Friday, September 18, 2015



TIME PASS POEMS IN TELUGU - ON ISSUES OF THE DAY
ఉబుసు పోక ఊరికే పద్యాలు - బులుసు, పులుసు, తెలుసు అన్నీ!

######################

These are poems penned by me on issue of the day. It has various issues. Just for fun.

Telugu explantion and English translation will be posted next week. Enjoy.

On Minister from TG visiting Godavari, without water.

పుష్కరాలు వచ్చె పన్నెండేళ్ళ పిదప
శుష్క వాగు డొకటె శుద్ధి లేదు
పంపు నీళ్ళ మునుగ బాసర పోనేల
పట్న మందు వచ్చు పానీయ మదిగాదె! 1

Just fun on a photo shared

సంధ్య వార్చ మనగ సంధ్య యేదనడిగె,
పటమ టింట చూడు పడుచు శోభ,
కమల నాభు డంపె కనులకు విందుగ
వాణి పలుకు మాట నాదు నోట! 2

On Lavanya's tweets

వేమనన్న నేను వేమనయె కాదు
షేక్స్ పియర్ తోటి సాటి నేను
ఆంగ్ల మందు రాయ అంతటి ప్రతిభె
వాణి ఇచ్చె నాకు వాక్కు యొకటి! 3
@lavanya_aluri

సీత కోక పలుక సిలుకల పలుకులు
చిలుక తీసె యొక్క చిత్ర మయరొ
అల్లరెంతొ చేసె అల్లురి లావణ్య
వాణి పలుకు మాట నాదు నోట! 4

@lavanya_aluri

On KaalvaKuntla CR.

కుంట లోని నీరు కల్లుగ మారెను,
కల్వ కుంట్ల చెట్టు కుమిలి పోయె
నీరు యడుగ నాకు నీరాను ఇస్తిరే
వాణి పలుకు మాట నాదు నోట 5

On Pushkaram and Punyam

పుష్కరములు జరుగు పది రెండు దినము
మొదటి రోజె బోయి మునుగ నేల
పరుల దోసి మునుగ పాపము కాదొకొ
తల్లి గోదావరికి తలవంపు తేగను!  6

స్వార్ధ బుద్ధి తోడ సం యమనము వీడి
పుణ్య మెల్ల నాకె పొసగు ననుచు
వొకరి మీద యొకరు వడివడి బోవగ
మిగిలె యేమి తుదకు మరణ ఘోష!  7

On Ciru, Botsa Moral Nuisance

చెప్పు వాడె గాని చేయు వాడెవడొకొ
చిరంజీవి నీతి చెప్పి పోయె
బొత్స కంట నీరు బొట బొట కార్చెను
స్వార్ధ చింత యొకటె  సాయ మెచట! 8

On TG Minister dipping in muddy Godavari

కోట్లు ఖర్చు పెట్టి ఘాట్లు కట్టిరనిరి
బురద మునుగ వచ్చె పుణ్య మిపుడు
మట్టి మింగి రేమొ మంత్రివర్యులు చూడు
భువన భాండ మెల్ల బయట పడును!  9

On rich poor gap

కూలి వాని కెపుడు కడుపు నింపగ చింత
భాగ్య వంతు కధిక బరువు చింత
దమ్ము లేక యితడు దారిలొ పడి పోయె
జిమ్ము కెళ్ళి యతడు దమ్ము విడిచి బోయె! 10

On +vakkeli

వాక్కు చక్ర కేళి వాక్కేళి పలుకగ
చక్కెరున్న మీరు చదువ వలదు
తీపి ఎక్కుడైన తదుపరి బాధలు,
వాణి పలుక మాట నాదు నోట! 11

సింగ పూరు నందు సింగము వాక్కేళి
తెలుగు పలుక యది తేట గీతి
తెలుగు లెస్స యనుచు దేశ దేశముల చాటె
వాణి పలుకు మాట నాదు నోట! 12

వాకూల కేళికి రెండు వాక్పోగులు!

On KCR toddy

కుక్క తోక పట్టి గోదారి ఈదకు
తాగినోడి మాట తరచి వినకు
తాగి నపుడు యనును తల్లియె సాక్షని
దిగిన పిదప తిట్టు తల్లె గురిగ! 13

On Operation Attraction and Extraction

తలకు సాన బెట్టి తలసాని తెచ్చెను
మంత్రి పదవి ఇచ్చి ముద్దు జేయ
రాజు తలకు పెట్టె రంజుగ కొరివిని
నార సిం హ పోయె నదిలోన మునుగంగ! 14

చేసిండా, చెయ్య లేదా! కాయ్, రాజా!

On Rahul in Anantapur

అంత రమ్ము పెంచి అనంతపు రమొచ్చె
దూర కంత లేదు దొంగ తోడు
రాహు లన్న చెప్ప రఘువీర వంతట
చిరంజీవి కొట్టు చావు డప్పు! 15

తండ్రి దోచి నీదు తల్లికె ఇచ్చెగ
నేడు కొడుకు పైన నింద లేల
దొంగ దొంగ కలిసి దోచిరి జనులను
ముసుగు వేసు కొచ్చి మాయ జేతె! 16

ఆంధ్ర జనులు మిమ్ము యాదరింపగ నాడు
ముక్క జేసితి కదర మూర్ఖముగను
రెంట చెడగ నేడు రాల్చెదె కన్నీరు
సీమ మీద దొంగ బ్రేమ ఏల?  17

On the River Amalgamation

క్రిష్ణ వేణి వెడలె గోదావ రింటికి
తలుపుతట్టి యడిగె తాగ నీరు
కనుల నీరు నిండ కడివెడు నీరిచ్చె
క్రిష్ణ సంత సించి కావ లించె! 18

చూడ చాల వాయె చారెడు కన్నులు
చెల్లి యేమి యాయె చిక్కి బోతి
యనగ చెల్లి పలికె యిటుల భ్రేమతొ
ఏమి సేతు నక్క ఎవరు దిక్కు! 19

కుండ పగుల గొట్టి కండ కావరమున
నీరు యెల్ల మార్చె నల్ల ధనము
స్కేము లంచు చేసె స్కాములు ఎన్నెన్నొ
అన్న పోగ నేడు యముడు  మిగిలె! 20

కలువ మనసు యాయ కాలమటుల బోయె
బాబు వచ్చి నేడు బాగు చూసె
పిన్ని పోయి కలువు పెద్దమ్ము ననగను
బేగ వస్తి యిటుల బార నీరు! 21

రాయ సీమ నేడు రాలతొ నిండెను
నీరు యిచ్చి వారి నాదు కొనుము
కలిసి యుంద మిటులె కల కాలమనగ
తల్లి గంగ చూసి తరలి వచ్చె! 22

కలసి యుంద మిటులె కాతుము బిడ్డల
కావెరమ్మ జూసి కదలి వచ్చు
బిడ్డ కన్న ఫలము భారత మాతకు
నేడు దక్కె బాబు మోడి తోడ! 23

భరత మాత బొంగె భారము తగ్గెను
క్షామ మన్న దింక క్షణము లేదు
కోట్ల కొలది నాదు కొడుకుల బిడ్డల
వెతలు బాప  భాగి రధులు బుట్టె! 24

నల్ల ధనము బోయి తెల్ల బంగారొచ్చు
కరువు పోయి నేడు వరియె గాంచు
దుష్ట పాలన బోయె శిష్టులు వచ్చిరి
భరత మాత చేసె పుణ్య మెంతొ! 25

జనులు యొక్క రీతి మనగను జూసెను
నదులు యొక్క చోటె నాట్య మాడె
కరువు బోయి జనులు తెరపిని బడగను
ఆశ తోడ కదిలె వ్యాస భూమి! 26





No comments:

Post a Comment