Thursday, July 16, 2015

సాగర మధనమనే నా స్వీయ చరిత్రలో ఎనిమిదో భాగం నా దేవత ప్రవేశం In Telugu.ఈ భాగాన్ని మా అమ్మ ఆశీస్సులతో ప్రారంభిస్తాను. ఆమె మా అన్నదమ్ములూ, అక్క చెల్లెళ్ళ ఇళ్ళలో కొన్ని సంవత్సరాలు గడిపి తిరిగి 2009 లో మా ఇంటికి చేరింది. మా చిన్న చెల్లెలు కూతురు వివాహం సందర్భంగా. తిరిగి చెన్నై వెళ్ళాలని తిరుగు ప్రయాణం టికెట్టు ముందుగానే తీసుకున్నాగానీ, ఆమె వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. మేమూ అభ్యంతరం చెప్పలేదు. (అలా నిర్ణయం అయ్యాక మర్నాడు నిద్ర లేస్తునే నా భార్య కాళ్ళ మీద పడింది. ఒక్క సారి ఖంగు తిన్న నా భార్య ఆమెను లేపి గట్టిగా కావలించుకుని ఏడవడం మొదలు పెట్టింది. "ఇంక  నేనిక్కడనుంచి వెళ్ళను, నన్ను ఉండనివ్వండి, తిండికి కూడా కరువై  పోయింది. మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను. వస్తానని రాస్తే మీరేమంటారోనని వ్రాయలేదు" అని వల, వలా ఏడ్చింది. నేను కూడా ఓదార్చాను. "ఎక్కడికి వెళ్ళక్కర లేదు. మా దగ్గర డబ్బు లేదు కాని ముగ్గురు పిల్లలున్నారు. మాకు పెట్టేదే నీకు పెడతారు".అని. అలా చివరి రోజుల్లో నా దగ్గరే స్థిర  పడింది.)
అదే సంవత్సరం అక్టోబరు,20వ తారీకున ఆమె నన్ను నా పుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వదిస్తూ తను రోజూ రాసుకునే డైరీలో రాసుకుంది. ఈ రోజు ఆమె పాత డైరీలు తిరగేస్తుంటే ఇది కనబడింది. ఇది తెలుగులోలొనే ఉంది కాబట్టి మళ్ళీ వ్రాయడం  లేదు.  ఆమె అశీసులతో డబ్బు వస్తే అది పది మందికీ ఉపయోగ పడుతుంది. రాకపోయినా  పర్వా లేదు. నాకు డబ్బు అవసరం తీరిపోయింది, ఎప్పుడో. ఈ అశీస్సులు ఆమె చివరి ఆశీస్సులు. తరువాత నాలుగు నెలలకి ఆమె కోమా లోకి వెళ్ళి పోయింది. తరువాత ఆరు నెలల్లో చని పోయింది. కానీ ఆమె ఎక్కడున్న నన్ను ఇంకా ఆశీర్వదిస్తుందనడానికి ఇదో నిదర్శనం. అందుకోనేమో మూడు సార్లు నరకం తలుపులు తట్టినా మళ్ళీ వెనక్కి పంపాడు దేవుడు.  బ్రతికి పది మందికీ సాయం  చెయ్యమని.

అమ్మ మీద కొన్ని పద్యాలు వ్రాశాను, నా ద్విశతిలో. మననం చేసుకుంటాను. అమ్మ అశీస్సులతో ఎనిమిదవ భాగము.

తల్లి ముద్దు బెట్టగ బ్రేమె తిట్ట బ్రేమె
రెంటి యందును భేదము రాదు కాన
తిట్టు యమ్మయె యొకనాడు తట్టు భుజము
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తల్లి ముద్దు పెట్టినా ప్రేమతోనే పెడుతుందితిట్టినా ప్రేమ తోనేరెంటి మధ్యా భేదం కానరాదు రోజు తిట్టిన అమ్మే  రోజు నిన్ను భుజం తట్టి అశీర్వదిస్తుంది.

English:

If the mother kisses you it is out of love. If the mother curses you, it too is out of love. The mother who castigates you today, will, one day pats your shoulder and blesses you.

తల్లి వొడివేడి  రోజు తలపు కొచ్చె
కంది పచ్చడి రుచికి కలలు కందు,
అమ్మ కలువ నాకు మనసు అయ్యె నేడు
తేట బలికెను ఈబాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తల్లి వొళ్ళో ఉండే వెచ్చదనం  రోజు మళ్ళీ గుర్తుకొచ్చిందిఆమె చేసిన రోటి పచ్చడికంది పచ్చడి రుచి కలలో కొస్తున్నదిస్వర్గంలో ఉన తల్లిని వెళ్ళి త్వరగా కలుసుకోవాలని ఆశ కలుగుతోంది. (నాకూ వయసు మీరింది కదాకాలు డొచ్చే కాలం దగ్గర కొచ్చింది కదా

English:

Today, again I recollect the warmth of the bosom of my mother. I dream the taste of the Chutney (made with Taur Dal) in a grinding stone she used to make. (This is Andhra special. Eat with ghee. You can see Heaven on earth). How I wish I meet her in Heaven soon. (even I am of the age when the Lord of Death is awaiting my arrival there). This was written on International Mothers’ Day.

ఎప్పుడొదలదు బిడ్డను ఒంటి గాను

వీట వదిలిన నీవామె వెంటె యొందు

మనసు లుండును యమ్మకు ముందు వెనుక

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

అమ్మ నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలి పెట్టదుఅత్యవసరంగా వదల వలసి వచ్చినా నువ్వు ఆమె వెంటే ఉంటావుఎందుకంటే ఆమె మనసు నీ దగ్గరే వదిలి వెళుతుంది కదాఅమ్మకు ముందూవెనుకా రెండు హృదయాలుంటాయేమో!


English:


Mother never leaves you alone. Even if she leaves you at home in emergency, you are still with her as her heart revolves around you. Who knows, mother has two hearts one on duty, the other on child?                                         ############################### మళ్ళీ 1975-76 ల లోకి వెళదాము. పింఛను విషయం ఒక వెయ్యి రుపాయలు వదిలించుకుని పరిష్కరించాక, జీవితం పెద్దగా ఒడిదుడుకులు లేకుండా సాగింది. సరే ఆడపిల్లలతో ముచ్చట్లు (చేతన్ భగత్ చూస్తే బాధ పడతాడేమో, భక్తులకి ముచ్చట్లు లావు అని, గుంటూరు మిర్చి తిని పెరిగిన వ్యవహారం కదా). 1974 లోనే నేను హెచ్ పి గ్యాస్ కొత్తది తీసుకో గలిగాను. ఆ రోజుల్లో కొత్త కనెక్షన్ రావాలంటే సంవత్సరాలు ఎదురు చూడాల్సొచ్చేది మరి. మరి నేను ఎలా తీసుకున్నానో ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బ్లాకులో కాదు. ఆ రోజుల్లో గ్యాస్ రావడం కంటే తిరుపతి వెంకటెశ్వర స్వామిని వెంటనే దర్శించుకున్నట్లే. మనం వీ ఐ పీ ఐనా అయ్యుండాలి లేదా వాళ్ళ దగ్గర కాగితం ముక్కైనా ఉండాలి. మా ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగి ఒకతను ఈ పధకం చెప్పాడు. మేము చిక్కడపల్లి దగ్గరలో అశోక్ నగర్ ప్రాంతంలో ఉండేవాళ్ళం. ఆ సమయంలో  మలక్ పెట సూపర్ బజారు దగ్గర్లో ఒక కొత్త అవుట్ లెట్ తెరిచారు. మేము ఆ ఏరెయాలో తిరిగి ఒక మంచి ఇల్లు నంబరు తీసుకొని ఆ ఇంటి వోనరు పేరు ఏదో రాసి, అప్లికేషను ఇచ్చాము. అతను ఒక వారం తరువాత రండి అని చెప్పే లోపే నేను మాట కలిపెశాను. అతను చూడ ముచ్చటగా ఉన్న, అప్పుడే కాలెజీ నుంచి వచ్చిన కొత్త డిగ్రీ హోల్డరు. మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. (నిజానికి నేను ఉద్యోగంలో ఉన్నానంటే  అద్రుష్టమే. అలా ఎంతమంది తెలివి కల వాళ్ళు అవకాశాలు లేక కొట్టుకుంటున్నారో?)అతను నోరు తెరిచే లోపలే "మీరేం చదువుకున్నారు?" అని అడిగేశాను. అతను కొంచెం ఆనంద పడ్డాడు. (ఇది దేల్ కార్నెగీ పుస్తకంలో సూత్రం, అవతల వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడమనేది). అలా చాలా విషయాల మీద ఒక అరగంట సంభాషణ సాగాక,  మాకు ఆరోజే క్నెక్షన్ ఇచ్చేశాడు, ఏమీ చూడకుండానే. నిజానికి మాతో మాట్లాడినందుకు అతను ఎంతో ఆనంద పడ్డాడు. అంతే కదండీ, ఎవరు మాట్లాడతారు?  ఎవరి పని వాళ్ళు చూసుకుని వెళ్ళి పోతారు కదా. నేను స్టౌ, మిగతా దానికి సంబధించిన అవసరమైనవీ, అనవసరమైనవీ అన్నీ కొన్నాను, అక్కడే. అక్కడ నుంచి మా ఏరియాకి ట్రాన్స్ఫరుకి ఆరు నెలల గడువు ఉంటుంది. నాకు నిజం దాచడం అప్పటికీ, ఇప్పటికీ తెలియదు. (తెలిస్తే బ్యాంకు చైర్మన్ల ఇంటర్వ్యూలలో నా పేరు కూడా ఉండేది). మాటల మధ్యలో నిజం చెప్పేశాను. (మీకేమైనా ఇబ్బంది అయితే వద్దు అనీ కూడా చెప్పాను) మా స్స్నేహితుడికి కోపం కూదా వచ్చింది. తరువాత క్లాసు పీకాడు, ఇందాకా వచ్చాక ఇప్పుడు అతనేమన్నా  పైకి రాస్తే ఏమయీఅది? అని. ఏమైనా నా నైజమంతేనని చెప్పాను. ఆ కుర్రాడు, నవ్వి అందరూ అలాగే చేస్తారండీ, మాకు కొత్తైతే కదా అన్నాడు. అప్పట్లో కొత్త ప్రదేశాల్లో  కనెక్షన్లు ఇవ్వడం ప్రాధాన్యంగా ఉండేది. ఇంటికొచ్చాక మా అమ్మ ఇది నా మడికి పనికి రాదు అని గోల పెట్టుకుంది. నీ కోసమే తెచ్చనమ్మ అంటే వినదే. మా ఇంటి యజమాని గారి తల్లి 80 ఏళ్ళు ఉండేవేమో, అస్సలు పనికి రాదు అని ఈమెకు చెప్పిందిట. బర్నర్లెలా కడుగుతామూ, సిలిండరు ఎలా కడుగుతామూ అని పేచీ పెట్టింది. ఆశగా వచ్చిన నేను    హతశుడనయ్యాను. వారం రోజులు మా అమ్మ భీష్మించుకు కూర్చుంది. అప్పుడు మా బ్రాహ్మణ స్నేహియులను పిలిచి, వాళ్ళ అమ్మలు ఎంతటి ఆచార సంపన్నులో వ్వరించి వాళ్ళు స్టౌ ఎలా కడుగుతారో వివరింప చేసి, దాని వల్ల కలిగె బహుళ ప్రయొజనాలనూ ఆమెకు అర్ధమయ్యే రీతిలో చెప్పి మొత్తానికి "మమా అనిపించాము. అప్పటినుంచి ఆమె మళ్ళీ కిరొసిన్ స్టౌ వాడితే ఒట్టు.

నెమ్మదిగా ఉన్న డబ్బుల్లోనే ఒక సుమీత్ మిక్సరూ, కుక్కర్లూ, ఇంకా మా అమ్మకు కష్టం లేకుండా ఉండడానికి మార్కెట్లో ఏది కొత్తగా వస్తే అది కొని తెచ్చే వాడిని. ఆమె, చెల్లెళ్ళూ సుఖంగా ఉండడం మీదే నా ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఇది మా అన్న దమ్ములకి నచ్చ లేదు. నా ఆదాయానికి మించి ఖర్చు చేసి బదాయికి పోతున్నానని. మొదటిది నిజమే, రెండోది కాదు. ఈ రోజు నాకు దమ్మిడీ ఆదాయం లేదు. ఆస్తులు లేవు, నాది అని చెప్పుకొడానికి ఒంటి మీద బట్ట కూడా నాది కాదు.మేము (భార్యా, భర్తా పీల్చే గాలి మాత్రమే మాది). కానీ మా దగ్గర లేనిది లేదు ఏడు దేశాలు తిరిగాము. ఎనిమిదోది సిద్ధం. ఈ రోజు నేను ఒక i-pad, i-phone, two lap tops, one samsung smart phone, one small Samsung phone ఇంకా చాలా వాడతాను. ఖరీదైన బట్టలేసుకుంటాను. ఖరీదైన బట్టలు దానం చేస్తాను. నా దగ్గర అడిగి లేదనిపించుకున్న వాడు లేడు నన్ను మోసం చెయ్యాలనుకునే వారు తప్పితే. ఇదంతా మా పిల్లలు మమ్మల్ని చూసి నేర్చుకున్న సంస్కారం. సంవత్సరానికి అరవై వేలు మా ఆరొగ్య భీమా కూడా పిల్లలే కడతారు. మనం ఏ విత్తు నాటితే అదే మొక్క మొలుస్తుంది. తులసి వనంలో గంజాయి మొక్కలు పుట్టవు కదా? మా అళ్ళుళ్ళు, కోడలు తమ తల్లి, దండ్రుల లాగానే మమ్మల్నీ చూసుకుంటారు. "yatodharmastatoa jayaha!"
1975 లోనే మా రెండో అన్నయ్య మద్రాసు నుంచి ఒక్కడే వచ్చాడు. అప్పతికే ఆర్ధికంగా ఎంతో చితికి పోయి ఉన్నాడు. (ఎందుకో నాకు తెలియదు) కానీ పెళ్ళి అయిన తరువాత మద్రాసు వెళ్తుందగా రైల్లో పెట్టె దొంగతనం జరిగింది. డబ్బూ, నగలూ అన్నె పోయినాయట. అప్పతికే నేను హైదరబాదులో ఉద్యోగంలో చేరాను. నాకు వివరాలు పెద్దగా చెప్పలేదు, చిన్న వాడిని కాబట్టి. ఆయన వేసుకున్న చిరిగిన బట్టాలు, ఆయన మాసిన గడ్డమూ, ముఖంలో నిరాశా  చూసి మా అమ్మ ఏడ్చింది. మా అమ్మ నాకు చెప్పింది, చేతనైనంతా సహాయం చెయ్యమని. అది ఆదేశమే, ప్రార్ధనగా తీసుకోలేదు. (ఆంగ్లంలో తప్పు మాట వాడాను). అప్పటికప్పుడు మా దేవుడు సోలంకి (వాయిదాల గురువు) దగ్గర ఆరు జతాలు బనియన్లూ వగైరా, ప్యాంటు, షర్తు ముక్కలూ తీసుకు వచ్చి, కొంత డబ్బు అప్పు తీసుకు వచ్చి ఇచ్చాను. నిజానికి ఇది వ్రాయ వలసిన అవసరం లేదు. ఆయనతో మాకు చాలా తక్కువ అనుబంధం ఉండేది. కాని ద్దెనికి సంబంధించి భవిష్యత్తులో రెండు, మూడు సంఘటనలు  జరిగాయి కబట్టి, మనిషి స్వార్ధ చింతన ఎలా ఉంటుందో అప్పుడు చెప్పడానికి ఇప్పుడు వ్రాయ వలసి వచ్చింది.

1975 సంవత్సరం ప్రశాంతంగానే గడిచిందనే చెప్పుకోవాలి. మా చిన్న చెల్ల్లెలు చదువులో సరస్వతే అని చెప్పుకోవాలి. చాలా కష్ట పడేది. మా పెద్ద చెల్లెలుకి చదువు మీద శ్రద్ధ బాగా తక్కువ. కుట్లూ, అల్లికలూ, బొమ్మలు వేయడం, స్నేహితులతో వాగడం, అరవడం, అందరితో గిల్లి కజ్జలు పెట్టుకోవడం ఎక్కువ. దాని నేనే అతి గారాబం చేసి చెడగొట్టానని ఇప్పటికీ అపవాదు మోస్తునే ఉన్నాను. నిజానికి చాలా గారాబం చేసే వాడిని. ఇప్పుడు ఏడవదానికి కళ్ళల్లో నీళ్ళు కూడా ఇంకి పోయాయి. పడరాని మాటలు పడ్డాము నేనూ, నా భార్యా. అయినా దాని చెయ్యి నేను వదలలేదు. అదే నా చెయ్యి వదిలేసి గుప్పిట్లల్లో డబ్బులు పెట్టుకుని మురిసి పోతూ ఉంది.  చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహా దేవా అని. నా పుణ్యం నాకు శాపంగా మారినిది.

మా చిన్న చెల్లెలంటే మా తమ్ముడికి ప్రాణం. ఎప్పుడూ వదిలే వాడు కాదు. దాని అవసరాలన్నీ వాడే చూసుకునే వాడు. దాని అవసరాలన్నీ వాడే చూసుకుండే వాడు. ఆ విధంగా నా అర్ధిక భారం కొంచెం తగ్గింది. మా పెద్ద చెల్లెలు డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టెదై. (ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద పిసినారి). అందువల్ల నా మీద ఎక్కువ భారం ఉండేది సహజంగా. మా చిన్న చెల్లెలు ఖర్చులో చాలా జాగ్రత్తగా ఉండేది. చాలా సౌమ్యంగా మాట్లాడేది. చాలా తక్కువ మంది స్నేహితులుందేవాళ్ళు. నేనన్న, మా తమ్ముడన్నా ప్రాణంగా చూసుకునేది. ఇప్పటికీ అంతే. నేను ఎప్పుడన్నా ఏడవాలనుకుంటే దాని దగ్గరే చెప్పుకుని ఏడిచే వాడ్ని, బాధలు చెప్పుకుని. ఒక విధంగా మా ఇంట్లో అతి మంచి పిల్ల అది. నా కష్ట కాలంలో ఎంతో ఆదుకుంది. కానీ కొన్ని మాతలు నన్ను బాగా బాధించాయి. అవి మర్చి పోవచ్చు. కానీ మర్చిపోలేక పోతున్నాను. అదీ నా దురదృష్టమె అయి ఉండొచ్చు.

1976 లోనే నేను మా భీమా సంస్థలో అస్సొసియేట్  పరీక్ష ఉత్తీర్ణుడయ్యాను. ఆ సంవత్సరమే పరీక్షల పద్ధతి మార్చారు. ఆరు కొత్త పాఠ్యాంశాలకి ఆరు కొత్త పుస్తకాలు ఇచ్చారు. ఒక్కోటి 150 పేజీలుండొచ్చు. అంద్లో accountancy ఒకటి. నాకు పూర్తిగా కొత్త. భీమా సంస్థలో కోచింగ్ ఇచ్చే వాళ్ళే కానీ నేను వెళ్ళే వాదిని  కాదు. ఇంటికి రావడం పుస్తకాలు బట్టీ కొట్టడం. స్నేహితులతో పిచ్చా పాటి, తిరగడం, పేకాటలాడదం  అన్నీ ఆగి పొయ్యాయి.

ఆఫీసు నుంచి ఇంటికే. సాయంత్రం ఆరు గంటలనుంచి పదకొండు వరకూ పుస్తకాలు బట్టీయం వెయ్యడం.చివరి పదిహేను రోజులూ సెలవు పెట్టి పుస్తకాలన్నీ ఎంతగా బట్టీ కొట్టానంటే, ఏ చాప్టరు ఏ పేజీలో మొదలవుతుందో చెప్పే వాడిని. పట్టుదల అంత అప్పటికీ, ఇప్పటికీ. నేర్చుకోవాలంటే నేర్చుకోవలసిందే. ఫలితంగా మొత్తం హైదరాబాదు డివిజన్లో రెండు భాగాలూ నేనొక్కడినే పూర్తి చేశాను. నా కంటే ఘటికుడు నా స్నేహితుడు (అందరూ అతను ఒక్కడే తప్పక ఉత్తీర్ణుడవుతాడని) అంచనా వేశారు. ఒక్క పేపరు మిగిలి పోయింది. మిగిలిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. ఒక పేపర్లో నాకు డివిజన్లో  మొదటి మార్కు వచ్చింది.  రవీంద్ర భారతిలో క్యాషు  ప్రైజు  (50 రూపాయలు), ఒక సర్టిఫికటూ ఇచ్చారు. నాకు రెండు ఇంకెమెంట్లు వచ్చాయి. అది చిన్న విషయం కాదు. నాకు డబ్బు చాలా అవసరం, మా వాళ్ళని చూడడానికి. సమయానికి ఆదుకుంది. జీతం బాగా పెరిగింది ఒక్క నెల లోనే. ఆఫీసులో నా విలువ బాగా పెరిగింది. ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే మూడో పరీక్ష, ఫెలోషిప్  పూర్తి చేసే వాడిని. ఇంకో రెండు ఇంకెమెంట్లు, తరువాత ప్రమోషన్లలో అవకాశాలు. (అప్పట్లో భీమా సంస్థల్లో ప్రమోషన్ల మీద నిషేధముండేది. అందరూ బయట ఉద్యోగాలు వెతుక్కోండి అని సలహా చెప్పేవాళ్ళు). ఆ విధంగా జాతకం మళ్ళీ మలుపు తిరిగింది.

                                               #############################

ఆఫీసు నుంచి ఇంటికే. సాయంత్రం ఆరు గంటలనుంచి పదకొండు వరకూ పుస్తకాలు బట్టీయం వెయ్యడం.చివరి పదిహేను రోజులూ సెలవు పెట్టి పుస్తకాలన్నీ ఎంతగా బట్టీ కొట్టానంటే, ఏ చాప్టరు ఏ పేజీలో మొదలవుతుందో చెప్పే వాడిని. పట్టుదల అంత అప్పటికీ, ఇప్పటికీ. నేర్చుకోవాలంటే నేర్చుకోవలసిందే. ఫలితంగా మొత్తం హైదరాబాదు డివిజన్లో రెండు భాగాలూ నేనొక్కడినే పూర్తి చేశాను. నా కంటే ఘటికుడు నా స్నేహితుడు (అందరూ అతను ఒక్కడే తప్పక ఉత్తీర్ణుడవుతాడని) అంచనా వేశారు. ఒక్క పేపరు మిగిలి పోయింది. మిగిలిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. ఒక పేపర్లో నాకు డివిజన్లో  మొదటి మార్కు వచ్చింది.  రవీంద్ర భారతిలో క్యాషు  ప్రైజు  (50 రూపాయలు), ఒక సర్టిఫికటూ ఇచ్చారు. నాకు రెండు ఇంకెమెంట్లు వచ్చాయి. అది చిన్న విషయం కాదు. నాకు డబ్బు చాలా అవసరం, మా వాళ్ళని చూడడానికి. సమయానికి ఆదుకుంది. జీతం బాగా పెరిగింది ఒక్క నెల లోనే. ఆఫీసులో నా విలువ బాగా పెరిగింది. ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే మూడో పరీక్ష, ఫెలోషిప్  పూర్తి చేసే వాడిని. ఇంకో రెండు ఇంకెమెంట్లు, తరువాత ప్రమోషన్లలో అవకాశాలు. (అప్పట్లో భీమా సంస్థల్లో ప్రమోషన్ల మీద నిషేధముండేది. అందరూ బయట ఉద్యోగాలు వెతుక్కోండి అని సలహా చెప్పేవాళ్ళు). ఆ విధంగా జాతకం మళ్ళీ మలుపు తిరిగింది.

ఆఫీసు నుంచి ఇంటికే. సాయంత్రం ఆరు గంటలనుంచి పదకొండు వరకూ పుస్తకాలు బట్టీయం వెయ్యడం.చివరి పదిహేను రోజులూ సెలవు పెట్టి పుస్తకాలన్నీ ఎంతగా బట్టీ కొట్టానంటే, ఏ చాప్టరు ఏ పేజీలో మొదలవుతుందో చెప్పే వాడిని. పట్టుదల అంత అప్పటికీ, ఇప్పటికీ. నేర్చుకోవాలంటే నేర్చుకోవలసిందే. ఫలితంగా మొత్తం హైదరాబాదు డివిజన్లో రెండు భాగాలూ నేనొక్కడినే పూర్తి చేశాను. నా కంటే ఘటికుడు నా స్నేహితుడు (అందరూ అతను ఒక్కడే తప్పక ఉత్తీర్ణుడవుతాడని) అంచనా వేశారు. ఒక్క పేపరు మిగిలి పోయింది. మిగిలిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. ఒక పేపర్లో నాకు డివిజన్లో  మొదటి మార్కు వచ్చింది.  రవీంద్ర భారతిలో క్యాషు  ప్రైజు  (50 రూపాయలు), ఒక సర్టిఫికటూ ఇచ్చారు. నాకు రెండు ఇంకెమెంట్లు వచ్చాయి. అది చిన్న విషయం కాదు. నాకు డబ్బు చాలా అవసరం, మా వాళ్ళని చూడడానికి. సమయానికి ఆదుకుంది. జీతం బాగా పెరిగింది ఒక్క నెల లోనే. ఆఫీసులో నా విలువ బాగా పెరిగింది. ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే మూడో పరీక్ష, ఫెలోషిప్  పూర్తి చేసే వాడిని. ఇంకో రెండు ఇంకెమెంట్లు, తరువాత ప్రమోషన్లలో అవకాశాలు. (అప్పట్లో భీమా సంస్థల్లో ప్రమోషన్ల మీద నిషేధముండేది. అందరూ బయట ఉద్యోగాలు వెతుక్కోండి అని సలహా చెప్పేవాళ్ళు). ఆ విధంగా జాతకం మళ్ళీ మలుపు తిరిగింది.
ఆఫీసు నుంచి ఇంటికే. సాయంత్రం ఆరు గంటలనుంచి పదకొండు వరకూ పుస్తకాలు బట్టీయం వెయ్యడం.చివరి పదిహేను రోజులూ సెలవు పెట్టి పుస్తకాలన్నీ ఎంతగా బట్టీ కొట్టానంటే, ఏ చాప్టరు ఏ పేజీలో మొదలవుతుందో చెప్పే వాడిని. పట్టుదల అంత అప్పటికీ, ఇప్పటికీ. నేర్చుకోవాలంటే నేర్చుకోవలసిందే. ఫలితంగా మొత్తం హైదరాబాదు డివిజన్లో రెండు భాగాలూ నేనొక్కడినే పూర్తి చేశాను. నా కంటే ఘటికుడు నా స్నేహితుడు (అందరూ అతను ఒక్కడే తప్పక ఉత్తీర్ణుడవుతాడని) అంచనా వేశారు. ఒక్క పేపరు మిగిలి పోయింది. మిగిలిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. ఒక పేపర్లో నాకు డివిజన్లో  మొదటి మార్కు వచ్చింది.  రవీంద్ర భారతిలో క్యాషు  ప్రైజు  (50 రూపాయలు), ఒక సర్టిఫికటూ ఇచ్చారు. నాకు రెండు ఇంకెమెంట్లు వచ్చాయి. అది చిన్న విషయం కాదు. నాకు డబ్బు చాలా అవసరం, మా వాళ్ళని చూడడానికి. సమయానికి ఆదుకుంది. జీతం బాగా పెరిగింది ఒక్క నెల లోనే. ఆఫీసులో నా విలువ బాగా పెరిగింది. ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే మూడో పరీక్ష, ఫెలోషిప్  పూర్తి చేసే వాడిని. ఇంకో రెండు ఇంకెమెంట్లు, తరువాత ప్రమోషన్లలో అవకాశాలు. (అప్పట్లో భీమా సంస్థల్లో ప్రమోషన్ల మీద నిషేధముండేది. అందరూ బయట ఉద్యోగాలు వెతుక్కోండి అని సలహా చెప్పేవాళ్ళు). ఆ విధంగా జాతకం మళ్ళీ మలుపు తిరిగింది.

అది నవంబరు 28, 1976. ఆ అమ్మాయిని మొదటి సారి కలుసుకున్న రోజు. నా ఇంకో ప్రాణ స్నేహితుడు అక్కపెద్ది వెకటప్పయ్య శర్మ. (వీడి గురించీ ఇంకో ఇద్దరు చిన్ననాటి ప్రాణ స్నేహితుల గురించీ తరువాత చెప్తాను). అ రోజు వాడి పుట్టిన రోజు. అందరం మా ఆఫీసు పక్కన సరోవర్ హొటలుకి వెళ్ళాము. అక్కడ గార్డెన్ రెస్టారెంట్ ఉండేది. అక్కడ మామూలుగా టిఫ్ఫిన్లు అయ్యాక స్వీట్ ఏం కావాలని కొత్త అమ్మాయిని  అడిగాను. అప్పట్లో నాకు కొత్త, పాత, ఆడ, మగా తేడా ఉండేది కాదు. ఎవరితోనైనా భాషలో పదనిసలు పలికే వాడిని. వాగుడు కాయే అనుకోవచ్చు. కల్మషం అంటే అప్పటికీ,ఇప్పటికీ తెలియదు. ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ వాగుడు కాయ అవడంతో జోడీ సరి పోయింది. తను బాసుంది కావాలని అడిగింది. "చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చినట్టున్నారే " అని ఒక విసురు వేశాను. కోపం నతించినా కోపం రాలేదని అర్ధం అయి పోయింది. బాసుందీ అంటే అప్పట్లో  చాలా ఖరీదైన స్వీటు. 5 రూపాయలు, ప్లేటు. తను కాఫీ, టీ తాగేది కాదు. అందరం స్వీటే తిన్నాము. జేబు ఖాళీ. ఆ అమ్మాయి ఫోను నంబరు తీసుకొని మర్నాడు ఫోను చేశాను, "కుదిరితే ఓ సారి కాఫీ" అని. రెండు గంటలకి వాళ్ళ ఆఫీసు అయిపొగానే రుస, రుస లాడుతూ వచ్చింది. "ఆఫీసులకి ఫోన్లు చేస్తే ఆఫీసర్లు ఏమనుకుంటారు?" అని. అయితె మీకు కోపం రాలేదుగా, ఏమీ అనుకోరులే అని మళ్ళీ అదే హొటల్లో కఫీ తాగి ఇంటికి పంపించాను. తరువాత తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ అక్కయ్యకి నాతో సంబంధం కలుపుకోవాలని వచ్చింది అని. చాలా సిగు పడ్దాను, తప్పుగా ఆలోచించినందుకు. సరే, పెద్ద వాళ్ళని మాట్ల్లాడమని చెప్పు అని ఇంక ఫోన్లు ఆపేశను. ఒక నెల గడిచింది. రోజూ అడిగేదట, నేనెందుకు మాటలాడడం లేదని. ఇది తెలిశాక ఫోను చేసి కాఫీకి పిలిచాను. వాళ్ళ అక్కయ్య విషయం ఆ అమ్మాయి చెప్పలేదు, నేనూ అడగ లేదు. అప్పుడు మొదటి సారి అడిగింది తన మీద నా అభిప్రాయమెమిటని. చాలా ఇష్టం ఏర్పడింది అని మొహమాటం లేకుండా చెప్పాను. తను కూడా నేనంటే, నా మాటలంటే, తెలివి తేటలంటే,  చతుర భాషణలంటే చాలా ఇష్ట పడ్డాను. అందుకే మర్చిపొలేక ఫోను చెయ్యమన్నాను అని చెప్పింది. అదే కకుందా నా నిష్కలషమైన మనసుతో మాట్ల్లడడం ఇంకా నచ్చింది. ఇంకో విష్యం నర్మ గర్భంగా చెప్పింది. మగ వాళ్ళంటేనే చాలా జుగుప్స అని, ఇప్పుడు మొదటి సారి ఆ అభిప్రాయం మార్చుకున్నానని. నాకు అర్ధం కాలేదు. తరువాత తెలిసింది. అప్పటి నుంచీ మేము కలుసుకోవడం నిత్య కార్యక్రమ మయ్యింది. ప్రేమ, పెళ్ళి మాటలు లేవు. నౌబత్ పహాడ్ (ఇప్పుడు బిర్లా మందిరం), పబ్లిక్ గార్డెన్స్, మ్యూజియం, జూ పార్కు  వగైరా మేము తిరిగే ప్రదెశాలు. ఇదంతా మూడు నెలల్లోనే. ఈ లోగా నాకు జ్వరం వచ్చి ఆఫీసుకి వెళ్ళలేదు. వాళ్ళ స్నేహితురాలిని కలుపుకుని మా ఇంటికే వచ్చేసింది. మొదటి సారి కన్నీళ్ళు పెట్టడం చూశాను. (మా ఆవిడ అంత తొందరగా అధిర్య పడదు, ఏడవదు, వాళ్ళమ్మ పోయినప్పుడే ఇవన్నీ సహజం అని మా పిల్లలకి ధైర్యం చెప్పింది).    

1977, మార్చ్ 4 న తనే చెప్పకుండా అఫీసుకి వచ్చింది. గేటు దగ్గర నిలబడి మా ఆఫీసులో ఉన్న పోస్టు మాన్ తో కబురు పెట్టింది. ఇద్దరం మళ్ళీ సరోవర్ హోటల్ కి వెళ్ళాము. ఒక నా జీవితంలో అత్యంత అదృష్టవంతమైన మలుపు అదేనేమో. తనే లంచ్ ఆర్దర్ చేసి మొహమోటం లేకుండా చెప్పింది. " నాకు మీరంటే ఇష్తం. మీ వాళ్ళందర్నీ ఎదిరించించైనా నన్ను పెళ్ళి చేసుకుంటారా? అయితే వాగ్దానం  చెయ్యండి." అని. చాలా ధైర్యం కావాలి కదా. నేను కూడా అదే చెబ్దామని చూస్తున్నాను, కాని సందేహిస్తున్నాను అని చెప్పాను. అప్పుడు తను మొదటి రోజు వచ్చింది వాళ్ళ అక్కయ్య కోసమని నాకు తెలుసు. అందుకే తటపటాయించాను అని. "నేను కూడా ఆ విషయంలో సిగ్గు పడుతున్నాను కాని, మీరు నాకే కావాలి. ఇంతకంటే ఏమీ చెప్పలేను" అని చెప్పి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఎవరేమన్నా చేసుకుంటాను అని చెప్పా. నిజానికి నన్ను ఆపగలిగిన  వాళ్ళు అప్పటికీ, ఇప్పటికీ లేరు. ఆ రోజు నన్ను ఆప గలిగిన దేవత నా జీవితంలో ప్రవేశించింది. ఆమె మాటే వేదం మా ఇంట్లో అందరికీ. మంచితనంతో గెలిచింది అందర్నీ. నిర్ణయమైపోయింది.  కష్టాలు ప్రారరంభం అయ్యాయి.

ఆ రోజు రాత్రే నా నిర్ణయం మా అమ్మకు చెప్పాను. గోల, గోల. అమ్మా, అన్న దమ్ములూ, చెల్లెళ్ళూ అందరూ ఎదురే. ఒకళ్ళైతే ఉద్యోగం చేసే అమ్మాయి ఈ నవ మన్మధుణ్ణి వరించిందంటే ఆ అమ్మాయికి ఇలా ఎంత మందితో సంబంధాలు ఉన్నాయో, అని నా ముఖం మీదే అనేశారు. మా పెద్ద చెల్లెలు పెళ్ళి అయిందాక ఆగుతానని కూడా వాగ్దానం చేశాను. అయినా లాభం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా మొదట్లో కొంత మొరాయించారు, పిల్ల వాడు బాగా లేడు, పెద్ద పిల్ల పెళ్ళి కాలేదు (అంటే పెద్ద పిల్లని కూడా నాకిచ్చే వాళ్ళు కాదేమో, ఆవిడ ఇంకా చాలా బాగుండేది, చాలా సౌమ్యురాలు) . కానీ త్వరలోనే వాళ్ళు సర్దుకున్నారు. కారణాలున్నాయి.  

కానీ అసలు సమస్య వేరే ఉంది. అది నాకు కూడా తెలియదు. ఒక సాయంత్రం, టాంకు బండు మీద కూర్చున్నప్పుడు నెమ్మదిగా చెప్పింది. "నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను.  ఇప్పటిదాకా సందేహించాను. మిమ్మల్ని తరువాత  ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. మొదటిది నేను డిగ్రీ పూర్తి చెయ్య లేదు. ఆర్ధిక ఇబ్బందులతో అందరం చదువులు మానేశాము. మీ స్నేహితులు, మీరు కనీసం డిగ్రీ చదివిన తెలివైన అమ్మయిని మాత్రమే చేసుకుంటారు అని చెప్పి నా చేత అబద్ధం చెప్పించారు" అని. దాన్ని నేను అబద్ధంగా భావించ లేదు. బ్యాన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం వస్తే నేనూ డిగ్రీ ఆపేసి చేరే వాడినే కదా? తిండి ఉంటేనే చదువు కదా. డిగ్రీ దేముంది తరువాత పూర్తి చెయ్యొచ్చు అని చెప్పాను. ఇది చదివితే కానీ ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు. తన మానం కాపాడాల్సిన బాధ్యత ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడే నా నొటికి తాళం పడింది. ఇది చదివితే, హారి పిడుగా, అని హాశ్చర్య పడతారేమో. తరువాత ఎం ఏ ఇంగ్లీషు, వీణ, సంగీతం, యోగా, డ్యాన్సూ, ఈత, గీతలో  పద్దెనిమిది అధ్యాయాలు కంఠతా నేర్చుకుంది) మా పిల్లలకి అప్పటికీ, ఇప్పటికీ గురువు ఆమే. 
అసలు బాంబు తరువాత పేలింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వీళ్ళ చిన్నతనంలోనే (ముగ్గురు ఆడ పిల్లలు) వేర పెళ్ళి చేసుకున్నాడని. కారణం నేనడగ లేదు. ఇప్పటికీ నాకు తెలియదు. ఎందుకంటే ఆ విషయం నేను చాలా తక్కువ సార్లు మాట్లాడుంటాను. నాకు సంబధించని విషయం. మా అమ్మ కూడా జాలి పడింది తరువాత రోజుల్లో. ఇంత మంచి పిల్లల్ని వదిలి ఎలా వెళ్ళాడు దుర్మార్గుడు, అని. వాళ్ళ ముగ్గురి మీద తరువాత రోజుల్లో చాలా అభిమానం పెంచుకుంది మా అమ్మ. ముగ్గురు రత్నాలని కన్న ఆ తల్లిని ఎలా వది వెళ్ళాడో, తలుచుకుంటే జాలి వేస్తుంది, కోపమూ వస్తుంది. గతం గతః! ఆ తల్లి మాత్రం కడుపులో కాళ్ళు పెట్టుకుని గుట్టుగా సంసారం నడిపింది. చాలా దీర్ఘ కాలం కోఋతు కేసులు నడిచాక భరణం  కింద కొంత పొలం, మూడు చిన్న రూముల ఇల్లు ఇచ్చాడట. వీళ్ళు నలుగురూ ఒక రూములో ఉంటూ రెండు రూములు అద్దెకిచ్చి,పొలం మీద వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండే వాళ్ళు. (మొదటి సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నేను గమనించిన  వాళ్ళ పరిస్థితి ఇది).   

దీని అర్ధం వాళ్ళు కట్నం ఇచ్చుకో లేరు. నాన్న, అన్నదమ్ములూ లేరు కాబట్టి పెళ్ళి తరువాత ఏ రాచ మర్యాదలూ చెయ్య లేరు. మా అమ్మ మాటల్లో "మగ దిక్కు లేని సంసారం. మన దగ్గరేమన్నా కోట్లు ఉన్నయా, జాలి పడి చేసుకోడానికి". ఇదంతా ఒక్క సారి, సినిమా లాగా నా కళ్ళ ముందు కనబడింది. నాకు వీటి మీద ఆశ లేదు. మా అమ్మ నాకు చాలా కట్నం వస్తుంది, ఆ డబ్బుతో మా చెల్లెలు పెళ్ళి చెయ్యొచ్చు అని ఇలా చాలా ఆలోచనలు చెప్తుండేది, నాకు. ఆమెను ఈ విషయంలో సర్ది చెప్పడం బ్రహ్మ తరం కూడా కాదు. ఇప్పుడంతా తల్లకిందులయ్యింది. వాళ్ళను కూడా కాస్తో, కూస్తో ఆదుకోవాల్సిన స్థితి. అంతా విని, పోదాం పద అని లేచాను. వెనకాల నుంచి చెయ్యి గట్టిగా పట్టుకుంది "అయితే ఇంక ఆశలు వదులుకోమంటారా? వాగ్దానం చెయ్యండి నన్ను వదలనని అని కొంచెం బాధగానే అడిగింది. నా మాట వేద వాక్కు. నేను మాట తప్పడం జరగదు, ఎవరన్నా నన్ను మోస బుద్ధితో దగ్గర చేరితే తప్ప. ముందు, ముందు ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను. సినిమా కధలా లేదూ? ఇప్పటికీ ఈ విషయం గుర్తు చేస్తే "నేను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అదే" అని కవ్విస్తూ ఉంటుంది. 

మేమిద్దరమూ కలుసుకుంటూనే ఉన్నాము.  మా అమ్మకి ఈ విషయాలు చెప్పాలంటే  భయమేసింది. తను అడుగుతూనే ఉంది "చెప్పారా" అని. లేదు, అంటే దిగులు పెట్టుకునేది. పదిహేను రోజుల తరువాత మా అమ్మకు చెప్పాను వాళ్ళ నాన్న విషయం. ఇంట్లో భూకంపం వచ్చింది. ఏడుపులూ, పెడ బొబ్బలూ. నేను చెప్పాను.  "నేను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవడం ఖాయం. మీకు ఇష్టమైతే ఇక్కడ ఉంటాము. లేదా మేము వేరే ఉంటాము" అని. మా చుట్టాలు చెప్పాలని చూశారు. ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి. ఈ తరమే ఇలా ఏడ్చింది.  ఇంక పూర్వీకులు ఎలాంటి వాళ్ళో అని ఉపన్యాసాలు. తలరాత బాగుంటే తరాలు అడ్డం కాదని అడ్దంగా వాదించే వాడిని. చెప్పాను కదా నాకు చెప్ప గలిగిన వాడు ఇంకా పుట్ట లేదని. నా మనవళ్ళు కూడా నా మాటే వింటున్నారు, ఇప్పటి వరకూ. వాళ్ళు ఇదే విధంగా ఆ అమ్మాయినీ, వాళ్ళ వాళ్ళనీ నిందిస్తే వెంటనే చేసుకుంటాను, తరువాత మీ ఇష్టం అని గట్టిగా చెప్పాను. ఐనా మన మీడియా లాగా ఆగలేదు. ఆ అమ్మాయి మీద, వాళ్ళ అమ్మ మీద, అక్క చెల్లెళ్ళ మీద నోటికొచ్చినట్లు మాటలాడే వాళ్ళూ. అప్పటి దాకా నేను పడ్డ  శ్రమ, చేసిన అప్పులూ, త్యాగాలూ అన్నీ  గాలిలో పేలపిండి లాగా ఎగిరి పొయ్యాయి. నువ్వు చూడక పోతే విషం తాగే వాళ్ళం అనే దాకా వచ్చింది. అప్పుడు నేను నా నిర్ణయం తీసుకున్నాను.

 నేను త్వర పడి పెళ్ళి చేసుకోడానికి రెండు కారణాలున్నాయి. (ఆ రోజుల్లో నేను చేసిన పని చాలా ధైర్యంగా చేసిందే అని చెప్పుకొవాలి. పరిస్థితులు ఎటైనా మారొచ్చు.) మొదటిది మా అత్తగారు ఆందోళన చెందడం మొదలైంది. ఈ పెళ్ళి కనక చెడి పోతే, (అప్పటికే మేమిద్దరం కలిసి తిరంగడం అందరికీ తెలుసు) ఒంటరి ఆడదాన్ని, మిగతా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యగలను అని. రెండోది, మా పెద్ద చెల్లెలు పెళ్ళి నా కర్చుతో చేయిస్తే ఈ పెళ్ళికి మాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా మా వాళ్ళ మడత  పేచీ. (నా దగ్గర అంత డబ్బు లేదని వాళ్ళకు తెలుసు). మిగతా అన్న దమ్ములకి తప్పుకోడానికి ఇదొక సాకుగా మారొచ్చు.  నేను కట్నం తీసుకోలేదని.      

 నేను త్వర పడి పెళ్ళి చేసుకోడానికి రెండు కారణాలున్నాయి. (ఆ రోజుల్లో నేను చేసిన పని చాలా ధైర్యంగా చేసిందే అని చెప్పుకొవాలి. పరిస్థితులు ఎటైనా మారొచ్చు.) మొదటిది మా అత్తగారు ఆందోళన చెందడం మొదలైంది. ఈ పెళ్ళి కనక చెడి పోతే, (అప్పటికే మేమిద్దరం కలిసి తిరంగడం అందరికీ తెలుసు) ఒంటరి ఆడదాన్ని, మిగతా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యగలను అని. రెండోది, మా పెద్ద చెల్లెలు పెళ్ళి నా కర్చుతో చేయిస్తే ఈ పెళ్ళికి మాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా మా వాళ్ళ మడత  పేచీ. (నా దగ్గర అంత డబ్బు లేదని వాళ్ళకు తెలుసు). మిగతా అన్న దమ్ములకి తప్పుకోడానికి ఇదొక సాకుగా మారొచ్చు. నేను కట్నం తీసుకోలేదని.  

కట్నమిచ్చుకోవడం అనేది వాళ్ళకి శక్తికి మించిన విషయ. ఒక సారి  వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఇంట్లో ఇత్తడి సామాన్లు బయట తాకట్టు పెట్టి దబ్బు తేవడం చూసాన్. ఇప్పుడు డబ్బు అవసరం ఏమొచ్చింది అని అడిగితే, కాబోయే అల్లుడు కదా, పిండి వంటలు వండి పెత్తడానికి అని చెప్పిందొఇ వాణి. నేను కోప్పడ్దాను.  ఇలాంటి పనులు ఎప్పుదూ చెయ్యొద్దు అని చెప్పాను. అప్పటినుంచీ డబ్బు అవసరమైతే తనే నన్నడిగి తీసుకునొ వాళ్ళకిచ్చేది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ముందు డుబ్బు ఇచ్చే వాడిని ఖర్చులకి. (ఇదంతా పెళ్ళి కాక ముందు. ఏప్రిల్ నెలలో మా ఆవిడ తాత్కాలిక ఉద్యోగం కూడా పోయింగ్. తను విజయవాడ వెళ్ళి పోయింది. అందుకని నేనే ప్రతి సని వారమూ వెళ్ళే వాడిని.). మా పెళ్ళి అయిన సంవత్సరం లోపే వాళ్ళ అక్కయ్య పెళ్ళి అయింది. ఆ కట్నం కోసం, పెళ్ళి కర్చుల కోసం మా అత్త గారు ఉన్న పొలం అమ్మేసింది. నేనూ కొంత డబ్బు ఇచ్చాను. నేను కట్నం తీసుకుని ఉంటే ఆ పొలం అప్పుడే అమ్మి వేయ వలసి వచ్చేది కదా. ఇంక నేను వాళ్ళ అక్కయ్యకి చేసిన అన్యాయం ఏమిటి? ఈ విషయంలో మా మూడో అన్నగారు ముఖ్స్ పుస్తకంలో పెట్టిన పోస్టు కింద పెడుతున్నాను. చదవండి, నిజానికీ, దుష్ప్రచారానికీ ఉన్న తేడా.  అన్న దమ్ముల మధ్యే ఇలా   ఉంటే ఇక రాజకీయాల విషయం వెరే చెప్పాలా? 

Sudhakara Rao Neelamraju

May 18 ·
It is true that I did not come to Hyderabad asI was in Shaghai.Atleast whether you waited till your elders to come.Do you remember that the utterences you made in front of the public and Purohit. You already killed when she was alive..What makes you to burn the pyre when the younger bother was there. Are you proud of the actions. "You don't havr thr patience to wait till the elder sister of your wife to get marry."You ruinrd her life also..For all five brothers and sisters there is only one mother. We can can not cut in to her pieces. It it is her wish to stay back with you for reasons well knowno you. (Verbatim. No corrections made. sic.)


That is his culture.

నా స్నేహితులకి ఈ విషయం చెప్పాను. రిజిస్టర్డ్ పెళ్ళి చేసుకుందామనుకుంటున్నానని. మా స్నేహితుల్లో ఒకడి చుట్టం ఒకాయన, పెళ్ళిళ్ళ రిజిస్ట్రారుగా ఉండేవాడు. రెండు రకాలుంటాయనీ మొదటిది జనరల్, రెండోది స్పెషల్ రిజిస్ట్రషన్  అంటారని. గుళ్ళో పెళ్ళి చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొదటిది. కానీ దీనిని ఎవరైనా చెల్లదని కోర్టులో దావా వెయ్యొచ్చు. రెండోదానికి నెల రోజులు నోటీసు ఇవ్వాలి. మే 15 న విజయవాడ నుంచి వాణీని పిలిపించి నోటీసు ఇచ్చాము. వాళ్ళింట్లో తెలుసు. జున్ 15 న పెళ్ళి ప్రమాణ పత్రం సంతకం చేసాము. ఒక సాయుబు గారు రిజిస్ట్రారు. మా స్నేహితులే సాక్షి సంతకాలు చేశారు. దాన్లో బేగ్ అని చందోలు సాయుబు కూడా వున్నాడు. నిష్టా  గరిష్టుడు.  భారత, భాగవతాలు వల్లె వేసె వాడు. రోజూ అయిదు సార్లు నమాజూ చేసే వాడు. బేగ్ శాస్త్రి  అని ముద్దు పేరు పెట్టాము. అతనికి, అతని కుటుంబానికి ఈద్ శుభాకంక్షలు. 

పెళ్ళి పత్రం వారం రోజుల తరువాత వచ్చింది. మా అమ్మకు చూపించాను.  వాళ్ళ మాటల మూలకంగా తొందర పడాల్సి వచ్చింది అని. మా అమ్మని దారికి తేవడానికి రెండు నెలలు పట్టింది. ఇంటికి తీసుకు రమ్మని చెప్పింది. వచ్చి వారం రోజులుంది, మా ఆవిడ. మా అమ్మకు, చుట్టు  పక్కల వాళ్ళకు ఆమెంటే మంచి అభిప్రాయం వచ్చేసింది. 

మా అమ్మే సలహా చెప్పింది. ఇలాంటి పెళ్ళిళ్ళు మన ఇంటా, వంటా లేవు. మళ్ళీ శాస్త్రొక్తంగా  పెళ్ళి చెసుకోండి అని. సెప్టెంబరు 2న పెళ్ళి చేసుకున్నాము, శాస్త్రోక్తంగా. చాలా తక్కువ ఖర్చులో,. మూడు వేలు ఖర్చు అయ్యాయి. ఎక్కువ ఖర్చు నేనే పెట్టాను. ఏ మనస్పర్ధలూ, తగాదాలూ లేకుండా మా ఇంట్లో జరిగిన మొదటి పెళ్ళి అది. మా అమ్మ చాలా ఆనంద పడింది. మంచి కుటుంబం. డబ్బు కొరుక్కు తింటామా అని. పెళ్ళికి వారం రోజుల ముందే వాణి మా ఇంటికి వచ్చి బాధ్యతలు తీసుకుంది. అయితే పెళ్ళి కొత్తల్లో, మా అమ్మ ఆచారాలు, మా చెల్లెళ్ళ దెప్పి పొడుపులూ భరించ లేక పదిహేను రోజులు పుట్టింటికి వెళ్ళి పోయింది. అదే ఆమె నన్ను మొదటి సారి, చివరి సారి అన్ని రోజులు వదిలి పెట్టడం. మొదటి రెండు కానుపులకి  కూడా తొమ్మిదో నెల  చివర్లో వెళ్ళి మొదటి నెలలోనే వచ్చేసింది. మా ఆడ పిల్లలు కూడా వాళ్ళ భర్తల్ని వదిలి మా ఇంటికి రారు. మా కోడలు మమ్మల్ని వదిలి వెళ్ళదు. వాళ్ళ పుట్టిల్లు  ఇక్కడే. అయినా ప్రొద్దున్న వెళ్ళి సాయంకాలం వచ్చేస్తుంది. 

కధ సుఖాంతం కాదు. ఇది అంతులేని కధ. అయితే గత ఐదారెళ్ళుగా, ఎంతో ప్రశాంత వాతావరణంలో మా పిల్లల ప్రేమని అస్స్వాదిస్తూ గడుపుతున్నాము. 

(నేను నా భార్యని ఆమె అని సంబోధించడానికి ఒక కారణం ఉంది. మార్చ్ నాలుగున నన్ను పెళ్ళి చేసుకోమని అడిగిన రోజున అడిగింది. "మీ ఇంట్లో భార్యల్ని ఏమే, ఒసే అని పిలుస్తారా అని. అది, ఇది అని చెబుతారా అని. అవనని చెప్పాను. నేను అలా పిలవనని వాగ్దానం తీసుకుంది. ఇంతవరకు, పేరు పెట్టి తప్పితే వేరే విధంగా పిలవ లేదు. ఆమె అని తప్పితే వేరే విధంగా ఎవరికీ చెప లేదు.)

                       #####################A total change in life. From here on it is not about me but about weird characters in the Bank and influence of the actions of my family members on me that routed me but I rose like Phoenix, with the help of the girl/lady/woman in my life and my highly educated, highly resposnsible and mild mannered children who are nothing but replicas of my wife in patience, perseverance, love and attachment.From next epidode, I will share my blog individually, as it reflects the characters you find in Media (rumor mongers), Lalus (convicts that speak morals), Kejris (that never tell truth, but appear honest), Nitishes (envious to the core), Indira Gandhis (dictators and corrupt to the core), dynasty rule, diabolic double talkers, back stabbers etc., And you find a Swamy, a Modi though not successful like them fought through out. Here, I am risking a criminal defamation too, as I name people but records justify my stand. I am confident.