Wednesday, May 21, 2025

వాణి త్రిశతి - సుందరాకాండ దండకము


గణపతి పూజ 

గరిక చాలునయ్యి గణప నిను కొలువ

మూషికమ్ము నిన్ను మోయుటకును 

బెల్ల మటుకు లీగ బహుళ వరము లిత్తు 

తృప్తి నీకు పూజ తొలుత చేయ! 


నలుగు పిండి తోడ నిను జేసె శివ సతి

తండ్రి యీశు డిచ్చె తొండము చెవులు 

గణము లన్ని నీకు కానుకగ యీగను 

కంటి రెప్ప వోలె కావుమయ్య!


తే: ధర్మ మొక్కటె రాముకు దండ్రి మాట 
దాట కుండుటె యాతని ధర్మ నిష్ట 
పదవి యతనికి తృణపు ప్రాయమ గుట 
పుణ్య పురుషుడు రాముడు పురుషు లందు 


తానిచ్చిన మాట యొకటె 
తానమ్మిన నీతియొకటె దాశరధికి పో 
తానేర్చిన విద్య యొకటి 
తానిచ్చు వరము ఋషులకు దండక మందున్! 


రాలు కరుగు నంట రామ పదము పాడ


జలము రాలు కంట జనని కధకు


మేలు కలుగు నింట మారుతి భజనతొ


వాణి పలుకు మాట వేద వాక్కు! 


పంక్తి రధుని సుతుకు పావని సఖునికి 

సోదరులకు బ్రియుడు సౌమ్యునికిని

కైక సుతుని కరుణ కాచిన ప్రభువుకు 

రామ చంద్రు గొలుతు రమ్యముగను!


హనుమ ప్రార్ధన 
హనుమ నిన్ను కొలువ అణువుల సమమేము
రామ కధను పాడ ఱెల్లు (తృణము) సమము 
ఆటవెలది కంద తేట గీతిక యందు 
రామ కధను చెబుదు బ్రేమ కనుమ! 

 
సుందరాకాండ 

సుందరంబు యయిన సుందరకాండము 

దండకముగ పాడ దారి చూపు

హనుమ నిన్ను గొలిచి హారతు లిచ్చెద

భజన సేసెద నయ భక్తి గదుర!




No comments:

Post a Comment