POETRY IN TELUGU.
తెలుగు పద్యాలు
నా భార్య వాణి 61 వ జన్మ దినానికి (షష్టి పూర్తి, 30 జూన్, 2015) ఒక పద్యం కానుకగా ఇద్దమని చందోబద్ధంగా చంపక మాల పద్యం రాశాను. అదే స్ఫూర్తితో వాణి శతకం అని ప్రారంభించాను. అది రెండు వందల పద్యాలు పూర్తయినాయి. అన్నీ ఒకే సారి ప్రచురించడం కంటే రోజుకి పదిహేను పద్యాలు ప్రచురిస్తే బాగుంటుందని ఈ రోజు ప్రారంభిస్తున్నాను. చివరి భాగం జూన్ 30 న. ఇవి కూడా తప్పులు దిద్దిన తరువాత పుస్తకంగా ప్రచురిస్తాను. దీవించండి!
On the occasion of the 61st birthday of my wife, on 30th June, 2015, I wanted to present her with my first poem in Telugu written as per Grammar rules. I wrote it in Champakamaala, one jewel in Telugu grammatical poems. With the same enthusiasm I started penning Vaani Satakam, with 100 such poems. I ended up writing two hundred. (Vaani Dwisati). Instead of publishing all on one day, I wanted to publish 15 poems per day to complete it on 30th June.I will publish this on 30th June after getting them corrected by experts. Bless us!
This contains the Telugu meaning of the poem with English translation.
తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11 వ తరగతి తరువాత తెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవదమూ, తదుపరి జీవితమంతా ఎక్కవగా ఆంగ్ల భాషా పుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానే మిగిలి పోయింది. ఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని ఏనాడూ ఒక్క పద్యం కూడ పూర్తి చెయ్యలేదు.
It is a difficult proposition to attempt to write a
poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules
which are complex after my 11th class. As I was totally engrossed in
reading and dealing in English, this desire to write a poem in Telugu remained
a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying
and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకు, నా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టాను. చిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణ సూత్రాలు, లఘువులు, గురువులు, వృత్తాలు, యతి, ప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నాను. నా భార్య సలహా తీసుకున్నాను. పద్యం పూర్తయ్యాక. ఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చు. నాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పింది. కుదరలేదు, సరైన పదం. వదిలెశాను.
ఇక మీ ఓపిక.
At last with
the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the
grammar rules I learned during my school days, referred a few books, took my
wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on
Goddess Vani and Vani. This called Champakamala, in Telugu lingo. There might be
errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As
far as I know, there is one clear error. Please correct, if you have knowledge
of Telugu grammar.
వాణి శతనానికి నాందీ పద్యము.
FIRST POEM AS PROLOGUE TO VAANI SATAKAM
కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!
Dedicated to
Goddess of Knowledge, Vani.
నా చదువుల రాణి వాణికి అంకితం.
Like a
creeper blooming with flowers that moves lightly during wind, your words are so
mild and touching. As a lady of the house, when you entered our house, you bore
your burden with proper judgment and intelligence. When very young you faced
unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet
smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vaani.
వాణి శతకం
1.
రామ యనిన నాడు రసమయ భావన,
రామ యనిన నేడు రక్షణ కరవాయె
మతము పెరు చెప్ప మలమల మాడ్చరే,
మతము పెరు చెప్ప మలమల మాడ్చరే,
వాణి పలుకు మాట నాదు నోట!
తాత్పర్యము (తా):
ఒకప్పుడు రామ అని పలుకగానే నర, నరాల్లో భక్తి భావన కలిగేది. నేడు రామ అనగానే ఏమి ముంచుకొస్తుందోనని భయం. ఎవరి మతము పేరు వారు చెప్పుకోవడానికి కూడా భయ పడే పరిస్థితి. (ఇదేమి సెక్యులరిజం అని)
English:
Once upon a time, if we chanted the
name of Rama, people used to go into a trance. Today, the very word Rama became
a taboo. Verbal attacks are increasing on people who say they belong to a
particular religion. (Is it the secularism we had dreamed of?)
2.
నాదు మతముయనిన నగవుల పాల్చేయ
ఇట్టి రీతి ఇంక ఎన్ని దినము
లింక వేచి చూడ లావు లేదు ప్రభూ
వాణి పలుకు మాట నాదు నోట.
తాత్పర్యము (తా):
నా మతము పేరు చెప్పుకుంటే నన్ను నవ్వుల పాలు చేస్తున్నారు. ఇలా ఇంకెన్ని రోజులు, ప్రభూ? వేచి చూడ నాకు శక్తి లేదు, రామా?
English:
I am becoming a laughing stock to say
the name of my own religion. How many years can I wait like this my Creator? I
am losing power to wait further.
No comments:
Post a Comment