishness reached a point of no return? (These two poems were penned as an advice to people to. at least from now, protect our Earth on the sad incident of quakes in Nepal)

10.

ఎర్ర చందనంబు ఎటుబోయె తెలియదె 
యొక్క ముద్ద కొరకు యూరి జనులు
మారణాగ్ని యందు మలమల మాడరే
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఎర్ర చందనం ఎక్కడుందో మనకి తెలియదుకానీమల మల మాడ్చే జఠరాగ్ని చల్లార్చుకోవడానికిఅమాయక కూలీ జనాలుపోలీసులుస్మగ్లర్ల మధ్య జరిగిన మారణాగ్నిలో మలమల మాడి పోయారు కదా? (ఆంధ్రాలొ జరిగిన మారణ కాండ పైన

English: Common man does not know where the red sandalwood has gone. But to satiate their appetite, those daily wagers who came to work for pittance were killed in the cross fire between police personnel and smugglers. How sad? (On recent killings of daily wagers in AP State, India) 


11.

హిందువనిన నాడు హరిత వర్ణము గాదె
హిందువనిన నేడు హేయమయెగ
సెక్యులరిజ మన్గ సరితూగమని గాదె,
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):
హిందూ మతమనగా ఒకప్పుడు లేత పచ్చని ఆకులతో నిండిన చెట్టు వంటిది కదాఅదే హిందూ మతమంటే తాను పుట్టిన దెశంలోనే హేయమయినదిగా భావించబడుతోందేరాజ్యాంగంలో చెప్పింది "సర్వ మత సమ భావం” సెక్యులరిజం అని కదా!

English:

In days of yore, the Hindu religion was like a tree filled with tender green leaves. Today, the same religion is taboo in the nation of its birth. Did Constitution not say that “secularism” means “equality of religions”?

12.

ఆడ బిడ్డ పుట్టు నాడ నీ వనృత
మనుచు మాట లాడ జనులు నిజము
తెలియు ననుచు యాడ నలుసు నటె విడిచె
వాణి పలుకు మాట నాదు నోట.


తాత్పర్యము (తా):
అబద్ధాలు ఆడితే ఆడ పిల్లలు పుడతారని” నిన్ను భ్రమలో పెట్టిందా అమ్మా లోకంనువ్వు అబద్ధాలాడావని నిజం బయట పడుతుందేమోనని ఆడ పిల్లని పురిట్లోనె వదిలి వచ్చావా తల్లీ? ( ప్రపంచంలో అబద్ధమాడని  వారెవరమ్మా?)

English:

Did the superstitious belief that if you beget a girl child it is proof you told lies, make you fear and leave girl child in the hospital bed bed? (In this world who lives without telling a lie?)


కరణీకాలు పోయినా కొంచెం పాత వాసనమా తాతగారు కరణమే.

13.

మరణ మయిన నేమి కరణము దరి రాదు
ధనము తేక  దరికి రాగ వెరచు
లెక్క గట్టి యచటె లయము జేయు
వాణి పలుకు మాట వినర నరుడ!

తాత్పర్యము (తా):

కరణీకాలు పోయినా కొంచెం పాత వాసనమా తాతగారు కరణమే.

మరణమయినా కరణం దగ్గరకు  రాదు. యముడు కూడా  డబ్బులు తేకుండా రావాలంటే భయపడతాడులెక్కలు కట్టి అక్కడే యముడి డొక్క చించుతాడుడబ్బుతేక పోతే యముడు కూడా బయట నిలబడాల్సిందే.


English:

Even if the hereditary Village Officer posts were abolished, still the heirarchy remains. My grandfather was a Karanam too!

Without bringing money, even the Lord of Death, Yama, fears to approach a Village Officer. He makes calculations and audits Yama’s account. If there is no money, even Lord Yama has to stand outside a Village Officer’s house.


14.
రాశి పోసి యమ్మ రతనాలు గొనిరట
నేడు యచట చూడు నీటి కరువు
రతన మంటి సీమ పతన మాయెను కదా
వాణి పలుకు మాట నాదు నోట

తాత్పర్యము (తా):

అక్కడ ఒకప్పుడు రతనాలు రాశులుగా పోసి అమ్మారని ప్రతీతి రోజు అక్కడ నీటి చుక్క కూడా దొరకని స్థితిరత్నం లాంటి రాయల సీమ ఎంత పతనమయ్యిందో కదా? (రాయల సీమలో కరువు తాండవిస్తోందినాధుడేడీ?)

English:

Folklore has it that people used to buy pearls sold on roadside in heaps. Today the area is so dry that one drop of water costs the value of a pearl. What a fall to the Rayala Seema Area? (About the perennial drought in Rayala Seema area)


15.

యముడు యొచ్చు నంచు యెద నిండ భయ మేల
సూర్యు నెపుడు సేయ నేల పూజ
యముడు సూర్యు కొడుకు యోచించ రెటులనో
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

యముడు వస్త్తాడని ఎప్పుడూ భయమేకానీ సూర్య దేవుడిని మాత్రం రోజూ పూజ చేస్తాంయముడు సూర్య దేవుడి కొడుకే కదా. (అంటే మనం ఎవర్ని చూసి భయ పడక్కర లేదో వారిని/వాటిని చూసి భయ పడతామెందుకో)

English:

Why do we fear the Lord of Death, Yama and pray to Lord Suurya daily? After all, Lord  Yama is the Son of Lord Surya. (Means we fear that/him/her that we need not fear)

16.

పెండ్లికాక ముందు బశువులా నిలిచుండి
వేలమందు నీవు వేలు బలుక
నీదు పడతి గాదె నిను గని వెల గట్టె,
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పెళ్ళి కాక ముందువేలంలో పశువులా నిలబడ్డ నిన్నువేల రూపాయలు పెట్టి నీ భార్యయే కదా కొనుక్కున్నది?

English: Before marriage, when you stood on the auction platform and as your turn came, was it not your wife who bid the highest and owned you?

17.

మొగని ముందుభార్య మోకరిల్లగ నేల
తాను కొన్న కూర తానె తరుగు
కూర కన్న నీకు కలద యెక్కుడిలువ
వాణి పలుకు మాట నాదు నోట! 1

తాత్పర్యము (తా):

భర్త ముందు చేతులు కట్టుకొని నిలబడ వలసిన అవసర మేమొచ్చిందితాను కొనుక్కున్న కూరగాయలు తరుక్కునే హక్కు తనకే కదా ఉంటుందికొనుక్కున్న భర్తకు కూరగాయల కంటే విలువ ఎక్కువ ఎందుకివ్వాలి?

English:

Why should a wife live subservient life before the husband. Is she not cleaning and cutting the vegetables she bought? What better value does a husband who was bought in marriage market carry?


18.

ఉందమన్న యాస యున్న యుగయుగాలు మనకు
ఉందమన్న వార లుండనీడు యముడు
పోదమన్న వార్కి పెరుగును యాయువు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కర్మ ఫలం తప్పించడం ఎవరికి సాధ్యం?  మనము ఎన్ని యుగాలు బ్రతుకుతాదామనుకున్నా సమవర్తి సమయానికి తీసుకు వెళతాడు కదాపోదామన్న వారికి ఆయువు పెరుగుతూనే వుంటుంది కదా?

English:

Who can escape his Karma? Those who want to live perennially, will not, as the Lord of Death comes on the destined date. For those who really want  their lives to end, life span goes on increasing.

19

ఉన్న నాల్గు దినము లుపకారములు జేస
జన్మ రహిత పుణ్య జన్మ చాలు
నంచు నీవు సేయు నరుల సేవ నరుడ
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కర్మ ఫలం తప్పించుకోవాలంటే మరు జన్మ లేకుండా చేసుకోవడమేఅందుకే బ్రతికిన నాలుగు దినాలు ఇతరులకు ఉపకారము చేసి జన్మ రాహిత్యం కోసం నీవు పుణ్యము చేస్తూ దేవుణ్ణి ప్రార్ధించడమే మార్గం.

English: (How to escape this cycle of birth and death?)

If you want to rid of your Karma, it is through attaining Mukti, a state where you have no rebirth. For this, you should be helpful to the needy and do selfless service and pray the Gods to grant you such Mukti, freedom from birth-death cycle.


20.

నైజ ముప్పు కాగ నిజము నిప్పు వలెను
నిప్పు యందు పేలు యుప్పు నెపుడు
నీవు దాచు నిజము నిను బేల్చు నొకపరి
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నీ నైజం ఉప్పు లాంటిదైతేనిజమనేది నిప్పు లాంటిదిఉప్పు ఏదో ఒక రోజు నిప్పులో పేలక  మానదుఅలాగే నీ నైజంలో నువ్వు దాచిన నిజము పేలి ఏదో ఒక రోజు నిన్ను పేల్చక తప్పదు.

English:

If your nature is like raw salt, truth is like fire. One day the truth you hid in your nature will crack in fire and break you into pieces.

21.

కదప కాలు రాక ముదుసలి యొక్కండు
సిగ్గు యెగ్గు లేక సోమ రొకడు
భార మెవరు యనుచు ధరణి యచ్చెరు వందె
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కాలు కదప లేని ముసలి వాడొకడుఅన్నీ బాగుండి  పనీ చేయని సోమరి పోతొకడువీళ్ళిద్దర్లో  భారమెవరని భూదేవి అచ్చెరువొందుతోందట!

English:

“Out these two, an old man confined to bed, unable to do anything and a youth having all healthy limbs and unwilling to do anything, who is more of a burden for me?” the Earth is lamenting.

22.

దైవ దర్శన మనుచు వడి వడిగ బోయి
మూఢ జనలు మండుటెండ నిలువ
గొప్ప జనులు గనిరి రెప్పపాటు నన్నిన్ను
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

దైవాన్ని దర్శించుకుందామని మూఢులైన పేద ప్రజలు త్వర త్వరగా పోయి మండుటెండలో గంటలు నిలబడితేగొప్ప వారు క్షణంలో నీ దర్శనం చేసుకు పోతున్నారు కదయ్యాశ్రీనివాసా?

English:

This is a telling poem on the situation prevailing in the Temples of Gods. “Even as illiterate, poor folks are running to see your image and are standing in the queues for hours, the Very, Very Important Persons are having your Darshan (view) in seconds! Whither justice, Lord!”

23.

బతికి యున్న యపుడె భగవంతు దలచుము
పైకి బోయి చూడ ఫలము లేదు
ఉండి లేని వాని యునికి గను టెటుల
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

బ్రతికుండగానే భగవంతుణ్ణి తలుచుకోఎందు చేతనంటే పోయాక, ఉన్నాడోలేడో తెలియని భగవంతుని కోసం ఎక్కడ వెదుకులాడుతావు? (భక్తి మార్గమే ముక్తి మార్గమని సూచన)

English:

Pray and try to see the God when you are living. Or else, after you die where can you search the One you do not know whether exists or not. (Bhakti (devotion) is the only way to attain Mukti (Salvation) )

24.

చెప్పె నీతు లెన్నొ చిల్లర దేవుడు
కాసు పుచ్చు కొనక కదలి రాడె
ఆస్తులెన్నొ వెనుక యవధానికి కనరో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

 మధ్య రోజుల్లో చాలా మంది ప్రవచన కర్తలు వివిధ వేదవేదాంతాలపై ఉపన్యాసాలు దంచేస్తున్నారు.  వీరు చెప్పే నీతుల్లో అరిష్డ్వర్గాలను విడవమనేది ముఖ్యం శత్రు వర్గంలో లోభంమోహం కూడా ఉన్నాయి కదామరి  ప్రవచన కర్తలు డబ్బు ముట్టందే కాలు కదుపుతారావీరికి వెనుక ఉన్న ఆస్తులెన్నివాటి మీద వ్యామోహమెంతఅనేది ఎవరు చూస్తున్నారుతనకి పనికి రాని నీతి వేరే వారికి ఎలా పనికి వస్తుంది?

English:

Recently, many preachers are preaching non-stop the scriptures and their contents. Out of these winning over the six enemies (kaama (desire), kroadha (anger), loabha (miserliness), moha (attachment), mada (arrogance), maatsrya (jealousy)) is the main preaching. But, how many of these really move out of their homes if money is not offered as remuneration for the preaching> How many of them accumulated wealth and are deeply attached to it. If they can’t get rid of attachment and miserliness, how can others follow them? How can moral that does not apply to them apply to others?


25. 

మాత నే నిను దలచి శతక శకటం
బెక్కి ఇంత దనక యొక్క యడ్డు లేక
యొక్క వంతు నొక్క నొకటిగ సంపూర్తి
సల్పి నాడ నిన్ను వలచి వాణి!

తాత్పర్యము (తా):

అమ్మా వాణీనిన్ను తలచుకొనిశతక శకటం పైన పయనిస్తూ ఒక వంతు ప్రయాణము నీ కృప వల్ల ఇంత దనుక పూర్తి చేసినాడను తల్లీ!

English: (Praying Goddess Vaani for her mercy)

Mother VaaNee! With your blessings I started a journey, on a vehicle to complete a 100 mile journey and without hurdles I could complete one fourth of it till date.



26.

ఆకలైన వాడె అసలైన సాధువు
కడుపు మాడ వాడె కాల ఙ్ఞాని
సిరిని వదిలి చెప్పు శ్రీరంగ నీతులు
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆకలైన వాడే అసలైన సన్న్యాసికడుపు మాడితే కాల ఙ్ఞానం అదే వస్తుంది సాధువులు , సంతులుప్రవచన కర్తలు వారివారి సిరిని దానం చేసి అప్పుడు నీతులు చెప్తే విన సొంపుగా ఉంటుంది.

English:

The hungry man is the real Ascetic. When hunger burns the fuel inside, the Time Sense and preaching in the Holy Books automatically come to mind. These preachers and priests can donate their wealth and then preach, it will be precious to hear.

27.

మురికి వాడ యున్న ముదుసలి వినకున్న
వచన సార మెల్ల వ్యర్ధ మవదె
రాగ మిడక నీవు త్యాగము నేర్పెదో
వాణి బలుకు మాట నాదు నోట! 194

తాత్పర్యము (తా):

మురికి వాడల్లో దుర్భరంగా బ్రతుకు ఈడుస్తున్న ముసలి వాడు మీ ఙ్ఞాన బోధ వినలేనప్పుడు మీ ప్రవచన సారం వ్యర్ధమే కదామీరు రాగ బంధాలు తెంచుకోకుండా ఇతరులకు త్యాగం నేర్పడం నవ్వుల పాలవడమే కదా! (కడుపు నిడిన ధనికులకు ఏమి చెప్పి ఏమి ప్రయోజనం)

English:

Unless the old man living in the slums pathetically, hears your preaching, is it not a waste of energy? Without you getting rid of your own attachments and sacrifice self, how can others do it on your boding. (What is the use of preaching selfish rich people, the art of sacrifice?)

28.

చిన్న తనము నందె సన్యసించిన వారు
చెప్ప శాస్త్ర మదియె చంప కమ్ము
బంధ మిడక బలుక గంధ మగునె బాణి
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఎవరైతే చిన్నతనంలోనే అన్ని బంధాలనూ తెంచుకొని రాగాలకూఅనురాగాలకూ దూరంగా ఉండి సమస్త సంగాలనూ పరిత్యజిస్తారోవారు చెప్పే శాస్త్రాలు చంపక పుష్పం లాగా పరిమళాలు వెదజల్లుతాయి కదా!  బంధాల్ని విడువకుండా చెప్పే ఉపన్యాసాలు  ఙ్ఞాన సుగంధాన్ని వెదజల్లుతాయా?


English:

The preaching of those who quit the mundane life for Higher Learning during childhood and keep themselves away from the physical and material, those pearls of wisdom coming out of their tone spread the fragrance of Jasmine Flower. Without leaving the mundane for attaining the Supreme, whatever these worldly people preach do not spread any fragrance. (It is like Holy Water thrown in a drain)

29.

స్వఛ్ఛ భాష తోడె సమము దేశమవుగ
సంస్కృతమ్ము మనదు సంస్కృతి గదె
దేశ భాష నేర్వ దిమిదిమి దరువేల
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఒక స్వఛ్ఛమైన భాష దేశాన్ని ఏకం చేస్తుంది కదాసంస్కృత భాష మన సంస్కృతిలో భాగమే కదామరి  భాష నేర్చుకోడానికి  దరువు లెందుకు? ( ఇంత గోల దేనికి అని అర్ధము)

English:

One pure language unites the nation. Is not Sanskrit part of our culture? Then, why should we make it such a big issue?

30.

సోకు భాష వినగ సరస మేలగనయ
సొంపు భాష నేర్వ సొలయు దేల
సంస్కృతమ్ము బోయె సంకర మొచ్చెరా
వాణిబలుకుమాటనాదు నోట!

తాత్పర్యము (తా):

మనకు భాష సోకుగా ( అంటే భాష వివిధ వంకరలతో నెరజాణ మాదిరిఉంటే  భాష వెనుకనే పరుగులు పెట్టనేలవిన సొంపుగా ఉండే సంస్కృతమంటే యేహ్య భావమేలసంస్కృతము పోయి సంకర భాష వచ్చింది కదా!

English:

Why do we run behind a foreign language that has may turns in its body (like a beautiful lady) instead of learning our own language Sanskrit that is melodious to the ears? The days of Sanskrit are gone and in its place came adulterated languages. (mix of many languages into one)


31.

ధ్యాస యెటులొ మనదు భాషయు యటులనె
తప్పు సేయు వాడు తప్పు బలుకు
భాష శుద్ధ మయిన బతుకు శుద్ధ మగును
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మన ఆలోచనా సరళి ఎలా ఉంటుందో మన భాష అలాగే ఉంటుందితప్పు చేసిన వాడి నోట్లోనుంచే తప్పుడునీచమైన పదాలు వస్తాయిమన భాష శుద్ధంగా ఉంటే మన జీవితాలు శుద్ధంగా ఉంటాయి.

English:

The way we think and act reflects in our language. If we commit mistakes and cover up, we tend to use harsh, un-parliamentary language. If our language is good, it shows our life is good and we think good.


32.

భార్య రోత బుట్ట బోయె సానుల వాడ
క్షణము సుఖము వ్రణ మారు నెలలు
ధనము మింగె సాని దార సేసె సేవయు
వాణి బలుకు మాట నాదు నోట! 155

(ధనము బోయి వ్రణము మిగుల  రోతను గుణం చేయడానికి నీకు రోత బుట్టిన భార్యయే గతి యని సారాంశము)


తాత్పర్యము (తా):

భార్య అంటే రోత బుట్టి సాని వాడలకి పోతే, "అర నిమిషం భోగంఆరు నెలల రోగంఅని సామెత వ్రణాలు తగ్గిన దాకా సేవ చెయ్యలంటేడబ్బు తీసుకున్న సాని రాదు కదారోత బుట్టినాకరుణించి సేవ చేసేది నీ భార్యే కదా!

English:

If you get allergic to your wife and visit red light areas, you will land with half second of pleasure and six months’ of suffering from disease. Even if you hate your wife, she is the one who serves you until you are cured. Will the other woman who gave you pleasure for money come and serve?

33.

పుట్టు నపుడు లేదు బోగవచ్చె గోత్రము
పాడె మోయ ఏల బ్రహ్మ ఙ్ఞాని
దిక్కు చూప వచ్చు దేవుడి కులమెదో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మనం పుట్టేటప్పుడు లేని కుల గోత్రాలు (మంత్ర సాని కదా మనల్ని బయటకు తీసేదిపోయినప్పుడు ఎక్కడనుంచి వస్తాయిమన కట్టె మోయడానికి మన కులం వాడే కావాలనే నీతి సూత్రమేమిటిదిక్కు లేనప్పుడు మనలని కాపాడే  దేవుని కులమేదిగోత్రమేది? (మా అమ్మగారు పోయినప్పుడు అన్నదమ్ములు రాకుండా శవం ఎలా తీస్తారని పని లేని ఒక చుట్టం శాస్త్రం లేవదీశాడుమా పని వాళ్ళే మోస్తారు అని చెప్పిన దానికి  రోజు వరకు వెలేరాని వాడి తప్పు కంటే కుళ్ళి శిధిలమవున్న పార్ధివ శరీరానికి  నేనే అంత్య క్రియలు చేయడంలో తప్పేమిటి)

(మనిషి కట్టె యయ్యాక మోయడానికి దొరికిన వ్యక్తే బ్రహ్మ ఙానిఅయిన వాళ్ళు తప్పించుకుంటే ఉన్న వాళ్ళే మోస్తారని సారాంశము)

English:

The caste and creed that were not there when we were born (Do we know the caste of the nurse that brings us to this world?), come to the fore when we die? What kind of morale is there is in this? What caste or creed the God that helps us in time of need belong to? (when my mother died and three of my brothers delayed their arrival and her body was decomposing, I wanted to cremate her. One relation, who never looked after her during her convalescence, raised an objection as who would carry the body. I said my workers would do. Till now, I am a taboo in the family. Am I at more fault than those sons who delayed their arrival despite traveling by planes for personal chores?)

34.

పేద కడుపు నింప బెనుగు లాడెడి వాడు
పెళ్ళి సేయ బెట్టు పెద్ద ఖర్చు
డాంబి కమ్ము నడుమ దయ యేడ దాగెనో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పేద వాడికి ఇంత ముద్ద పెట్టి కడుపు నింపడానికి వెనుకాడే వాడుపెళ్ళి మాత్రం మహా వైభోగంగా చేస్తాడు. ( మధ్య పుట్టిన రోజులుచీరలిచ్చే రోజులుపంచెలిచ్చే రోజులుఉపనయనాల్లోనూ  ఒరవడి ఎక్కవయింది). ఇంత డాంబికం మధ్య "దయవెదుకుదామన్నా దొరకదే?

English:

The man who hesitates to give a bread piece to a poor, hungry guy spends lakhs and crores on pompous weddings. (Recently this trend spread to other functions too where wealth is displayed obnoxiously). Humanity is not found when searched with powerful lenses behind this vanity.


35.

తల్లి ముద్దు బెట్టగ బ్రేమె తిట్ట బ్రేమె
రెంటి యందును భేదము రాదు కాన
తిట్టు యమ్మయె యొకనాడు తట్టు భుజము
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తల్లి ముద్దు పెట్టినా ప్రేమతోనే పెడుతుందితిట్టినా ప్రేమ తోనేరెంటి మధ్యా భేదం కానరాదు రోజు తిట్టిన అమ్మే  రోజు నిన్ను భుజం తట్టి అశీర్వదిస్తుంది.

English:

If the mother kisses you it is out of love. If the mother curses you, it too is out of love. The mother who castigates you today, will, one day pats your shoulder and blesses you.


36.

తండ్రి చేసిన తప్పులు తనయు డెంచె
తనయు తనయుడు తండ్రినె తప్పు బట్టె
తరము మారిన మారదు తీర్పు యదియె
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తండ్రి చేసిన తప్పులు కొడుకు ఎంచుతాడుఅతని తనయుడు తన తండ్రి తప్పులు ఎంచుతాడుతరాలు మారినాతీర్పు ఒకటే కదా! (తనయుడు తండ్రి చేసింది సరి యయిన పనే అని తెలుసుకునే లోపలే నువ్వు చేసింది తప్పు నాన్నా అని చెప్పడానికి అతనికి ఇంకో తరం వాడు వస్తాడు)

English:

Son points out the mistakes of his father. His son points out his own mistakes. Though generations change judgment is one. (Taken from a quote “ By the time the son realizes that what his father did was right, he has a son who tells him he is wrong)

37.


తల్లి వొడివేడి  రోజు తలపు కొచ్చె
కంది పచ్చడి రుచికి కలలు కందు,
అమ్మ కలువ నాకు మనసు అయ్యె నేడు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తల్లి వొళ్ళో ఉండే వెచ్చదనం  రోజు మళ్ళీ గుర్తుకొచ్చిందిఆమె చేసిన రోటి పచ్చడికంది పచ్చడి రుచి కలలో కొస్తున్నదిస్వర్గంలో ఉన్న తల్లిని వెళ్ళి త్వరగా కలుసుకోవాలని ఆశ కలుగుతోంది. (నాకూ వయసు మీరింది కదాకాలు డొచ్చే కాలం దగ్గర కొచ్చింది కదా

English:

Today, again I recollect the warmth of the bosom of my mother. I dream the taste of the Chutney (made with Taur Dal) in a grinding stone she used to make. (This is Andhra special. Eat with ghee. You can see Heaven on earth). How I wish I meet her in Heaven soon. (even I am of the age when the Lord of Death is awaiting my arrival there). This was written on International Mothers’ Day.

38.


పుత్రు డుండిన పిండము పెట్టు నంచు
యాడ పిండము ద్రుంచిరి యాది లోనె
భార్య లేకయె బిండము నేడు బెట్టు టెట్లు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

పుత్రుడు పుడితే పిండం పెట్టి పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని కొడుకుల కోసం చూసి ఆడ బిడ్డల్ని పుట్టకుండా చేస్తే మీ కొడుకులకి భార్య దొరకక పోతేభార్య లేకుండా పిండం ఎలా పెడతాడుపున్నామ నరకంతో పాటుబిడ్డని చంపిన పాపానికి నరకం సిద్ధం కదా!

English:

Hoping that your son will protect you from the curse of birth and death and gives you Mukti, if you go on killing the girl child before birth or after, where do you bring wife for him? And without wife, how can he offer you obsequies and grant you Mukti. Instead, for killing the girl child, you will go to real hell.


39.

బతికి యున్న రోజులు చింత బొట్ట నింప,
కడుపు నిండిన పిదపట కాలు చింత
యముడు గొనిపోవ మెతుకు వాయసము చెంత
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

బతికున్నన్నాళ్ళు పొట్ట నింపుకోవడానికి ఇంత మెతుకు కోసం తాపత్రయంకడుపు నిండాక కాలుడొచ్చే సమయం వస్తుందేమోనని చింతమనిషి పోయాక సంపాదించిన మెతుకు చేరేది కాకి చెంత. (ఎందుకింత చింత యని యర్ధము)

English:

As long as we live we think about a grain of rice to fill our stomach. When once it is filled we start fearing approaching death. After death the grains we earn will reach the crow, whom we adore as our ancestors. (why so much agony for transient things?)


40.

తెల్ల వన్నియు పాలను తేట వయసు
నల్ల వన్నియు నీరను నాటు వయసు
రెండు కళ్ళెగ జూసెదు రాత్రి పగలు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

లేత వయసులో తెల్లని వన్నీ పాలని నమ్ముతారుమధ్య వయసొచ్చే సరికి మనిషి దెబ్బ తినిప్రతి విషయాన్ని అనుమానించడం  మొదలు పెడతాడునల్లని వన్నీ నీరనుకుంటాడురాత్రినిపగలును చూసేది  రెండు కళ్ళే కదా? (ఙ్ఞాన నేత్రంతో చూడ గలిగేదే నిజంఙ్ఞాన సముపార్జనికి కృషి చేయాలి)

English:

During adolescence we believe all that is white is milk. As we grow, we gain experience through troubles and tribulations and start suspecting everything. We believe all that is black is water. (What we see through the inner eye, or wisdom, is only true. Hence gain wisdom.)

41.

చిత్త శుద్ధి లేని చిత్ర పూజ లదేల
చినుకు పడని చోటు ఛత్ర  మేల
వేడి పాల మీద వెన్న వెదుకు దేల
వాణి బలుకు మాట వినవొ నరుడ !

తాత్పర్యము (తా):

నీకు చిత్త శుద్ధి లేకుండా ఎన్ని బొమ్మలు పెట్టుకొని దండాలు పెట్టి స్తోత్ర పాఠాలు చదివితే ఏమి ఉపయోగం? (పొయ్యాక తల్లిదండ్రుల బొమ్మలు పెద్ద చిత్రాలు గీయించిదండాలు పెట్టే వాళ్ళువారు బ్రతికుండగా కనీసం పలకరించిన పాపాన పోరు). కనీసం ఒక చినుకు పడని చోట గొడుగు తీసుకు వెళ్ళినట్లే కదాలేదా వేడి పాల మీద వెన్న కోసం వెదికినట్లే కదా?

English:

Without your conscience being clear, what is the use of adorning photos and praying them? (There are people who might never have cared for their parents but make big paintings of them after they leave this world and shower their praises on them). Is it not like carrying an umbrella at a place where even a drop of rain does not fall? Or is it not like searching for butter on hot milk?


42.

కనగ తల్లి నిన్ను కన్ను తెరువ లేదు
పోగ తల్లి నీవు పోతి వెటకొ
తద్దినంబు బెట్ట తనయుని కన్నదో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆమెను చూడ లేదుఎందుకంటే కళ్ళు మూసుకుని బయటకు వచ్చావుఆమె గతించినప్పుడు నువ్వు దూర దేశాల్లో  విహార యాత్రలు చేస్తున్నావుకనీసం ఆమె పార్ధివ శరీరం చూసే అవకాశం కుడా నీకు లేదునిన్ను నీ తల్లి కన్నది ప్రతి సంవత్సరం పిండ  ప్రదానం చెయ్యడానికా

English:

At the time of your birth you did not see your mother, as you came out eyes closed. When she breathed her last you were on tour of far of lands for pleasure and did not see her body. Did she give birth to you just to perform obsequies every year?

43.

యేడ్చి కూర్చునుండ ఏమి ఫలము లేదు

యటులె యత్న మిడిచి యలసి జనకు

చీమ చూసి నేర్వు చెమట యోడ్చుట ఎటులొ

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

"కల కానిదీవిలువైనదీ బ్రతుకూ కన్నీటి ధారలలోనే బలి సేయకుఅన్నడో కవిపోయిన దాన్ని గురించి (ముఖ్యంగా పరీక్షలుఏడుస్తూ కూర్చుంటే లాభ మేమిటినిరాశతో బ్రతుకు ఈడ్చి లాభ మేమిటిచీమను చూసి నేర్చుకోకష్టే ఫలే అనే సూత్రం.

English:

Why do you waste the precious life by crying for the lost things or people? There is no use from it. Without making effort to rejuvenate yourself and bring the life on track, do not disparage. Learn from the ant how they survive by carrying food from far off places and storing.

44.


ఎట్టి బరువు మోయ్క యాత్రలు చేసితి

వెట్టి వాని నొకని బెట్టి మోయ

పుణ్య మెవరి కొచ్చె గణియించి చూడరో

వాణి బలుకు మాట నాదు నోట! 172


తాత్పర్యము (తా):

నువ్వు ఏలాంటి బరువు మోయకుండా ఒక వెట్టి వాణ్ణి పెత్తిఅతనికి జీతభత్యాలు కూడా అతని శ్రమకు సరి పడా ఇవ్వకుండా పుణ్య క్షేత్రాలన్నీ తిరిగావు కదాపుణ్య మెవరికొచ్చిందో తెలుసుకున్నవానీకు కాదుకడుపు మాడ్చుకొని నీ బరువు మోసిన వాడికి.


English:

You went on pilgrimage. But, the weight you carry or your weight, you took the services of a worker whom you paid pittance. Do you think you got the blessings of God or the worker who carried your weight? (certainly the latter, if you paid him less than what he deserved)


45.

అమ్మ బతికి యుండ యాలి మాటయె ఋక్కు   

అమ్మ పోగ గురుతు యొచ్చె యిపుడు

అమ్మ చేతి వంట కమ్మని రుచులును 

వాణి బలుకు మాట నాదు నోట! 177

(పెళ్ళాం బెల్లమూఅమ్మ విషమూ ఆనాడుపోయాక
సూక్తి ముక్తావళి)


తాత్పర్యము (తా):

అమ్మ బ్రతికున్నన్నాళ్ళు నీ ఆలి మాటే నీకు వేదంవేదాంగమూనుఆమ్మ పోయాక,  ప్రతి సంవత్సరమూ  తద్దినం పెట్టేటప్పుడు  అమ్మ బ్రతికుంటే ఎంత కమ్మగా వండి పెట్టేది అని వగస్తే ఏమి ప్రయోజనంఆమె తిరిగి వస్తుందా?



English:

When your mother is alive the word of your wife was scripture and stricture. After her death, every year you remember the taste of delicious  food she was making ,while paying obsequies. (will she return?)


46. 

సీస పద్యము

నంద వంశము బుట్ట నందుడు వివేకా

       నందుడగునె వివేకమ్ము లేక 

గాంధారి పుత్రుడు గాడ్రించి యరువగ

       గాంధి యగునె సత్యవంతుడవక

కల్మష హృదయుడు కలల యందైనను

       యెటగు కలాముగ యెపటి కయిన

మంద బుద్ధి సుతుడు మరువడె గతమును 

       గొర్రె మందను జేరి జనుచు వెనుక 


గొప్ప వారి సూక్తి జెప్పగా చింతించు 

    నీదు వయసు మనసు నీకు సాక్షి 

    నీరసించె నేమొ నిలుచుండి యోచించు

    వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

కొందరు ప్రబుద్ధులుగొప్ప వారి సూక్తి ముక్తావళిని పదేపదే ప్రచారం చేస్తారు కానీ వారు చెప్పిన ఒక్క సూక్తిని నిజ జీవితంలో పాటించిన పాపాన పోరు. (ఇది నాకు తెలిసిన కొంతమందినా దగ్గరి బంధు మిత్రుల నుద్దేశించి వ్రాసినది మాత్రమే). వారి నుద్దేశించి వ్రాసిన పద్యము.

నంద వంశంలో జన్మించిన ప్రతివాడు వివేకానందుడవుతాడా?  గాంధారి పుత్రుడు ఎంత గట్టిగా అరిచినానిజాలు చెప్పకుండా గాంధీ అవుతాడామనసంతా కల్మషంతో  ఉన్నవాడు కలలో నైనా కలాము అవుతాడాదుర్మార్గుల వెనుక గొర్రె మందలో గొర్రెలా పోయే వాడు తన పూర్వీకుల వైభవాన్ని అర్ధం చేసుకో గలడా?

గొప్ప వారి సూక్తులను వల్లించేటప్పుడునీ వయసునీ మనసు నీకు సాక్షిగా నిలుస్తాయిఅవి కూడా వయసు మళ్ళి నీరసించినాయేమో ఒక్క సారి యోచించు.


English:

It has become a fashion for people to quote great people, without following their teachings. (Those that were very close to me like family members, whose characters, I know). This poem is intended to convey a message to such people.

Will a person born in Nanda dynasty become Vivekananda by his name? Will the son of Gandhari (here idiomatic reference to a crook) become Gandhi without following the path of truth, even if he shouts from rooftops, he is good?  Will a man with adulterated mind turn into the great Abdul Kalaam even in his dream?  Will not the nincompoop son, forget the glorious past of his own dynasty, by following the flock of sheep into the abyss?

You go on reciting the quotes of great people. But think once. Your age and your conscience are living proofs. Or are they so old that they are tired to think even?


47.


ప్రవచనములు వినగ పరివర్త నొచ్చునే

ఋజు వర్త నొచ్చె ఋక్కు జదువ

మనిషి యందు వలయు మార్పు సహజముగ

వాణి బలుకు మాట నాదు నోట!  


తాత్పర్యము (తా):

ప్రవచనాలు విన్నంత మాత్రాన మనిషిలో పరివర్తనొస్తుందావేదాలు వల్లిస్తే మంచి నడవడి వస్తుందామనిషిలో పరివర్తన సహజంగా మనసు లోనుంచి రావాలి.

English:

If you hear the preaching of Gurus will there be a change in your attitude? By just reading the Vedas, will your basic nature change? Change should come naturally in your mindset.

48.

త్రేత యుగము నందు తల్లియె దైవము

భక్తి చేరె కృష్ణు బడతులు ద్వాపర

కలి యుగము నందు చులకనాయె పడతి

వాణి బలుకు మాటనాదు నోట!


తాత్పర్యము (తా):

త్రేతా యుగంలో తల్లే దైవము. ద్వాపర యుగంలో భక్తి మార్గంతో స్త్రీలు భగవంతుడిని చూశారు. కలి యౌగంలో స్త్రీ యెంత చులకన యయ్యిందో కదా?

English:


As Yugas change the treatment of women has undergone change. In Treta Yuga, a man used to have repect on mother.. In Dwapara, women reached the Lord through devotion. In Kali Yuga, role of women has been reduced and she is being treated as a slave and as a material object to satisfy the ego of man.

 49.


ఉల్లి తరుగగ నీరొచ్చు ఉబికి కంట

తల్లి బోవగ కనదేల తడియు యింత

తల్లి మనసు తగద ఉల్లి రుచితొ

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెతకు కూడా వక్ర భాష్యం చెప్తున్నారునేడుఉల్లి తరిగితే (పోయినట్లేగా)  కళ్ళ వెంట ధారగా వస్తాయితల్లి స్వర్గస్థురాలైతే కనీసం కంట తడి కూడా పెట్టరే.ఉల్లి రుచి కంటే తల్లి మనసు రుచి తక్కువా?


If we cut onion, tears flow from our eyes. If mother reaches Heaven, we stopped even crying. Is onion tastier than the love of mother?

50.

ఆటవెలది నేను యర శతకము రాయ
వాణి నాడు నేడు తోడు నిలిచె
రాసెద మిగులు సగము రస తేట గతి తోట
వాణి పలుకు మాట నాదు నోట!



51.

భయము లేని వాడి బల్కె నిదర్శనము

తనదు తప్పు లేదె తగ్గి బలుకు 

తప్పు సేయ గాదె దప్పుడు పలుకులు

వాణి బలుకు మాట నాదు నోట!  

తాత్పర్యము (తా):

తప్పు చేశాననే భయం లేని వాడు సౌమ్యంగా మాట్లాడతాడుతప్పు చేసిన వాడు కప్పి పుచ్చుకోవడానికి తప్పుడు కూతలు కూస్తాడు.

English:

The man who does not have fear and carries conviction that he is truthful, talks in a pleasant tone. The man who commits frauds and tells lies shouts from rooftops to cover up.


The following eight poems are translation to the best of my ability, Shakespeare’s Seven Stages of Life in “As You Like It” a philosophy that impressed me at age 18, in my graduation and led me to read the whole lot of Shakespeare dramas with devotion. Must be read in unison to get the full pleasure.

 క్రింది ఎనిమిది పద్యాలు షేక్స్పియర్ వ్రాసిన "మనిషి జీవిత నాటకంలో ఏడు అంకాలుఅనే "As you Like It" అనే డ్రామా లోనిదిఇది నేను నా 18  ఏట చదివిన తరువాతవారి డ్రామాలు మొత్తం బట్టీ కొట్టి, walking Shakespeare అని పేరు సంపాదించుకున్నానుఎంత గొప్ప వేదాంతమండీ ఎనిమిదీ ఒక్క సారి చదివితేనే దాన్లో సారం అర్ధం అవుతుందండీ.




VANI+CHANDRA 38 years of happy living.

Traveling in Italy. Our life has been an arduous journey through lakes and rocks.


We might have covered tens of thousands of miles in various countries.

WAITING FOR THE CALL

SHE TURNS 60 (Shashti Poorthi on 30th June.) My gift to her, 300 poems.


VANI DVISATHI




No comments:

Post a Comment