Friday, June 16, 2023

    OPPOSITION UNITY AGAIN - 

    JOKE OF THE BILLENNIUM 

                       PART -1

                   ************

Opposition Unity ? Is it a pipe-dream, a mere posturing or a concrete effort ? For analysing this we should peep into pages of history and analyse their Strengths, Weaknesses, Opportunities and Threats. (SWOT analysis).

###################

Now, if we peep into the pages of history, what do we know? India aka Akhanda Bharath , (from Himalayas to the great oceans down South, From Chanakya, Serial. Himalayon Se Lekar , Samudra Paryanth Tak ) has always been ridden with factional politics. That was one of the reasons why ambitious foreign thugs, out to loot wealth of Bharath could invade and occupy this country easily. Chanakya, the Creator of Ardh Shastra, a treatise on economy and political science , uses his acumen to unite the fractured Indian polity divided into small kingdoms or Janapadas as they were refered then , to dethrone the selfish , womanising and  tyrant Dhanananda and establish a rule of law under Maurya Chandragupta. Dangling the carrot, using the stick and using their flaws to pin them down Chanakya unites them and defeats the Magatha King, who was invincible till then and anoints Maurya Chandragupta on the throne. Some in the group of cunning kings and princes try till the last minute to thwart the attempts of Chanakya. But the wily patriot Chanakya overrides them. Is there a Chanakya in the opposition camp now? No. We have only Nava Nandas (nine Nandas, jokers now). Where is Chanakya the patriot and politically savvy intelligent leader now? He is ruling the country to the utmost satisfaction of the populace. Is it possible to dethrone him for these Nanda dynasts who are  useless and whose only strength is their ancestry? Where do we find one , one and the only one who can counter the charis№###ma of Modi, his love of India , his patriotism and his unifying nature? 

###################

Mughals and later the British used the inefficacy of and internecine quarrels among the rich , dynastic but nincompoop princes to overthrow them and bit by bit occupy our sacred land. These princes, as long as they were allowed to remain rich, gaudy and allowed to indulge in body sports with the feminine gender ignored the poor population. We saw a similar pattern in the opposition parties and groups today.

Congress, a behemoth political dispensation few years back slowly disintegrated into a non-entity. The sinking ship was ditched by more patriotic senior leaders. But the dynasts , as long as they could enjoy the ill-gotten wealth and the bail in courts handed over to them on a platter inspite of their criminal mindset are not bothered to revive the party and infuse courage in the cadre. Many Regional parties who are off-shoots of the Congres of yore follow the pattern by the book. Other Regional parties , formed on regional sentiments cling to power spending the tax-payers' money  offering freebies and keeping population drowsy offering them them intoxicating drinks and allowing the drug-trade flourish in their states . Many state level leaders consider the states they rule as their kingdoms. Now, leaders of these parties want to come together to dethrone Modi. The incentive? PM post. Raison diet're? Hatred for Modi. Why hate Modi? 

Contd., 

Wednesday, December 14, 2016

VANI TRISATI - THREE HUNDRED POEM inS IN TELUGU ON CONTEMPORARY ISSUES- WITH TRANSLATION IN ENGLISH PROSE AND TELUGU PROSE

8



తెలుగు భాషలో ఛందోబద్ధంగా పద్యం వ్రాయడం అతి క్లిష్టమైన ప్రక్రియ. 11  తరగతి తరువాతతెలుగు వ్యాకరణంతో పూర్తి బంధం తెగి పోవడమూ
తదుపరి జీవితమంతా ఎక్కువగా ఆంగ్ల భాషాపుస్తకాలే చదవడం వల్ల తెలుగులో కొంతనైనా చందోబద్ధంగా పద్యం రాయాలన్న నా కోరిక అలానేమిగిలి పోయిందిఐతే నా తృష్ణ చల్లారనిది . ప్రయత్నిస్తూనే ఉన్నానుకాని ఏనాడూ ఒక్క పద్యంకూడ పూర్తి చెయ్యలేదు.

It is a difficult proposition to attempt to write a poem in Telugu grammatically. I lost total touch with Telugu grammar rules which are complex after my 11th class. As I was totally engrossed in reading and dealing in English, this desire to write a poem in Telugu remained a dream. But my appetite is unquenchable. So, time and again, I have been trying and failing in the process. But, I could never complete even a single poem.
ఎట్టకేలకునా రాణి వాణి పై ఒక పద్యం మొదలు పెట్టానుచిన్నతనాన నేర్చుకున్న వ్యాకరణసూత్రాలులఘువులుగురువులువృత్తాలుయతిప్రాసలు ఒక్క సారి మననం చేసుకున్నానునాభార్య సలహా తీసుకున్నానుపద్యం పూర్తయ్యాకఆమె కొన్ని తప్పులు దిద్దింది.
ఐనా కొన్ని లోపాలు ఉండవచ్చునాకు తెలిసి ఒక చోట యతి గతి తప్పిందికుదరలేదుసరైనపదంవదిలెశాను.
ఇక మీ ఓపిక.

At last with the blessings of Goddess Vani and with wishes from my wife Vani, I recalled the grammar rules I learned during my school days, referred a few books, took my wife’s advice, as she knew Telugu better than me and compiled the first poem on Godess Vani and Vani. This is called Champakamala, in Telugu lingo. There might be errors and as I stay in Mumbai, I had no option but to depend on my wisdom. As far as I know, there is one clear error. Please correct, if you have knowledge of Telugu grammar.

వాణి శతనానికి నాందీ పద్యము.

కుసుమ లతా విధాన మొక మందర మారుత తుల్య భాషణల్
తరుణివి నీదు భార మతి నేర్పున తీర్పున మ్రోయు ధీమతిన్,
చిన్నతనమందె కష్టముచె భారము మీరగ తీర్పున భరిం
చి సుమ పరీమళంబు శుచి జల్లిన నా యలివేణి వాణికిన్!

Dedicated to Goddess of Knowledge, Vani.

నా చదువుల రాణి వాణికి అంకితం.

Like a creeper blooming with flowers that moves lightly during wind, your words are so mild and touching. As a lady of the house, when you entered our house, you bore your burden with proper judgment and intelligence. When very young you faced unbearable troubles with aplomb. Like the flower creeper, you spread the sweet smell of flowers in my life. I dedicate this to the one woman in my life, Vani.



స్మార్ట్ ఫోను లేక సమయ మెట్లు గడుచు
ఫేసు బుక్కు లేక బతుకు టెటుల
వాట్స్ అఫ్ఫు లేక విలువలు లేవయా 
ట్వీటరమ్మ లేక పాట్లు యెన్నొ!  317

పాలిటిక్స్ వద్దు
ఫొటో పెట్టు ముద్దు
లైక్స్ వచ్చుట కద్దు
నా ఫేసు బుక్కూ!1 

ఆరుద్ర గారు 'కూనలమ్మ పదాలూ అని కొన్ని రుక్కులు విసిరి మనలని అనంద పరిచారు. ఆ "రుద్రు"డంతటి వాడిని కాక పోయినా భావ ద"రిద్రు"డిని కాదు కాబట్టి రోజూ కొన్ని ఫేసు రుక్కులు. 

పెళ్ళి చేసి చూడు
ఇల్లు కట్టి చూడు 
ఫేసు బుక్కు వీడు 
నా ఫేసు బుక్కూ!2y

ముఖమె పుస్తకమాయె
పుస్తకమె వెగటాయె
మస్తకము మరుగాయె

నా ఫేసు బుక్కూ! 3


అప్పు ఇచ్చి మరల అడగని వాడును
కట్న మిచ్చి కాళ్ళు కడుగు వాడు 
మందు మనకు ఇచ్చి ముందె పోయెడి వాడు
చిల్లు కుండ లోన కల్లు పగిది! 318

స్నేహ దినము - తద్దినము 

నేడు స్నేహ దినము
చేసిరట మహ ఘనము
చదివితిర భాగవతము
ఓ! చంద్రం మామ!  
మహరాజు కృష్ణుడు
కడుపేద కుచేలుడు
నెయ్యమన్న యదె చూడు
ఓ! చంద్రం మామ!  
నమ్మకమె ఆ నెయ్యము
అమ్మకాలకు ఓ దినము
విలువ లేడను కనము
ఓ! చంద్రం మామ!  

షిప్పు మునుగ తెలియు ఫ్రెండు షిప్పు విలువ
ముందు దూకు వాడు మిత్రు డగున
స్నేహ మున్న వాడు సేయూత నిచ్చును 
స్వార్ధ మెరుగ దయ్య సఖ్య మెపుడు!

చిరు సమస్యలు -పెను ముప్పులు

చెవి దగ్గర దోమ 
ఇంట్లొ నసిగె భామ 
బ్రహ్మ కైన ఉమ్మ (చెమట)
ఓ! చంద్రం మామ! 

ఫేసు బుక్కు లవ్వు
బెడిసి కొడితె కెవ్వు
లోకమంత నవ్వు
ఓ! చంద్రం మామ! 

చేత స్మార్ట్ ఫోను చెవిలొ ఇయరు ఫోను బ్రతుకు ల్యాండు మైను
ఓ! చంద్రం మామ! 

(ల్యాండ్ మైన్ లో పేలినట్టు పోతాడు అని)

యువత కమిత క్రేజు "సెల్ఫి" కిచ్చె పోజు చేరె "హెల్" కి క్లోజు
ఓ! చంద్రం మామ!  

శ్రీ శ్రీ

ఇంటి పేరు శ్రీరంగం కలము తీస్తె వీరంగం కవితలేమొ సారంగం
ఓ! చంద్రం మామ!  

పతక మొచ్చు వరకు పలకరించి రెవరు ప్రోత్సహించి రెవరు పొగడి రెవరు శిక్షణిచ్చు వారి దీక్ష చూసి రెవరు చుట్టు చేరె నేడు చీమ దండు! 321

చెమట నోడ్చి గెలిచె సింధు ఓ పతకము
శోభ కేలొ వచ్చె సొడ్డు చాల
మందరమ్మ పుట్టె మరల యనునటుల
పరుష భాష లాడె పడతి యీర్ష్య! 322

సింధు నాగరికత బంధువగునొ కాదొ ఆడు వారు ఎవరొ ఏడ వారొ గూగులమ్మ నడిగె కులము గోత్రము ఏదొ బ్రహ్మ ఋషిగ కాడె బోయ వాడు! 323

అన్ని దానములలొ అన్న దానమె మిన్న లేని వాని కచట లేదు చోటు గుడిని మింగు వాడె గుడిలొ యన్నము మింగు కడుపు కాలు వాడు గుడికె రాడు! 324

మన్ను తిన్న నిన్ను మందలించ యశోద కన్ను చెదర మన్ను మిన్ను చూపి బాపితివట యామె తాపము తమమును చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు! 325


గీత గీసె భ్రాత త్రేతా యుగము నందు
రమణి గీత దాట రామాయణము
యుగము మారె గీత యర్ధమె మారెను
భాగవతుని బోధె భారతమ్ము! 326

కలియె యేలు చుండ కల్లు గీత వరము
కాలు ఒకటె నటగ కలికి నడువ
కల్లు తాగినంత కాలితొ పని లేదు
గాలి లోన తేలి కాలు బిలుచు! 327

సీసము

విత్తనమ్ము వేసె వేడుక నొక నాడు
మొలక గనిన యంత మురిసె తండ్రి
బరువు యనక యెంతొ ఎరువువేసెను నాన్న
చిగురు వేయగ చూసి ఎగిరె చాల

పూలుపరిమళించ పొంగిపోయెను కాద
పాదు చేసి నీరు పోసె బాగ

కాయ చూసి తాత కలలు కనెను చాల
పండు తనదె యనుచు పొంగి పోయ

ఆటవెలది

పండు పరుల దాయె పరము యెదురు చూసె
కొత్త విత్తు మిగిలె కలల లోనె
ఆశ వదల దాయె అంకురము పయిన
కాల మహిమ యదియె కర్మ ఫలము! 328

Karmanye vadhikaraste Ma Phaleshu Kadachana,
Ma Karmaphalaheturbhurma Te Sangostvakarmani

The meaning of the verse is—
You have the right to work onlybut never to its fruits.
Let not the fruits of action be your motive, nor let your attachment be to inaction.

The above is poem to explain this Karma theory!

మాతృ భాష దినము మాత వందన మమ్మ దేశ భాషలందు తెలుగు లెస్స వాడి పోయె నేడు వాడుక మరువగ లేని భాష నెటుల లెస్స యనుట! 329

అంబ ఆని (అంబాని) తీసె అమ్ముల పొది నుంవి
సిమ్ము ఒకటి యెంతొ సోకు గాను
క్యూలు కట్టి కొనిరి కోటి కోట్లు జనులు
రియలొ ఫేకొ యెంత రిలయ బుల్లొ! 330
రెలయన్స్ వారి కిది కొత్త కాదు! "మితి మీరిన డబ్బు, మార్కెట్ కిల్లెర్స్" అనే జబ్బుగా మారుస్తోంది వీరిని. ఇది వరలో రిలయన్సు గ్యాసు, రిలయన్సు పెట్రోలు పంపులు, ఆరు వందల యాభై రూపాయల ఫోను ఈ కోవకు చెందినవే. ఈ సారైనా వారు చెప్పిన మాటలు నీటి మూటలు కావని ఆశిద్దాం!
(అంబ+ఆని= అంబాని, సవర్ణ దీర్ఘ సంధి కాని అంబానీలు కాబట్టి సువర్ణ దీర్ఘ సంధి అనవచ్చు)
కారణమ్ము లేక కనికర మెటులొచ్చు
పంచతంత్రమందు బాప చెప్పె
పప్పు నువ్వు మార్చ పొట్టు నువ్వుల తోడ
నిజము తెలియు మీకు నిలకడగను! 331

గజము భూమి కొరకు కురు యుద్ధ మయె నాడు
జలము పేర నేడు జగడ మాయె భాష లేమి యెరుగు పొంగి పొర్ల నదులు తల్లి పాల కొరకు తగవు సబబె! 332

ఆన కట్ట కట్టి ఆప గలరు నీరు
గాలి నాప గలరె గోడ కట్టి 
కృష్ణవేణి గంగ గౌతమి కావేరి

భరత మాత కన్న బిడ్డ లేగ!   333

కన్నడిగుల సొత్తు కావేరి యెటులౌను దేవ భాష కాదు తమిళ మన్న భాష దురభిమాన బధిరాంధులు మీరు తల్లి గుండె చీల్చ తగదు మీకు! 334

కుటిల రాజ నీతి కుత్సితు లొకనాడు భాష పేర భరత భూమి చీల్చ వనరు లన్ని యొకచొ వనరు వారొక చోట హక్కు యడుగ నేడు రక్త మోడె! 335 (వనరుట=వగచుట)

కాజు ఖర్జురంబు కడుపు నిండుగ పెట్టి 
కండ బట్టి నేను కులుకుచుండ
పండుగంచు నన్ను బలిచేయ నెంచేవు 
మానవత్వ మేది మానవుండ! 336

గొర్రె విలాపము 

కంట నీరు లేదు కావేరి వగచగ జలక మాడ నెంచ జలము లేదు సాగరమ్ము తోడ సరస మాడను పోగ కాలు కదల దాయె క్షరము లేక! 337 (క్షరము= నీరు)
కరుణ చూప మనుచు వరుణ దేవుని వేడ కరువు తీర నేడు కురిసె వాన కనుల నీరు నిండె కాలని వాసికి మరల మనుచు వేడ వరుణ దేవు! 338

చెరువు పూడ్చి వైచి సెల్లార్లు చేసియు 
అంగడులను కట్ట ఆశ కొలది
జనమ నెత్తె నేడు చెరువులు వాగులై
కక్ష తీర్చు కొనెగ శిక్ష వేసి! 339


యూరి దాడి పాప మూరికె పోదని ఉరిమి చెప్ప వారు వినక పోయె ఉరికి భరత సేన ఉరివేసె శత్రుల వారి భూమి పైనె గోరి కట్టె! 340

#IndiaStrikesBack

అర్ణ బేమొ అరిచె ఆనందముగ నేడు బర్ఖ దత్తు వగచె బాధ మీర రాజ దీపు కేమొ రావాయె మాటలు సొమ్మ సిల్లి పోయె సాగ రీక! 341 #MediareactsToSurgicalStrikes

ధన తేరసంటు ధనికులు యెగబడి కొనిరి పసిడి ధనము కోట్లు పోసి పణము పెరుగు ననుచు పసిడి కొనగ నేడు పసిడి వణిజు పణము పెరిగె నిజము!  342



దీప కాంతి వెలిగె దివ్య భరత భూమి ప్రక్క రాజ్య మందు పాప తమము నరక యసురు వధతొ భరత భూమి మురిసె నరికి జనుల వారు నవ్వు కొనిరి! 343

బీద వాడు నేడు బంధువాయెను చూడు పాత నోట్లు మార్చి పసిడి సేయ కూడు పెట్టనోడు కాలు పట్టెను నేడు పరువు విడిచి కూలి పంచ చేరె! 344

కొత్త ధనము కొరకు క్యూలు కట్టిరి చూడు పేద వార లెల్ల పనిని మాని నేర గాళ్ళ ధనము నలుపు తెలుపు చేయ బుద్ధి ఎపుడు వచ్చు పేద నీకు? 345 Whose money?

కొత్త ధనము కొరకు కొత్త గోతులు తీసి పాత ధనము నెల్ల పాతరేసి పిల్లి కళ్ళు మూసి పాలు తాగ ధని రాచ మర్యాదె యట ఊచ లెనుక! 346