Friday, September 25, 2015

హృదయ ఘోష - వాణి కవితలు



హృదయ ఘోష - వాణి కవితలు 


నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను అన్నాడు శీ శ్రీ  

#############


పుస్తకాల దొంతర సర్దుతున్నప్పుడు ఒక డెయిరీ దొరికిందిపేజీలు ఖాళీ ఉన్నాయేపద్యాలు రాసుకోడానికి ఉపయోగ 
పడుతుంని బయటికి తీశాఅందులో శ్లోకాలుసంస్కృతంలో ఛందస్సు పైన వ్యాసాలు , శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్థానములో కొన్ని 
కవితలుఅన్నమాచార్య కీర్తనలూ రాసి ఉన్నాయిఉబుసు పొనప్పుడోనా మీద కోపం వచ్చినప్పుడో (ఎప్పుడూ పుస్తకాలు 
ముందరేసుకుని చదువుతూనోరాస్తూనో ఉంటాననిఇలా రాయడం నా భార్యకు పరిపాటినేను కూడా మాటలాడుకుండా రాస్తూ  
కూర్చుంటే నీకు ఎలా ఉంటుందో చూపిస్తాననని

నాకు చాలా బాగుండేదిఒకటి ఊళ్ళో వాళ్ళ కబుర్లు వినక్కర లేదురెండు ఎవరన్నా చదువుతున్నారాస్తున్నా నా కడుపు నిండుతుంది.

సరే పేజీలు తిప్పుతుంటే ఎంతో మంచి కవితలుఆమె రాసినవేకొన్ని నా కళ్ళ వెంట నీళ్ళు తెప్పించాయినా మీద విసుర్లతో 
కూడా ఒక గేయంచూశారా భార్యతో ఎక్కువ కబుర్లు చెప్పక పోవడం వల్ల ఫలితంఅప్పట్లో మేమిద్దరమే ఉండేవాళ్ళ
మండీ ఒంటి కాయ సొంఠి కొమ్ము లాగా.


ప్రళయ మారుతం అనే  గేయంలో సృష్టి కర్తభర్తసమ్హర్త అయిన భగవంతుడ్ని ఎలా వాహనం చేసిందో చూడండి వాణి!

ప్రళయ మారుతం

ప్రపంచానికి ఊపిరి పోసిన నీవు
ప్రళయానికి కారణ మవుతున్నావే
జీవ కోటిని కూకటి వేళ్ళతో
పెకలిస్తున్నావే!
సృష్టి కర్తా సృష్టిని
విలీనం చేస్తున్నావే!

నీ గొప్ప తనాన్ని
జీర్ణించుకోడానికి
ఎన్ని జన్మలు కావాలో
నీలో జఠరాగ్ని ఎంతుందో
ఆకలి వేసిన నీకు ఆహుతి
అవుతున్నదే లోకం!

కరుణించు మమ్మల్ని
వీక్షించు కరుణా దృష్టితో
మలయ పవనాన్ని వీచి
మానవత్వం నింపు
మమ్మల్ని నింపు
నీ అసమాన ప్రభావంతో
నిర్మల హృదయంతో
కురిపించు రుణని!

నీ చేతిలో బొమ్మలం
నీ పాలి బిడ్డలం
వేధించినా
బాధించినా
వెళ్ళలేని పాపలం
చేసుకో మమ్మల్ని
నీ ప్రతి రూపాలుగా
నీ  పాలించే
భృత్యులుగా
అమాత్యులుగా
నీ దివ్య సందేశాన్ని
చాటుతాం
దశ దిశలా
నీ ఘన కీర్తి
చాటుతాం
భూలోక భువర్లోక
సువర్లోక మహా లొకాలకు
అస్థిత్వం లేని మాకు
నీవేగా ఆధారం
మా జీవాధారం
మా జీవన వేదం
ఘోషించనీ
నీ గొప్ప తనాన్ని
మనసు నిండగా
రావోయి మిత్రమా
మా కలలు పండగా!

యాచక మహారాజు 



అతనో యాచకుడు
నిత్య దుఖితుడు
చేయి చాస్తాడు
సిగ్గు విడిచి
యాచిస్తాడు పదిమందినీ!

నిండుతుంది బిక్షాపాత్ర
కానీ మనసులో ఏదో కక్ష
తినగా మిగిలేది కొంత
దాచడానికి చెంత ఓ బొంత!

ఎదురుగా ఓ ఇంద్ర భవనం
తరిగిపోని వైభవం
రంగు, రంగుల దుస్తులు
రంగులీనే కార్లు!

అక్కడ వారి కళ్ళల్లో కాంతి 
యాచకుడి మనసులో అశాంతి
చూసిన కొద్దీ ఈర్ష్య
నాకెందుకీ శిక్ష!

వాళ్లు తృప్తిగా చేసే దానం
యాచకుడికి అదో అవమానం
ఎంత ఇచ్చినా వారికి ఆస్తి తరగదే
ఎంత దొరికినా నాకు ఆస్తి పెరగదే!

యాచించి యాచించి 
కుంచించుకు పోయిన అతడు
యోచించి, యోచించి 
మరుగుజ్జై పోయాడు!

అప్పుడు జరింగిందో అద్భుతం
వెన్నెల నింపే చంద్రోదయం 
చుట్టూ చీకటి, గాలి వాన భీభత్సం 
చేయి చాచిందో హస్తం! 

ఆ హస్తం వెనుక దీనమైన కళ్ళు
యాచించాయి యాచకుడిని
ఒక్క ముద్ద అన్నం, ఒక్క రాత్రి విశ్రాంతి
మండుతున్న వొళ్ళు, కాలే కడుపు!

అందించాడు ఆపన్న హస్తం
తినిపించాడు పట్టెడు అన్నం
బళ్ళున తెల్లవారింది
యాచకుడి మనసు విప్పారింది!

ఎదురుగా మేడ కన్నా 
చెట్టు కింద గుడిసె మిన్న
నేను ప్రపంచానికి రాజుని
పెట్టగలిగే మహరాజుని!

బొంత తెరిచి తీశాడు తన ధనం
పదిమందికి పంచాడు ఆనందం
ఎప్పుడో తాను చేసిన పుణ్యం
యాచకుడు చెశాడు ధర్మం!

అతనికి పెరగ లేదు ఆస్తి 
కానీ మనసు నిండుగా తృప్తి!

                                                     ###############################



సర్వే జనాః సుఖినో భవంతు 











No comments:

Post a Comment