Tuesday, June 23, 2015

THE CHURING OF OCEAN OF LIFE VI THE PART - సాగర మధనమనే నా స్వీయ చరిత్రలో ఆరవ భాగం- తెలుగులో You have enemies? Good. That means you've stood up for something, sometime in your life. Winston Churchill ENGLISH AND TELUGU."జీవితమనేది పరిష్కరించ వలసిన సమస్య కాదు. అనుభవించాల్సిన నిజం."    నిజాన్ని నేను పూర్తిగా అనుభవించాను. అనుభవాలనుంచి గుణ పాఠాలు నేర్చుకున్నాను. నేర్పాను. అయ్యీ, కాని వాళ్ళని వదిలేశాను. ఏమీ కాని వాళ్ళకి సహాయం చేస్తున్నాను.

“Life is not a problem to be solved but a truth that we should experience” This truth, I experienced totally. From experiences, I learned a lot of lessons. I taught the lessons to others. I left all those that peripherally belonged to me and really did not. I am helping those who are outsiders totally, to pursue their lives within my means.


తరువాత ఒక్క సారే మా వూరు వెళ్ళాను. ఒక శని వారం రోజు బయలుదేరి వెళ్ళి మళ్ళీ సోమ వారం తిరిగి వచ్చాను. మా నాన్న గారిని ఉంచిన ప్రైవేటు ఆస్పత్రిలో వాళ్ళు "లాభం లేదు ఇంటికి తీసుకు వెళ్ళ మన్నారట". ఇంటికి తేవడానికి మా ఇంటి యజమాని ఒప్పుకోలేదు. రోగిని ఇంట్లో పెట్టుకుంటే అరిష్టమన్నాడట. ఎదిరించే ధైర్యం లేదు. డబ్బు ఖర్చు చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యలేదు. చెయ్యలేని మా తమ్ముడు నిస్సహాయంగా . ఉన్నాడు  ఇవన్నీ కనీసం నాకు వ్రాయ లేదు. మా ఇంటి యజమాని ప్రభుత్వ ఆస్పత్రికి ఆహారం పమిణీ చేసే కాంట్రాక్టరు. ఆయనే చెప్పి ఒక బెడ్డు ఇప్పించాడు. నర్సింగు లేదు. అంతా మా తమ్ముడే చేశాడుట. నేను వెళ్ళేటప్పటికి కోమాలో ఉన్నారు. 20 ఏళ్ళ వయసు. ఏడిచాను, గుండెలవిసేలా. జనవరి 24 ఆయన ప్రాణం పోయింది. వార్తా మోసుకొచ్చింది మా మేనమామ గారే. "పద పోదాం" అని సెలవు ఒక్క రోజు తీసుకున్నాడు మా ఆఫీసరు దగ్గర. రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే  వెళ్ళాము.

Later, I visited my home town only once. I started one Saturday and returned on Sunday night, as there was neither leave nor funds enough to travel frequently.
The Private Hospital where my father was convalescing told our people that his days were numbered and any more treatment there was only a financial burden. (With my mental set up, I would have borrowed more money and kept him there to see he died comfortably. That was how I loved him and that was my confidence level). Our house owner flatly rejected to bring him into the premises, as he said it would be bad omen, it seems. None dared oppose him. Those who could spend money conveniently avoided. My younger brother was left with no money, neither was he adept, nor willing to raise borrowings like me. Nobody informed me these developments. (What I would have done was a fact of my life). Our house owner, who was official contractor, to supply food in the Government Hospital arranged a bed, with no nursing or no doctor visits. He was in coma, when I went there with flies having a field day. My younger brother looked after all his needs including cleaning the bowels. I was 20 then. I wept my heart out. I returned the same day. On January, 24th, exactly 45 days after I joined a job, he left the world leaving behind two unsettled sons two school going daughters. My uncle, Sri Penumaka Ramachandra Rao, brought this sad news also, took one day LOP leave from the officer and took to me to home town, purchasing my ticket too. He was too loving and too sacrificing. He is still, at age 86. May God give him a long life.


ఎంత దుస్థితి? మా నాన్నగారి పార్ధివ శరీరాన్నిరోడ్డు మీద మురుగు గుంట కింద పడుకో బెట్టారు. ప్రధాన ద్వారం గుండా లోపలికి తేవెడానికి వాస్తు అడ్డమొచ్చిందని మా యజమాని పేచీ పెట్టాడు. ఎంత క్రూరత్వం? నీచమైన ఆచారాలు? శవ దహన మయ్యింది. చలి రోజులు. మేము తండ్రి పోయి ఏడుస్తుంటే మా వదిన వాళ్ళ ఆయన చన్నీళ్ళ స్నానం చెయ్యాల్సొచ్చిందని ఏడవడం మొదలెట్టింది. ఏమి సంస్కారమండీ? ఇవన్నీ  నా మనసును చాలా గాయ పరిచాయి. అసలే వ్యవస్థ మీద పొరాడాలనే కక్ష. తోడుగా ఇవన్నీ. ఇంకా నన్ను మూర్ఖుడిని చేశాయి. ఎదిరించడం ఎక్కువయ్యింది. చెప్ప దలుచుకుంది సూటిగా చెప్పడం మొదలెట్టాను. శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. నా కక్ష ద్విగుణీకృతమవుతూనే  ఉంది. భవిష్యత్తులో నా జీవన గమనానికి   రోజున పడ్డ బీజం. కోపం అనే అంతః శతృవు  కాటేసింది. 50 ఏళ్ల వయసు వరకూ అదే కోపం. ఎదురుగా ఎవరున్నా దులిపేయడమే.

"జీవితమనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు. నిన్ను నువ్వు పునః సృష్టించుకోవడం."

When I reached our home, I saw what the most pathetic position in the life and death of my father. The man, who loved all, lived like a lion, was lying outside just by the side of an open drain. Our house owner did not allow him inside as, according to him, Vaastu would not allow it. What kind of anarchy? What kind of superstitions? I was hurt badly that day. Cremation was complete. We were crying that our father was no more and my sister in law started crying that her husband had to bathe in cold water during winter! All these incidents left an indelible mark of hurt on my psyche. Already, my inclination was to fight till the end that which I considered was superstition. My resolve only increased that day. I became almost a fool in the mad world. I started opposing everyone with precision. What I wanted to tell, I was telling without mincing. The number of my enemies was growing by the day. That made me more and more stubborn. Seed was sown for my future growth and fall. The internal enemy “uncontrollable anger” entered my sub conscious. It did not leave till 50, leaving me totally shattered in life.

“Life is not about knowing yourself, but re-creating yourself”

10 రోజున  ధర్మోదకాలు వదలడానికి బాపట్ల దగ్గర మా నాన్న గారి జన్మ స్థలానికి రావాలి అన్నారు. అన్నీ జీతం నష్టం సెలవులే. వెళ్ళాను. పల్లెటూరు చేరేటప్పటికి చాలా పొద్దు పోయింది. చీత్కారాలు. తండ్రి  మీద ప్రేమ ఉంటేగా? అని అన్న దమ్ముల హేళనలు. పురోహితుడు "బుద్ధుందిటయ్యా?" అని తిట్లు. ఒక రోజు ముందు సెలవు తీసుకోవచ్చు కదా, ఈసడిపంపులు. మళ్ళీ మంగలిని పిలవాలి, విసుగు. నాకు కోపం. సెలవు ఎవడిస్తాడు. రోజుకి 12 రూపాయలు పోతాయి. ఎవడు వింటాడు. బ్రాహ్మణ్యం మీద కోపం. కులంలో పుట్టినందుకు కోపం. ఆచారాలంటే కోపం. ఎదురు తిరగాలి. ఎంత అవకాశముంటే అంత మార్చాలి. నిర్ణయం అయ్యింది. అమలు పరిచాను. శతృవులు పెరిగారు, ఇంటా, బయటా. రోజూ అలాగే ఉన్నాను. నా వృత్తి కాక పోయినా మంత్రాలన్నీ విని నేర్చుకున్నాను. రోజు అభిషేకాలూ, పూజలూ  చేస్తాను. నా పద్ధతి లోనే. ఎవర్నీ బాధ పెట్టను. వాస్తుని నమ్మను. చాలా ఉన్నాయి,. తరువాత.

I returned back on the day of cremation. I was asked to come to the native village of my father, some kilometres away from Bapatla, AP. All the leave I took was on Loss Of Pay, as I was on probation. I reached the village very late in the day. Immediately all the people fell on me like wild animals. Harsh words! “Does he have love on father?” mocked by brothers. “Do you have sense?” the priest. “Can’t he have taken one more day leave?”, other relations. Who gives leave? I have to lose Rs.12/- per day if I take leave and it is difficult to get that. In addition, the probation period gets extended by the number of LOP leaves and I would remain junior to my batch mates, in case promotions were given. That day I hated Brahminism. I hated myself for being born in a Brahmin family. I hated the superstitions and diktats of the pseudo- learned. I decided. To the extent possible, I will change the system. I became suddenly unorthodox but a devout Hindu and Brahmin. Enemies grew inside and outside. I was almost banished from family circles. But, I continued my higher learning. I got by heart all the Vedic chants just by hearing in temples. Today I perform all rituals in my house even though it is not the profession of our sect in Brahmins. I can perform a marriage too, if needed. I remained true Brahmin, but too unorthodox to be accepted by my pseudo orthodox family members. In future chapters.

నాలుగు రోజులు మకాం. నాకు ఏమీ తెలియదు. సంతకాలు పెట్టమన్నారు. పెట్టాను. పొలం అమ్మేశారు. చవగ్గా. ఎవరు కర్చు పెట్టిన కర్మ కర్చులు వాళ్ళు తీసుకున్నారుట? మిగిలింది మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి డిపాజిట్టు చేశారుట. అప్పులు తీర్చారో లేదో గుర్తు లేదు. మా స్నేహితుడి వాళ్ళ ఇంట్లో చేసిన అప్పు మాత్రం తీర్చ లేదు. మా ప్రధానోపాధ్యాయుల  దగ్గర తీర్చలేదు. మా ఎం ఎల్ గారి కోడలుకి తీర్చలేదు. ఎందుకంటే ఇవన్నీ నేను 1976 లో తీర్చాను. కధ తరువాత.

I stayed there four days. I did not know anything what transpired. They asked me to sign some papers. I signed. They sold the remaining farm land at the cheapest rate, desperate sale. People who spent on funeral rituals collected back their money. The rest, I was told, was deposited for my sisters’ marriages. I do not remember whether they repaid any loans which I jointly raised with my father. But the loan with my friend’s family, my Head Master of school and the daughter-in-law of the local MLA remained unpaid. I repaid them in 1976. There is a story there too. At the appropriate juncture. I could bear the scene nor could I forget.

నేను బయలుదేరే ముందు చివరి ఘట్టం. అమ్మని ఒక చోట కూర్చోబెట్టి బిందెలతో చల్ల నీళ్ళు  పోయడం, తెల్ల చీర ఇవ్వడం, గాజులు పగల కొట్టడం. చూడ లేక పోయాను. ఛీ! పాడు ఆచారాలు. ఆమెకు 46 ఏళ్ళు. జీవితంలో అన్ని రోజులూ గుర్తుకు ఉండవు. కొన్ని క్షణాలు మాత్రమే గుర్తుంటాయి. మా అమ్మ మళ్ళీ అందరి మాదిరిగానే బ్రతికింది. పూర్వపు పద్ధతులకు ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు.

Before I departed from there the last scene. Mother was made to sit at one place. Pots of cold water was poured on her. It was winter just as it was winter to my brother. But my sister in law did not cry. She was given a white saree by Sree Penumaka Ramachandra Rao, my uncle who was crying copiously. (He loved us all, unadulterated love!)/ What kind of culture? She was 46 then. Too young. “We do not remember all days in life. But few moments can never be erased from the sub-conscious” My mother lived like all normal women afterwards. We all opposed the ancient superstitions.

“Life is really simple. But we make it complicated by our foolish beliefs.”

ఇది అయ్యాక ఇక మిగిలింది, సంసారం మళ్ళీ ఎలా నిలదొక్కుకోవాలి. ఎక్కడుండాలి. మా తమ్ముడి డిగ్రీ చివరి సంవత్సరం  పరీక్షలూ, ఆడ పిల్లల స్కూళ్ళూ అయ్యాక ఏం చెయ్యాలి. పెద్దాయన హైదరాబాదులో, రెండు మద్రాసులో, మూడు ఇంకా ఉద్యోగం లేదు. నేను హైదరాబాదులో. కొత్త ఉద్యోగం. అన్నయ్య దగ్గరే ఉంటున్నాను. ఇంత పెద్ద సంసారం హైదరాబాదులో బ్రతకడం కష్టం. అందరం తలకొక 50 రూపాయలిచ్చి అక్కడే వుంచుదామని ఆయన, కాదని నేను కొన్నాళ్ళు తర్జన, భర్జనలు పడ్డాము. లోగా మా మూడో అన్నయ్యకి సిండికేటు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. మా తమ్ముడి డిగ్రీ పూర్తయ్యింది. ఆయనకి నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో పోస్టింగు. అది ఒక పెద్ద పల్లెటూరు లాంటి పట్టణం. ఒక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ అందరూ ఉండాలని నిర్ణయం అయ్యింది. వెళ్ళారు. వెళ్ళిన నాలుగు నెలలకి ఉత్తరాల మీద ఉత్తరాలు. " వూరులో ఉండటం కష్టం. ఆడ పిల్లలకి ఏమన్న జరిగితే నా బాధ్యత లేదు. నువ్వే ఏమన్నా చేసి వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి" అని మా పిరికి భీముడు వ్రాయడం, వెంట, వెంటనే మా అమ్మ వీడు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు, వెంటనే వచ్చి తీసుకెళ్ళు అని మా అమ్మా, తమ్ముడూ వెనకాలే సందేశాలు. అప్పటికే మా పెద్ద చెల్లెలు అక్కడ జూనియర్  కాలేజీలో చేరింది. ఇక్కడ అడ్మిషన్లు అయి పొయ్యాయి. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. పెద్దాయన ససేమిరా అలా కుదరదు. నేను ఒక్క రూపాయి సహాయం చెయ్యను అని బల్ల గుద్ది చెప్పాడు.  జీవితంలో వెరే వాళ్ళకి సహాయ పడడం ముఖ్యం. అలా చెయ్యలేకపోతే కనీసం వారిని బాధించకుండా ఉండగలగాలి.

After all this the issue was how to re- settle the family and where to keep them. Who will look after all? What should we do after my brother’s final year graduation is complete and schools of my sisters were closed. My eldest brother was in Hyderabad, second one in Madras, third one still job less, me in Hyderabad with my eldest one, living on tenterhooks.  “We cannot live comfortably in Hyderabad with such big family” was my brother’s argument. I was seriously opposing it, though he proposed all of us could contribute Rs.50/- each to make them comfortable there! We were continuously squabbling. In the meantime my third brother got a job in Syndicate Bank, not without recommendation, from his friend with whom he had a fist fight in school. (See how God links people and issues). My youngest brother completed his degree with flying colours. The service he did to my father and family paid rich dividends to him. He was such a nice boy those days. (We used to look similar if seen from the backside. Once, later years, one of his friends hugged me from behind and exclaimed “You Son of a B…., it was usual in AP to call friends like that. Where were you? I turned back and seeing his face told him “I am the elder son of the b…” and laughed. Till he got down, he was apologizing. Funny incidents. ) He was posted in big village-cum town, Atmakuru near Nellore town. As he had to stay alone my family decided to shift there much to the relief of my eldest brother. (My mother, sisters, younger brother travelled in the back of the lorry behind the goods for 14-15 hours during night) What a fall!) After four months, I started receiving letter after letter from the timid Bheemaseana. He was writing that the village was full of demons, they might do anything to my sisters, already a few were after her (she was very pretty before she turned fatty, even now she is fatty but still very pretty. In fact, her husband can reimburse the dowry he extracted from us with 24% interest for her pretty face and her attachment to her family. But! Alas! He demanded more from my mother just a week before she went into coma!). Behind his letters followed letters from my mother and brother that he was constantly pestering them to leave and he was not sleeping nor was he allowing anyone to sleep. He was so courageous, even now he is. I told my elder brother that e could bring them to Hyderabad and live together until all settle in life. He said “NO” very firmly and threatened that I brought them, he would not give that Rs.50/-, he promised earlier.

“To help others in life is important. If not possible, we should desist from hurting others!


లోగా, నేను వేరే ఇల్లు వెదకడం మొదలు పెట్టాను. అదే ప్రాంతంలో. ఇక్కడ ఉండొద్దు. నా పరువు పోతుంది, అని ఆయన. నీకు ఉంటే కదా పోవడానికి అని నేనూ రోజూ యుద్ధం. చెప్పాను కదా. ఎంతటి వాడితో అయినా అలానే మాట్లాడే వాడిని. లోగా ఒక ఒక గొప్ప వింత జరిగింది. మా అన్నయ్య ఇంటి పక్క పోర్షను ఖాళీ అయ్యింది. అద్దె 170 రూపాయలు. ధైర్యం చేసి మా ఇంటి ఓనరుని అడిగాను. ఆయన సలహా చెప్పాడు, ఒకే ఇంట్లో పక్క, పక్కన ఉండటం మంచిది కాదేమో ఆలోచించుకో అని. మీ అన్నయ్య బాధ పడతాడేమో  అని కొంచెం తటపటాయించాడు. ఇంట్లో ఏమనుకున్నరో ఏమో మర్నాడు పిలిచి సరే అన్నాడు. మరి అంత అద్దె కడతావా అని అడిగాడు. కడతాను, మా తమ్ముడికి టెలిఫోను డిపార్ట్ మెంటులో  135 రూపాయల స్టైపెండుతో జూనియర్ ఇంజినీరుగా వచ్చింది. నా జీతం పెరిగి 430 రూపాయలయ్యింది. (మేము చేరంగానే జీతాల సవరణ జరిగింది, డీ పెరిగింది) మా అన్నయ్య 50 రూపాయలు పపుతాడు. పెద్దాయన ఇచ్చినా తీసుకోను అని చెప్పాను. సరే ఇల్లు తీసుకుని అడ్వాన్సు ఇచ్చాను. అప్పుడు మా అన్నయ్యకి చెప్పాను. ఇక ఒక కిటికీ దగ్గర నిలబడి, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చేసినట్లు ధర్మోపదేశం చెశాడు. నువ్వు ఎంత చేసినా వాళ్ళు నిన్ను పొగిడి నెత్తికెక్కించుకుంటారనుకోబోకు. నీ డబ్బంతా ఇప్పుడే వాళ్ళ మీద పెడితే రేపు నీ భార్యా, పిల్లల విషయ మేమిటి. నీకేమన్నా కష్టమొస్తే, "ఒక్కండును, ఒక్కండును, ఒక్కండును నీ దరికి రాడు" ఇంకా చాలా చెప్పాడు. నిర్ణయం అయిపోయింది . అమ్మా వాళ్ళు వస్తున్నారు, ఖండితంగా అని చెప్పాను. జీవితంలో మనం సమాధానం చెప్ప వలసిన మొదటి, అత్యవసరమైన ప్రశ్న మనం వేరే వాళ్ళకి ఏం చేస్తున్నామనేది. మా ఇంటి ఓనరుతో మాట్లాడాడు . మీ ఇంటి విషయాలు అనవసరం కూడా అని "తాబులాలిచ్చేశాను. తన్నుకు చావండి" అన్నట్లు మొహం మీద కొట్టినట్లు చెప్పాట్ట. వచ్చేశాడు.  నాకు తెలియదు. నేను ఇల్లు తీసుకుని, అడ్వాన్సు ఇచ్చి  మా అమ్మ వాళ్ళని తీసుకు రావడానికి టిక్కట్లు   రిజెర్వు చేయించాను.అందర్నీ తీసుకుని, 12 పెట్టెలతో ఆత్మకూరు నుంచి నెల్లూరు, అక్కడ నుంచి హైదరాబాదు. సామాను ట్రక్కులో వచ్చింది.

So, I decided to bring them to Hyderabad at my own risk. I started searching a portion in the vicinity as the area was already familiar to me and my uncles both paternal and maternal live very nearby. “Do not stay here. I will lose my respect” he told me. “If you have any respect, there is fear of losing. So do not fear on that count” I firmly told him. I was talking like that then and still I talk like that now, only I changed it to pun and say what I want to say now, so that the others do not have scope to argue. A lesson in life. A funny opportunity came my way then. The portion adjacent to my brother’s portion fell vacant. The rent was Rs.170/- . without losing time I approached the house owner without the knowledge of my brother. He advised me as an elderly person, just to think if it would be appropriate for brothers to stay in the same house in adjacent portions. He also expressed a doubt whether my brother would feel bad. (He was a nice gentleman. Until my sister got job in 1981, viz. for seven years he did not increase the rent. Then he made it Rs.250/- He allowed us to stay there for 11 years). I do not what transpired in their home, he called me next day and nodded assent. But he asked me, “Can you bear Rs.170/- as rent?” I told him my younger brother got posting as Junior Engineer in Telephone Department with a stipend of Rs.135/- p.m. and my salary increased to Rs.430/- (salary revision took place soon after we joined and DA increased). And my third brother promised Rs.50/- per month and that I would not take help from the eldest even if offered. So I paid advance and took the portion on rent. Then only I informed my brother. Shell-shocked, he stood near a window (I remember the scene as it happened just now) and like Lord Sree Krishna preached Gita to Arjuna, he preached me life Geeta, He told, “Whatever you do never be under the misguided impression that they would flatter you and hail you, ”Thou” Our saviour!, If you spend your total earnings on the family (and it is not sufficient, you have to borrow) what will happen to your own wife and children in future? And if you are in trouble, you will be left like Karna in the midst of the battle and none will rescue you” He told me many more things about life. (The part that none would come to my rescue came true later). I told him firmly, “Mother and family are coming” and closed the discussion.

“The one question we should answer in life fast and firm is what we can do to the others” I answered that question. My life remained an unanswered question.  

He talked to our house owner. It seems he told him he was not concerned with our family matters and as an owner he gave the portion to another tenant. I booked tickets to and from Nellore and brought my mother, two sisters from Nellore to Hyderabad, with twelve boxes/suitcases etc., It was tedious journey, from Atmakur to Nellore to Hyderabad. We reached home.


20 ఏళ్ళ వయసుల అది సాహసమే. అందరూ నాకు ఎదురే. ఒంటరిగానే పోరాడాను. ఇంటికి వచ్చాము. మా పోర్షను  ముందు ఒక పెద్ద వరండా  ఉండేది. ఒక పెద్ద హాలు, ఒక కిచెనూ. హాల్లో ఒక చెక్క పార్టిషనూ, కిచెన్లో ఒకటి. పక్క పోర్షన్లో మ్ముడు రూముల్లో మా అన్నయ్య. వచ్చి వరండాలో సామాను పెట్టి బెల్లు కొట్టాము. తలుపు తియ్య లేదు. మా తాళం  చెవి ఆయన దగ్గరే ఉంది. 20 నిమిషాలు బెల్లు కొడుతూనే ఉన్నాము. తియ్యలేదు. చివరికి మా వదిన తలుపు తీసి లోపలికెళ్ళి పోయింది. రోజు ఎలాగో అక్కడే గడిపి, మర్నాడు మా ఇంట్లో కెళ్ళాము. కొత్త జీవితం ప్రారంభం. గ్యాస్ స్టవ్  లేదు. మామూలు జీవితం. మా పెద్ద చెల్లెలుని ఇంటర్లో చేర్చాలి. అదంటే నాకు ఆరో ప్రాణం. ఒక్క క్షణం వదిలే వాణ్ణి కాదు. ఏమడిగినా సిద్ధం. అప్పు చేసైనా  సరే కొనే వాణ్ణి.   విషయంలో మా పిరికి భీమసేనుడి అభిప్రాయం.  ముఖ పుస్తకంలో.

It was adventurous at age 20. Everybody was against my bold step. I was standing alone with the family burden. Our portion used to have a big open verrandah, a big hall and a kitchen. The hall and kitchen were separated by wooden partitions. Adjacent, three room portion was occupied by my brother. We came home, sat in verrandah and rang the bell. For twenty minutes the door was not opened. We sat there. After 20 minutes, my sister in law opened the door left in a huff without talking. Our keys were in their house. It was a kind of tense situation. We spent the day there and entered our portion next day. There was nothing in the house. Luggage came in a truck. We had no gas stove.  We spent time like a lower middle class family. My first task was to admit my elder sister in Junior College. She was my beautiful rose that was flowering every day. I was never leaving her in thoughts and actions. I used to get her whatever asked for, even borrowing money. If there was a tear in her eye I used to cry. After all this, the post made by my third brother in Face Book.  It is self-explanatory. I wrote a few poems on the life led by such people. It is better read in Telugu. I am leaving the translation part.


Sudhakara Rao Neelamraju
May 18 ·
It is true that I did not come to Hyderabad asI was in Shaghai.Atleast whether you waited till your elders to come.Do you remember that the utterences you made in front of the public and Purohit. You already killed when she was alive. What makes you to burn the pyre when the younger brother was thre. Are you proud of the actions. "You don't havr thr patience to wait till the elder sister of your wife to get marry."You ruinrd her life also..For all five brothers and sisters there is only one mother. We can can not cut in to her pieces. It it is her wish to stay back with you for reasons well knowno you. (Verbatim. No corrections made. sic.)


ఆయన కోసమే వ్రాసిన కొన్ని పద్యాలు. సామాజిక స్పృహ ఉన్నవారెవరైనా ఇవి చదివి నిజం తెలుసుకుంటారు.

1.నీట నుండు చేప నీట నుండగ నీక
వలను వేసి తీసి వాస నందె
మత్స్య ముండు నీటె ముత్య ముండును గద
వాణి బలుకు మాట నాదు నోట! 156

(దుర్మార్గుడని తెలిసి కదిలించి, కవ్వించి వాడు నన్ను తిట్టాడు బాబోయ్ అని పెళ్ళాం దగ్గరేడిస్తే ఊరుకో పిరికి వెధవా అంటుంది. చేపలు పట్టడమెందుకు. వాసన అని ఏడ్చుడెందుకు. అదే సముద్రంలో ముత్యాలుంటాయి, వాసన రావు. ఓపిగ్గా కూర్చుని పట్టు కొమ్మని సారాంశము. చేపల్ని వాటి మానాన వదిలెయ్యి. నచ్చిన వారు పట్టుకుంటారు).

1.An advice to those who pick up quarrels without reason and then if the other person reacts cry their hearts out. Why should one catch the fish that is playing in water, smell it and say it is bad smelling and blame it? You can let it live in water or allow it to be caught by the one who likes the smell.

2.
అన్న దమ్ము మధ్య యాత్మ కధల ఘోష
పోయినొళ్ళ యాత్మ పొగను బెట్ట
నీదు లోపములను నిలువెత్తు జూపరో
వాణి బలుకు మాట నాదు నోట

2. Brothers, instead of blaming each other for their plight, should come out with their mistakes in life that effected all. That only gives peace to the departed ancestors.

3.
తనదు కడుపు మాడ్చి తనయుల బెంచగ
యామె పోవు వేళ యొకడు లేడాయె
యల్లు డొచ్చి బలుకు యెకసక్కె మాటలు,
వాణి బలుకు మాట నాదు నోట! 151
 (మనిషి కట్టె యయ్యాక మోయడానికి దొరికిన వ్యక్తే బ్రహ్మ ఙాని. అయిన వాళ్ళు తప్పించుకుంటే ఉన్న వాళ్ళే మోస్తారని సారాంశము)

3. Even without feeding wife properly, father brought up children. By the time she passed away, none was available to carry her body. And the son-ln-law, mocks she died like an orphan.


4.
బతికి యుండగ బుండు వాసన వెగటాయె
శవము చూడ కొంత సమయ ముంచు
యనెడి బుత్రు నేమి యనెడు శాస్త్రములును,
వాణి బలుకు మాట నాదు నోట!
(తల్లి మంచాన బడి పుండ్ల వాసనతో ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్న కొడుకు మీద ఏనాడూ తల్లి మంచం దగ్గర లేకుండా, కుళ్ళి శల్య మౌతున్న శవాన్ని ఇంట్లో ఉంచుకో మేము రెండు రోజుల తరువాత వస్తామూ,అమ్మని చివరి సారిగా చూడాలి అని శవ పంచాయతీ పెట్టే ప్రబుద్ధుల గురించి  చిన్న ఆట వెలది)

4. The son who left the country unable to bear the smell coming out of the body of the mother on bed, asks the son who looked after her bearing all, to keep the dead body until he comes. What should we call such a son?


5.
బతికి చెడిన వాడు బతికించు ఇతరుల
చెరచి బతుక నెంచ చేరు యముని
చీమ కుట్ట గానె చేరదె కాలుని
వాణి బలుకు మాట నాదు నోట

5.  The man who lived a rich life and became pauper knows the horrors of poverty and helps others. The man who wants to spoil lives of others will reach hell soon. The ant that bites gets killed immediately.
6.

అన్న దమ్ము నడుమ యగ్గి రాచల్లుడు
యత్త మామ నెటుల యాదరించు
కాడు బోవు వేళ కట్నంబు యడుగడా
వాణి బలుకు మాట నాదు నోట

6.  The son-in-law who ignites fire between brothers and pours oil on it could never have treated his in-laws properly. Even before their death, he would have demanded money.

7.
అన్న దమ్ము చెల్లి యనువు నుండగ
అల్లు డేల మిమ్ము గిల్లు చుండు
కట్న మడుగ చేరు కటకటాల వెనుక
వాణి బలుకు మాట నాదు నోట

7.  If brothers are united, how can a son-in-law of family spread hatred between them? If he asked dowry from a dying mother-in-law, he would have been behind bars if brothers were united.

8.

సోదర బ్రేమ బోయి స్వార్ధమ్ము నిండగ
బయటి వారి నడుమ పల్చనవరో
మిత్ర భేద కధను మరచితి రెటులయా
వాణి బలుకుమాట నాదు నోట

8. If selfishness gives place to natural love between brothers, will they not become laughing stock in front of others? Did these guys forget the “Mitra Bheadam” in Pancha Tantram?On second thought I translated the poems too.


ఇక్కడ మీకు రెండు విషయాలు బోధ పడతాయి. ఆయన మూర్ఖుడు,  పిరికి వాడు, తను చెప్పిందే వేదం అని పట్టు బట్టే మనస్తత్వం. మహా పిరికి. కానీ ద్వేషమనేది ఆయన్ని దహిస్తూనే ఉంది. ఇంకా చాల ఉన్నాయి చెప్తే. ఇక్కడ నా భార్య కుటుంబ వ్యవహహారాన్ని బయటకు తెచ్చి, తన భార్య కుటుంబం గురించి  (నాకు సంబంధించనిది), తన వియ్యంకుడి కుటుంబం గురించి చెప్పే అవకాశం ఇచ్చాడు. అవసరమనిపిస్తే చెప్తాను. నా బ్యాంకులో ఏమి జరిగిందో నా మీద ఆరోపణలూ దాచకుండా చెప్పాను. మౌనమే సమాధానం. వాళ్ళ బ్యాంకులో ఏం జరిగిందో నేను రుజువులతో బయట పెట్ట గలను. కానీ నాకేం అవసరం? ఇది నా కధ ఊళ్ళో వాళ్ళది కాదు కదా?  ఆయన దగ్గర డబ్బుంటే నా దగ్గర అమూల్యమైన సంస్కారం ఉంది. నా భార్య అక్కకు పెళ్ళి కాకుండా నేను పెళ్ళి చేసుకున్నానని ఆయన ఆరోపణ.   సందర్భంలో వివరిస్తాను. సాక్షులు  చాలా మంది. తరువాత ఇది ఎలాగైనా చెప్పే వాడిని.

Here you will realize two naked truths. He is foolish and timid. He wants to hide these two qualities behind one another. Because he is a fool and timid too, he tries to insist that his word should carry weight. (This affected the family and more so, me, still he does not realize). But the hatred he developed for others, not only, me still is burning within self and burning him. Here, by poking his nose in the affairs of the family of my wife, (of which his knowledge is minimal) he gave an open invitation to talk about the family of his wife (of which I know more) and the family of his son’s in-laws? Will I do that? It depends on his further utterances. Or else, this is my life, my story. I already said that incidents that do not have bearing on my life find no place here. He persisted, persisted and persisted that I should reveal charges on me my Bank. I did it. He became mum and unfriended me on Face Book. A person should carry conviction not only to tell truth but to face truth. I know what happened in his bank, with proof. But, it is not my concern. He crossed all limits of decency commenting on my wife’s sister and anyhow as I am narrating my story I would have mentioned that too. He probably lost all sense of propriety in his foolishness and anger. The matter of my marriage will find major place in my story. I will narrate at the appropriate place. There are many witnesses. Hope he stops denigrating others for his sadistic pleasure.

ఇక జీవిత భీమా ఆఫీసులో నా జీవితం. చాలా ఒడిదుడుకుల తర్వాత, కుటుంబం స్థిర పడింది. మా చెల్లెల్ని చేర్చడానికి అన్ని కాలేజీల్లో సేట్లు అయి పోయాయి. అదే సంవత్సరం నారాయణ గూడాలో రామ భద్ర కాలేజని తెరిచారు. ఎక్కడా సేట్లు దొరకని వాళ్ళు అక్కడ చేరారు. మా చెల్లెల్ని తీసుకెళ్ళాను. ప్రిన్సిపాలు నన్ను చాలా గౌరవంగా చూశాడు. మొదటి సారి నా సైజు మీద మాట్లాడని వాడు ఆయనే. పేరు గంగాధరం. మా చెల్లెలు మార్కులు చూసి ఎగిరి గంతేశాడు. ఇన్ని మార్కులొచ్చినమ్మాయిని మా కాలేజీలో ఎందుకు చేరుస్తారు అన్నాడు. తప్పదు, మా ఇంటికి దగ్గర అని అబద్ధం చెప్పాను. ఇంతకీ ఎన్ని మార్కులో తెలుసా . 365/600 కి. ఏమీ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మా చెల్లి. అప్పటికి బంగారు తల్లి. "నీ పాదముపై పుట్టు మచ్చనై చెల్లెమ్మా" అని తరువాత వందేమాతరం రాసి పాడితే సినిమా చూసి వలా, వలా  ఏడ్చాను. అది మాత్రం నేను తన జీవితంపై పెద్ద బురద ముద్ర లాగానే చూసింది తరువాత రోజుల్లో. అన్నీ  వస్తాయి. ఇదో ఉద్గ్రంధం.

Now, about my life in Life Insurance Corporation of India. After many ups and downs, family settled in Hyderabad, but not before my own finances took a severe beating. Then came the issue of admitting my sister in Junior College. Seats in clooeges were filled up. That year one new Junior College by name Ramabhadra Junior College, was opened in Narayanguda, near our house. I accompanied my sister there. That principal respected me a lot. First time in my life, he did not comment on my size. He was pleased with my communication skills. His name was Gangadharam. All students who could not get seats in other colleges got admitted there. He saw my sister’s marks and jumped in joy. “Why are you admitting such a bright girl in our college?” he asked. As it is nearer to our house, I lied. Do you know the marks?  365/600.  Where no other tree grows, Castor tree is the best, a Telugu saying. She was my fairy queen those days and even now. “ I will remain forever as a birth mark on your foot” wrote one Telugu lyricist. I wept copiously seeing the scene in the film, as I remembered her. I wanted to remain a birth mark. But, she washed me out from her life as a mud spot. This is going to be an Itihas in itself.

చాలా ఎక్కువ ఫీజు. అప్పు చేసి కట్టాను. అప్పులు చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య అయ్యింది చిన్న తనం నుంచీ. అప్పులు చేసే వాడిని. వడ్డీలు కట్టేవాడిని. వడ్డీలు  కట్టడానికి మళ్ళీ అప్పులు చేసే వాడిని. నేను అనుభవించింది చాలా తక్కువ. వేరే వాళ్ళు అనుభవించిందే ఎక్కువ. (ఒక సారి ఒక సర్దార్జీ నన్నడిగాడు "మేనేజరు గారి పిల్లలకి ఇంత మామూలు డ్రస్సులా? తిండి పెడుతున్నారా లేదా? అంత పేద వాళ్ళుగా ఎందుకు పెంచుతున్నారు" అని. గర్వం పెరగ  కూడదని, నా దగ్గర డబ్బుల్లేవు కాబట్టి అని  చెప్పాను . నేను ఇస్తాను అన్నాడు. వద్దు అని చెప్పాను .  ఆయనే తరువాత నేను చాలా మంచి వాడిని అని బ్యాంకులో బల్ల గుద్ది వాదించాడు. ధన్యుణ్ణి, సర్దార్!  నా భార్య కూడా చాలా చవక రకం చీరలు వేసుకొనేది. బంగారం లేదు. సదా కృతఙ్నుడిని.)

I paid very heave fees as it was new college and building fund was more. I borrowed and paid. Borrowing was a game of the left hand for me. I was borrowing, paying interest, to pay interest I was borrowing more. It was vicious. But it was inescapable, because of my love to my family and my soft heart to those suffering. The funds I enjoyed was less and the funds I spent on family was more from then till 1986.  (At one point of time, one Sardarjee, who was a client asked me why a Manger’s children were so shabbily dressed like poor guys? I told him I wanted them not to think they were children of a Manager and that I was not having money also. He offered assistance. I refused. This man later argued emphatically in my bank that I was the best Manager the bank ever had. Thank you, SardarJee!  Even my wife was wearing the cheapest of sarees. There was neither gold nor silver. Thank her!)


కాలేజీలో చేరాక మా చెల్లికి చాలా ఖరీదయిన డ్రెస్సులు కొన్నాను. మంచి బ్యాగు, ఏమి అడిగితే అది. తండ్రి లేడు అనే లోపం లేకుండా చూశాను. (దాని పెళ్ళయ్యాక వాళ్ళ మామగారు నన్ను వేనోళ్ళ పొగుడుతూ, నీ లాంటి మనిషిని నిన్నే చూసానొయ్, అని వ్రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గర ఉంది. ప్రచురిస్తాను. హైదరాబాదులో ఉంది). దాన్ని చెడగొడుతున్నావు అని మా అన్నయ్య, అమ్మా, తమ్ముడూ అందరూ తిట్టే వాళ్ళు. దాని పేరు తలుచుకుంటే  నాకు ఆనందం వేసేది. దానికి కన్నీళ్ళొస్తే ఏడిచే వాడిని. అదే నా ప్రపంచం. ఇదెందుకు చెప్పానంటే నేను చేసిన అప్పులు రామదాసు లాగె సత్కార్యానికే పోయి, నేను శిక్ష అనుభవించాను, రామదాసు లాగా. "నువు కులుకుతూ కూర్చుండేవు"  అని చెప్పలేను కదా. దాని వైభోగం నాకు ఆనందమే ఇప్పటికీ. నాకు అసూయ అంటే తెలియదు.

After she joined college, I purchased her good dresses, a fine bag. Whatever she asked was present the next morning. I treated her in a way she would forget she had no father. I became her father. My brothers and mother used to object my pampering her. (After her marriage her father in law wrote a letter to me. “You are the only person like you, I have seen in my life that treated a sister like that with the scarce resources. I still retained the letter though I lost my life. It is in Hyderabad,. I will post it here at appropriate place). When I thought of her, I used to feel elated. If she had tears I used to cry. Why I am telling all this is that now she lives in a palatial bungalow, with the amount of gold one envies and she is one of the richest. Like Ramadas, I spent my money for a good job. But like him, I do not blame my sister, “You are enjoying my wealth and I am suffering from a life time curse”. For, envy never entered my mind. I always thank God for what he had given me lot of courage, a wife that is an asset and children that are loving and caring.నా పెద్ద కూతురికి దాని పేరే పెట్టాను. లక్ష్మీ రాజ కుమారి అని. వాళ్ళ మామగారికి ఆనందంగా వ్రాశాను. ఆయన బ్రతికి ఉండే వాళ్ళ పేర్లు పెట్ట కూడదు అని వ్రాశారు., లక్ష్మీ కుమారి అని పెట్టాను. మరి నా భార్య సంతోషంగా ఒప్పుకుంది కదా. ఆమె కూడా స్త్రీ కాదా, వీళ్ళ లాగా?

I named my eldest daughter after her. Lakshmi Raja Kumari. I wrote a letter to her father-in-law seeking blessings. He wrote back saying that one should not people after those still living and hence suggested Lakshmi Kumari. It is her name now. My wife did not fast or shout on me. She is also a woman driven by all human passions. But, she is different.సరే! ఇక ఆఫీసు.   భీమా సంస్థలో  అప్పట్లో వింత పరిస్థితులు ఉండేవి. చాలా బలమైన  కమ్యూనిస్టు    యూనియను. బీ జే పీ వాళ్ళ యూనియన్లో చేరాను. అప్పట్లో నేను బలమైన కాంగ్రెస్సు వాదిని. కమ్యూనిస్టులన్నా,  బీజేపీ అన్నా  కోపముండేది. (జన సంఘ్) దీనికి మా నాన్న గారి ప్రభావం ఎక్కువ. (ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు కాలేజీలో రొటరాక్ట్ క్లబ్బు లో ఉన్న పేరు చూసి బీ వీ పీ వాళ్ళు కాలేజీలో ఉండగా  నన్ను మెంబరుగా చేర్చారు. నేను ఆర్ ఎస్స్ ఎస్స్ కి పూర్తి వ్యతిరేకం. వాళ్ళకి చెప్పాను. నా అభిప్రాయాలు  మారవని. నిద్ర లేస్తె చదవడం నాకు జన్మతః వచ్చింది. తింటూ కూడా చదివే వాణ్ణి. దాంతో రాజకీయాల మీద ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి. ఇప్పటి పిల్లలకి కూడా అదే చెప్తాను. చదవండి. దేశానికి ఉపయోగ పడుతుంది అని)   అయినా చేర్చుకున్నారు. వెంకయ్య నాయుడంటే చాలా గౌరవముండేది. ఆయన మీటింగులన్నీ వినే వాడిని. విశ్లేషించే వాడిని. మర్నాడు చర్చ పెట్టే వాడిని. ఆయన్లో తప్పులు వెదికి మరీను. అప్పుడే రాజకీయ విశ్లెషణ చెయ్యడం ప్రారంభించాను. నా వాదనలు చాలా  మంది వినే వారు.  నా ప్రాణ స్నేహితుణ్ణి కూడా చేర్పించాను. సమయంలో విజయవాడలో ఒక పెద్ద సదస్సు జరిగింది. నన్ను, మా స్నేహితుడినీ మరి కొంత మందినీ మా వూరి నుంచి పంపారు, కార్యకర్తలుగా. ప్రొద్దున్న గడిచింది. రాత్రి అందరికీ క్రింద చాపలేసి పడుకోమన్నారు. కొంతసేపు  పడుకున్న తరువాత సంశయ మొచ్చింది. నాయుడు గారెక్కడ  అని. హోటల్లో పడుకున్నారు అని. సీ హోటలు. ఆయన ఇక్కడికి రావాలి, లేదా మాకు కూడా హోటల్లో రూము లివ్వమని అన్నాను. అందరికీ కోపమొచ్చింది. క్రమశిక్షణ అన్నారు. ఆయనకు లేని క్రమ శిక్షణ  మాకెందుకు అన్నాను. పెద్ద గోల అయ్యింది. కొందరు అటూ, కొందరు ఇటూ. ఏమయ్యిందో తెలియదు. మీకు ఇష్టం లేక పోతే వెళ్ళి పొండి అన్నారు. మేము కొంత మందిమి వెళ్ళి పొయ్యాము. వెళ్ళెటప్పుడు చెప్పాను, నాయకుడు కార్యకర్తల్తో కలిసి ఉండాలి. ప్రత్యేక మైన సదుపాయాలు ఉండకూడదు అని. కధ అంతటితో ముగిసింది. వాళ్ళు నన్ను తీసేశారు ఏబీవీపీ నుంచి.(కానీ సంఘటనకి, నా కాంగ్రెస్సు మీద ప్రేమకీ సంబధం లేదు. ప్రతిదీ విశ్లేషించే అలవాటు వేణ్ణూలుకుంది)

Now, let us go to my office life. Those days, in LIC of India a peculiar situation prevailed. There was a strong communist union and a Union affiliated to BMS, a wing of BJP (then Jana Sangh). I joined BMS. At that time I was a staunch Congress supporter. I used to hate communists and Jana Sangh equally. My father had maximum influence in this regard on me. I have to tell one matter here. With the popularity I gained as a Rotaract Member, the local unit of ABVP approached me that time in college in my town. I was strongly against the ways of RSS back then. I told them I won’t change my opinion about their parent organization. Reading books, papers and whatever comes way was and is my forte. Even while eating, I was reading something that my children imitated and continue to read. Hence, I had some firm opinions about politics of the day.  I tell children now too to read. It will be useful to the nation. Even after I told them this, they admitted me as they considered me as a value addition. I used to have great respect for Venkaiah Naidu those days. I never missed his speeches with punch. I used to analyse and start discussion on his speech, even pointing out the negatives in his speech. My friends used to like my analysis. Political analysis started in my life too early. I got my best friend too admitted as we were inseparables. That time a grand meeting of ABVP took place in Vijayawada. We were deputed to represent our town wing along with few others. First day morning session over, post dinner, we were asked to sleep on mats in a big hall. After sometimes, I got a doubt where Mr. Naidu was. I asked the organizers. He was resting in an AC Hotel. I told them frankly that either he should sleep in the hall or we should be sent to hotel too. There was commotion. People started speaking discipline. I said if the leader is not disciplined, we had no need. The hall was divided into two wings. I do not know what happened. But we were asked to leave. We packed and left to our town. Later we were removed from ABVP. But the incident had no bearing on my Congress love.  Analysing everything became part of my blood.భీమా సంస్థలో ట్రైనింగు అయి పోగానే సరెండర్స్ అనే సెక్షన్లో వేశారు. 12 ఫైళ్ళు ఇచ్చారు. పక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. రోజు 4 గంటల వరకూ పట్టింది. రెండో రోజు 12 గంటల కల్లా పని అయి పోయింది. ఆఫీసరు కిచ్చాను. ఇంకా చేస్తావా అని అడిగాడు. అవుననన్నాను. ఇంకో 20 ఇచ్చాడు. ఇది పక్క సెక్షన్లో కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి తెలిసింది. కోప్పడ్డారు. నీ లాగా మేము పని చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయా? నువ్వు పెండింగు పెడితే ఇంకొంతమందికి ఉద్యోగాలొస్తాయి అని గీతోపదేశం  చేశారు. (తరువాత వచ్చిన యమ గోల సినిమాలో "మేము పని చెయ్యం, ఇంకోళ్ళని చెయ్యనివ్వం అని రామా రావు చెప్తాడు. పశ్చిమ బెంగాలులో ఇది ఇప్పటికీ నడుస్తుంది). ఏం చేస్తాం. మరునాటి  నుంచీ రెండు గంటలు బయటా, రెండు గంటలు సీట్లో అలవాటు చేసుకున్నాను.తరువాత నెమ్మదిగా బస్ స్టాపుల్లో నిలబడటం అందమైన అమ్మాయిలని చొంగ కార్చుకుంటూ చూడడం, 11 గంటలకి (అప్పుడు రాక పోతే సెలవు పెట్టాలి) రావడం అలవాటయ్యింది. ఇక్కడే  ఇంకో ఐదుగురు నా లాటి యూనియన్  బాధితులు తగిలారు. అందరం బస్ స్టాపుల్లో తిరిగే వాళ్ళం. ప్రొబేషన్ అయి పొయ్యాక కొత్త పద్ధతి కనుక్కున్నాం. అక్కడికి దగ్గర్లో మీర టాకీసు. వారానికి కొత్త సినిమా. ప్రతి వారం సంతకం పెట్టడం, పక్క సెక్షన్లో పని ఉందని నాలుగు చిత్తు కాగితాలు పట్టుకుని సినిమా చూసి, లంచ్  చేసి వచ్చి గంటలో పని పూర్తి చేసే వాళ్ళం. కొన్నాళ్ళయ్యాక సెక్షన్ మార్చారు. ఇది ప్రీమియంస్. ఇక్కడ ఒక షీటు ఇచ్చే వారు. జర్నలు. దాంట్లో పాలిసీ  నంబర్లుండేవి. అవి చూసి లెడ్జర్లలో  తేదీ వ్రాయడం, నంబర్ సరి చూసుకుని. 250 కోటా. మొదటి రోజు అర గంటలో పని అయ్యి పోయింది. జీతాలు పెరుగుతూనే ఉన్నాయి. లాభం లేదనిపించిది. రెండో రోజు 1000, మూడో రోజు 2000, ఇలా 10,000 వరకూ వెళ్ళాను. సెక్షనుకి ఒక ముస్లిం సెక్షన్ హేడ్ ఉండేవాడు. ఆఫీసరుకి చెప్పాడు. తొందరగా  చేస్తున్నాడు, తప్పులు పోతాయని. యూనియన్ వాళ్ళొచ్చారు. నా ఇష్టం అని చెప్పాను. ఆఫీసరు మీద అరిచి వెళ్ళారు. అప్పుడు దైవ సహాయం అని మళయాలీ ఆఫీసరు. వాళ్ళ ఎదురుగా నన్ను కోప్పడి "నువ్వు ఎదిరించ దలచుకుంటే రేపు 15,000 చెయ్యి. నేను అండగా ఉంటాను. అని చెప్పాడు. చేశాను. ముకుందన్ అని డివిషనల్ మేనేజర్ నన్ను పిలిచి నన్ను పిలిచి నా సర్వీసులో ఎవరూ చెయ్య లేని పని చెశావోయ్  అన్నారు. అంతే. వేల మంది పని చేసే ఆఫీసులో నా పేరు మోగింది . నా బ్యాచులో నలుగురూ కూడా యూనియన్ కి ఎదురు తిరిగారు. మొత్తం మారి పోయింది. కోటా సిస్టం గోవిందా. దాని తరువాత జే ఆర్ కే మూర్తి అనే ఆఫీసరు వచ్చాడు. ఆయన నన్ను తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీసు నుంచి కొంత మందిని 90 రోజుల సర్వీసు మీద తీసుకునే వారు. ఎక్కవ మంది మా సెక్షనుకే వచ్చారు. వాళ్ళకి నన్ను బాసుని  చేశాడు.  రోజూ మా సాయుబు గారితో తగాదేనే. అందర్నీ చెడగొడుతున్నాడు. ఇలా అయితే పని అంతా అయి పోతుంది. నన్ను ట్రాన్స్ఫర్  చేస్తారు అని. ముష్టి యుద్ధాల దాకా వెళ్ళేది. కుర్ర బ్యాచ్ అంతా నా వెనకాలే. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని పెళ్ళి చేసుకొమ్మని అడిగారు. రోజూ లంచ్ లు, గిఫ్టులు ఇలా ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూసే వారు. జీవితమే జీవితం. సెక్షన్ కెళ్ళినా చాలా మర్యాదగ చూసే వాళ్ళు, పని చెయ్యడం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది. ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను మొదలు పెట్టాక, యూనియన్  కేవలం మీటింగులకే పరిమిత మయ్యింది. సంవత్సరంలో నేను, నేనుగా గుర్తించ బడ్డాను. పొట్టి రెబెల్ గా.

After the fifteen days’ oral training, I was allotted to Surrenders’ section. I was given 12 files, the quota fotr the day. I learned the calculations from seniors and I completed work by 4’o clock. Next day, by 12’o clock I finished the work. I handed over the files to the officer. He asked whether I would do more. I took 20 more files and finished. News reached the communist union in the next section. They came and taught me Geeta. “If we worked fast like you, you would not have got job. If you work so fast there will be no pending work and no further recruitment. Hennce, complete your quota and keep with you” Later in one Telugu picture, N.T.Ramarao says “We neither work nor allow others to work” after he establishes a union in hell and preaches the workers there how to avoid work. (Yama Gola). There was a rumor that this sentence was uttered by NTR on the spur of the moment and it became very famous. Even now, in West Bengal the same rule rules. From next day, I used to spend two hours in seat and two outside, depending on the load of work. Later, I started to spend time in bus stop till 10.30 AM looking at girls getting into busses and dreaming. I used to reach office by 11’o clock, the time at which they used to mark absent. (Eventhough there was 1o minute rule and if we crossed it two times, leave was marked officers were not daring to implement it. Such was the grip of unions those days.) Here only, I got acquainted with five more guys. We used to be called “Agraharam Batch” as all were Brahmins. We used to be together wherever we went. We used to oliter in bus stops and reach at 11 AM. After confirmation, we devised a new strategy. There one talkies nearby, where pictures used to change every week. We used to sign, take some scrap in hand as we had some work in the other section, go to the picture, have lunch and finish work by evening and go home. Speding time idly at that age was horrendous experience. If we read bboks, it came under indiscipline. This was discipline. (reason why country is like this). After few days I was shifed to Premiums Section, Ledger Department. At 10’o clock the section head, a muslim, used to hand over a sheet containing policy numbers, name, amount paid and date of payment. Huge ledgers were in large cup boards and were were provided high chairs to reach to the top. We have to compare details and write date in the ledger. The quota was 250. First day, I completed it in half an hour. Our salaries were on the rise continuously. There was no work to do. I decided one day, I had to break the jinx. I did 100 postings, next day 2000 and I reached upto 10,000 postings one day. My section head got panicked. He complained to the officer that doing so fast I might commit errors. He asked him to verify. Union people came and bombarded the office. Mr. Divasahayam, the officer, cajoled them by saying he would advise me and advised me to reach 15,000. My friends too opposed the quota system and the union. The quota system failed. Many followed us and were doing work as much as they can. Lazy guys continued with old practice. At that time we got a new officer, MR.JRK Murthy. He made his close aide. At that time, recruitment of temporary hands was being done by LIC for 90 days. Many used to come to our section. I was made in charge of them by-passing my immediate boss. I was guiding them to do the maximum turn out. This led to daily arguments with my boss. One day, in anger I threw the journal on his face and he made a big issue. He wanted my immediate suspension. Our Divisional Manager, Mr. Mukundan, called me and congratulated and with his usual tact saw the issue was resolved.
During this period only two girls proposed marriage to me. They were giving gifts, lunch to me. (Don’t worry. My wife met them after they were married. She knows all my life stories). I became a talikg point. Many used to show lot of love and respect to me. Many employees were willing to work more but were afraid of the strong arm tactics of unions.  Within a year, I was recognized on my merit and on my size, as a short rebel.

మన జీవితంలో మనకున్న ఒకే ఒక్క గౌరవం మనమేంటో ప్రక్క వాళ్ళు గుర్తించడం. నా విషయంలో అది అక్షరాలా నిజమయ్యింది. నా జీవితమే సందేశమయ్యింది. వ్యవస్థకు ఎదురు తిరగల్సిందే అనే నా పట్టుదల ఇంకా పెరిగింది. గర్వమూ పెరుగుతుంది కదా?


“The only respect we have in life is our neighbors and co-workers recognizing our worth” My lefe became a message. My resolve to oppose the system multiplied. With it my self-pride and arrogance too! Two sides of the coin.

                                                      ##########################

వచ్చే భాగంలో, ఇంకా కొన్ని వింతలూ, భీమా సంస్థకు వచ్చిన నా భామ, ప్రేమా, పెళ్ళీ అన్నీ త్వర, త్వరగా. జీవితంలో పెను మార్పులు.

More funny episodes in next part, how I managed the office and family life deeply attached to both, entry of my wife into LIC office to propose to me, love, marriage and very quick changes in life.


“You have enemies? Good. That means you've stood up for something, sometime in your life.”