Saturday, September 12, 2015

STORIES OF PANCHATANTRA- IN SIMPLE TELUGU POEMS- PART 1 MITRA LABHAMU- TRANSLATION INTO ENGLISH- GAINING FRIENDS

STORIES OF PANCHATANTRA- IN SIMPLE TELUGU POEMS- PART 1 MITRA LABHAMU- TRANSLATION INTO ENGLISH- GAINING FRIENDS

###################################

For more than two and a half millennia, the Panchatantra tales have regaled children and adults alike with a moral at the end of every story. Some believe that they are as old as the Rig Veda. There is also another story about these fables. According to it, these are stories Shiva told his consort Parvati. The present series is based on the Sanskrit original.

A king, worried that his three sons are without the wisdom to live in a world of wile and guile, asks a learned man calledVishnu Sharman to teach them the ways of the world.


Since his wards are dimwits, Vishnu Sharman decides to pass on wisdom to them in the form of stories. In these stories, he makes animals speak like human beings. Panchatantra is a collection of attractively told stories about the five ways that help the human being succeed in life. Pancha means five and tantra means ways or strategies or principles. Addressed to the king's children, the stories are primarily about statecraft and are popular throughout the world.


Image result for panchatantra images

  
                                                                                                   

विद्वत्त्वं नृपत्वं नैव तुल्यं कदाचन  

स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते  


Scholar and king are never comparable. King is worshipped in his country, but scholar is worshipped everywhere. 




రోజు నుంచి పంచతంత్రం కధలను తేలికైన, కమ్మని తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలని సంకల్పించాను. సచిత్రంగా చేసి అందంగా ఉండేలా  పిల్లలకు ఉపయోగ పడేలా చెయ్యాలని సంకల్పం. చిత్రాలను వెయ్యడం ఇప్పుడే నేర్చుకోవడం ప్రారంభించాలి కంప్యూటరు సాయంతో

From today, I decided to write the story “PANCH TANTRAM” a collection of moral stories penned by Manya Vishnu Sharma. I want to make a pictorial presentation of the stories, but still I am learing the line sketch on Computer. I will edit these blogs soon.

నాకు భగవంతుడిచ్చిన అహంకారాన్ని, ఆత్మ విశ్వాసంగా మార్చుకోమని ఇప్పటికి సంకల్పం కలిగింది.
రోజు నుంచి పంచతంత్రం కధలను తేలికైన, కమ్మని తెలుగు పదాలతో పద్య రూపంలో వ్రాయాలని సంకల్పించాను.

I mode vow that I will turn my arrogance born out of immense self-confidence, knowledge and thirst for more into pure self-confidence.

1.
విష్ణు శర్మ నామ విప్రుండు గురువు
శిష్యులందరికిని చెప్పె కథలు
నాడు నేడు రేపు నీతి బతుకు రీతి
పంచతంత్ర మంచు పేరు నిడెను! 1

తాత్పర్యము

విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు తన శిష్యులకి పంచతంత్రమనే పేరుతో, అయిదు కధలు చెప్పెను. కధలు నాడు, నేడు రేపు ప్రజల ప్రవర్తనకు, రాజ ధర్మానికీ, మిత్రులను పొందడానికీ వంటి విషయాలలో  మార్గదర్షకాలుగా ఉంటూ వస్తున్నాయి.

English: A Brahmin and Teacher known as Vishnu Sharama, taught five moral stories to his students. These stories were applicable yesterday, are applicable today, will be applicable tomorrow. They teach us how people should behave, the duties of Kings and getting friends, eliminating enemies.

2.

అయిదు కధలు జెప్పె యనువగు భాషలో
మిత్ర లాభ మనియు మిత్ర భెద
మనియు మూడు కథలు మరిజెప్పె గురువు
పంచతంత్ర మన్న యెంచు రీతి! 2

తాత్పర్యము
పంచతంత్రమనే కధలలో విష్ణు శర్మ అనే గురువు మిత్ర లాభము, మిత్ర భేదము, లబ్ధ ప్రణాశము, అపరీక్షికారిత్వము అనే అయిదు కధలు చెప్పారు.

English:

In these five stories named Panchatantra, the teacher told the stories “Gaining Friends, Losing friends, Loss of gains, Of crows and owls and Imprudence.”

3.
శాస్త్ర వేద మెల్ల చదివిన చాణక్యు
రాజనీతి విస్ణు వాచ్య రీతి
రెండు గలిపి జదువు పండు జనమ
తంత్ర మొకటి పంచ తంత్ర మొకటి!

తాత్పర్యము
వేద శాస్త్రాలు అవపోసన పట్టిన చాణుక్యుని రాజకీయ తంత్రం, విష్ణు శర్మ వాచ్యంలో ఉన్న నీతి తంత్రమూ, రెండూ కధల్లో అగుపడతాయి. పంచతంత్రము చదివితే రెండు తంత్రాలూ ఒకచో చదివి నట్లే. జన్మ  ధన్యమవుతుంది.

English: The Rajaneeti of Chanakya, the Minister well versed in Vedas and Shastras and the knowledge of letters of Vishnu Sharma are both evident in these stories. Life is blessed if we read these stories.

4.

మిత్ర లాభమె మోదము హితుల గలువ
మిత్ర భేదము ఖేదము మిత్రులకును (మోదము శత్రులకును)
మోద ఖేదమ్ముల కధలె మొదటి రెండు
తంత్రి తెంపెను యెలుక తంత్ర మాడె నక్క! 4

తాత్పర్యము

మితులను కలిసినప్పుడు వచ్చే ఆనందము మిత్ర లాభంలో, మిత్రులు విడిపోయినప్పుడు వారికి కలిగే ఖేదము (శత్రులకి కలిగే మోదము) మిత్ర భేదము లోనూ, మోద ఖేదముల కధలే మొదటి రెండు. మొదటి కధలో మిత్రుని వలను  కొరికి మిత్రుని రక్షించిన కధ, రెండో కధలో నక్క కుతంత్రంతో మిత్రునిచే, మిత్రుని చంపించిన కధా చెప్పబడ్డాయి.

English: The first story is about the pleasure one gets when he meets a friend and second one is about the pain one feels when a friend is forced to distance from another one (though this enthrals the common enemy) were described. First story is about a mouse that secures the life of a dove by cutting the net in which he was trapped and in the second one, the story of two foxes that conspire and provoke one friend kill the other.

5..
వాస ముండెను యడవిన వాయసమ్ము
మృగము తాబేలు జింక మూషి కమ్ము
ఒకరి కొకరు సాయము జేసి యొడుపు నుండె
స్నేహ మన్ననె యదియని సెప్పు కొనగ! 5

తాత్పర్యము
ఒకానొక అడవిలో ఒక కాకి, జింక, తాబేలూ, ఒక ఎలుకా ఒకరికొకరు పరస్పరం సాయం చేసుకుంటూ, ఆహా!  స్నేహమంటే ఇది కదా అనేలా, ఎలా కలిసి ఉన్నాయో మొదటి కధలో వర్ణింపబడింది.

English

In the first story, a mouse, a deer, a tortoise and a crow that helped each other and lived friendly lives. Seeing this one used to wonder, “Oh! If not this, what is friendship?”

6.

బోయ యొక్కడు వేటాడ బన్నె వలను
పైన యెగురుచు బొయెడు పావురములు
దినుసు చూసి ఆశతొడ దిగగ బోవ
వారి రాజు చిత్ర గ్రివుడు వారి నాపె! 6

తాత్పర్యము

ఇలా ఉండగా ఒక బోయవాడు పక్షులని వేటాడే నిమిత్తం ఒకచోట నూకలు జల్లి, వలను పెట్టి దగ్గర్లో చూస్తూ నిలుచున్నాడు. పైన ఎగురుతూ పోతున్న పావురాల  గుంపు ఒకటి భూమిపై నూకలు చూసి ఆశతో దిగుచుండగా, వారి రాజు చిత్రగ్రీవుడు వలదని వారించెను.

English: As time was passing off as usual in the woods, one day a hunter placed a net under a banyan tree and spread few grains to attract birds. A group of doves flying high saw the grains and with hope of food tried to come down. Their king Chitragreeva, asked them not to venture.

7.
మఱ్ఱి యందున యుండెను ముసలి కాకి
పిలుతు రాతని బ్రియ లఘు పతన కుండు
వేల పక్షుల నడుమున వాస ముండె
చూసె కాకియు బోయను వలను బన్న!  7


తాత్పర్యము
ఆ మఱ్ఱి చెట్టు కొమ్మల్లో లఘుపతనకడు అనే కాకి ఎన్నొ ఏళ్ళ నుంచి ఉంటోంది. అదె చెట్టుపైన కొన్ని వేల పక్షులు కూడా నివాస ముంటూ ఉండేవి. ఈ ముసలి కాకి బోయ వల పన్నడం చూసింది.

English: In the branches of the Banyan Tree an old crow, by name Laghupatanaka has living since long. She saw the hunter laying the trap of net.

8.
అంత ఎగురుచు వచ్చెను ఆక సమున
గువ్వ రాజుతొ కూడిన గుంపు యొకటి
చూసె నూకలు కిందను చెందె ముదము
ఆశ తోడను దిగుటకు సిద్ధ పడెను! 8


తాత్పర్యము
విధంగా ఆకాశంలో ఎగిరే గువ్వలు గుంపుగా నూకల మీద ఆశతో కిందికి దిగే ప్రయత్నం చేశాయి. వారి రాజు, చిత్రగ్రీవుడు వద్దని వారించినా కూడా!

English: Even though the King of Doves, Chitragreeva warned them not to, the hungry group of doves tried to get down to earth, in the hope of eating the grains.

9.

చిత్ర గ్రీవుడు వారికి చక్ర వర్తి
బలికె ఇటులను తొందర బడగ వలదు
నరుడు దూరని యడనిన నూక యెటుల
మోస మున్నది యిందున ఖండి తముగ! 9

తాత్పర్యము
వారి రాజు చిత్రగ్రీవుడు చివరి యత్నంగా విధంగా చెప్పాడు. "మానవ సంచారం లేని  కారడవిలో నూకలేలా వచ్చాయి. ఇందులో ఏదో మోసం ఉన్నట్లు కనపడుతున్నది. ఆగండి"

English:

Their king Chitragreeva warned them. “This is a wild forest where humans fear to enter. How can grains come here. There is some trickery in this. Please wait.”

10.

కాకి కూడను వారించె కాదు వలదు
పన్నె వల బోయ  పట్ట మనను
నూక యాసతొ ప్రాణంబు నొదల తగదు
అయిన వినవాయె గువ్వలు యాస తోడ! 10    

తాత్పర్యము

మఱ్ఱి చెట్టుపైన కాకి కూడా " వలదు. వలదు. మనలను పట్టడానికి బోయ ఒకడు వల  పన్ని పోయాడు. కాసిని నూకల కోసము ప్రాణాలు పణంగా పట్ట వద్దు" అని సలహా చెప్పింది. కాని ఆశ వదలని గువ్వలు వాయసము మాట కూడా పెడచెవిన పెట్టడానికి సిద్ధమయ్యాయి.

English: The crow living on the tree too advised, “No! No! Do not venture to barter your lives to a handful of grains. A hunter laid a trap for us here” But the greedy and hungry doves do not heed his advice too.






SARVEY JANAHA SUKHINO BHAVANTHU




No comments:

Post a Comment