Friday, September 18, 2015

NARA CHANDRA BABU NAIDU-THR VISIONARY PAR EXCELLENCE -PART 1 ONLY TELUGU


NARA CHANDRA BABU NAIDU-THE VISIONARY PAR EXCELLENCE -PART 1

ONLY TELUGU 

##################


This is a simple blog of Telugu poems on the life and times of the great visionary in the hundred poems I am  penning on Babu's life and vision.

The Telugu explanation and English translation will be given by next week end. Further poems will come soon.

Last two poems are a sample on Modi. I would like to continue the poems till 2022, if God gives me life and strength.

బాబు కదల ముందు బాటను చూపగ
ఆంధ్ర జనులు బ్రేమ యరుగ వెనుక
వాణి మురిసె యెంతొ వదిలె భారమనుచు,
తెలుగు తల్లి మురిసి దారి చూపె!  1

అర్ధ శాస్త్ర మతడు యవపోసనను బట్టె
రాజనీతి యతని రాచ బాట
శాస్ర సారమెల్ల సరి తూచి యేలగ
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 2


కల్లు విసుర యతడు కళ్ళు మూసుకొనడు
ముల్లు తీసి వేయు ముల్లు తోడె
కల్లు తాగి యెగురు కోతుల బనిబట్ట
తెలుగు తల్లి మురిసి దారి చూపె. 3

ఇచట మొదటి కల్లు యనగా రాయి యని యర్ధము. రెండో కల్లు మీకు తెలిసిందే.

చిరుత బ్రాయ మందె చేపట్టె బాధ్యత,
మంత్రి పదవి జనుల ముదము గూర్చ
ప్రభుత యందు నీతి బరిగె తనదు రీతి
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 4

ముఖ్య మంత్రి యాయె మామ తప్పగ దారి
కుట్ర యెటుల కూల్చ కుటిల మూక
బన్న పడెను తాను బతికించ దల్లిని
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 5

గంధ మొదిలి కొత్త బంధము వెదుకగ
లక్ష్మి యొచ్చె తాను లక్ష్మి కొరకు
పార్వతొచ్చె తాను పరమేశు నొదిలేసి,
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 6

బన్న బరుచ తనను బగవారు మాటల
బాబు బొడిచె వెన్ను పోటు యనుచు
ముందు చూపు కోట్ల మందిని కాపాడె
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 7

దొంగ బుద్ధి వారు కాంగిరేసు జనులు
రంగు కలలు జూపి రాజ్యమేల
అన్న తోడు నిలిచె యల్లుడు బాబన్న
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 8

అన్న గారు బిలిచె యాత్మ గౌరవమని,
తెలుగు వాడు దుష్టు తరిమి గొట్టె
అంత మొందె నేడు అనువంశ పాలన
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 9

రాజ్యమేలె యన్న రామన్న రాజ్యమె
బాబు తోడు నిలువ బాసటగను
విత్తు నాటె నాడు వచ్చె బాబు మరల
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 10

పది వత్సరములు ప్రజల దోచుచు
రాజ శేఖరుండు రాజ్య మేల
పున్నమొచ్చె చంద్ర బింబపు వెన్నెల
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 11

నాక మందు యున్న నా తల్లి నిను జూచి
మురియు చుండు నిన్ను మరువ దెపుడు
అమ్మ వోలె నాడు యాదరించితి వీవు
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 12

కర్మయోగి యతడు యాగమె తను సేయు
బాబు లెల్ల బాబు బాట నడువ
యంత్ర మోలె యతడు మంత్రాంగము నడుప
తెలుగు తల్లి మురిసె దారి జూపె! 13

పని యందు హనుమ పాలించ రాముడు
చతురతందు బాబు చక్ర ధారి
భాష యందు వాసి భావమ్ము వాల్మీకి
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 14

యేమి ఫలమొ నేడు యెప్పటి పుణ్యమొ
ఆంధ్ర దేశమందు ఆశ మొలిచె
తలకు పోటు పోయె తలపులు మెరుగాయె
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 15

రాజు ముందు వెడలె రవి తేజ మలరగ
కొంగ జపము జేయు కొడుకు రాగ
చంద్రు డొచ్చె పరుచ చల్లని వెన్నెల
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 16

యెవడు వాడు వచ్చె యెటనుంచి యిటకు
భూమి యెల్ల దోచు భూతలుండు
విక్రమార్కుడొచ్చె విడిపించ శాపము
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 17

పాద యాత్ర జేసి పరము జూపె రాజన్న,
ప్రజల భూమి యెల్ల బావు కొనగ
పాద యాత్ర జేసె బాబు మీ కొరకెగ
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 18

మామ చంద్రుడొచ్చు(చందమామ)మాసము కొకపరి
బాబు చంద్రుడుండు పగలు రాత్రి
ప్రజల నడుమె నెపుడు పాలన మీ వద్దె
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 19

మధ్యవర్తి పీడ మరుగున పడ వేయ
రైతు రాజు జేసె రమ్యముగను
పంట వారె యమ్మ బాజారులు తెరిచె
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 20

జన్మ భూమి పేర జేర్చె జనుల నొకచొ
వారి వినతి రోజు వారి వినగ
బాబు లెల్ల బోయి బాసట నిలువగ
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 21

ముందు చూపె యెపుడు ముందె ప్రణాళిక
ముందు కేగు టెరుగు ముడులు విప్ప
విజను ముందె వేసె వర్షము లిరువది
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 22

రైతు బిడ్డ యతడు రాజు కొడుకు కాదు
నేర్చునపుడె విద్య నాయకుండు
స్వేదమోడ్చి సేయ సేవను జనులకు
తెలుగు తల్లి మురిది దారి జూపె! 23

తాత మంత్రి కాదు తండ్రి కాదు యెపుడు
తెలివి తనదె బాబు తవిలి జూడ
ఫాక్షనిస్టు కాదు పడవు గ్రూపు లెపుడు
తెలుగు తల్లి మురిసి దారి జూప! 24

తండ్రి చిన్న రైతు తన తల్లి గృహిణి
పుట్టె నార వారి పల్లె యందు
బాబు యూరు యందు పాఠశాలయు లేదు
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 25

శేష పురము బడియు చంద్రగిరిలొ స్కూలు
తిరుపతేగి చదివె తివిరి బాబు
అర్ధ శాస్త్ర మందు యమిత ప్రతిభ జూపె
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 26

ఎన్ జి రంగ స్ఫూర్తి నారాయణ గురువు
రాజ కీయ మందు రాటు దేలె
అర్ధ రాజ నీతి యనువుగ గలిపెను
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 27

ఇరువదెనిమిదేండ్ల యతి పిన్న వయసున
సభలొ సభ్యు డాయె సభకె వెలుగు
మంత్రి యాయె యపుడె మరెవరు తన సాటి
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 28

చదువు సార మెల్ల సాన బట్టిన బాబు
పతకములను పొందె పాడి గాను
దాగి యున్న వింత దాననుచు బొగడ
తెలుగు తల్లి మురిసి దారి జూపె! 29



1st poem in Modi DaSa Sati,

మోది కదుల జనము ముదమున చూసిరి,
దేశమునకు జూప దశయు దిశయు
అరువదేండ్ల పీడ విరుగడ సేయగ
పలుక మోది మురిసె భరత మాత! 1

స్వఛ్ఛమైన మనసు స్వఛ్ఛము యోచన,
నీచ రాజ నీతి నాతి యనెను
ధరణి మురిసి మెరిసి ధగధగ మనియెను,
పలుక మోది మురిసె భరత మాత! 2

More in blogs only.


SARVEY JANAHA SUKHINO BHANATHU


No comments:

Post a Comment