Sunday, July 5, 2015

The Churning of the Ocean of Life- The story of pension and Life and Death game. -సాగరమధనమనే నా స్వీయ చరిత్రలో ఏడవ భాగం - పింఛము రాని పింఛను కధ. In English and Telugu.

మా నాన్నగారే నాకు మార్గదర్శకులు. "నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎంతమందిని పైకి తీసుకొచ్చావనేది ముఖ్యము" అని. అందుకే బాధ్యతలు తీసుకున్నందుకు, డబ్బు కర్చు పెట్టినందుకు నేను ఏనాడూ వెనక్కు తిరిగి ఆలోచించ లేదు. కానీ  నా జీవితంలో చేసిన ప్రతి పనిని భూతద్దంలో చూసి, ఒక దుర్మార్గుడిగా  నిలబెట్టిన ఈ లోకం మీద కోపం కన్నా జాలి ఎక్కువ ఇప్పుడు. దీనిలో నా రక్తం పంచుకున్న అన్న, దమ్ములూ,అక్క చెల్లెళ్ళు భాగం కావడం దురదృష్టమే.

My father was my guide in life. " It is not how high in life you grew, but how many people you brought up in life" . It was reason enough for me to take responsibilities and spening money. But, I pity those who saw every small error in my life in a lense and portrayed me as a criminal. It is unfortunate that my own kith and kin formed part of this group.

ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చెయ్యాలి. ఆయనే శ్రీ పీవీఆర్. ఒక గొప్ప అంతర్జాతీయ న్యాయవాది.  భాషా పరంగా చాలా సున్నితమైన, కచ్చితమైన  భాషలో వ్రాస్తారు. వారు మీకు చాలా మందికి @musicaltreses గానూ,  @wordbank గానూ  పరిచయమే. సామాన్యంగా మా ఇద్దరి మధ్య ట్విట్టరు సంభాషణలు ఒక ఉన్నతమైన స్థితిలోనే సాగుతుంటాయి. ఇది ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఆయన (నాకంటే చాలా చిన్నవాడు) మొదటి రెండు భాగాలూ చదివాక ఇలా Tweet చేశారు.

Here, I have to introduce an important person here. He is Mr. PVR. He is a lawyer of international repute, represents corporates across the globe. You know him on Twitter as @wordbank and @musicaltress. He is much younger than me in age. After reading the first two parts he tweeted like this.

"Your  expression is excellent as usual. But reduce intensity"  ఆయన సలహా నేను ఎప్పుడూ మితిమీర లేదు. అందుకే ఈ కధ సున్నితమైన భాషలోనే నిప్పు లాంటి నిజాలు నా జీవితం మీద ఎంత ప్రభావం చూపాయో వరకే పరిమితం చేస్తున్నాను. ఆయనకు నా కృతఙ్ఞతాభివందనములు.

"Your expression is excellent as usual. But reduce intensity." That is one reason I am narrating the events in my life in a unhurting language, confining my narration to the horrid truths that changed the course of my life. I am grateful to him.

                                         ##############################

ఇక కధ లోకి. చిన్న కుటుంooబమే కానీ బాధ్యతలు చాలా ఎక్కువే. ఎందుకంటే అప్పటిదాక నానా యాతనలు పడ్డ నా చెల్లెళ్ళూ, తల్లిని ఏ కష్టం లేకుండా చూసుకోవాలనేది నా సంకల్పం. డబ్బు లెక్క పెట్టుకోవడం, "నేను కర్చు పెడుతున్నాను కాబట్టి మీరు ఇవ్వండి" అని అడగడం చేతనయ్యేవి కాదు. అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు. కుర్రాళ్ళం కావడంతో మేము కూడా హొటళ్ళల్లో తింటూ, సినిమాలు చూస్తూ డబ్బు కర్చు పెట్టే వాళ్ళమే. కానీ ADVD అని ఒక పద్ధతుండేది. ఎవడిది వాడే! మొహమాటాలకు తావు లేదు. నేను బయట తినడానికి ఇంకో కారణం ఉండేది. నేను డబ్బు ఇవ్వకుండా తింటున్నానని, మా వదిన మన్స్ఫూర్తిగా  అన్నం పెట్టేది కాదు. ఇది అన్నం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. దాంతో బయట తిని ఏ రాత్రికో చేరి పడుకుండే వాడిని. ఎంత దౌర్భాగ్యమండీ?

Now back into the narrative. It was a small family. But responsibilities were more. I was determined to look after my mother and sisters who faced lots of travails till then. I never counted the money spent nor ever asked anyone, " I spent money. You reimburse me. ". As we were in prime of age we too were spending money in hotels and cinemas. But there used to be a system called ADVD. It is each one has to contribute for what he ate or the movie seen. There was no scope for hypocritic obligatory spending, There was another reason I was eating outside alongwith bachelros, for whom it was cant but. As I was not paying money, my sister-in-law was not feeding me wholeheartedly. This I can vow on the food I eat today too! So,I used to est outside and reach home in the middle of night. 

ఒక చిన్న సంఘటన చెబుతాను. మా అన్నయ్య ఇల్లు మా మామయ్య,శ్రీ పెనుమాక రామచంద్ర రావు గారి ఇంటికి చాలా దగ్గరగా ఉండేది. ఆయనే మాకు పెద్ద దిక్కుగా ఉండేవాడు. మా అమ్మమ్మ అప్పుడు మేమంటే చాలా ప్రేమగా చూసేది. (చివరికి ఆమె పొయ్యేటప్పుడు మా మామయ్య చూడలేక బయటికి వెళితే  ఆమె చెయ్యి నా చేతుల్లోనే ఉంది). చాలా రోజులు వాళ్ళింట్లోనే భోజనం చేసే వాడిని. ఒక్కో సారి అక్కడే పడుకుండే వాడిని. ఈ సందర్భంలో ఒక సంఘటన జరిగింది.నాకు విపరీతమయిన దగ్గు పట్టుకుంది. దగ్గు కొత్త. డాక్టరు దగ్గరకి  వెళ్ళటం నాకు అలవాటు లేదు. మా నాన్నగారే డాక్టరు కదా. ఇలా ఓ పక్షం రోజులు గడిచాక ఓ అర్ధరాత్రి మా అన్నయ్య వచ్చి, "ఏమిటా దగ్గడం? మా అందరికీ నిద్రలు పట్టడం లేదు. పిల్లలు ఏడుస్తున్నారు. డాక్టరు దగ్గరకి వెళ్ళొచ్చు కదా?" అని గట్టిగా అరిచి తలుపులు బాదేసి పడుకున్నాడు.. (ఇవి మా కుటుంబం రాక ముందు సంఘటనలు). ఆ రోజు విపరీతంగా ఏడుపొచ్చింది. మా స్నేహితులకి చెప్పి ఏడిచాను. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందరూ కొత్తే. రెండు రోజుల తరువాత, మా మామయ్య వాళ్ళింటికి వెళ్ళాను, ఆదివారం. పగలంతా దగ్గు కంట్రోలులో ఉన్నా రాత్రికి మళ్ళీ మొదలయ్యింది. మా మామయ్య వచ్చి మంచం మీద కూర్చుని ఛాతీ నిమిరి "ఎందుకురా అలా దగ్గుతున్నావు? ఎన్ని రోజులనుంచీ ఇలా? మీ అన్నయ్యకి చెబితే డాక్టరు వినయభూషణ రావు దగ్గరకి తీసుకెళ్ళే వాడు కదా? మీ ఇంటి పక్కనే" అని రాత్రంతా సపర్యలు చేస్తూ కూర్చున్నాడు. జరిగింది చెప్పాను. మర్నాడు ఆఫీసు తరువాత ఆయనే తీసుకెళ్ళాడు. ఆ రోజుకి మందిచ్చి, రక్త పరీక్ష చేస్తే యుసనోఫిలియా 16 శాతం ఉంది.(6 శాతం అత్యధికంగా ఉండొచ్చు)  ఇంకో వారం గడిస్తే ఏమయ్యేదో తెలియదు. బుద్ధుందా?" అని తిట్టాడాయన. ఇదెందుకు చెప్పానంటే, ఆ రోజు నుంచీ టైముకి ఇంటికి రావడం మానేశాను.. సాయంత్రం, సుధా హొటల్లో (ఇప్పటికీ ఉంది) మిరపకాయ బజ్జీలు, ప్లేటు  పూరీ తినే వాళ్ళం, ఐదుగురం. రోజూ ఇదే తంతు. అటూ, ఇటూ తిరిగి వాళ్ళ రూముల్లో పేకాట ఆడుకుని రాత్రి తొమ్మిదింటికి చేరుకుని ఒక ముద్ద ఎంగిలి పడే వాణ్ణి. నాలో మార్పు ఆయన గమనించాడు. మా మామయ్య చెప్పాడు, ఆయనకి. ఆయన్లోనూ మార్పు లేదు, నాలోనూ మార్పు లేదు. చెడు తిరుగుళ్ళకి అలవాటు పడ లేదు, అదృష్టం. ఒక సారి రాత్రి ఒంటి గంటయ్యింది. లక్డీ కా పూల్ మీద కూర్చున్నాము. మా అన్నయ్యకి భయమేసి మామయ్యని తీసుకొని వచ్చాడు. ఊరంతా వెదికి, అక్కడికి ఒంటి గంటకు వచ్చాడు. నేను బాధ పడ్డాను. అది నా సహజ గుణం. ఆయన దానికి వ్యతిరేకం. జీవితంలో ఒక వ్యక్తి ప్రవర్తన మీద చాలా సంఘటనలు ప్రభావం చూపుతాయనడానికి ఇదొక నిదర్శనం.

I will be failing in my duty if I do not narrate an incident in life at this point that made me harder and harsher. My brother's residence was very near the residence of my maternal uncle Sri Penumaka Ramachandra Rao. He used to be paternal guide to us. My grandmother was loving us all very much till her death. (When she was about to breathe her last, as my uncle went out unable to see her go away from him, her hand was in mine. I take it as a blessing. Later my mother-in-law,my mother, all passed away in my hand only. I wish my son will be there for my wife). I used to take lunch, dinner etc., there only many a time, specially on Saturdays and Sundays and sleep there only. An incident occurred during this period. I was attacked by cough (worse than Kejri's). I was new to Hyderabad. I never visited another doctor in my life as my father was a doctor. It continued for a fortnight. It went on increasing. One midnight, my brother opened his room door and shouted, " What is this continuous coughing? (lucky Kejri has no elder brother). There has been no sleep for us. Children are crying. Why don't you search for a doctor and meet him?" And he banged the door on my face. That day I wept copiously. My mother used to wake up whole night in such a situation. I cried for my dead father, who left me alone soonafter I got a job. ( All this happened before my family moved to Hyderabad). Next day I cried in front of my batch.They sympathised. What can they do? All are 20 year olds, new to the city. Two days' later, I went to my uncle's house. During the entire day cough was under control. The moment I went to bed, it started again. My uncle came out, applied balm on my chest and massaged. He asked, " Since when you were coughing like this? Why did you not tell your brother? He would have taken to Dr. Vinayabhushan Rao, near your house. (He was family doctor for both). He sat with me the whole night. Next evening, after office, he took me to the doctor. He gave a medicine for the day and sent me for blood examination. Yusinophlis percentage was 16 as against a maximum permissible 6 per cent. He shouted, "Are you having sense? Another week, I can not say what would have happened? " He also chided me for being dependent at age 19-20. From that day, I stopped coming home in time. All the five-six of us used to eat Mirchi bajji and a plate poories, in a hotel called Sudha, (it is still there), roam here and there and used to play cards till late in night, go home eat a little and sleep. During this period, I started smoking again with my friends. I was angry on God, myself, the world around me. "Why should this have happened to me, of all?" I used to lament. I did not fall further into the abyss, God saved me. My brother observed the change in me. Talked to my uncle. He advised him. He did not change, nor me. One day we roamed the city, (it was a very peaceful city those days) and sat on Lakdi Ka Pool till 1 AM. None had a watch. My brother got worried ( he thought I committed suicide, mostly) , roamed the new city extensively along with my uncle and found us at 1 AM. He did not talk much. I felt bad. That was my nature. He did not.That is, still, his nature. I narrated this incident in the past history to make a point how psychology in that age changes because of the attitudes of others, either good or bad. So, be good examples to youth, not bad! 

ఇదే సందర్భంలో ఇంకో సంఘటన. మా స్నేహితులందరూ సిగరెట్లు  తాగే వాళ్ళు. ఒక రోజు నేనూ తాగాను. ఆ మర్నాడే మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం. "నువ్వు సిగరెట్టు  తాగావని కల వచ్చింది. జాగ్రత్తగా ఉండు. నాకు చాలా గాభరాగా ఉంది" అని. అంటే నేను సిగరెట్టు తాగే మూడు రోజుల ముందే  ఆమెకు కల వచ్చిందన్న మాట. అందుకే ఆమె నన్ను ఎంత కాదనుకున్నా, చివరి క్షణం వరకూ ఆమెకు సేవ చేస్తూనే ఉన్నాను. ఇది పచ్చి నిజం.

During this period (earlier than the above), soonafter my father's death, one more incident left an indelible mark on my psyche. All my friends used to smoke. One day, I too smoked. Next morning, I received a letter from my mother. It read, " I had a dream that you were smoking, Be careful. I am worried" So, she dreamed about my smoking three days earlier than I actually smoked! "The key to soul is left in mother's womb. She can open it any time and search for the skeletons in the cupboards of our souls".  That is why, whatever  be the differences that cropped up in our lives in the latter period, she never disowned me nor did I disown her. Testing waters at every place and unable to digest the drain waters, she came searching me and my wife, pleaded and took an oath that I would allow her to stay with us till last breathe. In that desperation, she said that she would transfer all the money stashed by my eldest brother (her words, I never bothered). I simply brushed away the suggestion, as I had no need of money then or now, though I do not have a rupee income nor movable or immovable assets. I assured her my children loved her more than I loved her and she was secure with us. Within 9 months, she breathed her last in my hand with my daughter, first declaring she was no more. Her soul rests in peace, I know, as her life time wish is fulfilled by the God, breathing last in my house! I am grateful to the Gods!

She wrote a poem on me just before her death, the reproduction of which enraged my third brother's envy so much that he started abusing me. Culture vultures look for cadavers only.This was written by her a few months before she went into coma. It meant, " If a son like you is born, it is enough. I heard harsh words from you and as I chew them again and again, I feel the sweetness in them. I pray Vani ( Goddess Saraswati) to grant me the same vocabulary he granted you at least in next birth". And, she is accused of seeking revenge on me. ( This was her writing at age 82).

1974 గడిచింది. మా జీవిత భీమా సంస్థలో అంతర్గత పరీక్షలుండేవి. (departmental examinations) మొదటిది licenciate. ఇది మేము చాలా మందిమి పాస్ అయ్యాము. ఒక increment వచ్చింది. తరువాత Associate 1976 లో వ్రాశాము.

1974 passed off with many events, ups and downs. In LIC of India, there used to be Departmental tests. First one was licentiate. Most of us cleared it with good marks. We got one extra increment. In 1976 we appeared for Associate Examination. 

1975 లోపలే నాకు మా సంస్థలో మంచి పేరొచ్చింది. "ఏ పనైనా సమర్ధంగా చెయ్యగలడని". ఆ సందర్భంలోనే, మేము ఉన్న బిల్డింగు వెనకాలే పెద్ద బిల్డింగు కట్టారు. మా సెక్షను అక్కడికి మార్చారు. అప్పటికి మూర్తి గారే మా ఆఫీసరు. ఆ రోజు ఆదివారం. ఆయన నాకు రమ్మని చెప్పలేదు కానీ, రేపు మన పుస్తకాలన్నీ కొత్త బిల్డింగు లోకి వెళ్తాయి అని మాత్రం చెప్పారు. మరునాడు పదింటికి  ఆఫీసుకి వెళ్ళాను. అప్పట్లో భీమా సంస్థల్లోనూ, బ్యాంకుల్లోను overtime మీద నిషేధముండేది. ఆయన నన్నడిగారు. "overtime లేదు కదా మరి ఊరికే వచ్చావా" పని చేయడానికా" అని. "పని చేయడానికె వచ్చాను. కూలీ వాళ్ళు పుస్తకాలు వరుసలో పెట్టక పోతే మాకు బాధ కదా, అందుకే దగ్గరుండి నేను పుస్తకాలు ఇస్తాను, మీరు కొత్త  బిల్డింగులో వరుసలో పెట్టించండి" అని చెప్పాను. ఆయన వరుసలో పెట్టే బాధ్యత నాకు వప్పగించారు. వెళ్ళాను. కూలీ వాడి లాగా రాత్రి పదింటి వరకూ పని చేశాను. ఆయన చాలా ఆనంద పడ్డారు. ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని బాధ పడ్డారు. "నేను డబ్బుల కోసం రాలేదు. నా తృప్తి కోసం వచ్చాను"  అని చెప్పాను. మరునాడు యూనియన్  వాళ్ళు మళ్ళీ తగులుకున్నారు. ఇలా పని చేస్తే కిరీటం పెడతారా అని. కిరీటం వచ్చినట్లే అని చెప్పాను. ఇది ఎమర్జెన్సీ పెట్టక ముందు కధ. మూడు నెలల తరువాత నా జీతం slip లో 64 రూపాయలు overtime allowance వచ్చింది. ఆదివారం కాబట్టి 10 గంటల నుంచి అయిదు గంటల వరకూ, జీతానికి రెండింతలు లెక్క వేసి ఇచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఆఫీసరుకి చూపించాను. అవును. ముంబయ్ ఆఫీసుకి వ్రాసి తెప్పించాము అని చెప్పారు. బహుశా overtime ban ఉన్నప్పుడు అలా overtime వచ్చిన వాడిని నేనొక్కడినే అయి ఉండ వచ్చు. యూనియన్ వాళ్ళు మా సీనియర్ డివిజనల్ మేనేజర్  దగ్గర గోల పెట్టారు." అతను పని చేశాడు, ఆఫీసరు వ్రాశాడు, హెడ్ ఆఫీసు వాళ్ళిచ్చారు" అని గట్టిగానే వాదించారుట. నేనూ మా స్నేహితులూ కలిసి హొటల్లో full meals చేసాము ఆ రాత్రి, నా డబ్బుతో. ఇలాంటిదే సంఘటన నేను బ్యాంకులో దావణగిరిలో చెసేప్పుడు జరిగింది. మళ్ళీ నిజామాబాదులో జరిగింది. అది వ్రాసినప్పుడు ఇది గుర్తు చేస్తాను. జీవితంలో కొన్ని పాఠాలు  మనకి తెలియకుండానే నేర్పుతాడు  దేవుడు. ఇది అలాంటిదే. క్రింద వాళ్ళ చేత ఎలా పని చెయ్యించొచ్చు అని మొదటి పాఠం. సామం, దానం తోనే పని చేయించే వాడిని. దండమనేది తెలియదు. భవిష్యత్తులో.

Even before 1975, I got a good name in my organization that I could do any work allocated to me efficiently. During this period, a new bulding was constructed behind our existing building. Our section was allotted space there. Then Sri JRK Murthy was our officer still. I was informed by my officer that our section was being shifted to the new building on Sunday. I was there by 10'o clock. At that time there was prohibition on payment of overtime allowance in banks and LIC of India. He asked me whether I just came to have a look or whether I was willing to work, as he was not in a position  to pay overtime allowance. I said I came to physically arrange the ledgers in chronological order as the workers employed might just dump them as they liked and it would be difficult for us to search for the numbers. I told him that I would hand over the books in order and he could supervise the arrangement. He told me to go to the new building. I worked till 10 pm arranging the books myself and relieving the workers only for carrying the books. Though my officer was extremely happy, he regretted that he could not pay any allowance, as rules barred payment. I said I came not for money but to help myself. Next day again Trade Union people bombarded me. "Did you get a crown?" they questioned. I told them I got a crown as good as any. All this happened before emergency. After three months I was in for a big surprise as my payslip included Rs.64/- as overtime allowance. They calculated the allowance from 10 AM to 5 PM , at double the pay as it was holiday. I showed to the officer.He said they got it through Head Office, Mumbai. Union people raised an objection and took the matter to the Senior Divisional Manager who told them, "He worked.Officer recommended. And I endorsed."  I was told thst he had a big fight with Union leaders on this issue. Perhaps, I was the only one in the organization that got overtime allowance when there was a ban. We had a sumptuous meals that night in a good hotel. Similar incident happened when I was officer in a bank in Davangere and again in Nizamabad. When those incidents are referred I will recollect this. In life God teaches few lessons without asking. I learned the art getting work done through many such incidents. I used to get work done with ease without hurting the psyche of my subordinates. 

"జీవితమనేది సహజంగా క్లిష్టమైనది. అన్నిటికన్నా క్లిష్టమైనది ఏమీ చెయ్యకుండా ఉండడం.ఈ ఏమీ చెయ్యకుండా ఉండడమనేది ఒక్కటీ మనం నిరోధించగలిగితే, జీవితం సుఖంగా ఉంటుంది."

"Life is complicated. The most complicated thing in life is not doing anything. If we could get rid of this helplessness in helping others, our life will be filled with pleasure"

నేను ఈ సూత్రాన్ని అక్షరాలా పాటించాను. బయటి వాళ్ళకి అప్పట్లో ఎక్కువ సహాయం చెయ్యలేకపోయినా, నా వాళ్ళకైనా అండగా ఉండగలిగాననే తృప్తి జీవితమంతా ఉంటుంది.

I followed this dictum in letter and in spirit. I could not help outsiders then due to financial constraints, I have the satisfaction of looking after my own family members.

ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి.. మా వాళ్ళు మాత్రమే నా దగ్గర ఉంటే అంత భారమయ్యేది కాదు. కానీ మా అమ్మ నా దగ్గర ఉండటం వలన దాదాపు రోజూ సరాసరి ఇద్దరు మనుషులు ఇంట్లో ఉండేవారు. అవీ క్లిష్టమైన రోజులే. వారికి పాలు, భోజన సదుపాయం, ఊరు చూపించడం, ఇంకా రక రకాల కర్చులు నా మీద ఉండేవి. , మొదటి సంవత్సరం. ఇవన్నీ కనపడని భారం. ఒక కుటుంబం వస్తే కనీసం వారం రోజులుండేవాళ్ళు. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాని, నువ్వు చేసిందేముంది అని అడిగినప్పుడ చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుల ఊబిలో ఇరుక్కు పోయాను. మిగతా వాళ్ళందరూ, ఆస్తులు కూడ బెట్టడం మీద ఎక్కువ శ్తద్ధ చూపించేవారనొచ్చు. (ఈ విషయంలో నాకంటే ఇంకా ఎక్కువ బాధలు పడ్డవాడు మా మామయ్య శ్రీ పెనుమాక రామచంద్ర రావు గారు.)

You have to note one point here. If my own family members were staying with me, it would not have been burdensome. But as my mother was staying with me, on an average, two more relations used to stay with us, Those days were too tough for a middle classes. Milk, provisions, rice, fuel etc., all used to cost extra. Besides, whoever was new to city the burden of roaming witn them was adding to the burden. If a family visited, they used to stay with us for a week. (A habit that developed in our family during my father's time). All need not be narrated, but at a point in life if everyone asks, " What did you do? If not you, someone would have taken the burden.", it hurts. I fell into a debt trap. All others concentrated on saving money and buying assets, (In this respect my maternal uncle suffered a million times more than me. None looks at him now. He is an enemy of all, friend to none). 

ఇలా ఉండగా, 1975 లోనే మా అమ్మ ఒక కోరిక కోరింది. ఆమె ఏమడిగినా నోరెత్తకుండా చేసే వాడిని. పూజారులకి, గుడిలో హుండీల్లో ఆమె అదేశం మేరకు ఎంత వెసే వాడినో లెక్క తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడు నా చెయ్యి నొప్పి అంటే రాత్రంతా మేలుకొనేది. తల నొప్పి వస్తే ఏడిచేది. ఇవన్నీ మా అన్న దమ్ముల మీద చాలా ప్రభావం చూపేవి. మా అమ్మకు నేను బలహీనుడిని, తెలివి కల వాడిని. నన్ను నిర్లక్ష్యం చేస్తే కుటుంబం బాగుండదు అనే నమ్మకం ఉండేదనుకుంటా. పైపెచ్చు, నిద్ర లేచిన దగ్గర నుంచీ ఆమె వెనకే ఉండి సహాయం చేసే వాడిని. అదీ మనసులో ఉండొచ్చు.

As things stood like this, my mother expressed a desire. (Fate led me like this throughout). Through out her life, whatever she asked. whatever amount she advised me to donate to priests in temples or to place in Hundies, I used to oblige. (I was the one who took her by flight to Tirupati, on her request at my expence, the first and last in her life. That was a good experience. I will narrate at appropriate time). When I was a child she used to wake up the whole night if I had pain in the hand (that used to repeat, because of excess reading and writing). If I got head ache she was crying. It might be that I was too weak or that I was the most studious and if I were ignored, it would hurt the family.  Moreover, I used to be behind her since morning to help her in her chores. ( That was how I developed a flair for cooking and am one of the best in our family circles) . 

ఈ కోరిక ఏమిటంటే ఆమె పాత బంగారమంతా మార్చి కొత్త బంగారం చేయించమని. డబ్బు ఎక్కువ వేయకుండా. సరే అన్నాను. నాకు నగరం కొత్త. అంచేత, తెనాలి వెళ్ళినప్పుడు మా స్నేహితుడు, ఆరమండ్ల వెంకటేశ్వరరావు అమ్మకు విషయం చెప్పాను. సరిగా అదే సమయంలో వాళ్ళు ఒక కంసాలికి బంగారం చెయ్యడానికి డబ్బు ముందుగా ఇచ్చారు. నన్ను అక్కడికే తీసుకెళ్ళి మా అమ్మ బంగారం ఇప్పించింది ఆమె. designs కూడా ఆమే చెప్పింది.

This was a small desire. Her gold ornments were very old. So, she requested me to exchange the old ornaments to new. As Hyderabad was new to me and my knowledge in these issues was meagre, I told the mother of my friend, Venkareswara Rao the matter. Exactly, at that time they paid huge amount to a local goldsmith for making ornaments for their daughter. She took me there, ordered some designs and handed over the old gold. I paid the balance amount.

ఒక వారం తరువాత పిడుగు లాంటి వార్త. వాడు ఉళ్ళో వాళ్ళ బంగారం అంతా ఎత్తుకుని పారి పొయాడని. మేమూ వెళ్ళాము. మా స్నేహితుడి వాళ్ళ డబ్బు కూడా చాలా పోయింది. పోలీసులు కూడా ఏమీ చెయ్యలేక పొయ్యారు. ఇంకో అవకాశం. వీడే  తినుంటాడు . వాళ్ళూ, వీడూఊ కలిసి పంచుకొని ఉంటారు. ఎంత దుర్మార్గమండీ. మా అన్న కర్చు పెట్టనప్పుడు నోటు లేకుండా 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు మన బంగారం తీసుకుంటారా. ఎంత పాపం? ఇప్పటికీ మా మూడో అన్నయ్య ఇదే అభాండాలు వేస్తున్నాడు నా మీద. సరే ఎవరి సంస్కారం వారిది. ఇది నిజానికి నాకు పెద్ద దెబ్బే. తరువాత ఆఫీసులో వచ్చే అప్పులూ, బయట అప్పులూ కలిపి కొంత బంగారం, దాని తరువాత రోజుల్లో కొంత బంగారం చేయించాననుకోండి. అదీ ఆ కష్ట కాలం లోనే.

Within a week, there was bad news. It was bolt from the blue to me. The goldsmith left taking huge amount of gold and lot of money and closed shop overnight. We too went there. Even police could not trace him. Another chance to my brothers. Allegations flew like kites. " These two must have shared the booty". Even now, my third brother sticks to the same point. Of course, he can not rise above that level. This was another biggest blow after my father's death. All within a span of two years of settling in life! After some days, I raised all available loans from office, added some outside borrowings and made good her ornaments to the maximum possible, during the same troubled times.

ఈ కర్చులన్నీ ఎవరూ లెక్క వెయ్యరు. 50 రూపాయలు పంపిస్తానన్న పెద్ద మనిషి మధ్య, మధ్యలో ఎగనామం పెట్టే వాడు. నాకు పెళ్ళయితే ఇంట్లో వస్తువులు కావాలి కదా అవి కొన్నా అని. (నేను బళ్ళారి నా భార్యను తీసుకు వెళ్ళినప్పుడు, ఒక చాప, దిండ్లు, ఐదారు గిన్నెలూ, ఒక స్టవ్ (కిరోసిన్ ఆయిలుది) తో వెళ్ళాను.

None makes a count of these expenses. The third brother who promised Rs.50/- pm used to skip it frequently saying he was accumulating household goods for future married life. (When I went to Bellary with wife, I took a mat, two pillows, bedsheets, few utensils and a kerosene stove. We lived like that for 3 years, with no more furniture).

సరే, ఇది ఇలా జరుగుతుండగానే మా నాన్న గారి పించనూ, పీ ఎఫ్, వగైరా ఇంకా రాలేదనీ,  వస్తుందో రాదోననీ ఒక ఆందోళన ఉండేది. అప్పటికి ఆయన పదవీ విరమణ చేసి 6 సంవత్సరాలు గడిచినాయి. 1975 కి ఏడో సంవత్సరం. మా పెద్దన్నయ్య హైదరాబాదులో ఉండి కూడా ఏమీ చెయ్యలేదు. చెయ్యలేక కాదు. చెయ్యాలంటే, తెనాలి, గుంటూరు, హైదరాబాదు చుట్టూ తిరగాలి. డబ్బు కర్చు పెట్టాలి. ఆయనకి అది ససేమిరా ఇష్తం లేదె! మూడో ఆయనకి మాట్లాడడమే వచ్చేది కాదు. రెండో ఆయన అప్పటికే  కష్టాల్లో పీకల లోతు కూరుకు పోయాడు. ఆ కధ తరువాత. తమ్ముడు ఇంకా చిన్నవాడు. కాబట్టి బాధ్యత మళ్ళీ నా నెత్తికొచ్చింది.

As things stood where they were, with a little financial stability in sight, issue of my father's pension and PF cropped up.By 1975, it was the seventh year that my father retired and second year of his passing away. None knew where the file was held up. I knew that it was in ZP, Guntur as they held up the file saying my father was ineligible for pension and gratuity as there was a break in service of one year due to ill health. My father could not spend much going around the office due to paucity of funds. My eldest brother, though he was in  Hyderabad, did not help much. He knew he had to go around Guntur, Tenali, Hyderabad etc., to get the file moved and he was not willing to spend money unless he was assured it would be refunded. This was like a lamp in the wind. None knew my father would get anything. My third brother was too poor in communication. Second one was deep in troubles post marriage. Last one was too young and was on probation. So, the mantle fell on me.ముందరగా, ఆయన "మరణ  ధృవీకరణ    పత్రం" "వారసుల ధృవీకరణ  పత్రం" తేవాలి. శలవు మీద తెనాలి మునిసిపాలిటీ ఆఫీసుకి వెళ్ళాను. 21-22 ఏళ్ళు. చూడ్డానికి   స్కూలు పిల్లడిలా ఉన్నాను. ఆ గుమాస్తా చాలా జాలి పడ్డట్టుగా అనిపించింది. కాగితాలు తిప్పాడు. మళ్ళీ రమ్మన్నాడు. ఎందుకో తెలియదు. మళ్ళీ  డబ్బు కర్చు పెట్టుకుని వెళ్ళాను. ఈ సారి  ఇంకా జాలి చూపించాడు. మళ్ళీ రమ్మనే వాడే. నా జీవితంలో మొదటి సారి, 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టి ఇవాళ ఏమైనా సరే నాకు ఆ సర్టిఫికేటు ఇవ్వాల్సిందే అని పట్టు పట్టాను. గంటలో ఇచ్చేశాడు. మొదటి అనుభవం. పనులెలా చేయించుకోవాలో తెలిసింది . ఎక్కువ సార్లు అరిచి సాధించే వాడిని.

First task was to bring his "death certificate" from Tenali Municipal office and a "legal heir" certificate from MRO, Tenali. I was 21-22, looking like a school boy. The clerk seemed to have shown a lot of sympathy for me, for having lost father. He took a file out, turned some papers here and there and asked me to come again. I returned back to Hyderabad and went again. Might be, he might have asked me to come again, but I kept Rs.10/-  in his hand and pleaded that I wanted the certificate that day. He made it and gave it in an hour. It was my first ever experience to get things done. Most of the times  I used to shout and get my work done. (My son still tells others how people used to do my work fast).


అది పట్టుకుని ఎం ఆర్వో  ఆఫీసుకి వెళ్ళాను. ఏదో ఫార్మ్ ఇచ్చారు. ఒక అఫిడవిట్  ఇచ్చారు. అందరి సంతకాలూ కావాలని. ఇద్దరు దూరంగా ఉంటారని చెప్పాను. నువ్వే  పెట్టెయ్యి నేను చూసుకుంటాను అన్నాడు.హైదరాబాదు తిరుగు ప్రయాణం. ఉన్న వాళ్ళ సంతకాలు తీసుకుని, లేని వాళ్ళ సంతకాలు చేసి, నోటరీ చేయించి (పెద్ద మాయ) మళ్ళీ తెనాలి ప్రయాణం. అక్కడ రెండు రోజుల మకాం తరువాత ఒక ఆదివారం ఎం ఆర్ వో ఇంటికి వెళ్ళి కలువు, ఆయన సంతకం పెట్టాక తీసుకురా అన్నాడు. వెళ్ళాను, ఇల్లు వెదుక్కుని. ఒక అరగంట తరువాత తలుపు తీశాడు. బయటే నిలబెట్టి మాట్లాడాడు. పలానా ఆయన పంపించాడు అని చెప్పా . ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. చెప్పాడు అని వంద రుపాయల నోటు ఇచ్చాను. సంతకం పెట్టాడు. (100 రూపాయలు 1975 లో). మర్నాడు చక, చకా పని అయ్యింది. ఇంకో ఇరవైతో. తీసుకుని హైదరాబాదు వచ్చాను. ఏం చెయ్యాలి. మా అన్నయ్య ఒక ఆఫీసరు పేరు చెప్పి వెళ్ళి కలువు అన్నాడు. ఆయన ఎగతాళిగానే మాటలాడాడు కానీ చేసిందేమీ లేదు. మళ్ళీ మొదటి కొచ్చింది.

With the death certificate problem solved, I went to MRO Office. He gave me a form and an affidavit format on which my mother and all seven children should sign. I said two were away. He told me it was just a formality, so I could sign against their names. I went back to Hyderabad. I took signatures of those available, signed on the signatures of those not available and returned to Tenali. (This was exactly a charge on me in Bank. Helping people out?) This was notarised without seeing anyone signing. ( This is the biggest joke, the Notary system). After running around the office for two days, I was directed to meet the MRO at his residence and was given directions. I found the house, knocked the door. After half hour he opened the door. He talked to me on the road only and asked, " Did he say anything more? " I took out a hundred rupee note and gave him. ( Rs.100/- in 1975). I was asked to stand there as he went inside, signed and stamped the affidavit and form both. Next day, with another Rs.20/- for tea I got the work done and returned back. I could not proceed further, My brother asked me to meet an officer. He only passed some mocking remarks on the system but did not help, proving hr was too part of it. The story came to the first page.

సరే, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఈలోగా నా స్నేహితుడి వాళ్ళ నాన్న అర్జంటుగా  గుంటూరు రా మన పని చేసి పెట్టే వాణ్ణీ పట్టుకున్నాను అని ఉత్తరం వ్రాశాడు. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంటులో పని చేసే వారు. వెళ్ళాను. ఈ కర్చంతా నాదే,. మీరు గమనించాలి. (ఎందుకంటే ఇక్కడ ఇంకో లింకు వస్తుంది.) ఆయన్ని పరిచయం చేశాడు. ఆయన గుంటూరు జిల్ల పరిషత్తులో పని చేస్తాడు. చూశాడు ఫైల్ అంతా. చేస్తాను అన్నాడు. కానీ పీ ఎఫ్ రావాలంటే హైదరాబాదులో పీ ఎఫ్ ఆఫీసుకి వెళ్ళాలి.  పించను కోసం సెక్రెటేరియట్ లో  కలవాలి   ఈ కర్చంతా నీదే. వచ్చిన ఎర్రియర్సులో 5 శాతం   నాది. నేను హైదరాబాదు  వచ్చినప్పుడు నన్ను  మొత్తం హైదరాబాదులో తిప్పాలి. ఆ కర్చంతా నీదే. నా చార్జీలు ఎన్ని సార్లు వస్తే  అన్నీ నీవే. భోజనం మీ ఇంట్లో ఏర్పడితే సరే (మీరు బ్రాహ్మణులు కాబట్టి,  లేదా ఇద్దరం బయటే భోజనం చేద్దాం  . "మీ ఇంట్లో  పడుకోవడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. కింద చాప మీద అయినా పడుకుంటాను." అని చెప్పి, పద కాఫీ తాగుదాం  అని  కాఫీ, టిఫినూ  పూర్తి చేసి బిల్లు నా చేతే ఇప్పించి నన్ను వేనొళ్ళ పొగిడి (ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద వ్యవహారం  నడుపుతున్నందుకు,) సాగనంపాడు.

I was continuing with my efforts talking to people. My friend, Venkateswara Rao's father sent a letter asking me to come to Guntur at the earliest as he got hold of a man who could do our work, with a price tag. He was working in ZP, Guntur. As my friend's father was Dy. Tahasildar, he knew people. I went. All this expenditure was borne by me alone. (I had to tell this, as there was a link here).  We were mutually introduced. He saw the file. He said he could do it. "I have to go to RPF office for PF and Secretariat for pension, For my coming and going, you have to spend money. After arrears come, you should give me 5 per cent of it. When I am in Hyderabad, you should show me tourist places. (I never visited Hyderabad. Lucky, he did not bring family too). All the charges from and to Guntur and Hyderabad have to be reimbursed, including Rikshaw fare. Since, you are Brahmins, I do not force you to feed me in your house. If possible arrange, Or we shall eat outside, for which you have to pay. I do not have objection to sleep in your house. For me a mat and pillow are enough." so lecturing he led me to the canteen, had both lunch snacks and coffee, asked me to pay, lauded me in the most pleasant words about my age, my structure and my ability to communicate with great persons like him to get work done and said good bye making me accept all his conditions, without bargaining.


ఈ కధ మొదలు పెట్టాను కాబట్టి ఇదే కొనసాగిస్తాను. ఇది 1976 దాకా కొనసాగింది. 1975 కి మళ్ళీ వెళదాము. సరే, మళ్ళీ ఒక రెండు సార్లు గుంటూరు పిలిపించుకొని ఫైలు తయారు చేసి  హైదరాబాదు వచ్చాడు. మా అమ్మను బ్రతిమాలి ఆయనకు వసతి, భోజనం ఇంట్లోనే ఏర్పాటు చేశాను. బయట పడక, హాల్లో భోజనం . ఆయన బాధ పడకుండా సహపంక్తి భోజనం చేశాను. మా అమ్మ ఇద్దరి మధ్యా ఒక గజం దూరం  ఉంచింది. నాకు రగిలి పోయేది ఇలాంటి పిచ్చి వేషాలకి. ఏం చేస్తాం. పని కావాలి కదా. ఆయన వెళ్ళాక క్లాస్ పీకేవాణ్ణి మా అమ్మకి. ఆమె నా కంటే ఎక్కువ ఆకులు  తిన్నది కదా. నాకు తిరిగి క్లాస్ పేకేది. నేను అన్నం మానేస్తాను అని బెదిరిస్తే తగ్గేది. అది నాకు చిన్నప్పటి నుంచీ అలవాటే ఆమెతో. కోపం వస్తే, అన్నం మానేసే వాడిని. అంతే నా మాటే చెల్లేది. అలా ఆచారాల్ని ఒక్కొక్కటీ ఎదిరిస్తూ వచ్చాను. చాలా స్పర్ధలు. మధ్యలో అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ నాటకాలు, స్వార్ధానికి.


Since I started this pension episode, let me complete it and we can go back to 1975 again. This spilled over till June 1976. He called me to Guntur again twice, completed the file and accompanied me to Hyderabad. I convinced my orthodox mother that he would dine and lodge with us and in the noon we would lunch outside. She fed him in the hall separately.He did not feel. But, I gave company on my own to him. My mother kept a yard distance between us. I used to get wild at such practices.I was bomabarding her later and she was countering me with equal and opposite force, as in Newton's law. Only when I used to threaten, I would skip food, she was coming down. This was a weapon I used since childhood to mend her orthodox ways. In the middle my brothers and sisters used to play their roles.

మొత్తానికి, రెండు, మూడు తిప్పట్లూ, కొన్ని అప్పులూ, కొన్ని సెలవులూ, తిరుగుడూ అయ్యాక తెప్పించాడు. ఏడేళ్లకూ కలిపి మొత్తం 4500 ఎరియర్సు వచ్చాయి. పింఛనూ, పీ, ఎఫ్ అంతా కలిపి. మా అమ్మను తీసుకుని గుంటూరు వెళ్ళి డబ్బు తీసుకున్నాము. ఆయన భాగం ఆయనకిచ్చి, కాఫీ, టిఫినూ  ఇప్పించి బయట పడ్డాము. మా నాన్నగారి  మొదటి పించను 31 రూపాయలు. మా అమ్మ మొదట తీసుకున్న కుటుంబ  పింఛను 61 రూపాయలు. అప్పటి నుంచీ డీ ఏ పెరిగినప్పుడల్లా గారి  పెరిగి, నేను ఆమెను 1977లో  వదిలి బెళ్ళారి వెళ్ళేటప్పటికి దాదాపు వంద లోపే పింఛను వచ్చేది. దీన్లో మా అమ్మ దాన ధర్మాలూ, ఇతర చుట్టాలకి పెట్టే చీరె, సారెలు వారి మీద అయ్యే పాల కర్చులూ, తిండి కర్చులూ పోను నాకు పది  రూపాయలు మిగిలేదేమో. ఇదెందుకు రాయాల్సొచ్చిందంటే, నేను ఆమె పించను డబ్బులు తిన్నానని ఆమె చని పోయే ముందు మా మూడో అన్న నడి రోడ్డు మీద నన్ను చెంప మీద దెబ్బ కొట్టాడు, మలక్ పేట్  యశోదా హాస్పిటల్  ముందు. అప్పుడు నాకు 57 ఏళ్ళు. దీని మీద ఆయన ముఖ పుస్తకం పోస్టు చూస్తే మీకు అర్ధమవతుంది.

All said and done this man was a go-getter. He achieved his promised goal. After few leaves, jaunting between Hyderabad and Guntur, roaming in Hyderabad to show places he got pension and PF released. Arrears amounted to Rs.4,500 app. We paid him his due, entertained him with snacks and coffee in a good hotel an came back. This amout was duly deposited for my sister's marriage.  I did not deduct my expenses. (Another episoe in 2010 liks to this). The arrangement was they would send the Pension to Hydeabad, by MO and every year, she had to be present in Guntur ZP for proving she were living. Once a year, two months' pension was going on this. Of course, I was there only for two years in the 1st installment of my stay there. Later, for four years, my younger brother was there. My fathers first pension was Rs.31/-  The first family pension she received was Rs. 61/-.  She might have received Rs. 2,300/- approximately when she passed away after 35 years. By the time, I left for Bellary in 1977, the pension might have been less than Rs.100/-.  Out of this her charity expenses, expenses on her relations, the honaroriums she was lavishly giving them etc., used to cost almost the whole amount. In addition I had to spend the to and fro charges to Guntur and back every year. This, I had to mention, as my third brother slapped me in front of Yashoda Hospital,Malakpet on the charge that I misused her pension amount. She was on death bed then. I was 57 then. You can understand the venom he accumulated on me if you read this post on his FB page.


By Neelamraju sudhakara Rao.(excuse his language. That is the level he can go. This is a copy of his FB posting. He mentions about the pension amount and the Rs.50,000/- deposit I used during my troubles. It is another story. I will explain the background of who was responsible for the deposit and who made it such a huge sum. He does not know his grand father's name.Hence, excuse his foolishness.

"It is very pitiful that you are not knowing the reasons behind why she stay back with you.When she was in Delhi she told that all deposits were mischievously drawn by your livilyhood.She doesn't want to stay back in Delhi as we haven't touched either her deposits or pension.Wjem some one else enjoyimg her money she could not digest the food im jer momey. Wjen she was in Vizag we got it done a gold chain with her pension amount ad well as our contribution.She came to you not with affection with a vengeance and to recover the amount.One should feel proud of if their parents are with them about But you make her presence as income source. You have sent from your house by throwing her belongings. Why all these you inform all your well wishers why you were dismissed on gross misconduct from a BANK. Why are you writing that.."


ఈ సదరు పోస్టు చాల అసహ్యంగానూ, జుగుప్సాకరంగానూ లేదూ. కానీ ఇవ్వేమీ ఆయనకు పట్టవు. (తన కొడుకు ఒడిషా బ్రాహ్మణుల పిల్లని చేసుకున్నాడని ఆయన్ని 70 పేజీల ఉత్తరంలో బూతులు తిట్టి, కౌకుని మూడేఅళ్ళు వెలివేసిన సంస్కారం అయనది. అది ఆయన వ్యక్తిగతం. కానీ వ్యక్తి స్వభావాన్ని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే)  నేను నా తల్లీ, చెల్లెళ్ళ కోసం పడ్డ శ్రమ, కర్చులూ ఎవరూ నాకు తిరిగి ఇవ్వలేదు.  నేను అది నా విధిగా భావించి చేశాను.  అది నా మంచితనానికీ, నా స్వభావానికీ, నా ఆత్మగౌరవానికీ, నా పట్టుదలకీ నిదర్శనం. అదే పట్టుదలతో ఇప్పటికీ నెట్టుకొస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థితికి వెళతాను. అది ఎవరూ అడ్డుకోలేరు. నేను ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపను, నేను సర్వ నాశనమైనా సరే.


Was this post not nasty? But he never cares about niceties in life. (He wrote a 70 page abusive letter to the father of his own daughter in law, accusing him of trapping his son for Rs.35 lakh bank balance, as he married an Odisha Brahmin girl. He threw his son out of house for 3 to 4 years. This was his personsl matter. But, it is an example of his attitude). No one refunded the money I spent on my mother and sisters. I performed it as a duty, a sacred duty. That was an example of my attitude, my behavior, my self-respect. Even now, my determination is intact. In future, it will only help me to occupy a high position of respect in society. I never stop in the middle whatever I start, even if it leads to my decimation.

భీమా సంస్థలో మా విన్యాసాలు అలానే సాగుతూ ఉండేవి. పని చేస్తూ ఉండేవాళ్ళం. తగాదాలు పెట్టుకునే వాళ్ళం. కొంతకాలానికి "అగ్రహారం బ్యాచ్" కి మిత్ర బృందం పెద్దదయ్యింది. అప్పుల వలయం తప్పితే నా జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా గడిపాను, ఆఫీసులో. ఇంట్లో ఎప్పుడూ ఏవో సమస్యలు తప్పవు కదా? అవి పెద్దగా పట్టించుకుండేంతవి కాదు. మా స్నేహితుడు, వెంకటేశ్వర రావు సీ ఏ ఇంటరు పూర్తి చేశాడు మొదటి ప్రయత్నంలోనే. ఎంతో ఆనందం కదండీ. ఎక్కువగా గుంటూరు వెళ్తుండే వాణ్ణీ, వాడిని చూడడానికి. మా ఇంట్లో ప్రతి సమస్యా వాళ్ళింట్లో తెలిసేది. వాళ్ళింట్లో ప్రతి సమస్యా నాకు తెలిసేది. నేను మాత్రం వారానికి గతి తప్పకుండా రెండు ఉత్తరాలు వ్రాసేవాడిని. వాడికి  బధ్హకం పాలు చాలా ఎక్కువ. మూడు, నాలుగు నెలలకి సమాధానం వ్రాసే వాడు. ప్రతి ఉత్తరమూ నాది కనీసం 10 పేజీ లుండేది. తరువాత చదువుదాం అని ఫైలు చేసే వాడు. ఒక సారి చూపించాడు. ఇవన్నీ ఇంకా చదవాల్సినవి., ఇవి చదివినవి అని. "ఎందుకయ్యా! వాడికి రాసి టైం వేస్టు చేసుకుంటావు?" అని వాళ్ళమ్మ ఎగతాళిగానేది. ఎంత ప్రేమండీ ఆమెకి వాడంటే. నిజంగా అలాంటి తల్లిని నేనెక్కడా చూడలేదు. నేనూ ఆమెకి చెప్పే వాడిని మీరే చెడగొడుతున్నారు, అని. వాళ్ళ నాన్న నన్ను వెనకేసుకొచ్చేవాడు. "వాడి కేమైనా చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలెనయ్య" అని కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. నిజానికి వాడు చాలా, చాలా, చాలా మంచి వాడు. నేనూ ఏమనగలిగే వాడిని కాదు, సలహా చెప్పడం తప్ప. ఇదొక అవ్యక్తమైన ఆనందం. వాళ్ళింట్లో ఎప్పుడూ ఒకే మంచం  మీద పడుకునే వాళ్ళం. ఇంకో మంచమేస్తె ఊరుకునే వాడు కాదు. ఆశ్చర్యంగా  ఉంది కదూ!

In the LIC office our tantrums continued. We used to work hard but fight on issues.Soon, our Agraharam Batch got new friends. Except the vicious circle of debts, I used to spend life happily
in the office. Family life had its own pit falls, as always. There used to be one or the other problem or issue. In the meantime, my friend completed his CA Inter in first attempt. (rare those days). It was the happiest moment in life. I used to visit Guntur very frequently. They used to discuss every problem in their family with me and me with them.There were no secrets. I used to write at least two letters every week. He used to reply briefly once in a quarter. My each letter used to be at least ten pages. He used to file them neatly. Once, he showed me two files. In one he filed letters already read and in the other for future reading. His mother used to mockingly say, "Why do you waste time on that fellow?" She used to love him so much. I never saw a mother pampering a son throughout her life. I used to tell her she was only making him lazier. She used to get tears saying she cannot think of a small scratch on his body. He was such a gentle, nice boy that I was also not able to tell him anything. That was an inexplicable pleasure to be with him. When I went to Guntur,we used to sleep on the ssme cot, talking till 2 AM. He never allowed me to sleep separately.

(నా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల్లో తెనాల్లో వాళ్ళ మేడ మీద చదువుకునే వాడిని. వాడు గుంటూరు మారాడు అప్పటికే. నేను తెల్లవారు జాము దాకా చదువుకుని కిందకొచ్చేసరికి ప్రతి రోజూ ఉతికిన దుప్పటి వేసి పక్క తయారుగా ఉండేది ముందు రూములో. వాళ్ళమ్మ నాకు ఇంకో అమ్మే)  .

(In my final year degree examinations' time I used to study on their terrace. He went to Guntur for degree studies. I used to read till early morning and by the time I got down, a bed with clean sheets used to be ready. She was my second mother)


1975 జూన్ లో ఎమర్జన్సీ రావడం ఆఫీసులో 10 గంటల నుంచీ ఐదు గంటల వరకూ పని చెయ్యడం, యూనియన్ల జులుం తగ్గడం, మేము కూడా అందులో భాగం కావడం. 10 గంటలకి ఆఫీసు కళ, కళ లాడుతూ ఉండేది. బయటికి వెళ్ళాలంటే భయం ,అందరికీ. ఒక ఆరు నెలల తరువాత మళ్ళీ మా బ్యాచ్ కలుస్తుండేవాళ్ళం, కిటికీల దగ్గర నిలబడి దమ్ము పీల్చడానికి. ఆఫీసర్లు పట్టించుకుండే వాళ్ళు కాదు. మేమంటే  అంత అభిమానముండేది.

During 1975 emergency was declared and a sense of duty mindedness percolated offices. All used to attend offices by 10 AM and leave at 5 PM. No one was moving out. After six months our batch used to meet at the windows outside for smoking. Officers never objected, as they used to love our batch.

ఆ సంవత్సరంలోనే  మొదటి భీమా అంతర్గత పరీక్షలో ఉత్తెర్ణుడయ్యి ఒక ఇంక్రిమెంట్ తెచ్చుకున్నాను. జీతం బాగానే పెరిగేది. మా తమ్ముడి జీతంకూడా  పూర్తిగా రావడంతో పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. ఆ సమయంలోనే మా మూడో అన్నయ్య "నా గురించి పూర్తిగా మర్చిపొయ్యారు. నాకు పెళ్ళి చేసే ఆలోచన లేదా? ఇక్కడ బతకలేక పొస్తున్నాను" అని ఉత్తరాల మీద ఉత్తరాలు అమ్మకి. ఇదొక పెద్ద జోకుగా మారింది. చివరికి విశఖపట్నం నుంచి ఒక సంబంధం రావడం, ఇంటికి పెద్ద మొగ దిక్కు నేనే అవ్వడం, ఆయన వచ్చి నన్ను ఆఫీసులో కలవడం ( మా అన్నను చుశాకే అనుకుంటా) , పెళ్ళి గుడివాడలో జరిగింది. మామూలే.గొడవలూ, ఏడ్పులూ, మా ఇంటికొచ్చిన ఇంకో  కొత్త కోడలుకి మా అమ్మ మీద జుగుప్స, అది నెమ్మదిగా మొగుడి కెక్కించడం, తగాదాలూ, కొడుకులు కోడళ్ళ వెనక, నేను మా అమ్మ వెనుక, ఇదండీ భారతం, " శరిత్ర సింపెస్త్తే సిరిగి పోదు, సెరిపేత్తే  సిరిగిపోదు. అన్నిటికీ, మరి, అదే, సాక్షికాలుంటారు  కదా! "

The same year, I passed out the Licentiate examination of the
department. I got an increment. Even, DA used to increase regularly. Salary reachd a comfortable level.My brother too completed training and was getting good pay. Financially, we were settling. During this period my third brother was pestering my mother to get him married, as he was living alone in a village. It was really difficult, as a matter of fact. Finally one good match came and after his father-in-law saw him, he met me in my office, as I was the chief negotiator then. Marriage was held at Gudivada and as usual there were heart burns, some crying, some shouting etc., So another daughter-in-law entered the house with full of anger on my mother. Brothers behind their wives and me behind my mother. It used to be hell on earth. History can not be erased from minds, After they left, I used to fight with my mother for being orthodox and harsh with daghters-in-law. I lost symathy of both. I was not caring. I always thought  I was performing my duty.

ఇక్కడ ఒక విషయం  అర్ధంచేసుకుండే మనసుంటే వాళ్ళకి అర్ధమయేదేమో?  మరి పెళ్ళంటే  మాటలా? చిన్న ఇల్లు. అన్నదమ్ములూ, వాళ్ళ సంసారాలూ,  చుట్టాలూ, వీళ్ళందరూ కనీసం  వారం రోజులుంటారు కదా. ఇది కాక  పది సార్లు వాళ్ళ మామగారూ, అత్తగారు, బామ్మరిదీ  ఇంటికి వచ్చి పోవడాలూ, వాళ్ళకి కాఫీలూ, టిఫిన్లూ వగైరాలూ  ఈ కర్చులన్నీ వాళ్ళివ్వరు  కదండీ? నాదీ,మా తమ్ముడిదే కదా? నువ్వు తిన్నావు (అదీ కష్ట కాలంలో) అని అడిగే వాడికి తిన్నదంతా  అరిగుంటుంటుందంటారా? ఏమో? వాళ్ళ ఒడిషా వియ్యంకుడిని సాక్సీక మడగాలి.

ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. మా అమ్మని ఒక్క మాటంటే మా అన్నలనీ, వదినలనీ నోటికొచ్చేటట్లు  తిట్టే వాడిని. వాళ్ళు గడప దటాక మా అమ్మతో లడాయి వేసుకుండేవాడిని. నాకు మిగిలింది చిప్పే, ఇద్దరికీ కాకుండా పోయే రోజు వచ్చింది. అయితే నా స్వభావం మారేది కాదు. అలాగే గడిపాను. ఇప్పటికీ నా పిల్లలకి అలాగే చెప్తాను. మా అమ్మాయి నిన్ననే చెప్పి పోయింది. నాన్న దగ్గర పెరిగితే ప్రపంచంలో ఎక్కడైనా గెలవచ్చని. కానీ ఇంతవరకూ ఆయన్ని గెలవడం చేతకాలేదని. కానీ ముగ్గురూ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అన్నిటితో  పాటు ఆ సంస్కారం నేర్పింది నేనే కదా. దానికి కారణం, నేను నా తల్లిని, చెల్లెళ్ళనీ చూసుకో బట్టి కదా? మరి ఈ అభాండాలేమిటండీ?

I am leaving the above two paragraphss they were passing remarks only.


"ధర్మో రక్షతి రక్షితః"  ఈ రోజుకీ, రోజూ పన్నెండు గంటలు పని చెయ్యగలుగుతున్నానంటే, ఇన్ని బ్లాగులూ, ఇన్ని పద్యాలూ, ఇన్ని కధలూ వ్రాయగలుగుతున్నానంటే నా మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ఇంకొకళ్ళని ద్వేషించను. అరుస్తాను. అంతటితో సరి. పది మందికి పెట్టి నేను తింటాను. అందుకే నా దరికి ఏ రోగమూ రాదు. గత దశాబ్దంలో జబ్బుతో డాక్టరు దగ్గరికి వెళ్ళింది పది వేళ్ళలో లెక్క పెట్ట వచ్చు.

"Dharmoa Rakshati Rakshitaha". Even today, I am able to work twelve hours a day, I am able to write stories, number of blogs on all issues, I read a lot, I write stories, poems interact at least with 200 people daily at least a thousand times on Twitter. This is because my mind remains pure. I never hated anyone. I only say the truth about them on face and forget. They never forget as the truth would be sour. I shout and forget. There is no scope for forgiving anyone as I never thought that the other man harmed me. I take it that there are enough faults in me too. That is the reason no decease touches me. I went to Doctor less than ten times, during past decade. Out of these three times as I harmed myself unable to push the cart of life and got frustrated. Shocked? Later in life. Do not sympathize, educate and get educated.


Now, I realized how I troubled my kith and kin. God gave me longer life.So, I wrote a poem on this as an advice to those who want to end lives prematurely. If I earn enough money, I will start an counselling Center on this subject.

63.


కాల మచ్చి రాదొ కాలుండు బలుకడు

సమవర్తి వచ్చు సమయమునకు

యత్న మేల నయ్య యాత్మ హత్య కొరకు

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):  

మన కాలం కలిసి రాక పోతే మనకు సహాయ పడడానికి యముడు కూడా రాడు. నిర్ణీత సయానికి ముందు, యముడు మనలను తీసుకు పోడు. అలాంటప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించి మరో పాపం, మరో నేరం ఎందుకు నెత్తిన వేసుకుంటావు? బ్రతికి, శోధించి, సాధించు.

English:

If our time is not good, why our friends and relations, not even Yama, the Lord of Death will not help. He comes at the destined hour only. Why do you attempt suicide and and commit another sin and crime?

                                 ####################

English translation tomorrow evening.