సుత్తి పలు రకములు
WAYS OF HAMMERING ORDINARY, SOFT, SUPER SOFT, REVERSE
TELUGU AND ENGLISH
##################################
"సుత్తి సృష్టించి కీ.శే. జంధ్యాల గారు, పిన్న వయసులోనే, దెవేంద్రుడికి "సుత్తి" కొట్టడానికి స్వర్గస్థులయ్యారు. వారు పోయినా, వారి సుత్తి చిరకాలం భూలోకంలో ఉండేట్లు చేశారు. ఇది "నారద వీణ" కంటే కూడా బలీయమైందని, నారదుడు పెట్టే తంపుల కంటే ఎక్కువ తంటాలు తెస్తుందని స్వయంగా నారదుల వారే "బృహన్నారదీయం" నాలుగవ ఆశ్వాసంలో నొక్కి సుత్తాడించారు.
అధహ కధా ప్రారంభహ!
ఆ విధంగా పదు నాలుగు లోకాలూ తిరుగుతూ నారదుల వారు భూలోకానికి విచ్చేశారు. వారు వచ్చే సమయానికి సాయంత్రం సరిగా ఏడు గంటలయ్యింది. హైదరాబాదు వేడి. దాహం వేసింది. ఒకానొకచో, "కల్తీ కల్లు దుకాణము" అని నామధేయముతో నున్న వ్యాపార సంస్థను గాంచి "ఔరా! మానవులు ఎంతకు తెగించిరి? బహిరంగముగా కల్తీ చేసి యమ్ముచుంటురే? సంకీర్ణ ప్రభుత్వము వలెనే మా నాన్నగారి నాలుగు తలలు నాలుగు విధములుగా యాలోచించుచున్నట్లు కాంపట్టుచున్నట్టుంది." అని యోచించుచూ దుకాణములోనికి వెళ్ళి, "నాయనా! కొంచము పానీయం ఇప్పించగలవా?" యని వేడుకొనగా ఆ దుకాణదారుడు "కల్తీయా, సిసలైన సరుకా?" యని యడుగగా నారదుల వారు అవాక్కయ్యి, "మీరు కల్తీ చేసి కూడా యమ్ముదురా" యనగా, దుకాణాదారుడు కించిత్తు కోపగించి "ఆపవయ్య నీ సుత్తి" అని తన కల్తీ తాను చేసుకొనుచూ పోయెను.
కల్తీ కల్లు దొరకలేదని పలువురి మృతి : ఆంధ్ర జ్యోతి 22-09-2015
కల్తీ కల్లు దొరకలేదని పలువురి మృతి : ఆంధ్ర జ్యోతి 22-09-2015
"సుత్తి" యనగా యేమియో తెలియని నారదుల వారు అప్పుడే కల్తీ లేని కల్లు తాగి కడుపు నొప్పితో బాధ పడుతున్న ఒకానొక వ్యక్తిని, "సుత్తి యనగా నేమి" యని యడిగెను. ఆతడు నొప్పి భరించ లేక "నీ చేతిలో ఉన్న వీణను ఒక్క సారి వాయించు, అప్పుడు ఇక్కడున్న జనం కొట్టెదే సుత్తి" యని బదులిచ్చెను.
"ఇన్ని నీరడిగినందుకు, ఎందుకయ్యా ఎన్ని బాధలు పెడుదురు?" యనగా" ఆపవయ్యా, గీడ నీరు దొరకదు, నీరా దొర్కుతది" యని యొక పెద్ద మనిషి చెప్పెను. అంతట నారదుల వారు "ఇదేదో పిచ్చి వారి నిలయము వలె యున్నది యని, "నారాయణా, నీ మహిమలు చూడగ" యని పాడుకొనుచూ ఒకానొక ఇంటి వద్ద యాగి, తలుపు కొట్టెను. తలుపు తెరిచే యుండుట వలన యది వెంటనే తెరుచుకొనగా నారదుల వారు కింద పడబోయి, సంబాళించుకొని, "అమ్మా, కాసిన్ని మంచి నీరు ఇప్పించ గలరా" యని యడిగెను. చిన్న డబ్బాలో, ఆపకుండా యేడుస్తున్న, వివిధ రకముల వేషధారణాలలో యున్న ఆడు వారిని, ఆ ఇంట్లోని ఆడువారు, కన్ను ఆర్పకుండా చూస్తూ వారు కూడా కళ్ళు వత్తుకుంటూ, నారదుల వారి రాకను పట్టించుకోక పోతిరి. కారణము లేకుండా ఈ వయసు యుడిగిన అప్సరసలు ఇవ్విధమున ఏడ్చుట ఏమి, వారిని చూసి ఈ భామలు ఏడ్చుట ఏమి అని ఆశ్చర్య పోతూ "అమ్మా, కాసిన్ని నీరు, అమ్మా కాసిన్ని నీరు" యనుచూ యడుగుచూనే యుండెను.
ఇంతలో ఆ వింత డబ్బాలో ఏడ్చు లావుపాటి యాడు వారు పోయి, సన్నగా సరివి కట్టెలా యున్న యొక వింత జంతువు, ఒక వింత వస్తువుతో కాళ్ళపైన వెంట్రుకలను తీసి వేస్తూ "జిల్లెట్! నొప్పే తెలియదు" యని నవ్వెను. "నవ్వు యాడు వారు కూడా ఉందురా ఈ వింత డబ్బాలో యని, "హరి, హరీ" మనసు ఎటో పోవుచున్నది" యని చింతించి "అమ్మ నీరు, దాహము వేయుచున్నది" యనెను. "ఏందయ్యా నీ సుత్తి. నీళ్ళు యాడనుంచి అత్తయ్. ఇది ఐదరాబాదని తెలియదా" యని మరల కూర్చుండెను. డబ్బాలో ఇంకనూ గడ బద్దల వంటి యాడు వారు వింత పనులు చేయుచూ వింతగా నవ్వుచుండిరి" " లేదు తల్లీ! నేను స్వర్గమునుంచి వచ్చిన నారద మునిని" యనగా, అచ్చటనే కూర్చుని కళ్ళు తిప్పకుండా డబ్బా వంక చూచుచున్న ఒక పడుచు, "కొట్టు, మెత్తటి సుత్తితో కొట్టు" యని నవ్వెను కాని, సుత్తి యర్ధము మాత్రము చెప్పక పోతిరి.
యింతలో, కల్తీ కల్లు దుకాణాదారుడు కల్తీ లేని కల్లు తాగి ఇంటికి వచ్చెను. "ఏంది, పంతులూ, గీడ్నే ఉన్నవా. ఉండు నేనిత్తలే నీళ్ళు" అని నీరు తెచ్చి ఇచ్చిరి. మరల యాడువారు, మామూలు ప్రకారము ఏడ్చుచున్న డబ్బా వింతలను చూస్తూ కళ్ళు వత్తుకొనుచుండిరి.
నీరు తాగిన, నారదుల వారు "నాయనా! సుత్తి యనగా నేమి?" యని యడిగెను.
"తత్తెరి! గది కూడా తెల్వదా? సెప్తా ఉండు. మా ఆడోల్లు గింత ముద్ద పెట్టలంతే ఈ టీవీ సుత్తి ఆగాల." యని ఇలా చెప్పసాగాడు.
"గిప్పుడు నువ్వు సుత్తి అంటే ఏంది అని అడిగావు కదా. నేను చెప్పేదే సుత్తి. గట్లనె నువ్వు సర్గం నుంచి అచ్చనన్నవంటగా. కల్తి కల్లు తాగినోడు కూడా గది సుత్తి అని నవ్వుతాడు. మా గురువు గారు, సుత్తి పలు రకములు అని సెప్పి పోయిండు. మామూలు సుత్తి. గిప్పుడు దరమ రాజు యచ్చుడు కాడి కెల్తే గాయన పశన లడుగుతాడు, గీన సెప్తాడు, గాయనడుగుతాడు, గీన సెప్తాడు, గాయనడుగుతాడు, గీన సెప్తాడు, గాయన..." నారదుడికి కోపం వచ్చి వీణ తీశాడు. "గిప్పుడా సుత్తి తియ్యకు" గిది మామూలు సుత్తి. గిప్పుడు నేను సెప్పట్లే గదే"
"ఇక మెత్తటి సుత్తి. గిప్పుడు నువ్వ అడక్క పోయినా, నీకు నొప్పి పుట్టకుండా నేను చెప్పేది. నాకు ఇద్దరు పెండ్లాలు, నలుగురు బిడ్డలు"
"సమఝైంది! తరవాత చెప్పు"
"పంతులు! గట్టోడివే! నీబొటోడు నా సాపులో ఉంటేనా, కల్తి మీద కల్తి, సుత్తి మీద సుత్తి"
"సుతి మెత్తని సుత్తి. అంటే మనకి పైసలు కావాలనుకో. పంతులూ, మీ నాయన పుణ్యాత్ముడు, మీ తాత దర్మోత్ముడు, మీ ముత్తాత దేవుడు, గందుకే నిన్ను బూమ్మీద పడేసి పోయిండ్రు , అని గిట్లా పొగిడిందే పొగిడి నాలుగు పైసల్ సేత్ల బెట్టుకు పోవుడు."
"ఓరి, మానవులారా! ఎంత తెలివి మీరితిరి. నాలుగు తలల మా నాయనకే గింత తెలివె లేక పోయెనే. మా తల్లి వాణికి గింత మాత్రం తెల్వది కదా? గనేషుడు గేం చేత్తాండు. శివుడిని నిల్దీత్తా. ఇష్ణువుని కిందకి తెప్పిత్తా"
ఇలా పిచ్చి వాడి లాగా మాట్లాడుకుంటూ నారదుడు వెళ్ళబోతే ఆపి, దుకాణా"దారు" డు "గిదే మరి. రివర్సు లేదా బదులు సుత్తి అంటే" అని లోపలికి పోయాడు.
నారదుల వారు వీణ తీసి "నారాయణా, నారాయణా" అని పాడుతూ, ఆవిధంగా వారు బ్రహ్మలోకమున కేగగా సదరు బ్రహ్మగారు నాలుగు ముఖములందున్న నాలుగు నోళ్ళతో సరస్వ్వతీ దేవికి సుత్తి కొట్టుట చూసి ఈ విధముగా వాపోయిరి.
"అమ్మా! వాణీ! భూలోకమున ప్రజలకు వాక్కును ప్రసాదించి సుత్తికి మూలమైన మీకు యెయ్యది గతి పట్టె! దేవరవారి సుత్తి కి బదులు సుత్తి కొట్టాలన్న వారికి నాలుగు ముఖములు ,మీకున్న రెండు చేతులలో వీణ పట్టుకొని కూర్చుంటే, బదులు సుత్తి కి అవకాశమే లేదా అని వాపోయె!
ఇది విన్న వాణి అవాక్కవ్వగా,బ్రహ్మ గారి నాలుగు గొంతులలో నాలుగు వెలక్కాయలు పడె.
నారదులవారు పరమానందము చెంది తన వీణను సుత్తి మెత్తగా వాయించుతూ కైలాసమున కేగెను.
కైలాసమున పరమానందమున శివుడు ప్రమధ గణములతో కలిసి పరమానందంగా పార్వతీ దేవికి సుత్తి కొట్టుచుండగా చూసి, నారదులవారు, 'అమ్మా! శక్తీ! ఇన్ని లోకములందు అతి శక్తిమంతురాలైన మీరు బదులు సుత్తి కొట్టక ఊరకుంటిరేమి?"
అని ప్రశ్నింప అమ్మ దిగులు గా "ఏమి చేయుదు! నేనునూ ప్రయత్నించుటునే యుంటిని. వారి నెత్తిన జడలు కట్టిన జుట్టూ వారికి ఏ మాత్రము నొప్పి కలిగించక పోగా, నా చేతులు నొప్పి ఫుట్టుచున్నవి."
అని వాపోయెను.
నారదులవారును తమ మెత్తని పొట్టను సుతి మెత్తగా రుద్దుకుంటూ వైకుంఠమునకు పోయెను
వైకుంఠమున మహావిష్న్ణువు పాలసముద్రములో శేషశయ్యమున విశ్రాంతి తీసుకుంటూ లక్ష్మీ అమ్మవారికి సుత్తి కొట్టుట చూసి నారదులవారు ముక్కుపై వేలు వేసుకుని,
"అమ్మా! అష్టలక్ష్మికి అష్ట కష్టములు వచ్చెను కదా! బదులు సుత్తి కొట్టుటకు అవకాశమే లేకపోయె కదా మీకు?"
అని వాపోయెను
"ఏమి చేయుదు నారదా! వారికి కొట్టిన సుత్తి దెబ్బలన్నీ పాపం, ఆదిశేషుడికి తగులుతున్నాయి. నాకే జాలి వేయుచున్నది"
అని కంటతడి పెట్టె.
అప్పుడు నారదులవారు "మీ ముగ్గురమ్మలు, అయ్యలను కలిసి, బదులు సుత్తికి మార్గము తెలుసుకొనవలె. లేనిచో భూలోక వాసులు ఏక మార్గ సుత్తితో బాధ పడెదరు"
అని సలాహ చెప్పి భూలోకమునకు పయనమయ్యె .
ముగ్గురమ్మలు కలిసి ముగ్గురయ్యలను కలిసి
"అయ్యలార! మీరు ఈ సమస్యకు పరిష్కారము చూపవలె. లేనిచో భూలోక వాసులు నిత్య సుత్తితో బాధలు పడెదరు. సుత్తి దెబ్బలు తగులకుండా మార్గమైనా చూపండి లేదా ఎదురు సుత్తికి మార్గము చూపండి." అని వేడుకొనిరి.
ఎదురు సుత్తితో తమకు కల ప్రమాదము గమనించిన విష్ణువు
"భయపడకండి, దెవీ. ఇప్పుడే భూలోకమున మార్కు జుకర్బర్గ్ అనే నా అంశ జన్మించినది. ఆ అంశ ముఖ పుస్తకము అనుయొక వింత ద్వారా ఈ సమస్య తీర్చును. ఇందులో సుత్తి కొట్టిన వారి దెబ్బలు అవతల వారికి తగలవు. అయిననూ వారు కూడా ఎదురు దెబ్బలు తగులకుండా ఎదురు సుత్తి కొట్ట వచ్చును.
ఆ విధముగా ఈ ప్రక్రియ వింత రూపం దాల్చి, సుత్తి దెబ్బలు తగలని వారికి, తగిలిన వారికి కూడా చాయా చిత్రములతో వింత లోకాలకు తీసుకు వెళుతూ యుండగా, జనులు మౌన వ్రతులయ్యిరి. అందు చేత ఒక మౌన మునిని రాజుగా ఎన్నుకొని ఆనందముగా కాలము వెళ్ళబుచ్చిరి.
ఇతి సుత్తిపురాణే, షష్టమ వేదే ముఖ పుస్తక నామ పంచమోధ్యాయహ!
In Andhra Pradesh, once upon time, till recently lived a very pun loving, fun loving Cine Script Writer. He was known to invent new lingo in the language. He had been a great observer of human behavior and was creating humor out of normal situations. Most of his films were like SITCOMs, in Hollywood.
In one of the pictures he created a word, "hammering" (sutti) for people who vex us with their continuous chatter sans meaning. He classified this hammering into various categories. He died at a young age. May be, he found the need to hammer Devendra, who is spending time with Item Girls, Rambha, Urvasi, Menaka and Tilottama. So he looked for Heavenly abode. (Great loss to Telugu Film Industry). This hammer is stronger than the Narada Veena. This hammer creates rift where it is not existing more powerful than what Narada can create, as per Narada himself in the Fourth Part of "Brihannaradeeyam"
Story starts now.
Narada, while going around the fourteen worlds landed on the Earth in Hyderabad City. It was 7 PM and was hot and humid. He was thirsty. As he was on search for water, he found a board
"ADULTERATED TODDY SHOP".
Shocked, Narada said to himself. "What level humans have degraded. They are openly selling adulterated food and beverages. Just as different voices in a Coalition set up, my Father, the Creator's four heads are thinking four different ways". So soliloquizing, he entered the shop and asked the shop owner, "Dear! can you give a little to drink?" At which the owner asked, "Adulterated or Unadulterated?" At which, Narada quipped "Do you sell adulterated stuff too?" At which the shop owner replied, "Stop your hammering" and was immersed in his adulteration of toddy process.
(Now, in Telangana State, people addicted to adulterated Toddy are falling sick as Government raided adulteration Centers. Doctors say, they are accustomed to adulterated toddy so much that once they started on pure toddy, they got withdrawal symptoms. Few died too)
Narada, who could not fathom the meaning of hammering went to a customer, who was suffering from severe stomach ache due to drinking unadulterated toddy first time in 15 months, and asked, "Sishya! What is meant by hammer?" The unadulterated drunkard (the man who drinks unadulterated toddy) suffering from pain quipped angrily, "Do one thing! Take out your Veena and sing and what the customers do then is hammering."
At which, one customer who was enjoying adulterated toddy said in fun. "Here you wont get water, you get only liquor, adulterated or unadulterated"
Narada said to himself, "this seems to be an asylum" and proceeded further singing, "Hari Om, Hari Om". He stopped at one house and wanted to tap the door loudly but as it was not bolted it opened suddenly and Narada was about to fall but could recoup position. There, he asked, "Oh! Mother! I am thirsty. Can you provide a little water?" There a few young women and old women were fully immersed in looking at the ever crying old ladies in a box, in various funny looking dresses and make ups and were pressing their eyes in tandem with the continuous crying in the box. None cared who came inside. But Narada persisted, "Mother! Water! Mother! Water!" None cared. Suddenly, the wailing of the fat old ladies acting as young brides stopped and one long, stick-like thin animal came and started removing hair on her thin legs saying "Gillette! No Pain" and smiling nervously. Narada was surprised that there were smiling dames too in the box and as he was getting distracted, he again asked "Oh!Mother! I am thirsty! I want water" At which the house lady angrily said, "I am seeing. What is your hammering? Don't you know it is Hyderabad? We don't get water here?" "No! Mother! I am from Heaven, I do not really know," Narada replied. At which, a young dame in her teens smiled and said, "Hammer! Hammer, with a soft hammer" but did not explain what hammering was. All were again immersed in pressing their eyes in tandem with the crying obese young ladies on the box.
Meantime, the Adulterated Toddy Shop owner came home and said "Oy" Bomman! Still here? Wait I will bring water" Narada drank the water and asked the shop owner, "Can you tell me what this hammering job is?"
"The Adulterated Toddy Shop" owner who came home consuming unadulterated toddy laughed and asked, "Don't you know the meaning really? Or are you hammering me in reverse?
Narada persisted. The owner said. "Our Guru, Jandhyala invented this. I will tell you. Anyhow, I will not get food till my ladies weep out all serials till 11 PM. and started telling the story of hammering.
"Now you asked what hammering is. What I am going to tell is only hammering. For example, Dharmaraja went to Yaksha. He asked a question, Dharma Raja answered, he asked, he answered, he asked, he... " Narada was angry and took out his Instrument to sing. "Now don't take out that hammer. This is called ordinary hammering. Asking and telling" the shop owner mildly chided Narada.
"Now Soft Hammering. even if you do not ask I will tell you. For example, I have two wives and four daughters"
"Samajh Gaya! Roko!" Narada shouted.
"Oye! Bomman! You got the meaning and our language too! If I have an assistant like you I can adulterate, adulterate and adulterate."
"Now, very soft hammering. Suppose we want to borrow money. We go to a lender and say "your father was a great great, your grandfather was greater, his father was the greatest in the world. That is why now, we have you, the kindest of all. And once he gives money, we can collect our hammer and come back."
Narada was furious! OH! Humans! You grew too clever. With four heads my father had no such intelligence. I will take him to task. I will ask Lord Shiva. I will bring Lord Vishnu in another incarnation. Where is Ganesha?" so talking incoherently Narada was ready to leave.
The adulterated toddy shop owner laughed loudly and said, "This is called reverse hammering"
So, Narada went to Brahma Loka, singing praises of Lord Vishnu and saw Lord Brahma hammering Goddess Vani with four heads and four voices. Vani was playing Veena. Narada lamented thus,
"Mother Vani! What a fate! He is hammering you with four heads and four voices and you have two hands with which you play music. Is there no chance for reverse hammering?."
At which, Mother Vani felt ashamed and four heads of Brahma swallowed four nuts.
Happy, he could create fissures in Brahma Loka, Narada went to Kailasa, where Lord Shiva with his courtiers was hammering Mother Shakthi. Narada lamented
"Oh! Mother Shakthi! You are all powerful. Cant you hammer Your Lord in reverse?" At which Mother Parvati said, "I am trying Narada. But you see He has thick hair on head and Ganga too. My hand is paining but he is not hurt"
Satisfied, Narada went to Vishnuloaka, where Goddess Lakshmi was massaging the feet of Lord Vishnu and Lord was hammering Her. Narada lamented,
"Mother! You give eight kinds of Wealth to people. Is there no way, you can hammer in reverse?" Mother replied, "Narada! I am doing it but the hammer hits are taken by the Adi Sesha! "
Narada advised, "Why don't you three go to the Lord and ask for a way where people can hammer in reverse? Or else, your subjects on Earth suffer from one-way hammering."
The three Mothers went to the three Fathers and said, "Oh! Lords! You have to show a way out. Either you should call a halt to hammering or suggest ways of hammering or our people on the Globe suffer from daily hammering."
Lord Vishnu knows if reverse hammering was suggested it would be danger for Him. So, he said " I am sending one of my integral parts to the Earth. His name will be Mark Zuckerberg. He will invent a Face Book. In this, anyone can hammer anyone without pain and the others too can do that. None feels the pain, as none understands the hammering but "like" the hammering and share it. It goes on and on and on and on. If the hammerers are still not satisfied, they can put their own photos and get as many likes as possible. "Beautiful, Marvelous, Awesome, WoW, Ahaa, like words determine that the hammering did not hurt the others. They display reverse photos and get all these words back. There will be little genuine hammering too! People have to bear or enjoy it!
With the blessings of Lord Vishnu, this has developed into a virus of sorts and people stopped oral hammering even while traveling too. Apple Company and Rahul Gandhi are spreading this virus as far as possible.
This is "Hammer Purana, Sixth Veda, Face Book Named Fifth Chapter!
##########################
No comments:
Post a Comment