Sunday, May 17, 2015My face book postings over a period.సుత్తి పలు రకములని మా జంధ్యాల గారు ఎప్పుడో చెప్పారు.

నారదుల వారు పదునాలుగు లోకములు తిరుగుతూ లోక కల్యాణార్ధము అని సుత్తి కొడుతూవుంతారని అనేక పురాణాలలో మన పూర్వీకులు  సుతి మెత్తని సుత్తి కొట్టారు.

ఆవిధంగా వారు బ్రహ్మలోకమునకేగినప్పుడు సదరు బ్రహ్మగారు నాలుగు ముఖములందున్న నాలుగు నోళ్ళతో సరస్వ్వతీ దేవికి సుత్తి కొట్టుట చూసి ఈ విధముగా వాపోయిరి.

"అమ్మా!వాణీ! భూలోకమున ప్రజలకు వాక్కును ప్రసా దించి సుత్తికి మూలమైన మీకు యెయ్యది గతి పట్టె! దేవరవారి సుత్తి కి బదులు సుత్తి కొట్టాలన్న వారికి నాలుగు ముఖములు . మీకున్న రెండు  చేతులలో వీణ పట్టుకొని కూర్చుంటే,  బదులు సుత్తి కి అవకాశమే లేదా అని వాపోయె!

ఇది విన్న వాణి అవాక్కవ్వగా,బ్రహ్మ గారి నాలుగు గొంతులలో నాలుగు వెలక్కాయలు  పడె.
నారదులవారు పరమానందము చెంది తన వీణను సుత్తి మెత్తగా వాయించుతూ కైలాసమున కేగెను.

కైలాసమున  పరమానందమున  శివుడు ప్రమధ గణములతో కలిసి పరమానందంగా పార్వతీ దేవికి సుత్తి కొట్టుచుండగా చూసి, నారదులవారు, 'అమ్మా! శక్తీ! ఇన్ని లోకములందు అతి శక్తిమంతురాలైన మీరు బదులు సుత్తి కొట్టక ఊరకుంటిరేమి?" అని ప్రశ్నింప అమ్మ దిగులు గా  "ఏమి చేయుదు! నేనునూ ప్రయత్నించుటునే యుంటిని. వారి నెత్తిన జడలు కట్టిన జుట్టూ వారికి ఏ మాత్రము నొప్పి కలిగించక పోగా, నా చేతులు నొప్పి ఫుట్టుచున్నవి." అని వాపోయెను. నారదులవారును తమ మెత్తని పొట్టను సుతి మెత్తగా రుద్దుకుంటూ వైకుంఠమునకు పోయెను

వైకుంఠమున మహావిష్న్ణువు పాలసముద్రములో శేషశయ్యమున విశ్రాంతి తీసుకుంటూ లక్ష్మీ అమ్మవారికి సుత్తి కొట్టుట చూసి నారదులవారు ముక్కుపై వేలు వేసుకుని, "అమ్మ!అష్టలక్ష్మికి అష్టకస్టములు వచ్చెను కదా! బదులు సుత్తి కొట్టుటకు అవకాశమే లేకపోయె కదా మీకు?" అని వాపోయెను


"ఏమి చేయుదు నారదా! వారికి కొట్టిన సుత్తి దెబ్బలన్నీ పాపం, ఆదిశేషుడికి తగులుతున్నాయి. నాకే జాలి వేయుచున్నది" అని కంటతడి పెట్టె.

అప్పుడు నారదులవారు "మీ ముగ్గురమ్మలు, అయ్యలను కలిసి, బదులు సుత్తికి మార్గము తెలుసుకొనవలె. లేనిచో భూలోక వాసులు ఏక మార్గ సుత్తితో బాధ పడెదరు" అని సలాహ చెప్పి భూలోకమునకు పయనమయ్యె .

ముగ్గురమ్మలు కలిసి ముగ్గురయ్యలను కలిసి "అయ్యలార! మీరు ఈ సమస్యకు పరిష్కారము  చూపవలె. లేనిచో భూలోక వాసులు నిత్య సుత్తితో బాధలు పడెదరు. సుత్తి దెబ్బలు తగులకుండా మార్గమైనా చూపండి లేదా ఎదురు సుత్తికి మార్గము చూపండి." అని వేడుకొనిరి.

ఎదురు సుత్తితోతమకు కల ప్రమాదము గమనించిన విష్ణువు "భయపడకండి, దెవీ. ఇప్పుడే భూలోకమున మార్కు జుకర్బర్గ్ అనే నా అంశ జన్మించినది. ఆ అంశ ముఖ పుస్తకము అనుయొక వింత ద్వారా ఈ సమస్య  తీర్చును. ఇందులో సుత్తి కొట్టుట వారి దెబ్బలు అవతల వారికి తగలవు. అయిననూ వారు కూడా ఎదురు దెబ్బలు తగులకుండా ఎదురు సుత్తి కొట్ట   వచ్చును.ఈ ప్రక్రియను నీలమ్రాజు  వంశము వారువిస్త్రుతంగా ప్రచారము చేయుదురు" అని ఆశీర్వదించెను. అటనుండీ ప్రతి ఉగాది  నాడు ఈ ముఖ పుస్తక పురాణము నీలమ్రాజు  వారి ద్వారా చదివి ఎదురు సుత్తి కొట్ట వచ్చునని శౌనకాది  మహామునులకు సూతుల వారు సుత్తి కొట్టగా, శౌనకాది మునులు మాకు ఈ అవకాశము లేకపోయెకదా అని భూలోకమునకు పయనమయ్యిరి.

సూతమహామునియను మహావిష్ణుప్రసాదముచే నీలమ్రాజు వంశమున జన్మించి యధాశక్తి నొప్పి లేని సుత్తి కొట్టుచూ భూలోక వాసులూకు ముక్తి ప్రసాదించుచుండెను.

ఇది చదివిన వారికి విన్న వారికి వైజాగ్,ముంబై  బీచులలో ఉచితంగా పల్లీ, బఠానీలు  పంచబదును

2.


.నలుగురు కుటుంబ సభ్యులు వైజాగ్ బీచులో  ఆనందంగ అ అడుకుంటుంటారు. ఇంతలో ఫొను మోగింది.నాన్న ఆన్సర్చేశాడు.
"హల్లో! గౌతం! ఎలా ఉన్నావ్.?"
అమ్మాయి ఫొను లాక్కుంది .
గంట మట్లాడి అమ్మకిచ్చింది.
ఇంకో గంట.
నాన అసహనంగా వాచ్ చూసుకుంటున్నడు.
అబ్బాయి ఇంకో గంట.

ఇంతలో ఆకాశం నుండి ఒక మనిషి రెక్కలు కట్టుకు   దిగి నాన్న జేబులో 15000 లాక్కుని ఎగిరి పోయాడు.


3.


తత్త్వములు

ఏమి సేతురా లింగా, ఏమీ సేతురా,

గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేతుమన్న,
గంగలోని చేప ,కప్పా ఎంగిలంటున్నాయి లింగా!

నీడ పట్టున కూరుచూని క్రికెటు మ్యాచు చూతుమన్న,
మ్యాచు, మ్యాచుకి ముందె  జనమూ
ఫిక్సెడంటున్నారు లింగా!

బయటికెళ్ళీ హాయిగా చల్లగాలి పీలుద్దుమన్నా,
గాలిలోనీ దుమ్ము, ధూళీ
రోగమంటున్నాయిలింగా!

మాహానుభావా, మాదేవ శంభూ,

ఏమి చేతురా లింగా, ఏమీ చేతురా!
7