Friday, September 25, 2015



కాలక్షేపం బఠానీలు- ఉబుసుపోక వ్రాసినవి- మచ్చుకి కొన్ని
#############


అందమె ఆనందం- ఆనందమె జీవిత మకరందం



కోటి ఆశలూ కాటి చెంతకే

ఆశల హద్దులు ఖర్చయితే,
నిరాశలు మన పద్దులో జమ అవుతాయి కదా!
పల్లెటూరే ప్రపంచమనుకున్న మనం,
ప్రపంచాన్నే పల్లెటూరుచేసి ఏలుతున్నాం!
కూడబెట్టిందెంత అని అడిగేవాడే కానీ,
ఏడకెళ్తుందిదంతా అని అడిగే వాడేడీ,
మన సొమ్ము రాళ్ళ పాలయితే,
మనం మట్టిపాలే కదా?
ఆరడుగుల నేలలో ఇమిడే మనం,
ఆరు బంగళాలు కడుతున్నాం,
మనం పోతే వెంట వచ్చేదెవరు,
కట్టె మోసే నలుగురు ఎవరు?
అందుకే కవి అన్నాడు. "ఎందుకోయీ తోటమాలీ అంతులేనీ యాతనా,ఇందుకెనా నీవు చేసే పూజలన్నీ తపోధనా."

మహిళా దినోత్సవం
వేలుపులందరు కూడి
ఇలలోన తమ రూపు,
మహిళగా కూర్చి,తీర్చి,
ఇంటికి దీపంగ మార్చి,
తల్లిగా,అక్కగా,చెల్లిగా
చూ సుకో బిడ్డడా యని పంప,
వెలలేని ఇల్లాలికి
వెలకట్టి నిలబెట్టి,
వెలయాలుగా జమగట్టీ,
వత్సరమందొక రోజు,
నీ దినంబంచు,
వ్యాపారముల్ చేయు
సంస్కృతిన్,
ఏమనందుము భాగ్యమా,
దౌర్భాగ్యమా!


66అ అయ్యవారి తీర్పు

నా చిన్నప్పుడు ఒకజొకు చదివిన గుర్తు.
"ఏమిట్రా చిన్నోడికి బూతులు నేర్పుతున్నావు?"
"లేదమ్మ! అనకూడని పదాలేమిటో చెప్తున్నాను."
రోజు 66 మీద పెద్ద కోర్టు వారి తీర్పు చదివాక ఇది గుర్తుకొచ్చింది.
"అవతాలవాడిహృదయందెబ్బ తినకండా దేశ సమగ్రతకు, రక్షణకు భంగం కలుగకుండా మీరేమైనా, ఎలాగైనా తిట్టుకోవచ్చు. పెద్దవారి లాగా ప్రభుత్వం ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎలా చెప్పగలదు? అలా చెప్తే అనకూడని మాటలు అందరికి చెప్తున్నానని ప్రభుత్వానికి చెప్పండి.అంటే."
చట్ట బద్ధముగ తిట్టుకోవచ్చని,
పెద్ద కోర్టు చెప్పెనోయ్,
టెంప్టు అయ్యి వారినే అంటే,
కంటెంప్టు కిందకు వచ్చునొయ్!


మిధ్య తరగతి-మధ్య తరగతి 


బడ్జెట్ రోజున పన్నులు తగ్గలేదని బాధపడే మధ్య తరగతికి మిధ్య తరగతి కధ.
"ఏటి కేతంబెత్తి యెయి పుట్లు పండించి గంజిలో మెతుకెరుగరన్నా"
ఇది"మిధ్య" తరగతి. వీరికీ ఆశలుంటాయి. అడిగే ధైర్యమే ఉండదు.
"మధ్య" తరగతి ప్రజల పన్నులపై బతుకుతారని వీరి మీద అందరికీ అక్కసే. పండ్లు బిగపట్టుకొని సదరు మధ్య తరగతి ఉద్యోగులు దయతలిచినప్పుడు వారు 11 గంటలకో, పన్నెండుగంటలకో కార్యాలయానికి వచ్చి వేడి తేనిటి పానీయం సేవించి, వీరి మీద ప్రసన్నులయ్యే వరకూ కడుపులో కాళ్ళు పెట్టుకొని కార్యాలయం బయటే పడిగాపులు కాస్తూ ఉంటారు.
ఫిబ్రవరి 28 అవకాశం కూడా రాదేమో.సదరు మధ్యతరగతి దొరలు పన్ను పోటు తగ్గిందేమో చూసుకోవాలి కదా!
నిజం నిష్టూరంగా ఉంటుంది.మరి దొరలు ఈరోజు ఎం పేరు పెడతారో చూడాలి.

శ్రీ శ్రీ గారికి వందనాలతో
వైను చుక్క,
ఇంత వోడ్కా, 
పాను గుట్కా,
ఇది కాదోయ్ జీవితమంటే!
బీరు బాటిలూ,
నీరా, కల్లూ,
బ్రాందీ పెగ్గూ,
ఇస్తాయోయ్ వెంటనే కిక్కూ!
దొంగ సారా, 
కల్తీ కల్లూ,
గుల్ల ఇల్లూ,
నరకానికి తుది మెట్టు!
ఇంటి పట్టూ, 
ఇంతి నుదుటి బొట్టూ,
బిడ్డ వృద్ధి తొలిమెట్టూ, 
చూడవొయ్ దేవుడున్నాడు నీ చుట్టూ!
శ్రీ శ్రీ గారి అగ్గి పెట్టే కవిత స్పూర్తితో!

చిన్న ఫన్ను

 ఏమిటి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
చార్మీనారు మన రాష్ట్రంలో లేదు కదా ఇప్పుడు పైకప్పుకి ఏం రేకులు వెయ్యాలా అని?

Modi Versus Kejri

A glaring example of experience versus inexperience in Indian politics is Narendra Modi versus Arvind Kejriwal. Modi was mocked with expletives never heard of in the annals of democratic India by AK. But today, AK's inexperience, arrogance and me-all and none-at-all stands exposed in the streets of Delhi even as Modi goes on doing his job with a no-nonsense approach to governance.
What is required is immense patience and vast experience, not a few tom-tommers surrounding you. Kejriwal is a living example of a few arrogant youth who revel in breaking rules and mocking elders and the


కేజ్రీ విపాసనాలు - రాహులు బాంకాక్ ఆసనాలు
ఎక్కువ తింటే పాసనాలు,
పోవడానికి విపాసనాలు,
థాయిలండులో ఆసనాలు,
ఏడపోవునోయి పాత వాసనలు!
రైతుల పేరుతో ఊరేగింపులు,
వారి సొమ్ములేగా ఆరగింపులు?


చెత్త- చరిత్ర

చెత్త గురించి కూడా
చరిత్ర రాయడం నా ధర్మం
చరిత్రలో చెత్త
వెదకడం నీ ఖర్మం!
తప్పు ఒప్పుకోలగడం
నా అసమాన ధైర్యం
తప్పుల తుప్పు
పేర్చుకొవడం నీ శౌర్యం!
రాళ్ళనుంచి పప్పు
చెయ్యగలగడం నాకు
దేవుడిచ్చిన వరం!
పప్పులో రాళ్ళు
వెదుక్కుంటూ ఏడవడం
దేవుడు నీకిచ్చిన శాపం!



చదివితే నా అదృష్టం- చదవకుంటే మీ అదృష్టం


No comments:

Post a Comment