Sunday, May 17, 2015
ముఖ పుస్తకంలో నేను అప్పుడప్పుడు పోస్టులు చేసిన తెలుగులో ఒక చోట.


1.

డబ్బు మూటలు కట్టె,
దొంగ మాటలు చెప్పె,
దొంగ నోటులు పంచె,
ఓ ఓటరన్న!

మత్తులో నిను ముంచి
గమ్మత్తు చెయ్యనెంచె,
చిత్తు చిత్తుగ ఓడె,
ఓ ఓటరన్న!

పేరు రాజన్నది,
జోరు జగనన్నది,
తీరు బాగున్నదా
ఓ ఓటరన్న!

ఉద్గ్రంధాలు చేతుల్లో,
దుర్గంధాలు మనసుల్లో,
వారీకే బంధాలు లేవయ్య
ఓ ఓటరన్న!

పైనేమొ సోనియమ్మ,
ఇక్కడేమొ విజయమ్మ,
ప్రియాంక షర్మిలమ్మ,
ఓ ఓటరన్న!

అక్కడేమొ వాద్రా బావ,
ఇక్కడనిలు బావ,
భూములన్నీ  స్వాహా,
ఓ ఓటరన్న!

దేవుడంటె ఎగతాళి
చెప్పుల్తొ పోవాలి,
ఫ్యానెలా తిరగాలి,
ఓ ఓటరన్న.

ఓటు నోట్ల రొమాన్సు,
వారికిదే తుది ఛాన్సు,
మళ్ళి రాడోయ్ బాసు,
ఓ ఓటరన్న!


2.


మా అమ్మగారు చివరి సంవత్సరాలలో చాలా సమయం ఏదో రాస్తు గడిపే వారు. ఎక్కడెక్కడ తిరిగినా చివరి రోజుల్లో నా దగ్గర ఉండడంతో ఈ పుస్తకాలన్నీ  నా దగ్గరే ఉన్నాయి. ఆమె పట్టు చీరలు, మిగతా ఏమున్న వృద్ధాశ్రమంలో  దానం చేశాము, నెనూ, నా వాణి. పండ్లు కూడా పంచాము. పనివళ్ళందరికి, చాకలికి, రోడ్లు చిమ్మేవాళ్ళకి, చివరి రోజుల్లో ఆమెను ఆప్యాయంగా చూసిన ఆసుపత్రి ఆయాలకి, నర్సులకి ఒక్కొక్కళ్ళకి 25 కిలోల బియ్యం, ఒక  మంచి చీర ఇచ్చాము. ఆమెకొసం కొన్న ఆసుపత్రి మంచమూ, చక్రాల కుర్చీ వగైరా వృద్ధాశ్రమంలో ఇచ్చాము. (దీని మీద చాలా విమర్శలొచాయి) కొంత బంగారం పని వాళ్ళకిచ్చాము.

నాకు దేవుడేమివ్వక పోయినా మా నాన్నగారు వదిలి వెళ్ళిన దేవుడి ఫొటోలు, ఈ పుస్తకాలు వగైరా నాతోనే తిరుగుతుంటాయి. ఇప్పటికి 30 ఇళ్ళు, 10 ఊళ్ళు తిరిగుంటాయి. ఈ వివరాలన్నీ నా స్వీయ చరిత్రలో నిక్షిప్త పరుస్తున్నాను.

ఎప్పటికైనా ఆమె చివరి రోజుల్లో  రాసిన శ్లోకాలు,  పద్యాలు, కవితలూ, ఆమె ఇంగ్లీషు భాష నేర్చుకున్న పద్ధతి అన్నీ ముద్రిద్తానని నా కొడుకు లాకర్లో భద్రం చేశాడు.

మచ్చుకి ఆమె రాసిన రెండు కవితల్లాంటివి.  చివరి  రోజుల్లో ఆమె పడ్డ మానసిక వేదన, మా మూలకంగా ఇందులో తెలుస్తుంది. చదవండి.

"మంచివాడిని పొగిడితే మరింత మంచి వాడవుతాడు,
అదే చెడ్డ వాడిని పొగిడితే మరింత చెడ్డ వాడవుతాడు
కత్తి చేసిన గాయం కన్నా మాట చేసే గాయం మిన్న"

పోయే ముందు రాసిన ఒక కవిత లాంటిది.

పుట్టిన చాలు నీ వంటి పుత్రుడు

కడు రత్నాల మాట నీ నోటి మాట,

వినగ, వినగ నాకు వేము తియ్య

నా ఎదురు జన్మల కైనను నీ మాట

నా నోట వేడుకొనుచున్నాను

నేను "వాణి" సరస్వతిని నా నోట బలుక!

సరిగ్గా ఇలాంటి  మకుటంతోనే నేను వాణి శతకం ప్రారంభించాను. కాని ఈ కవిత మొదటి సారి చూస్తునాను.

దీన్నేమంటారో నాకు తెలియదు. ఆమెకు వాణి అంటే ఆరో ప్రాణం. నక్కూడా అన్ని ప్రాణాలూ ఆమే!3.


పొలాలనన్ని
హలాల దున్న్ని
ఏటికేతంబెత్తి
యెయి పుట్లు పండిస్తె,
అకాల వర్షం,
కాలసర్పమై,
కాటేస్తుంటే,
చూసి తట్టుకున్న ఓ రైతన్న!

పొలాలనమ్మి,
దళారికిచ్చీ,
దూరదేశమున కూలి చేసుకుని,
పెళ్ళాం బిడ్దల
పోషిద్దామని
తిప్పలు పడీ,
అప్పులు చేసీ,
కూలీ, నాలీ
చేసుకు బతుకు బండిని
నెట్టుతు వుంతే,
దళారి చేసిన తప్పుడు పనికి,
తప్పుడు పత్రం నీదని,
సౌదీలో ఖైదీ అయితే,,
బందీగా ఈ రాబందుల తలుచుకు,
కుమిలి, కుమిలి ఏడుస్తున్న,
ఓ రైతన్నా,
నిన్న మొన్ననే తప్పించుకు పోయి,
పెద్ద విమానంలో
వచ్చిన వారసుడు,
మిమ్మల్ని నేను,
రష్చిస్తానని
వచ్చీరాని భాషలో చెబితే,
నువ్వు నవ్విన జాలి నవ్వు,
చప్పట్లై, తప్పెట్లై,
మోగుతు ఉంటే,

ఆ దయ్యపు నాట్యం,
నా ఎదలో ఎక్కడొ గుచ్చుకుని,
ప్రతిమెతుకులో నిన్నే చూస్తూ,
ఉపావాసమే చేస్తూ ఉన్నా!