Friday, September 11, 2015

వాణి త్రిశతి- 300 తెలుగు పద్యాలు

TRANSLATION INTO ENGLISH AND EXPLANATION IN TELUGU

PART 2 








వాణి శతకం    2




The following eight poems are translation to the best of my ability, Shakespeare’s Seven Stages of Life in “As You Like It” a philosophy that impressed me at age 18, in my graduation and led me to read the whole lot of Shakespeare dramas with devotion. Must be read in unison to get the full pleasure.

 క్రింది ఎనిమిది పద్యాలు షేక్స్పియర్ వ్రాసిన "మనిషి జీవిత నాటకంలో ఏడు అంకాలుఅనే "As you Like It" అనే డ్రామా లోనిదిఇది నేను నా 18  ఏట చదివిన తరువాతవారి డ్రామాలు మొత్తం బట్టీ కొట్టి, Walking Shakespeare అని పేరు సంపాదించుకున్నానుఎంత గొప్ప వేదాంతమండీ ఎనిమిదీ ఒక్క సారి చదివితేనే దాన్లో సారం అర్ధం అవుతుందండీ.



52.

సచ్చు తనక నటన రంగ స్థలము పయిన

వచ్చు నొక్కడు బోయెడి వాడొకండు

ఏడు యంకముల పిదప యముడు వచ్చు

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

చనిపోయే దాకా ప్రతి వ్యక్తీ ఒక రంగ స్థలము పైన నటుడు మాత్రమేతెర ముందు నటుడు కనుమరగయ్యే లోపు తెర వెనుక నుంచి ఇంకో పాత్రధారి తయారుగా ఉంటాడునాటకం ఏడు అంకములు ముగిసే  సరికి యముడు వచ్చి కూర్చుంటాడునాటకం పరి సమాప్త మవుతుంది.

English:

Original:

And all the men and women merely players;
They have their exits and their entrances,
And one man in his time plays many parts,
His acts being seven ages. 

The whole world is a stage and we are mere actors playing our role till we breathe the last. One person comes and the other goes, as on a stage. After seven acts, the Lord of Death comes and play ends.



53.

మొదటి యంకము నందున ముద్దు బిడ్డ

తల్లి యొడి లోన ఏడ్చుచు తీరు సేద

చేయుచుండును తగనన్ని చేష్టలెన్నొ

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):
మొదటి అంకంలో తల్లి ఒడిలో సేదదీరే పసి పాపపెద్దగా రోదిస్తూఇంకా ఎన్నో చిలిపి చేస్టలు చేస్తూ తల్లి మనసును ఉల్లాసంగా ఉంచుతుంది


English:

Original:

At first the infant,
Mewling and puking in the nurse's arms.

In the first act, it is the baby that rests in the warm bosom of the mother, crying loud sometimes and indulging in many a mischievous act, to the glee of the mother.

54.


నత్త బోలిన నెమ్మది నడక తోడ

బడికి బోవగ సంచెడు బరువు తోడ

చేరు రెండవ యంకము చదువు కొనగ 

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

రెండవ అంకంలో భుజం మీద సంచెడు బరువుతోఅయిష్టంగానే విద్య నేర్చి ఙ్ఞానమూ, విఙ్ఞానమూ  సముపార్జించడానికి నత్త నడక నడిచే  బాలిక/బాలుడూ ప్రవేశిస్తారుతమ పాత్ర పోషించడానికి.

English:

Original:

Then, the whining school-boy with his satchel
And shining morning face, creeping like snail
Unwillingly to school.
In the second act, the reluctant toddler walks slowly with a bag full of books etc., to the school to improve his knowledge and wisdom through education.


55.


నిట్టు యూర్పుల పాటల నీడ లోన

సేద దీరును వయసున బ్రేమ యందు

ప్రేయసి కను బొమ్మల తలబోసి డస్సి

తేట బలికెను  బాణి నాదు వాణి!



తాత్పర్యము (తా):
మూడవ అంకంలోనూనూగు మీసాల లేత వయసు కౌమార దశలో ఉన్న యువకుడు ప్రవెశిస్తాడుప్రేయసి విరహ తాపాన్ని తట్టుకోలేకఆమె కనుబొమల అందాన్ని వర్ణిస్తూ పాటలు పాడుకుంటూనిట్టూరుస్తూ తన పాత్రను పోషిస్తాడు.


English:

And then the lover,
Sighing like furnace, with a woeful ballad
Made to his mistress' eyebrow.

In the third part the adolescent enters with a sigh of separation from his lady love, singing melanchaloic songs on the beauty of her eye brows.

 56.

యువత నందును బాధ్యత యెంతొ బెరుగ

యుద్ధ వీరుని వోలెను యోధు డగును

ముక్కు మీదను చిరు కోప మెక్కు డవగ

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

నాలుగవ అంకంలోజీవితంలో అతి ప్రధాన పాత్ర పోషించడానికి ఉత్సాహంగా యువకుడు ప్రవేశిస్తాడు ముక్కు మీద కోపం ,మనసులో అకుంఠిత దీక్షబాధ్యత పెరిగిన యువకుడు యుద్ధ వీరుని వలె తన పాత్ర పోషిస్తాడు.  

English:

Original:

Then, a soldier,
Full of strange oaths, and bearded like the pard,
Jealous in honour, sudden, and quick in quarrel,
Seeking the bubble reputation
Even in the cannon's mouth

In the fourth part, the effervescent youth, with full of energy and enthusiasm enters the stage like a soldier to act the most important part in his life.

57.

మేధ పెరుగగ వయసు మీర గాను

చర్చ జరుపును మంచియొ చెడుయొ యనుచు

అనుభ వించును తృప్తిగ యాస్తి యున్ను

తేట బలికెను  బాణి నాదు వాణి!



తాత్పర్యము (తా):

మధ్య వయసు రాగానే నటుడు పూర్తిఙ్ఞానంతోఅనుభవంతోమంచిచెడు విశ్లేషిస్తూ రంగ ప్రవేశం చేస్తాడుతాను సంపాదించి కూడబెట్టిన కొద్ది ధనాన్ని తృప్తిగా అనుభవిస్తూ తన పాత్ర పోషిస్తాడు.

English:

Original:

And then, the justice,
In fair round belly, with a good capon lined,
With eyes severe, and beard of formal cut,
Full of wise saws, and modern instances,
And so he plays his part. 

The middle aged actor enters the scene in the fifth act, with knowledge and wisdom and ability to discuss what is good or what is bad (a judge) and spends his life enjoying his wealth.


58.


ముసలి తనమున శక్తి మరుగు పడగ

పోవ బలమును మనసున బాహు లందు

ఒంటి బతుకును నడుపును ఊరు నవ్వ

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

ముసలి వయసు మీదకు వచ్చిన నటుడు శక్తి ఉడిగికాళ్ళలోనుబాహువుల్లోనూమనసులోనూ శక్తి కోల్పోయితన వారుపర వారూ నవ్వుతుండగా ఒంటరి జీవితాన్ని గడుపుతాడు.

English:

Original

The sixth age shifts
Into the lean and slippered pantaloon,
With spectacles on nose and pouch on side,
His youthful hose, well saved, a world too wide
For his shrunk shank, and his big manly voice,
Turning again toward childish treble, pipes
And whistles in his sound. 
The actor, as he enters the stage in sixth act, is an old, crippled man losing both physical and mental capabilities and spends a lonely life even as those near and far mock at him.

59.

మరచి పొవగ తన గతమున్ను తన్ను

తాను బరుల సాయము తోడె తనువు గదల

మరల పొత్తిళ్ళ బిడ్డగ మారి పోవు

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తననుతన గతాన్ని మరచి పోయివేరే వాళ్ళ సాయం లేకుండా కదల లేని స్థితిలోఏడవ అంకంలో ప్రవేశిస్తాడు నటుడుఅప్పుడు మళ్ళీ తాను రంగ ప్రవేశం చేసిన పాత్ర లోకి ప్రవేశిస్తాడుతిరిగి  తెర కను మరుగవడానికి.

English:

Original: 

Last scene of all
That ends this strange eventful history,
Is second childishness and mere i,
Sans teeth, sans eyes, sans taste, sans everything.

In the seventh act, the actor forgets himself, his past and in a stage where he can not do any chores without help, reenters the first stage to disappear behind the screen permanently. The Drama of Life ends in the seventh Act.

60.

పూల వలచెదు వాటిని పార వైతు

జంతు ప్రేమయు కరిగెను జంపి తినగ

నన్ను బ్రేమింతు నందువు నాకు దిగులు

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

పూలను ప్రేమిస్తానంటావు వాడుకొని వాడి పోగానే పారవేస్తావుజంతువుల  మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నానంటావువాటిని చంపి తింటావునన్ను ప్రేమిస్తున్నానంటావుఏమొనాకు భయంగా ఉంది కదా!

English:

You say you love flowers. But you use them and throw away. You say you love animals. But you kill them and eat. You say you love me. I am now afraid, what you will do to me!

61.


ఎప్పుడొదలదు బిడ్డను ఒంటి గాను

వీట వదిలిన నీవామె వెంటె యొందు

మనసు లుండును యమ్మకు ముందు వెనుక

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

అమ్మ నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలి పెట్టదుఅత్యవసరంగా వదల వలసి వచ్చినా నువ్వు ఆమె వెంటే ఉంటావుఎందుకంటే ఆమె మనసు నీ దగ్గరే వదిలి వెళుతుంది కదాఅమ్మకు ముందూవెనుకా రెండు హృదయాలుంటాయేమో!


English:


Mother never leaves you alone. Even if she leaves you at home in emergency, you are still with her as her heart revolves around you. Who knows, mother has two hearts one on duty, the other on child?

62.

గుణము యెట్టిదనిన గణియించు టెట్టుల

మనసు విప్పి జూడ మనల తరమె

తల్లి యొకటె చెప్పు తీర్పు యంతయును

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):  

అన్నదమ్ములలో ఎవరు గుణవంతులని చెప్పడానికి మనము వారి మనసు  విప్పి చూసి చెప్ప లేము కదాతల్లి మాత్రమే సంకోచం లేకుండా గుణగణాలను ఎంచ గలదు.

English:

We can not open the hearts of brothers to decide who is good and who is bad. Only mother can vouch for their qualities rightly, without any hesitation.


63.

తరచి వేమ (వేమనజూడు చరితను జదువగ

మంచి యనెదొ యతని జెడ్డ యనెదొ

విశ్వదాభి రామ వినమె బ్రేమ

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):  

కేవలం ఒక వ్యక్తి గతం మీదనే అతని నేటి గుణాలను ఎంచడం సరి కాదుఅతనిలో ఎంతో మార్పు వచ్చి ఉండ వచ్చు కదావేమన చరిత్ర చదివితే, "విశ్వదాభిరామ వినుర వేమఅని నీతి సూత్రాలు మన నోటి నుండి వచ్చేవా?

English:

We can not assess the present qualitative attitude of a person, only taking into account his past behavior. If we read the history of Vemana, would we have rendered his Satakam (hundred poems) today.


64.


పిరికి వాని తోడ పామరు తోడను

ఙ్ఞానవంతు తోడ జాణ తోడ

తగదు వాదు ఎపుడు తామసు తోడను

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):  


పిరికి వాని తోటిపామరుడి తోటిఙ్ఞానవంతుడి తోటినెర జాణ తోటి, తామస గుణం అధిక పాలులో ఉన్న వాడి తోటి ఎప్పుడూ వాదు తగదు.


English:

Argument with a timid guy, an illiterate ( or foolish guy), a very wise guy or a Beautiful blonde and with a person afflicted by lowest instinct morally is futile.


65.


కాల మచ్చి రాదొ కాలుండు బలుకడు

సమవర్తి వచ్చు సమయమునకు

యత్న మేల నయ్య యాత్మ హత్య కొరకు

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):  

మన కాలం కలిసి రాక పోతే మనకు సహాయ పడడానికి యముడు కూడా రాడునిర్ణీత సయానికి ముందుయముడు మనలను తీసుకు పోడుఅలాంటప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించి మరో పాపంమరో నేరం ఎందుకు నెత్తిన వేసుకుంటావుబ్రతికిశోధించిసాధించు.

English:

If our time is not good, why our friends and relations, not even Yama, the Lord of Death will not help. He comes at the destined hour only. Why do you attempt suicide and and commit another sin and crime?

66.

నిజము రాగను బయటికి నెలలు బట్టు

గాలి వార్త చేరు గడియయు గడవక

మఱ్ఱి బోదె పడదె మరుగున యూడల

వాణి బలికెను  మాట నాదు నోట!


తాత్పర్యము (తా):  

ఒక నిజం బయటికి పొక్కాలంటే కొన్ని నెలలు పడుతుందిఅదే అబద్ధం క్షణంలో నలు మూలలా పాకుతుందిమర్రి చెట్టు ఊడలు మర్రి బోదెను కనపడకుండా చేస్తాయి కదా?

English:

Truth travels months before its real face is seen, while a lie shows its ugly face immediately. The large banyan tree trunk is covered thickly by aerial roots that outgrow the original trunk and hides it from view,

67.

చూడ యావ కాద కడు చేదు నువు నూనె
కార ముప్పు గలుప యూరగాయ
మావి ముక్క గలుప యావ కాయయది కదా
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆంధ్రుల అభిమాన ఊరగాయ "ఆవకాయమీద ఒక చిన్న పద్యం.

ఆవ రుచి చూస్తే చేదుగా ఉంటుంది గానీసమ పాళ్ళలో ఉప్పూకారమూనువ్వుల నూనేమామిడి ముక్కలు కలిపి తిని చూస్తే ఊరగాయ "ఆవకాయమజా వేరు కదా.

English: 

If we taste mustard seeds these taste bitter. If we grind it into powder, mix with suitable amount of salt, chilly powder, til oil it becomes “uuragaaya” (pickle), if we mix unripe mango pieces this pickle is called “aavakaaya”. During season, this is a small scale industry in AP and this is exported world wide. Taste it, it will be Heaven on Earth.

68.

పురుషు డనుచు పరుష పదములు బలుకుచు
భార్య చెంత నీదు బ్రతిభ జూపి
బరువు బాధ్యతలను బడతిపై బడవేతు
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

పురుషుడననే అహంకారంతోభార్య దగ్గర పరుష మైన మాటలు మాట్లాడుతూతన ప్రతిభ చూపే పురుషులు బాధ్యతలను మాత్రం భార్య పైనే వేసి తమ సరదాలు తీర్చుకుంటూ ఉంటారు కదా!

English:

With male ego the man who speaks harshly with wife to show his superiority, leaves the whole family burden on wife and lives an irresponsible life.


69.

మీసమొచ్చెనంచు మిడిసి బడి బడతి
ప్రేమ పేరు జెప్పి మీద బడుచు,
తప్పు యన్నచో ముప్పతిప్పలు పెడుదె
వాణి పలుకుమాటనాదు నోట!

తాత్పర్యము (తా):

నీకు మీసాలొచ్చీ రాగానేప్రేమ పేరు చెప్పి ఆడపిల్లలను వేధిస్తూ వారిని నానా అల్లరి పెడతావేవాళ్ళు తప్పు అని అరిస్తేవాళ్ళను నానా హింసల పాలు చేస్తావు కదా?

English:  (On Eve Teasing)

Soon after you attain adolescence, you start singing love songs in front of innocent girls. If they it is wrong, you start harassing them.

70.

ప్రేమ దోమ యనుచు బడతిపై కసి గట్టె
గొంతు నులిమి యైన గ్రోసి యైన
నీదు కక్ష తీర దునుమాడితివి కదా
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ప్రేమదోమ అంటూ ఆడ పిల్లల్ని వేధించివారు కాదంటే కక్ష గట్టి వారి గొంతు నులిమి గానీకోసి కానీ చపుతున్నావు   కదాఇది ఎక్కడి న్యాయం

English: (On increasing violence in the name of love)

You tease young girls with assumed love and if they refuse you kill them by throttling them or cutting their throats. What kind of justice is this?

71.

నీకు ఏమి మిగిలె నినుగన్న దలిదండ్రు
లేమి బావుకొనిరి మిగుల దుఖము
గాక యేలనయ్య పొగరు యేమి మిగిలె,
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నువ్వు హింసకు పాల్పడి ఆడ పిల్లల్ని చంపి వేస్తే నీకు ఏమి మిగిలిందినిన్ను కన్న తల్లి దండ్రుల కేమి మిగిలిందిఏలనయ్యా నీకు అంత మదము?

English: (On consequences of increased adolescent violence in the name of love)

With so much arrogance, if you kill innocent girls what remained for you in life and what remained to your parents who struggled to bring you to this stage, except life long sorrow?


72.

ఆటవెలది నేను యర శతకము రాయ
వాణి నాడు నేడు తోడు నిలిచె
రాసెద మిగులు సగము రస తేట గతి తోట
వాణి పలుకు మాట నాదు నోట!



 క్రింది నాలుగు పద్యాలూ ఆడపిల్లల్ని అమ్ముకుండే  మన  సంస్కృతి  పైన.


73.

ఆడపిల్ల యచట యరువది వేలట
నల్లగొండ లోన నడుచు రీతి
బాలురయిన నీకు బహు కష్ట మగునొకొ
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆడ పిల్లల మార్పిడి ముఠాలు నల్లగొండ పట్టణంలో అరవై వేలకు కొంటున్నారటబాలురకు విలువ లేదక్కడ.

English:

In Nallagonda town the human traffickers are buying a girl for Rs.60,000/-. There is no value for boys there.

74.

అష్టకష్టముల యవలీల భరియించి
ఆడ బిడ్డ కన్న హాని యనుచు
విడిచి పోయె తల్లి విడిదియెచట బిడ్డ 
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నవ మాసాలూ మోసిఆడ బిడ్దను కంటే హాని కలుగుతుందని మూఢ నమ్మకంతో తల్లి బిడ్డను ఎక్కడో వదిలి వేసి వెళ్ళి పొయిందినీకు నివాస మెక్కడబిడ్దా?

English:

After bearing the kid for nine months with difficulty, the mother left the baby somewhere as she felt, in her belief, it is harm to have a girl child. Child! Where is your abode now?

75.

రాక్షసాధములు నిను రక్ష చేసెద మనుచు 
వీధి యందు నిన్ను వెలను కట్ట 
మధ్యవర్తులెవరొ ధర కట్టి నినుయమ్మె
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

 విధంగా ఆడబిడ్దకు వెలకట్టి కొన్న మధ్యవర్తులైన రాక్షసాధములు తనను వీధిలో వెలను కట్టి అమ్మిరి కదా?

English:

These demons who bought you for a price, auctioned you in the midst of a road and sold you to the highest bidder, Oh! Girl!


76.

ఏమి పీడ గలిగె ఎపుడొకొ విముక్తి 
ఆడపిల్ల కెపుడు రక్ష కలుగు
ఇంటి దీపమార్పి తిమిరాన మనరొకొ 
వాణి పలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆడ శిశువులను పురిట్లోనే హతమార్చే  పీడ ఎప్పుడు విరగడ యవుతుందో కదాఆడ బిడ్డలకి ఎప్పటికి రక్షణ దొరుకుతుందో కదాఇంట్లో దీప మార్పుకొని చీకట్లో బ్రతుకుతారుఏమి  దౌర్భాగ్యము?

English:

When will this curse of killing baby girls soon after birth ends? When will the girl child get protection? Why do we prefer darkness by putting off the light in the family?


77.

ఆడ శిశువు యనిన యసహన మది యేల,
పుట్టగానె విసిరి పారవేయ
నీదు కన్న తల్లి నిను బారద్రోలెనా
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):

ఆడ పిల్ల అంటే అంత అసహన మెందుకునువ్వూ ఆడపిల్లవే కదానిన్ను కనగానే నీ తల్లి నిన్ను పార వేయ లేదు కదా?

English:

Why are you so impatient at giving birth to the a baby girl? Why do throw her away in garbage bins? Did your mother do this to you?

Sec. 498 the boon and the curse.

Sec 498 వరమూశాపమున్నూ

వరం
Boon.

78..

అత్తమామ ఇంట ఆరళ్ళు పడలేక
అత్త మామ మరియు ఆడపడుచు
జైలు పాలు జేయ జేసిరో చట్టము
వాణి పలుకు మాట నాదు నోట.


తాత్పర్యము (తా):

అత్తమామల ఇంట్లో కష్టాలు భరించ లేని వారికి ప్రభుత్వం  ఒక చట్టం తెచ్చింది చట్ట ప్రకారం కట్నాల కోసం వేధించే అత్తమామలనుఆడపడుచులను కారగృహానికి పంపే వీలు కలిగింది

English:

To provide confidence and security to the women who face trials and tribulations in the house of the in-laws, government brought out a law by which the culprits can be sent to jail.

శాపం
Curse

79.
చట్టమొచ్చెననుచు సరి కొత్త యారళ్ళు,
నీదు తండ్రి తల్లి నీవు కలిసి
సెక్షనొచ్చె ననుచు శిక్ష పాల్చేసిరో,
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):

section 498a వచ్చింది కదా అని ఎదురు వేధింపులు  మొదలు పెట్టిడబ్బు గుంజే మిషతో నువ్వు (కోడలూ), నీ తల్లి దండ్రులూ కలిసి అత్తమామలనిఅమాయకులనీ కారగృహానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు కదాకలి కాలం.

English:

As Sec. 498 a is providing the daughter-in-law, unrestricted freedom and protection, she along with her parents are harassing their in-laws, by threats of sending them to jail, to extract money from them. What times have come?


80.

కట్న కాన్క కొరకు కడదేర్చె శిశువును
కట్న మీని  బిడ్డ కడలి పాలు,
కట్నమడిగిరంచు కటకటాల పాలు,
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):

మన ద్వంద్వ నీతి ఏలా ఉంటుందో చూడండికట్నం రాదని తన ఆడ పిల్లని పుట్టగానే సముద్రంలో పారవేసిన తల్లితన కొడుక్కి కట్నం తేలేదని కోడల్ని వేధించి తాను కటకటాల పాలయ్యింది కదా!

English:

See our double standards. If it is a girl child, as no dowry can be earned, mothers throw their baby girls in the sea. The same is thrown into jail for demanding dowry from daughter-in-law.

81.

నీవు ఆడబిడ్డ నువు కన్నదదె కదా
ఇంటికొచ్చు బిడ్డ ఈడ బిడ్డె
ఆడబిడ్డ యన్న యలుసదెందుకో
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):

తల్లులకి చిన్నపాటి సలహామీరు ఆడపిల్లలే కదామీరు కన్నదీ ఆడ పిల్లనే కదామరి మీ ఇంటి కొచ్చే ఆడ పిల్లని ఈడ పిల్ల కాదుఆడ పిల్లని అవమాన పరుస్తారెందుకు?

English:

A small word to mothers. You were a girl child when born. Your daughter was a girl child. But, why do you ill treat the girl child that enters your house as your daughter-in-law, saying she does not belong here?


82.

ఏడ చూడు యాడ శిశువు బలిపశువు,
కాదు కాదు కాదు తగదు మనకు,
స్త్రీని పూజ సేయ సిరిద నిలుచునట
వాణి పలుకు మాట నాదు నోట.

తాత్పర్యము (తా):

ఎక్కడ చూసినా ఆడ పిల్లలే బలి పశువులవుతున్నారుఇది మనకు తగదువద్దుస్త్రీని అవమాన పరిచిన చోట సిరి నిలవదని నానుడి.

English:

Wherever we see, girls are sacrificial goats. It is not advisable. Where a woman is ill treated, Goddess of Wealth does not stay there, it is said.


83.

ఆడుబిడ్డ గలుగ యాలోచన పెండ్లిపై
పుత్రు గనిన చదువు కట్న ధ్యాస
మారు నెపుడొ మనదు మలినపు భావన
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆడ పిల్ల పుట్టిన దగ్గర నుంచి  పిల్ల పెళ్ళి ఎలా చెయ్యాలి అన్నదే ఆలోచన తల్లి దండ్రులకిమగ పిల్ల వాడు పుట్టగానేవీడిని ఎంత పెద్ద చదువులు చదివించాలిఎంత పెద్ద ఉద్యోగం చేస్తాడుఎంత కట్నం తెస్తాడు అనెదే ఆలోచన.


English:

As soon as a girl child is born, parents think about her marriage and the dowry they have to part. As soon as a baby boy is born, their thoughts go on how to educate him, what position he will land in life and how much dowry he can bring. Alas!

84.

తల్లి దండ్రు లందు దయ గలుగు పుత్రుండు
యొక్క డున్న చాలు యదియె ఫలము
నరక మొండ్రు యుండు ననుచు భయమదేల     
వాణి పలుకు మాట నాదు నోట

తాత్పర్యము (తా):


85.
దేవు డెంత దోషియొ తడసి గొంపోవ
చావు తడవు యయిన చేటు వార
సులకు ముగియు తేది కలదు మందు కయిన
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ముసలి తనం వచ్చాక కూడా ఆలస్యంగా తీసుకు వెళ్ళి దేవుడు వారసులకు ఎంత ద్రోహం చేస్తున్నాడుఆయన పొయ్యేదెప్పుడు ఆస్తి చేతి కొచ్చే దెప్పుడు?

English:

Why is God so unkind that he delays taking the old ones? How much agony he is leaving to his heirs, waiting with open eyes, to share his booty?


86.
.
సాధువనియె పేరు ఎపుడు సాని చింతె
సానుల గనమే వజ్రము సానబట్టి
పేరు చూసి గుణమదెటు పోల్చగలము
తేట బలికెను  గీతి నాదు వాణి! 51

తాత్పర్యము (తా):

ఏమిటో వింతసాధువని ఒకరికి పేరు పెట్టి పూజిస్తాముచీకటి పడగానే వాని నివాసము సాని వాడల్లోనేసాని యని పేరు పెట్టి కొందరిని వెలి వేస్తాముతెల్లవారక ముందే ఎంతో భక్తితో దేవుడిని ప్రార్ధించిమనసు నిర్మలంగా ఉంచే వారు సానుల్లో  ఎంత మంది లేరుఇద్దరిదీ వృత్తి యయినప్పుడు ప్రవృత్తి చూడడం సబబు కాదా


English:

We name one Sadhu and kneel in front of him. By evening he is roaming in the red light area searching for a girl for sensual pleasures. There are women, who are in the profession for lively hood, but they visit temples with pure body and soull and pray God. What is in name, we treat them differently?

87..

 చంద్ర సూర్యు లెపుడు చూడగ కానరు,

పోగ వచ్చు నొకరు పగలు రాత్రి

యొకరు కాచు నిన్ను యమ్మ పగలు రాత్రి

వాణి పలుకు మాట నాదు నోట.


తాత్పర్యము:

దైవ సమానులైన సూర్యచంద్రులు కూడా వంతులు వేసుకుని నిన్ను కాపాడుతారుఒకరు పగలుఒకరు  రాత్రిరాత్రనకపగలనక నిన్ను కాపాడేది నీ తల్లి మాత్రమే.

English:


Even the Sun and the Moon, whom we adore as Gods, do not protect us 24 hours. One appears during morning and when he disappears, another appears. Only mother can protect you twenty fours a day.

88.

పాత రుచులు బోయె మోత పాస్తా దాయె
మంచి రుచులు బోయె రుచి పిజ్జ యాయెనే
వెతలు బడ్డ తాత కతలొ బేతలు డాయెనె
వాణి పలుకు మాట నాదు నోట!

తాత్పర్యము:
పాత రుచులు మరుగున పడిపోయి పాస్తా రుచి మరిగాముమంచిమంచి భారతీయ వంటకాలు వదిలేసి పిజ్జా    తినడానికి పరుగులు తీస్తున్నాముఎన్నో వెతల కోర్చి నీ తండ్రితద్వారా నిన్ను ఇంత వాడిని చేసిన తాత 
విక్రమార్కుడి కథల్లో భేతాలుడుగా మిగిలి పోయాడు.

English:

The old, delicious tastes have gone into the cup board and we are after pasta. Good Indian recipes are taboo and we run after pizza. The grandfather, who passed through man tribulations has remained the Vaital in Vikaramarka stories.


89.

నాస్తి యనుచు దేవు నాస్తికుండు యనియె
నిన్ను చూడ కుండ నమ్మ డాయె
గాలి కనకె బీల్చు కాటి కేగు వరకు
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము::

హే!భగవాన్నాస్తికుడు నిన్ను చూడకుండా ఎలా నమ్మగలనునువ్వు నాస్తి అంటూనేతాను ఎప్పుడూ కంటితో చూడని గాలి పీలుస్తూ బ్రతుకుతాడు కదాగాలిని నాస్తి అనడే?

English:

Hey! God! The atheist says he cant believe your presence unless he sees you with his eyes. But he lives by breathing the air that he never saw nor hopes to see.

90.

వారసుండు యుండ వేరొక్క డొచ్చునే
రాజకీయ మనెడి రొచ్చు యందు
మఱ్ఱి చెట్టు కింద మరొ విత్తు మొలుచునె
వాణి బలుకు మాటనాదు నోట!

తాత్పర్యము (తా):

రాజకీయమనే రొచ్చు లోకి వారసులు తప్పితే ఇంకెవరు రావడానికి సాహసం చేస్తారు. మర్రి చెట్టు కింద వేరే మొక్క మొలుస్తుందా?



English:

Who will enter politics but for the heirs. Can any other plant grow under the banyan tree.


91.

.
కాలమనెడి నావ కడకు తీరము జేరు
నట్ట నడుమ సాగు నాటకమ్ము
ఆడు వాడు యతడె యాడించు నతడెగ
వాణి బలుకుమాట నాదు నోట!

తాత్పర్యము (తా):

 కాలమనే ఓడ కడకు తీరము చేరుతుంది. మధ్యలో జరిగేదంతా జగన్నాటకమే నాటకాన్ని ఆడే వాడూఆడించేవాడూ  భగవంతుడేకారణం లేకుండా ఫలితమెలా ఉంటుంది?

English:

This ship of life reaches the shores one day. In the middle of the ocean, it is the God that plays the the Captain and makes you play the Captain.


92.

లేమి లోన గుణుచు నను జూడ డెవ్వడు
కలిమి లోన లేమి కనడు బరుల
గాలి నింప బుడగ గాలిలో ఎగురదె
వాణి బలుకు మాట నాదు నోట

తాత్పర్యము (తా):

తన దగ్గర ఏమీ లేక బికారిగా ఉన్నప్పుడు నన్నెవరూ పట్టించుకో లేదని ఏడుస్తాడు.  అదే వ్యక్తితనకు మించిన కలిమి చేరాక లేని వాణ్ణి చులకన చేసి మాట్లాడతాడుగాలి నింపాక బుడగ గాలిలో ఎగిరి పోయిన తీరు  ఇదే కదా?

English:

When man suffers penury, he grumbles that others were not coming to his rescue. When he earns immense wealth, he never cares for the poor. If you fill a balloon with Hydrogen Gas, will not fly in the air?

93.


సంస్కృ తన్న పడదు సంస్కృత మన్నను
వేప పనికి రాదు చేపె మందు
చెట్టు లన్ని కొట్టి కట్టె భవనములు
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మన సంస్కృతి పడదుమన సంస్కృతమంటే ఏవగింపుమన పెరట్లో వేప చెట్టు మందుకు పనికి రాదు. (అమెరికా వాడు చెప్పాలిచేప మందు ఇస్తారని మూడు రోజులు పడి గాపులుమన పర్యావరణం మనకి పనికి రాదుచెట్టులన్నీ కొట్టేసి పెద్ద భవనాలు కట్టినయాగరా జలపతం అందాలని చూస్తూ కూర్చుంటాం

English:

We do not like our culture. We hate our native language, Sanskrit. We do not protect our environment. We cut tress, forests and construct palatial buildings. Sitting in our cozy homes, we appreciate the beauty of Nayagara Falls.

94.

.మరక పడదు తెల్ల మడి ధోవతి పయిన
శాస్త్ర మెల్ల జదివి యాత్ర మేల
ముక్కు మూసు కొనగ ముక్తి యొచ్చు నెటుల
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఎంత చదివి ఙ్ఞానం సంపాదించినాఎన్ని ప్రవచనాలు చెప్పినా మీ మోహం తగ్గకుండా ఏమి ప్రయోజంకనీసం తెల్ల ధొవతి పైన మరక పడినా కోపమొస్తుందే  మీకుకేవలం ముక్కు మూసుకుని ధ్యానం చేస్తే ముక్తి వస్తుందా? (నలుగురికీ ఉపయోగ పడే పని చెయ్య వచ్చు కదా?)

English:

Howsoever you are educated, whatever the wisdom you accumulated, if you do not leave attachment to your material possessions, what is the use of preaching others? Even if there is spot on your white dress, you get angry. If you close your nostrils and do meditation will you get salvation. Do something that is useful to the multitude.

95..

వర కట్న మడిగె వధువు చే బట్టగ,
పాద కట్న మడిగె బొంకు జెప్ప
అన్ని యనుభ వించి సన్యసించు దెటులయా
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఇప్పుడు ప్రవచనాలు చెప్పే వాళ్లలో చాలామంది వధువుని చేపట్టండానికి వర కట్నాలు తీసుకొనే ఉంటారు కదాముక్తి మార్గం బోధిస్తామని బొంకులు పలకడానికి పాద కట్నం  తీసుకుంటారు కదాఅన్నీ  అనుభవించి ఇప్పుడు సన్యాసి అవతార మెత్తితే ఏమి లాభం గురువర్యా?

English:

Many who preach salvation through sacrifice, once might have demanded dowry for marrying a girl. For preaching they would have demanded remuneration. After enjoying material things in the world, now they turn ascetic and preach others.


96.
జనుల చేర్చి చెప్పె చాల శాస్త్ర ములను
మరలి బోవ యడిగె ముల్లె యెంతొ
స్వర్గ మనగ నేమి త్యాగము కాదొకో
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

జనులను ఒకచో చేర్చి ఎన్నో శాస్త్ర పాఠాలను వల్లించే అవధాని గారువెళ్ళేప్పుడు డబ్బు సంచి చేతిలో పెట్టందే కదలరు కదావీరు చెప్పే స్వర్గం త్యాగంలోనే ఉంటుంది కదా డబ్బుని  సత్కార్యానికో వినియోగించ వచ్చు కదా.

English: 

Gathering devotees at one place the preacher preaches sacrifice, Heaven etc., While going he demands his money for having preached. If Heaven lies in sacrifice, why does he not use the money for charity? (He is already rich)

97.

మూర్ఛ రోగి బిడ్డ మొదటి ముద్ద తినకె
పాఠ శాల నుంచి బయట బంప
యక్షరములు నేర్చె యింత వయసు లోన
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

 అక్షరాలు నేర్చుకునే తల్లి మా వాచ్ మాన్  రెండో కూతురుచిన్నతనంలోనే ఎపిలెప్సీ రావడంతో బడి నుంచి పంపెశారటఇప్పుడు నా భార్య దగ్గర అక్షరాలు నేర్చుకుంటుందిఏక సంథా గ్రాహిదేవుడు  అమ్మాయిని చల్లగా చూడాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.


English:

The younger of the two girls is an epilepsy patient. Even before she ate her first solid meal she fell ill with epilepsy. The Government School she was studying discarded her and hence, she left studies. At this age she is learning alphabets in our house. (She is second daughter of our watchman)


98.

తల్లి సదువు తాది తెలివితే టలు మెండు
సొమ్ము లేడ తెత్తు సదువు సాగ
కట్ట మెంత బడ్డ పొట్ట నిండక పోయ
వాణి బలుకు మాట నాదు నోట!



తాత్పర్యము (తా):

లాప్ టాప్ లో టైపింగ్ నేర్చుకుంటున్న అమ్మాయి మా వాచ్ మాన్ పెద్ద కూతురు. 12 తరగతి లో 77 శాతంతో  ఉత్తీర్ణురాలయ్యి డిగ్రీ లో చేరిందిలాప్ టాప్ మేమే  అమ్మాయికి ఇచ్చాముఫీజు కట్టేందుకు ఏవరైనా ముందు కొస్తే అమ్మాయి కాలేజీకి పంపవచ్చుమా ప్రమేయం లేకుండాదురుపయోగం కాకుండాఅది మా ఇల్లేహైదరాబాదులోనేర్పుతోంది వాణి.

తాత్పర్యము (తా):

 పద్యం రాయలసీమ భాషలో రాసింది అమ్మాయి తండ్రి మా బిల్డింగులో వాచ్ మాన్. 12  తరగతిలో 77 శాతం మార్కులొచ్చయినీళ్ళు లేక పొట్ట చేత పట్టుకుని హైదరాబదు వచ్చారుఅతని మాటల్లోనే " మా తల్లి సానా బాగా సదువుతాది సార్డిగ్రీలో సేర్చాల. 42 ఏలు అడుగుతా ఉన్నారుమా సంపాదనలు పొట్ట నిపుకోడానికే సాలటం లేదుఅని.

నేను మొదటి వాయిదా (ప్రిన్సిపాలుకిపంపుతానని నాలుగు వాయిదాలు తీసుకున్నానుఎవరైనా సహాయం చెయ్య దలుచుకుంటే కాలేజీకి డబ్బు పంప వచ్చునాకు తెలిపితే నేను వివరాలిస్తాను.

English:

The elder one is the elder daughter of our watchman. She scored 77% in Intermediate. Clever girl. We donated a two year old Acer Laptop and promised the principal that we would pay first instalment of Rs.10,000/_ If anybody feels he/she can help may contact me. I w



99.

తల్లి కడుపు నింప తటపటా యించెను
తల్లి బోవ చితిని తాక డాయె
గుడికి మాన్య మివ్వ గత పాప మెటు బోవు
వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

తల్లి బ్రతికుండగా ఇంత ముద్ద పెట్టడానికి వెనుకాడిఆమె పోయినప్పుడు పార్ధివ శరీరాన్ని తాకడానికి ఇష్ట పడని వాడుగుళ్ళల్లో దానాలు చేసి పెద్దపెద్ద అక్షరాలతో పేర్లు వ్రాయించుకుంటాడు కదాదేవుడు మెచ్చుతాడ?


English:

A person who does not feed his mother even out of charity and who hesitates to touch her body on her passing away, donates huge amounts to Temples of God and gets his name printed in golden letters. Will the God accept such donations?



100.

నూరు ముగిసెను దైవమ వందనములు

యింత వరకును విఘ్నము ఇంత గనను

వాణి కరుణతొ శతకము వాశి ముగిసె



తేట బలికెను  బాణి నాదు వాణి!


101.


భాష స్వచ్చమున్న భావము స్వచ్చము
వినగ సొంపు వివిధ భారతి గదె
క్రొత్త పుంత తొక్కె కొంగొత్త గొంతులు
వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):


English:

Many FM channels have come to air programs. But, Aakaash Vaani, Vividh Bhaarati stands apart. The language of the anchors is pure, their thoughts are unadulterated. There is no scope for adulterated language. Hope Vividh Bharati entertains the listeners forever after.

102..

వాన కురవ దనియె వాతా వరుణుడయ్యొ

వరుణు డేమొ నవ్వి వింత జూడ

కురిసి పోయె వాన కుక్కలు పిల్లులు (cats and dogs)

వాణి పలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

వాతావరణ నిపుణుడు వాన కురవదు అని కచ్చితంగా లెక్కలు వేసి చెప్పగానేఇదేదో తమష చూద్దామన్నట్లుగావఋణ దేవుడు భారీగా వర్షం కురిసి పోయాడుట.

English:

Soon after the weatherman made calculations and predicted that there would be no rain, to see fu the rain Gods poured cats and dogs.








VANI+CHANDRA 38 years of happy living.

Traveling in Italy. Our life has been an arduous journey through lakes and rocks.


We might have covered tens of thousands of miles in various countries.

WAITING FOR THE CALL

SHE TURNS 60 (Shashti Poorthi on 30th June.) My gift to her, 200 poems.



VANI TRISATHI


श्री   सरस्वती   स्तुति - या   कुन्देन्दुतुषारहारधवला

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा पूजिता
सा मां पातु सरस्वति भगवती निःशेषजाड्यापहा ॥१॥

Devi Saraswati


No comments:

Post a Comment